
ఇలా చేయకండి...
చర్మంలోని తేమను బట్టే ముఖం తాజాగా కనిపిస్తుంది. ఎంత ఎక్కువగా ఫేస్ వాష్ చేస్తే ముఖం అంత తాజాగా కనిపిస్తుందనుకుంటారు కొందరు. అదే పనిగా ఫేస్ వాష్ చేస్తారు కూడా. అయితే ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి సున్నితత్వం కోల్పోతుంది. ఫలితంగా చర్మం పొడి బారుతుంది.
ఇలా చేయండి...
స్నానం చేయడానికి ముందు బాదం నూనెను ముఖానికి బాగా పట్టించాలి. అలా గంట పాటు వదిలేస్తే తేమను చర్మ గ్రంథులు పీల్చుకుంటాయి. తరువాత ముఖం శుభ్రంగా కడుక్కుంటే ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment