Wrinkled skin
-
మెడమీద ముడతలు తగ్గాలంటే..
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు క్లెన్సింగ్ మిల్క్‌లో ముంచిన కాటన్‌తో మెడను తుడిచి, ఆ తర్వాత టీ స్పూన్ కీరా దోసకాయ రసంలో టీ స్పూన్ ఆపిల్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని మెడకు పట్టించాలి. ఉదయం చన్నీటితో కడిగేయాలి. ఇలా కనీసం మూడు వారాల పాటు చేస్తే క్రమంగా మెడ మీద నలుపు వదులుతుంది. ఆపిల్ వెనిగర్ చర్మాన్ని టైట్ చేస్తుంది, కీరదోస చర్మాన్ని కోమలంగా మారుస్తుంది. ⇔ ప్రతి రోజూ ఒంటికి మాయిశ్చరైజర్, బాదం ఆయిల్ లేదా నువ్వుల నూనె రాస్తుంటే చర్మం చలికి పొడిబారకుండా ఉంటుంది. ⇔ శీతాకాలంలో చేతులకు ఆయిల్‌తో మర్దన చేయడం వల్ల ముడతలు తగ్గి చేతివేళ్ళు అందంగా తయారవుతాయి. ⇔ చలికాలంలో పెదవులు పగులుతుంటే... రాత్రి పడుకోబోయే ముందు నెయ్యి, వెన్న, మరేదైనానూనె రాస్తే పెదవులు మృదువుగా ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుడు జెల్ వంటివి రాసుకోవచ్చు. -
చర్మం పొడిబారుతుంటే...
స్వెటర్ వేసుకునో, వేడి వేడిగా కప్పు టీ తాగో చలిని ఇట్టే తరిమేయచ్చు. కానీ, పొడిబారే చర్మాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం దురద, ముడతలు పడటం వంటి సమస్యలు దీర్ఘకాలం బాధిస్తాయి. ఎండాకాలం కన్నా చలికాలం వేధించే చర్మ సమస్యలే అధికం. అందుకు కోల్డ్ క్రీములు, మాయిశ్చరైజర్లు ఉపయోగించినా రోజువారీ ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. గ్లిజరిన్ – పెట్రోలియమ్ జెల్లీ దూది ఉండను తీసుకొని గ్లిజర్లో అద్ది, పొడిబారిన చర్మంపై మృదువుగా రాయాలి. చర్మంలోకి ఇంకి పొడిబారడం సమస్య తగ్గుతుంది. వారానికి నాలుగైదు సార్లు రాయచు. అలాగే, పెట్రోలియమ్జెల్లీలో మాయిశ్చరైజర్ లక్షణాలు అధికం. పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రాత్రి పడుకునేముందు పెట్రోలియమ్ జెల్లీ రాసుకుంటే చర్మం పొడిబారడం సమస్య దరిచేరదు. పొద్దుతిరుగుడు నూనె చర్మం పొడిబారితే త్వరగా ముడతలు పడుతుంది. ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపుతుంది పొద్దుతిరుగుడు నూనె. కొద్దిగా ఈ నూనెతో చేతిలో వేసుకొని, ముఖానికి, కాళ్లకు, చేతులకు పట్టించి, మృదువుగా మర్దన చేసి వదిలేయాలి. రోజుకు ఒకసారైనా ఇలా చేస్తే చర్మం పొడిబారే సమస్య ఉండదు. తేనె–బొప్పాయి బొప్పాయిలో చర్మం ముడతలు పడటానికి నివారించే యాంటీ ఏజింగ్ ఏజెంట్స్ అధికం. తేనెలో చర్మాన్ని మృదువుగా మార్చే సుగుణాలు ఉన్నాయి. బొప్పాయి గుజ్జులో తేనె కలిసి ముఖానికి, మెడకు, చేతులకు రాసి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కొబ్బరినూనె చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ అంటే అది కొబ్బరి నూనె. కొద్దిగా అరచేతిలో కొబ్బరి నూనె వేసుకొని రెండు చేతులకూ రాసి పొడిబారిన చర్మం మీదుగా రాయాలి. త్వరగా రిలీఫ్ లభిస్తుంది. చర్మం పొడిబారడం సమస్యా తగ్గుతుంది. పాలు – బాదం బాదంపప్పు, పాలలో చర్మానికి మాయిశ్చరైజర్నిచ్చే సుగుణాలు ఉన్నాయి. పొడిబారి కందిపోయిన చర్మానికి ఇవి ఉపశమనంతో పాటు సమస్యను తగ్గిస్తాయి. టీ స్పూన్ బాదం పొడి, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలిపి మిశ్రమం తయారుచేసుకొని కందిపోయిన చర్మం మీదుగా రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే చర్మానికి తగిన మాయిశ్చరైజర్ లభిస్తుంది. తేనె – నిమ్మరసం నిమ్మలో యాంటీయాక్సిడెంట్లు, తేనెలో మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఈ రెంటినీ కలిపి వాడితే చలికాలం వేధించే చర్మ సమస్యలు దరిచేరవు. -
చేతుల చర్మం పొడిబారిందా?
గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం వల్ల సబ్బుల్లోని రసాయనాలు చేతుల చర్మం పై ప్రభావాన్ని చూపుతాయి. వీటి వల్ల చర్మం త్వరగా పొడిబారుతుంటుంటుంది. నిర్లక్ష్యం చేస్తే త్వరగా ముడతలు కనిపిస్తాయి. ఈ సమస్య దరిచేరకూడదు అంటే.. పని పూర్తయిన తర్వాత లిక్విడ్ సోప్‌తో చేతులను శుభ్రపరుచుకుని, కొబ్బరి నూనెతో చేతులను మర్దనా చేసుకోవాలి. కొబ్బరి నూనెలోని మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల చర్మం పొడిబారడం, ముడతలు పడటం జరగదు. -
మెళకువలతో మేనికాంతి...
ఈ వయసులో చర్మం ముడతలు పడే అవకాశం ఎక్కువ. అందుకని పడుకునేముందు తప్పనిసరిగా ‘ఫేస్ వాష్‌తో’ (సబ్బును ఉపయోగించకూడదు) ముఖాన్ని శుభ్రపరుచుకోండి. మార్కెట్లో లభించే ‘నైట్ క్రీమ్స్’ చర్మతత్వానికి సరిపడేవి ఉపయోగించడం వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. త్వరగా ముడతలు పడదు. మసాజ్‌కి ఆలివ్, కొబ్బరినూనెలు మేలైనవి. ఈ వయసులో చర్మం పొడిబారడం సహజం. తైలగ్రంథుల పనితీరు మందగిస్తుంది. దాంతో వాటినుంచి చమురు ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా పొడిబారిన చర్మం దురద పెడుతుంటుంది. దీంతో చర్మం నల్లబడుతుంది. కొన్నిసార్లు చారలు కూడా పడిపోతుంటాయి. వీరిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. గోళ్లు విరిగిపోతుంటాయి. పాదాల పగుళ్లు బాధిస్తుంటాయి. డయాబెటిస్, రీనల్ ఫెయిల్యూర్, బీపీ సమస్యలు సాధారణం. వీటి వల్ల చర్మం దెబ్బతింటుంది. * ఏ కాలంలోనైనా, గోరువెచ్చని నీటితో, టిఎస్ఎఫ్ఎమ్ ఎక్కువ కంటెంట్ ఉన్న సోప్‌తో స్నానం చేయాలి. తర్వాత మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. * పాదాల చర్మం బాగుండటానికి రాత్రి సగం చెంచా ఉప్పు కలిపిన లీటర్ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచి, శుభ్రంగా తుడిచి, తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోని పడుకోవాలి. * పదే పదే పాదాలను తడపకూడదు. గోళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే గోళ్ల రంగు మారుతుంది. దానికీ తగు చికిత్స తీసుకోవాలి. * ఎండలోకి వెళ్లేటప్పుడు బిడియపడకుండా పెద్ద హ్యాట్ లేదా గొడుగు, సన్‌గ్లాసెస్, మేనికి సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. * లో దుస్తులు సరైనవి కానప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రోజూ స్నానం చేసి, పొడి దుస్తులను మాత్రమే ధరించాలి. * 8-10 గ్లాసుల నీరు తప్పక తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. నాన్‌వెజ్ తినేవారు ఎగ్‌వైట్, ఫిష్, చికెన్, మల్టీ విటమిన్ ట్యాబెట్ తీసుకుంటే ఇమ్యూన్ పెరుగుతుంది.