మెరిసే చర్మ సౌందర్యం కోసం నెలనెలా వందల రూపాయలు ఖర్చు చేస్తుంటారు మగువలు. కానీ కెమికల్స్ ఎక్కువగా ఉండే ఫేస్ క్రీమ్స్ కంటే.. ఇంటి పట్టున సహజసిద్ధంగా తయారు చేసుకునే ఫేస్ ప్యాక్సే సరైనవని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. మరైతే ఎన్నో గొప్పలక్షణాలున్న కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లతో చక్కటి క్లీనప్, స్క్రబ్, మాస్క్ వంటివి ప్రయత్నించండి. చర్మం పటుత్వాన్ని కోల్పోకుండా చూసుకోండి.
కావలసినవి: క్లీనప్ : పెరుగు – 3 టీ స్పూన్స్, కొబ్బరి నూనె – 1 టీ స్పూన్‌స్క్రబ్ : కొబ్బరి నీళ్లు – 3 టీ స్పూన్స్, ఓట్స్ – 2 టీ స్పూన్స్ మాస్క్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్స్, తేనె – 1 టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని పెరుగు, కొబ్బరి నూనె యాడ్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకుని, ఓట్స్, కొబ్బరి నీళ్లు కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ముఖాన్ని చల్లని వాటర్‌తో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. తర్వాత తేనె, నిమ్మరసం, కొబ్బరి పాలు మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకుని బాగా ఆరనివ్వాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment