సోరియాసిస్‌ తగ్గి తీరుతుంది | Homeopathic Remedies Can Cure Psoriasis | Sakshi
Sakshi News home page

సోరియాసిస్‌ తగ్గి తీరుతుంది

Published Thu, Dec 5 2019 12:44 AM | Last Updated on Thu, Dec 5 2019 12:44 AM

Homeopathic Remedies Can Cure Psoriasis - Sakshi

నా వయసు 42 ఏళ్లు. చర్మంపై ఎర్రటి తెల్లటి పొడలు కనిపిస్తున్నాయి. ఆ పొడల్లో దురదగా కూడా ఉంటోంది. తలలోంచి వెండి పొలుసుల్లా రాలిపోతున్నాయి. డాక్టర్‌కు చూపిస్తే సోరియాసిస్‌ అని మందులు ఇచ్చారు. కానీ మూడేళ్ల నుంచి వాడుతున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. నా సమస్య హోమియో వైద్యంతో తగ్గుతుందా?

అన్ని ఇతర వ్యాధుల్లాగే సోరియాసిస్‌ కూడా సాధారణ వ్యాధే. కారణాన్ని తెలుసుకుని హోమియో వైద్యం అందిస్తే సోరియాసిస్‌ను సమూలంగా నయం చేయవచ్చు. సోరియాసిస్‌ అనేది దీర్ఘకాలిక చర్మవ్యాధి. ఈ వ్యాధి తగ్గినట్టే తగ్గి... మళ్లీ మళ్లీ వస్తుంటుంది. ఇతర చర్మవ్యాధులతో పోలిస్తే ఇది భిన్నమైనది. ఇందులో చర్మం మీద దురద, ఎర్రటి పొడలు రావడంతో పాటు, వెండి లాంటి తెల్లటి చేపపొలుసుల్లాంటివి కనిపిస్తాయి. ఈ పొలుసుల ఆధారంగానే సోరియాసిస్‌ను నిర్ధారణ చేస్తారు.

ఎందుకు వస్తుందంటే :  మన చర్మంలో సహజంగా పాత కణాలు పోయి కొత్త కణాలు వస్తుంటాయి. ఇది సాధారణ కంటికి కనిపించని ప్రక్రియ. ఈ విధంగా పాతకణాలు పోయి కొత్తకణాలు రావడానికి 28 నుంచి 30 రోజులు పడుతుంది. కానీ సోరియాసిస్‌లో ఆటో ఇమ్యూనిటీ కారణంగా చర్మంలోని కొత్త కణాలు త్వరగా రావడం జరుగుతుంది. కొత్త కణాలు 3 నుంచి 6 రోజుల్లోనే వచ్చేసి, పాతకణాలను బయటకు నెట్టేసి చర్మం మీద పొలుసుల మాదిరిగా కనిపించేలా చేస్తాయి.

లక్షణాలు : చర్మంపై చిన్నగా లేక పెద్దగా ఎర్రటి పొడలు రావడం, వాటి మీద వెండి లాంటి తెల్లటి పొడలు రావడం జరుగుతుంది. ఈ పొడలు దురదగా ఉండి, గోకిన వెంటనే తెల్లటి పొలుసులు ఊడి బయటకు వస్తాయి. తలలో ఉండే సోరియాసిస్‌ పలుసులు పెద్దగా ఉండి పెచ్చుల మాదిరిగా కనిపిస్తూ, ఎంతకూ తగ్గకపోవడం జరుగుతుంది.

హోమియో చికిత్స : ముందుగా సోరియాసిస్‌ రావడానికి ముఖ్య కారణాలను తెలుసుకోవడం జరుగుతుంది. రోగి మానసిక ఒత్తిడి, ఆందోళన మొదలైన కారణాలను తెలుసుకుని, దానికి అనుగుణంగా మందులు ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీర్ఘకాల సమస్య కాబట్టి వైద్యుల సూచన మేరకు ఓపికగా మందులు వాడాల్సి ఉంటుంది.
డా‘‘ కె. రవికిరణ్,
మాస్టర్స్‌ హోమియోపతి, హైదరాబాద్‌

పైల్స్‌కు శాశ్వత పరిష్కారం ఉంటుందా?
నా వయసు 55 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్‌ అన్నారు. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?

అమితంగా ఇబ్బంది కలిగించే సమస్యల్లో మొలల సమస్య ఒకటి. ఈ సమస్యలో మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి  మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. వీటిలో తీవ్రతను బట్టి రకరకాల గ్రేడ్స్‌ ఉంటాయి.

కారణాలు :
►మలబద్దకం
►మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండర బంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి
►సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం
►స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు ఒకే చోట కూర్చొని పనిచేయడం
►మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం
►పోషకాహారం తీసుకోకపోవడం
►నీరు తక్కువగా తాగడం
►ఎక్కువగా ప్రయాణాలు చేయడం
►అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం
►మానసిక ఒత్తిడి.. వంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ.

లక్షణాలు :
►నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి
►మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం.

నివారణ :
►మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం
►సమయానికి భోజనం చేయడం ∙ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం
►నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం
►మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం
►మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్‌ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు.
హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా మందులు ఇచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement