tightened
-
ఐస్‌వాటర్ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా!
ఇంతవరకు ఎన్నో క్రీమ్‌లు, సౌందర్య లేపనాలు ట్రై చేసి ఉంటారు. కానీ అవన్నీ కూడా ఈ ఐస్ వాటర్ ట్రిక్ ముందు బలాదూర్ అంటున్నారు సౌందర్య నిపుణులు. సెలబ్రెటీలు నుంచి ప్రముఖులు వరకు ఈ ఐస్‌వాటర్ ట్రిక్ని ఫాలో అవుతుంటారట. అందువల్ల వాళ్లంతా నలభైలలో కూడా టీనేజ్‌లో ఉన్నట్లే కనిపించేందకు రీజన్ ఇదేనట. అసలు ఐస్‌వాటర్ చర్మ సౌందర్యాన్ని కాపాడటం ఏంటీ? కామెడీగా అని కొట్టిపారేయకండి. ఇది ఎంత మేలు చేస్తుందంటే.. ఉదయం లేచిన వెంటనే మీ ముఖాన్ని కొద్దిసేపు ఐస్‌వాటర్‌లో డిప్ చేసి ఉంచితే ఒక్కసారిగా నిద్రమత్తుతో ఉన్న ముఖం క్షణాల్లో ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అది ముఖంపై ఉండే రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చిన్న రంధ్రాలతో అసహ్యంగా కనిపిస్తున్న చర్మానికి ఇది చక్కటి రెమిడీ అని చెప్పొచ్చు. అయితే ఈ చల్లటి వాటర్‌తో ముఖాన్ని రుద్దకపోవడమే మంచిది. ఎందుకంటే పొడిగా అయ్యి ర్యాష్ వచ్చే ప్రమాదం ఉంది. ఓ రెండు నుంచి మూడు నిమిషాలు ముఖాన్ని చల్లటి నీటిలో ఉంచితే ముఖం గ్లాస్ స్కిన్‌లా మెరుస్తూ తాజాగా కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) అదీగాక అప్పటి దాక సాధారణ టెంపరేచర్లో ఉన్న ముఖం ఒక్కసారిగి ఇలా చల్లటి నీటిలో ఉంచితే..ముఖానికంతటికీ రక్తప్రసరణ జరిగి ఒక్కసారిగా తెలియని ఉత్సాహం వస్తుంది. మనం ఉపయోగించే స్క్రబ్‌లు, మాయిశ్చరైజర్ల కంటే ఈ ఐస్ వాటర్ ట్రిక్ అత్యుత్తమమైనది అని అంటున్నారు. ఇలా రోజులో కనీసం రెండు నుంచి మూడు సార్లు క్రమం తప్పకుండా చేస్తే మెరిసే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుదంని చెబుతున్నారు. అంతేగాదు ముఖంపై వచ్చే వాపులను కూడా తగ్గిస్తుందట. వాపుగా ఉన్న ప్రాంతంలో... రక్త సరఫరా ఎక్కువ అవ్వడంతో కుచించుకుపోయిన నాళాలకు రక్తసరఫరా తగ్గి యథావిధికి రావడమే గాక నొప్పి కూడా తగ్గుతుందని చెబతున్నారు సౌందర్య నిపుణులు. అంతేగాదు ఇలా ఐస్‌వాటర్‌లో ముఖాన్ని డిప్ చేసి ఉంచే ట్రిక్‌తో తమ అందాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నామో వివరిస్తూ వీడియోలు షేర్ చేసిన కొందరూ సెలబ్రెటీల వీడియోలు నెట్టింట వైరల్ తెగ వైరల్ అవుతున్నాయి. చూసేయండి.. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) (చదవండి: ఈ చైర్లో కూర్చొంటే..దెబ్బకు బెల్లీ ఫ్యాట్ మాయం!) -
G20 Meet: శ్రీనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత..భారీగా బలగాలు మోహరింపు
సాక్షి, శ్రీనగర్: భారత్ జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగరలో సోమవారం జీ 20 దేశాల మూడో పర్యాటక కార్యవర్గ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వననున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. కేంద్రం జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను రద్దు చేసిన తదనంతరం ఈ ప్రాంతంలో ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. జీ20లో ప్రెసిడెన్సీలో భారత్ సగానికి చేరుకుందని, ఇప్పటి వరకు 118 సమావేశాలు జరిగాయని జీ20 చీఫ్ కోఆర్టినేటర్ హర్షవర్ధన్ షింఘూ తెలిపారు. అంతేగాదు టూరిజంపై గతంలో జరిగిన రెండు సమావేశాలతో పోల్చితే శ్రీనగర్ సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని అన్నారు. ఈ జీ20 సదస్సు కోసం సభ్య దేశాల నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు హాజరవనున్నారుని చెప్పారు. శ్రీనగర్‌లో జరగుతున్న ఈ సమావేశానికి అత్యధిక సంఖ్యలో సింగపూర్ నుంచి ప్రతినిధులు విచ్చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేగాదు ప్రత్యేక ఆహ్వానిత అతిథి దేశాల ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. అక్కడ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్న చైనా.. కాశ్మీర్లో జీ20 సమావేశాన్ని నిర్వహించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పైగా ఈ ఈవెంట్ కోసం సౌదీ అరెబీయా నమోదు చేసుకోలేదు. టర్కీ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. వివాదాస్పద ప్రాంతాల్లో జీ20 సమావేశాలను ఏ రూపంలోనైనా నిర్వహించడాన్ని చైనా తప్పుపడుతోంది. అలాంటి సమావేశాలకు చైనా హాజరుకాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు. అంతతేగాదు భారత్ తన సొంత భూభాగాల్లో ఇలాంటివి నిర్వహించుకోవడం ఉత్తమం అంటూ ఓ ఉచిత సలహ కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగా, ఈ జీ20 కార్యక్రమం కోసం శ్రీనగర్‌లో చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా గార్డులు, నేల నుచి గగనతలం వరకు భారీగా మోహరించారు. యాంటీ డ్రోన్లతో గస్తీ, ఆర్మీ బోర్డర్(బీఎస్ఎఫ్). సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), సశాస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) జమ్ము కాశ్మీర్ పోలీసులతో సహా వేలాది మంది సైనికులు గట్టిగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే జీ20 ప్రతినిధులు ఉపయోగించే మార్గంలో ట్రాఫిక్ కదలికలపై ఆంక్షలు కూడా విధించారు. కాగా, సందర్శనా కార్యక్రమంలో భాగంగా G20 ప్రతినిధులు శ్రీనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పోస్ట్‌కార్డ్‌గా మారిన పోలోవ్యూ మార్కెట్‌ను కూడా సందర్శిస్తారు. అంతేగాదు త్వరలో జరగనున్న జి-20 దేశాల పర్యాటక కార్యవర్గ సమావేశం విజయవంతమైతే జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల ప్రవాహం, పెట్టుబడులు పెరుగుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. CRPF Commandos, Marcos, and Black cat Commandos all geared up for the upcoming G20 summit in Srinagar pic.twitter.com/sMja7GHlX2 — The Asian News Hub (@AsianNewsHub) May 20, 2023 (చదవండి: 'నితీష్ జీ ప్రధాని కావాలనే పగటి కల'ను కనడం మానేయండి!) -
‘సెబీ’ సైబర్ సెక్యూరిటీ నిబంధనలు కఠినతరం
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్చంజీలు, ఇతరత్రా మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు పాటించాల్సిన సైబర్ సెక్యూరిటీ నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింత కఠినతరం చేసింది. స్టాక్ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు మొదలైన మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐ) ఇకపై ప్రతీ ఆర్థిక సంవత్సరంలో కనీసం 2 సార్లు సమగ్రమైన సైబర్ ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సైబర్ ఆడిట్ నివేదికలతో పాటు నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామంటూ ఆయా సంస్థల ఎండీ, సీఈవోలు ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో తెలిపింది. సవరించిన నిబంధనల ప్రకారం వ్యాపార కార్యకలాపాలు, డేటా మేనేజ్మెంట్, సర్వీసుల నిర్వహణలో కీలకమైన అసెట్లను వాటి ప్రాధాన్యత ప్రకారం వర్గీకరించాలి. సైబర్ ఆడిట్ల (వీఏపీటీ) నిర్వహణ పూర్తయిన నెల రోజుల్లోగా సెబీకి నివేదిక సమర్పించాలి. -
ఎర్రకోట శత్రు దుర్భేద్యం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సన్నద్ధమవుతోంది. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎర్రకోటను శత్రుదుర్భేద్యంగా మారుస్తున్నట్లు పోలీసు అధికారులు శనివారం చెప్పారు. ప్రధాన ద్వారం వద్ద షిప్పింగ్ కంటైనర్లతో తాత్కాలిక రక్షణ గోడను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిని దాటుకొని లోపలికి అడుగుపెట్టడం అసాధ్యమని పేర్కొన్నారు. చాందినీ చౌక్ ప్రాంతం నుంచి అనుమతి లేకుండా ఎర్రకోటలోకి ప్రవేశించలేని విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. చరిత్రాత్మక ఎర్రకోట వద్ద కంటైనర్లతో తాత్కాలికంగా భారీ గోడను సిద్ధం చేస్తుండడం ఇదే మొదటిసారి. ఇవి ఆకర్షణీయంగా కనిపించేలా రంగులు వేస్తున్నారు. గ్రాఫిటీ కళతో కనులకు ఇంపుగా తీర్చిదిద్దుతున్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిన డిమాండ్‌తో రైతులు నెలల తరబడి ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వారు తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవాలను వేదికగా మార్చుకొనే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినం సందర్భంగా ఎర్రకోట వద్ద రైతులు, భద్రతా సిబ్బంది మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. నిరసనకారులు అక్కడే మతపరమైన జెండా ఎగురవేయడం సంచలనం సృష్టించింది. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీలో డ్రోన్లు, పారా గ్లైడర్స్, ఎయిర్ బెలూన్లు ఎగురవేయడంపై నిషేధం విధిస్తూ గత నెలలో అప్పటి ఢిల్లీ కమిషనర్ బాలాజీ శ్రీవాస్తవ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 16వ తేదీ దాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల ఎర్రకోట వెనుక భాగంలోని విజయ్‌ఘాట్ వద్ద అనుమానాస్పదంగా ఎగురుతున్న ఓ డ్రోన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కట్టుదిట్టంగా లాక్డౌన్
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో లాక్ డౌన్ కఠినంగా అమలు జరుగుతోంది. జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి బయటకు వచ్చినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే నిత్యావసరాల కొనుగోలు సమయంలో ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. కావాల్సిన వస్తువులు నిర్ణీత సమయానికి కొనుగోలు చేసి ఇళ్లకు చేరారు. ►వైఎస్సార్ జిల్లాలో లాక్ డౌన్‌తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాలకు అనుమతులివ్వడంతో ఆ సమయంలోనే ప్రజలు కావాల్సిన సరుకులు కొనుకున్నారు. కొన్ని గ్రామాల ప్రజలు తమ గ్రామాలలోకి ఇతర ప్రాంతాల వారిని అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. ►తూర్పు గోదావరి జిల్లాలోని నగరాల్లో రోడ్లపైకి వచ్చిన వారిని బలవంతంగా పోలీసులు తిరిగి ఇళ్లకు పంపించేశారు. పెద్దాపురం, ముమ్మిడివరం, జగ్గంపేట నియోజకవర్గాల్లో పలువురికి కరోనా లక్షణాలున్నాయని గుర్తించిన వలంటీర్లు.. వైద్యులకు సమాచారం ఇచ్చారు. అనుమానితులకు పరీక్షల అనంతరం 14 రోజుల పాటు ఇంటిలోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన వారి కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కొంతమంది కాశీ వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. ►తిరుపతి రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న శ్రీకాళహస్తి యువకుడి కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడు ఇటీవల లండన్ నుంచి వచ్చాడు. పరీక్షల అనంతరం అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో అతని కుటుంబ సభ్యులు మొత్తం 8 మందికి కూడా పరీక్షలో చేశారు. శ్రీకాళహస్తికే చెందిన మరో యువకుడు, చిత్తూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం రుయాలో ఉంచారు. వారి రిపోర్టులు శుక్రవారం రానున్నాయి. ►అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 2,356 క్వారంటైన్ పడకలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మౌలిక సదుపాయాల కోసం వైద్య ఆరోగ్యశాఖకు రూ. 50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. ►నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అనుమతించడంతో చిత్తూరు జిల్లా వాసులకు కాస్త ఊరటనిచ్చింది. పలు దుకాణాల వద్ద కొనుగోలు బారులు తీరారు. కొన్నిచోట్ల సరుకులన్నీ కొనుక్కుని వెళితే మరికొన్నిచోట్ల వ్యాపారులు డోర్ డెలివరీ చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని వైద్యశాలల్లో జనరల్ ఓపీలు ఆపేసి, అత్యవసర సేవల్ని మాత్రం కొనసాగించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదుచేశారు. ►శ్రీకాకుళం జిల్లాలో గురువారం కూడా లాక్డౌన్ ప్రశాంతంగా ముగిసింది. అధికారుల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో నాలుగు చోట్ల తాత్కాలిక రైతుబజార్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ నిర్దేశిత ధరల ప్రకారం కూరగాయలు విక్రయించారు. -
యూకేలో చదువు, ఉద్యోగం కలే!
లండన్: యూరోపియనేతరులకు ఇక యూకేలో ఉద్యోగం, చదువు కల కాబోతోందా?. అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినవస్తున్నాయి. యూకే ప్రభుత్వం ఇమిగ్రేషన్ లో తీసుకురానున్న మార్పులు దీన్నే సూచిస్తున్నాయి కూడా. ఇమిగ్రేషన్ లో మార్పులకు సంబంధించిన ప్లాన్స్ ను యూకే మంగళవారం బయటపెట్టింది. బర్మింగ్ హామ్ లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆ దేశ హోం శాఖ సెక్రటరీ అంబర్ రడ్ వలసలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈయూ నుంచి బయటకు రావడం వ్యూహంలో ఒక భాగమైతే, వలసలను తగ్గించడం మరో భాగమని అన్నారు. దేశ కంపెనీలు ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకోకుండా ఉండే విధంగా నిబంధనలను కఠినతరం చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. దీంతో భారత్ లాంటి దేశాల నుంచి ప్రొఫెషనల్స్ ను ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం అక్కడి కంపెనీలకు కష్టమే. బ్రిటిష్ ప్రజలు చేయగలిగే ఉద్యోగాలను వేరే వారికి వెళ్లకుండా ఉండే విధంగా చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. తమ వాళ్లను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుకోలేకపోతే ప్రపంచంలో తాము గెలుపును చూడలేమని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి యూకేలో నివసించడానికి ఇమిగ్రేషన్ అనుమతి లేకుండా ఉన్నవారిని జైలుకు పంపిస్తామని తెలిపారు. కారును నడపడానికి కూడా కచ్చితంగా ఇమిగ్రేషన్ డిపార్ట్ మెంట్ అనుమతి ఉండాలని తెలిపారు. దీంతో యూకేలో విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్ధుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కోర్సును బట్టి యూనివర్సిటీ ఇమిగ్రేషన్ నిబంధనలను మార్చనున్నట్లు ఆమె తెలిపారు. అయితే, ఈ పద్దతిని పరిశీలించాల్సివుందని చెప్పారు. నిబంధనలపై యూనివర్సిటీలతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. యూకే చట్టాలను ఉల్లంఘిచిన వారిని తిరిగి ఈయూకు పంపే నిబంధనలను సులభతరం చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం చట్టాన్ని సవరిస్తామని వెల్లడించారు. -
రాహుల్ భద్రత మరింత కట్టుదిట్టం
లఖిమ్‌పూర్ ఖేరి (యూపీ): ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ రోడ్‌షోలో రాహుల్ గాంధీపై హరిఓం మిశ్రా అనే జర్నలిస్టు బూటు విసిరిన నేపథ్యంలో మంగళవారం ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాహుల్ చేపట్టిన 2,500 కి.మీ.ల కిసాన్ యాత్రలో భాగంగా మంగళవారం ఇక్కడ రోడ్‌షో కొనసాగింది. ప్రదాని మోదీ రైతులు, దళితులు, నిరుద్యోగుల గురించి మరిచి పోయారని.. కేవలం 15-20 మంది కోసమే పనిచేస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. -
తిరుమలలో భద్రత కట్టుదిట్టం
సాక్షి,తిరుమల: హైదరాబాద్ నగరంలో ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్ నేపథ్యంలో రాష్ర్టమంతా భద్రతాపరంగా అప్రమత్తమయ్యారు. తిరుమలలో కూడా ముందస్తుగా హై అలెర్ట్ ప్రకటించారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఆలయంలోకి వెళ్లే అన్నిమార్గాల్లోనూ తనిఖీ వ్యవస్థను పటిష్టం చేశారు. భక్తులను సైతం నిశితంగా తనికీ చేసి అనుమతించారు. ఇక ఆలయం వెలుపల కూడా నిఘా వ్యవస్థ అప్రమత్తమైంది. బాంబు డిస్పోజబుల్, డాగ్‌స్క్వాడ్‌లు కూడా అప్రమత్తమయ్యాయి. ఆలయ నాలుగు మాడ వీధుల్లోనూ భద్రతను పెంచారు. యాక్షన్ టీంగా పరిగణించే ఆక్టోపస్ దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. మఫ్తీల్లో గస్తీ తిరిగారు. ఇక ఆలయంతోపాటు రద్దీగా ఉండే కల్యాణకట్ట, నిత్యాన్నప్రసాదం వద్ద కూడా భద్రతను అప్రమత్తం చేశారు. తిరుమలకు ప్రవేశ మార్గాలైన తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం, తిరుమలలోని గరుడాద్రినగర్ తనిఖీ కేంద్రాల్లోనూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించారు. సీసీ కెమెరా వ్యవస్థ ద్వారా జనం కదలికలపై నిఘా పెట్టారు. -
ఆస్పత్రి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు