గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో ఘనతను అందుకున్నారు. శ్రీనగర్‌లో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో చెర్రీ పాల్గొంటున్నారు. ఫిల్మ్ టూరిజం ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్ అనే కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రతినిధులతో చరణ్ భేటీ కానున్నారు. పలు దేశాల నుంచి సెలబ్రిటీలు ఈ చర్చలో పాల్గొంటారు.
(ఇది చదవండి: వెయిటర్‌గా మారిన 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని)
ఇలాంటి ప్రతిష్ఠాత్మక సమ్మిట్‌కు టాలీవుడ్ హీరో హాజరు కావడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ వేదిక జీ20 సమ్మిట్‌లో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా చరణ్ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ చర్చలో భారత్ నుంచి చరణ్ ప్రాతినిధ్యం వహించనున్నారు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యాటక రంగంపై జీ20 సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించే సమావేశాలకు దాదాపు 60 మందికిపైగా విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు.
(ఇది చదవండి: Sarath Babu: శరత్‌బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు! మూడుసార్లు..)
కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం కియారా అద్వానీతో 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్.జె.సూర్య, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు. అయితే త్వరలోనే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నసంగతి తెలిసిందే. ఈ అరుదైన సందర్భం కోసం మెగా కుటుంబం ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తోంది.
Srinagar welcomes our Global star @AlwaysRamCharan garu for the prestigious #G20Summit along with influential leaders from across the Globe. #GlobalStarRamCharan #ManOfMassesRamCharan #RamCharan#GlobalStarRCfrG20Summit #RamCharanForG20Summit pic.twitter.com/7WGzbPaQa1
— SivaCherry (@sivacherry9) May 22, 2023
Comments
Please login to add a commentAdd a comment