మెళకువలతో మేనికాంతి...
ఈ వయసులో చర్మం ముడతలు పడే అవకాశం ఎక్కువ. అందుకని పడుకునేముందు తప్పనిసరిగా ‘ఫేస్ వాష్‌తో’ (సబ్బును ఉపయోగించకూడదు) ముఖాన్ని శుభ్రపరుచుకోండి. మార్కెట్లో లభించే ‘నైట్ క్రీమ్స్’ చర్మతత్వానికి సరిపడేవి ఉపయోగించడం వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. త్వరగా ముడతలు పడదు. మసాజ్‌కి ఆలివ్, కొబ్బరినూనెలు మేలైనవి. ఈ వయసులో చర్మం పొడిబారడం సహజం. తైలగ్రంథుల పనితీరు మందగిస్తుంది.
దాంతో వాటినుంచి చమురు ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా పొడిబారిన చర్మం దురద పెడుతుంటుంది. దీంతో చర్మం నల్లబడుతుంది. కొన్నిసార్లు చారలు కూడా పడిపోతుంటాయి. వీరిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. గోళ్లు విరిగిపోతుంటాయి. పాదాల పగుళ్లు బాధిస్తుంటాయి. డయాబెటిస్, రీనల్ ఫెయిల్యూర్, బీపీ సమస్యలు సాధారణం. వీటి వల్ల చర్మం దెబ్బతింటుంది.
* ఏ కాలంలోనైనా, గోరువెచ్చని నీటితో, టిఎస్‌ఎఫ్‌ఎమ్ ఎక్కువ కంటెంట్ ఉన్న సోప్‌తో స్నానం చేయాలి. తర్వాత మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
* పాదాల చర్మం బాగుండటానికి రాత్రి సగం చెంచా ఉప్పు కలిపిన లీటర్ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచి, శుభ్రంగా తుడిచి, తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోని పడుకోవాలి.
* పదే పదే పాదాలను తడపకూడదు. గోళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే గోళ్ల రంగు మారుతుంది. దానికీ తగు చికిత్స తీసుకోవాలి.
* ఎండలోకి వెళ్లేటప్పుడు బిడియపడకుండా పెద్ద హ్యాట్ లేదా గొడుగు, సన్‌గ్లాసెస్, మేనికి సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి.
* లో దుస్తులు సరైనవి కానప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రోజూ స్నానం చేసి, పొడి దుస్తులను మాత్రమే ధరించాలి.
* 8-10 గ్లాసుల నీరు తప్పక తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. నాన్‌వెజ్ తినేవారు ఎగ్‌వైట్, ఫిష్, చికెన్, మల్టీ విటమిన్ ట్యాబెట్ తీసుకుంటే ఇమ్యూన్ పెరుగుతుంది.