బ్యూటిప్స్
బంగాళదుంప తురుము – రెండు టేబుల్ స్పూన్లు, తేనె – సరిపడా. ముందుగా బంగాళదుంప తురుముని ఐస్ వాటర్‌లో అయిదు నిమిషాల పాటుంచి తీయాలి. దీంట్లో తేనె కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. తరవాత చన్నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే కళ్ల చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గుతాయి.
రెండు టీ స్పూన్ల శనగపిండిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల రోజ్ వాటర్, కొద్దిగా గ్లిజరిన్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడ మొదలుకొని ముఖానికి పట్టించి ఆరిన తరవాత చన్నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మ కాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది.