పర్పుల్ లైఫ్ సైన్సెస్ సోరియాసిస్ నుంచి ఉపశమనం కలిగించేలా ప్రకృతి సహజస్ధిమైన వాటితో తయారుచేసిన సరికొత్త ఆయిల్ PSOCAREని ప్రారంభించింది. ఈ సంస్థ సంప్రదాయ వైద్య విధానానికి పెద్దపీట వేసేలా.. ప్రకృతిసిద్ధమైన వాటిపై దృష్టిసారించిన ఏకైక సంస్థ. ఈ సంస్థ ప్రవేశపెట్టిన అనేక ఉత్పత్తుల్లో ఇలాంటి ప్రొడక్ట్ మొదటిదని సంస్థ పేర్కొంది.
ఇది సోరియాసిస్ లక్షణాలను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు. దీనిలో మొక్కల ఆధారిత ఆంథోసైనిన్, బాకుచియోల్, సోరాలిడిన్, ప్సోరాలెన్ ఉన్నాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మం వాపుని నయం చేయడమే గాక దీనికి కారణమైన ఆక్సీకరణ ఒత్తిడిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫలితంగా ఆవ్యాధి లక్షణాలను తగ్గుముఖం పడతాయి.
ఇందులో ఉండే ఆంథోసైనిన్ కోసం పర్పుల్ మొక్కజొన్నను వాణిజ్యపరంగా పండిస్తున్న ఏకైక భారతీయ కంపెనీ కూడా ఇదే. ఈ PSOCARE అనేది సింథటిక్ పదార్థాలు లేదా దుష్ప్రభావాలు లేకుండా అందించే సహజ సిద్దమైన ఆయిల్. దీర్ఘకాలికి వ్యాధులను సమర్థవంతంగా నిర్వహించి, తగ్గించే లక్ష్యంతో ఈ ఉత్పత్తిని తీసుకొచ్చామని సంస్థ డైరెక్టర్ మొహలి, ఫార్మాస్యూటికల్ డైరెక్టర్ రాఘవ్ రెడ్డి చెబుతున్నారు.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సాంప్రదాయ చికిత్స విధానంతో చక్కటి ఆరోగ్యాన్ని అందివ్వాలన్నదే మా లక్ష్యం అని ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ డైరెక్టర్ కే మణికంఠ రెడ్డి అన్నారు. అలాగే ప్రకృతి శక్తికి సాంకేతికతను జోడించి ఎలాంటి దుష్ప్రభావాలు ఇవ్వని సాంప్రదాయ వైద్యాన్ని సమర్థవంతంగా అందించడమే తమ సంస్థ లక్ష్యం అని చెబుతున్నారు.
(చదవండి: ఇదేం చిత్రం..! జననాల రేటు పెంచడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ..!)
Comments
Please login to add a commentAdd a comment