ఒళ్లంతా పొడిబారిపోయి చర్మంపైనుండే కణాలు పొట్టులా రాలిపోయే చర్మవ్యాధి సోరియాసిస్ గురించి తెలియనివారుండరు. తమ సొంత వ్యాధినిరోధక వ్యవస్థ తమ సొంత కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్ డిసీజ్) వల్ల ఇలా చర్మంపై పొట్టురాలిపోతూ ఉంటుంది. చర్మవ్యాధిగానే చూసే దీని ప్రతికూల ప్రభావాలు కొంతవరకు కంటిపైనా ఉంటాయి. అదెలాగో చూద్దాం.
ఈ జబ్బు ఉన్నవాళ్లలో కంటికి సంబంధించిన కొన్ని సమస్యాత్మక కండిషన్లు తలెత్తవచ్చు. అవి...
కంటిలోని ఐరిస్, కోరాయిడ్, సీలియరీ బాడీ అనే నల్లపొరలో ఇన్‌ఫ్లమేషన్ (మంట, వాపు) రావచ్చు. (ఇలా జరగడాన్ని ‘యువైటిస్’ అంటారు).
కార్నియాకు ఇన్‌ఫ్లమేషన్ రావచ్చు (కెరటైటిస్).
కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ (కంజంక్టివైటిస్) వచ్చే అవకాశాలున్నాయి.
కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి సమస్యలూ రావచ్చు.
జాగ్రత్తలు / చికిత్స : గతంతో పోలిస్తే ఇప్పుడు సోరియాసిస్‌కు అత్యంత అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ తరహా ఆధునిక చికిత్సలతో సోరియాసిస్‌ను వీలైనంతగా అదుపులో పెట్టడం సాధ్యమవుతోంది. పైన పేర్కొన్న కంటికి సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు సోరియాసిస్‌కు చికిత్సలు తీసుకుంటూనే... ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించడం చాలా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment