Swimming Under Ice: దక్షిణాఫ్రికాకు చెందిన ఓ స్విమ్మర్ సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పేందుకు ప్రాణాలనే రిస్క్‌లో పెట్టి స్టంట్ చేసింది. ఆమె ధైర్యానికి పలువురు ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, అంబర్ ఫిల్లరీ అనే మహిళ మంచు కింద 295 అడుగుల మూడు అంగుళాల దూరం ఈదుతూ రెండోసారి తన రికార్డును తానే బద్దలు కొట్టింది. కాగా, ఫిల్లరీ రెండేళ్ల క్రితం నార్వేలోని ఓప్స్జోలో 229 అడుగుల 7.9 అంగుళాల దూరం ఈది మొదటిసారి రికార్డు క్రియేట్ చేసింది.
తాజాగా కోంగ్స్‌బర్గ్‌లో డైవింగ్ సూట్ లేకుండా మంచు కింద నీటిలో ఆమె స్విమ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా.. క్రొయేషియాకు చెందిన విటోమిర్ మారిసిక్ అనే వ్యక్తి అంతకు ముందు 3 నిమిషాల 6 సెకన్లలో పూల్‌లో 351 అడుగుల 11.5 అంగుళాల దూరాన్ని ఈది గిన్నిస్ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు.
ఈ సందర్బంగా అంబర్ ఫిల్లరీ.. ఇప్పటి వరకు తనకు ఆర్థికంగా సహకరించిన , మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ రికార్డు సాధించేందుకు తనకు సహాయం చేసిన తన టీమ్‌కు కృతజ్ఞతలు చెప్పింది.
ఇది కూడా చదవండి: అత్యంత ప్రత్యేకం.. ప్రళయమొచ్చినా.. లైట్ తీసుకుంటాయ్!
Comments
Please login to add a commentAdd a comment