సాక్షి, శ్రీనగర్: భారత్ జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగరలో సోమవారం జీ 20 దేశాల మూడో పర్యాటక కార్యవర్గ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వననున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. కేంద్రం జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను రద్దు చేసిన తదనంతరం ఈ ప్రాంతంలో ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. జీ20లో ప్రెసిడెన్సీలో భారత్ సగానికి చేరుకుందని, ఇప్పటి వరకు 118 సమావేశాలు జరిగాయని జీ20 చీఫ్ కోఆర్టినేటర్ హర్షవర్ధన్ షింఘూ తెలిపారు.
అంతేగాదు టూరిజంపై గతంలో జరిగిన రెండు సమావేశాలతో పోల్చితే శ్రీనగర్ సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని అన్నారు. ఈ జీ20 సదస్సు కోసం సభ్య దేశాల నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు హాజరవనున్నారుని చెప్పారు. శ్రీనగర్‌లో జరగుతున్న ఈ సమావేశానికి అత్యధిక సంఖ్యలో సింగపూర్ నుంచి ప్రతినిధులు విచ్చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేగాదు ప్రత్యేక ఆహ్వానిత అతిథి దేశాల ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు.
అక్కడ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్న చైనా..
కాశ్మీర్‌లో జీ20 సమావేశాన్ని నిర్వహించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పైగా ఈ ఈవెంట్ కోసం సౌదీ అరెబీయా నమోదు చేసుకోలేదు. టర్కీ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. వివాదాస్పద ప్రాంతాల్లో జీ20 సమావేశాలను ఏ రూపంలోనైనా నిర్వహించడాన్ని చైనా తప్పుపడుతోంది. అలాంటి సమావేశాలకు చైనా హాజరుకాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు. అంతతేగాదు భారత్ తన సొంత భూభాగాల్లో ఇలాంటివి నిర్వహించుకోవడం ఉత్తమం అంటూ ఓ ఉచిత సలహ కూడా ఇచ్చింది.
ఇదిలా ఉండగా, ఈ జీ20 కార్యక్రమం కోసం శ్రీనగర్‌లో చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా గార్డులు, నేల నుచి గగనతలం వరకు భారీగా మోహరించారు. యాంటీ డ్రోన్‌లతో గస్తీ, ఆర్మీ బోర్డర్(బీఎస్‌ఎఫ్). సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), సశాస్త్ర సీమాబల్(ఎస్‌ఎస్‌బీ) జమ్ము కాశ్మీర్ పోలీసులతో సహా వేలాది మంది సైనికులు గట్టిగా పర్యవేక్షిస్తున్నారు.
అలాగే జీ20 ప్రతినిధులు ఉపయోగించే మార్గంలో ట్రాఫిక్ కదలికలపై ఆంక్షలు కూడా విధించారు. కాగా, సందర్శనా కార్యక్రమంలో భాగంగా G20 ప్రతినిధులు శ్రీనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పోస్ట్‌కార్డ్‌గా మారిన పోలోవ్యూ మార్కెట్‌ను కూడా సందర్శిస్తారు. అంతేగాదు త్వరలో జరగనున్న జి-20 దేశాల పర్యాటక కార్యవర్గ సమావేశం విజయవంతమైతే జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకుల ప్రవాహం, పెట్టుబడులు పెరుగుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు.
CRPF Commandos, Marcos, and Black cat Commandos all geared up for the upcoming G20 summit in Srinagar pic.twitter.com/sMja7GHlX2
— The Asian News Hub (@AsianNewsHub) May 20, 2023
(చదవండి: 'నితీష్ జీ ప్రధాని కావాలనే పగటి కల'ను కనడం మానేయండి!)
Comments
Please login to add a commentAdd a comment