శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా పరిధిలోని ఓ మారుమూల గ్రామంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం అందుతోంది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఆ తర్వాత సైనికులు ప్రతీ దాడి జరిపారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల మేరకు మెంధార్‌లోని పఠాన్ తీర్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు భద్రతా అధికారి తెలిపారు. దాక్కున్న ఉగ్రవాదులు సెర్చ్ పార్టీపై కాల్పులు జరిపారని, దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు.
రెండు వైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని, అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపామని అధికారి తెలిపారు. బారాముల్లాలో 12 గంటలకు పైగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. దాదాపు 12 గంటలకు పైగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.
ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Comments
Please login to add a commentAdd a comment