ఐస్‌వాటర్‌ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా! | Benefits Of Ice Water Face Dip For A Flushed Skin Tight And Glowing | Sakshi
Sakshi News home page

ఐస్‌వాటర్‌ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా!

Published Wed, Nov 29 2023 3:49 PM | Last Updated on Wed, Nov 29 2023 3:49 PM

Benefits Of Ice Water Face Dip For A Flushed Skin Tight And Glowing - Sakshi

ఇంతవరకు ఎన్నో క్రీమ్‌లు, సౌందర్య లేపనాలు ట్రై చేసి ఉంటారు. కానీ అవన్నీ కూడా ఈ ఐస్‌ వాటర్‌ ట్రిక్‌ ముందు బలాదూర్‌ అంటున్నారు సౌందర్య నిపుణులు. సెలబ్రెటీలు నుంచి ప్రముఖులు వరకు ఈ ఐస్‌వాటర్‌ ట్రిక్‌ని ఫాలో అవుతుంటారట. అందువల్ల వాళ్లంతా నలభైలలో కూడా టీనేజ్‌లో ఉన్నట్లే కనిపించేందకు రీజన్‌ ఇదేనట. అసలు ఐస్‌వాటర్‌ చర్మ సౌందర్యాన్ని కాపాడటం ఏంటీ? కామెడీగా అని కొట్టిపారేయకండి. ఇది ఎంత మేలు చేస్తుందంటే..

ఉదయం లేచిన వెంటనే మీ ముఖాన్ని కొద్దిసేపు ఐస్‌వాటర్‌లో డిప్‌ చేసి ఉంచితే ఒక్కసారిగా నిద్రమత్తుతో ఉన్న ముఖం క్షణాల్లో ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అది ముఖంపై ఉండే రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చిన్న రంధ్రాలతో అసహ్యంగా కనిపిస్తున్న చర్మానికి ఇది చక్కటి రెమిడీ అని చెప్పొచ్చు. అయితే ఈ చల్లటి వాటర్‌తో ముఖాన్ని రుద్దకపోవడమే మంచిది. ఎందుకంటే పొడిగా అయ్యి ర్యాష్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఓ రెండు నుంచి మూడు నిమిషాలు ముఖాన్ని చల్లటి నీటిలో ఉంచితే ముఖం గ్లాస్‌ స్కిన్‌లా మెరుస్తూ తాజాగా కనిపిస్తుంది. 

అదీగాక అప్పటి దాక సాధారణ టెంపరేచర్‌లో ఉన్న ముఖం ఒక్కసారిగి ఇలా చల్లటి నీటిలో ఉంచితే..ముఖానికంతటికీ రక్తప్రసరణ జరిగి ఒక్కసారిగా తెలియని ఉత్సాహం వస్తుంది. మనం ఉపయోగించే స్క్రబ్‌లు, మాయిశ్చరైజర్‌ల కంటే ఈ ఐస్‌ వాటర్‌ ట్రిక్‌ అత్యుత్తమమైనది అని అంటున్నారు. ఇలా రోజులో కనీసం రెండు నుంచి మూడు సార్లు క్రమం తప్పకుండా చేస్తే మెరిసే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుదంని చెబుతున్నారు.

అంతేగాదు ముఖంపై వచ్చే వాపులను కూడా తగ్గిస్తుందట. వాపుగా ఉన్న ప్రాంతంలో... రక్త సరఫరా ఎక్కువ అవ్వడంతో కుచించుకుపోయిన నాళాలకు రక్తసరఫరా తగ్గి యథావిధికి రావడమే గాక నొప్పి కూడా తగ్గుతుందని చెబతున్నారు సౌందర్య నిపుణులు. అంతేగాదు ఇలా ఐస్‌వాటర్‌లో ముఖాన్ని డిప్‌ చేసి ఉంచే ట్రిక్‌తో తమ అందాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నామో వివరిస్తూ వీడియోలు షేర్‌ చేసిన కొందరూ సెలబ్రెటీల వీడియోలు నెట్టింట వైరల్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. చూసేయండి.. వెంటనే మీరు కూడా ట్రై చేయండి.

(చదవండి: ఈ చైర్‌లో కూర్చొంటే..దెబ్బకు బెల్లీ ఫ్యాట్ మాయం!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement