healing
-
సోరియాసిస్‌ను తగ్గించే సహజసిద్ధమైన ఆయిల్..
పర్పుల్ లైఫ్ సైన్సెస్ సోరియాసిస్ నుంచి ఉపశమనం కలిగించేలా ప్రకృతి సహజస్ధిమైన వాటితో తయారుచేసిన సరికొత్త ఆయిల్ PSOCAREని ప్రారంభించింది. ఈ సంస్థ సంప్రదాయ వైద్య విధానానికి పెద్దపీట వేసేలా.. ప్రకృతిసిద్ధమైన వాటిపై దృష్టిసారించిన ఏకైక సంస్థ. ఈ సంస్థ ప్రవేశపెట్టిన అనేక ఉత్పత్తుల్లో ఇలాంటి ప్రొడక్ట్ మొదటిదని సంస్థ పేర్కొంది. ఇది సోరియాసిస్ లక్షణాలను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు. దీనిలో మొక్కల ఆధారిత ఆంథోసైనిన్, బాకుచియోల్, సోరాలిడిన్, ప్సోరాలెన్ ఉన్నాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం వాపుని నయం చేయడమే గాక దీనికి కారణమైన ఆక్సీకరణ ఒత్తిడిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫలితంగా ఆవ్యాధి లక్షణాలను తగ్గుముఖం పడతాయి. ఇందులో ఉండే ఆంథోసైనిన్ కోసం పర్పుల్ మొక్కజొన్నను వాణిజ్యపరంగా పండిస్తున్న ఏకైక భారతీయ కంపెనీ కూడా ఇదే. ఈ PSOCARE అనేది సింథటిక్ పదార్థాలు లేదా దుష్ప్రభావాలు లేకుండా అందించే సహజ సిద్దమైన ఆయిల్. దీర్ఘకాలికి వ్యాధులను సమర్థవంతంగా నిర్వహించి, తగ్గించే లక్ష్యంతో ఈ ఉత్పత్తిని తీసుకొచ్చామని సంస్థ డైరెక్టర్ మొహలి, ఫార్మాస్యూటికల్ డైరెక్టర్ రాఘవ్ రెడ్డి చెబుతున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సాంప్రదాయ చికిత్స విధానంతో చక్కటి ఆరోగ్యాన్ని అందివ్వాలన్నదే మా లక్ష్యం అని ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ డైరెక్టర్ కే మణికంఠ రెడ్డి అన్నారు. అలాగే ప్రకృతి శక్తికి సాంకేతికతను జోడించి ఎలాంటి దుష్ప్రభావాలు ఇవ్వని సాంప్రదాయ వైద్యాన్ని సమర్థవంతంగా అందించడమే తమ సంస్థ లక్ష్యం అని చెబుతున్నారు.(చదవండి: ఇదేం చిత్రం..! జననాల రేటు పెంచడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ..!) -
చిన్ననాటి గాయాలను సరిదిద్దే.. ఇన్నర్ చైల్డ్ హీలింగ్!
బాల్యం వ్యక్తిత్వానికి పునాదిలాంటిది. బాల్యంలో మన అనుభవాలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు సానుకూలంగా ఉండవచ్చు లేదా ప్రతికూలంగానూ ఉండవచ్చు. మనం పెరిగి పెద్దయ్యాక దైనందిన జీవితంలోని సంక్లిష్టతలను చాకచాక్యంగా మేనేజ్ చేస్తున్నప్పటికీ, బాల్యంలో అనుభవించిన నిర్లక్ష్యం, తగిలిన గాయాలు, అనుకున్నవి నెరవేరని బాధ నేటికీ అలాగే ఉండవచ్చు. ఆ గాయాలను నయం చేయకపోతే అవి యుక్తవయసు ప్రవర్తన, ఎమోషనల్ రియాక్ష¯Œ ్స, మానసిక సమస్యలుగా వ్యక్తమవుతాయి.ఉదాహరణకు.. బాల్యంలో నిర్లక్ష్యం, నిరాదరణ, తిరస్కరణకు లోనయినట్లయితే దాని ప్రభావం ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎంత విలువైన వ్యక్తిగా చూసుకుంటున్నారు, మీ సంబంధ బాంధవ్యాలను ఎంతవరకు నమ్మతున్నారనే దానిపై ప్రభావం చూపించవచ్చు. మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామితో, సహోద్యోగితో, ఉన్నతాధికారితో మీ సంబంధాలను ప్రభావితం చేయవచ్చు.ఇలాంటి సందర్భాల్లోనే ఇన్నర్ చైల్డ్ వర్క్ లేదా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనే థెరపీ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ లోలోపల దాగి ఉన్న భావోద్వేగ గాయాలను పరిష్కరించుకోవచ్చు. మీరు మరింత ఎమోషనల్ ఫ్రీడమ్‌తో ముందుకు సాగవచ్చు. కొంచెం సంక్లిష్టమైన ఈ ప్రక్రియను మొదట సైకాలజిస్ట్ పర్యవేక్షణలో నేర్చుకోవడం మంచిది.ఇన్నర్ చైల్డ్‌ను గుర్తించడంమీ లోపల బాల్యం అలాగే ఉందని, అది అప్పుడప్పుడూ మాట్లాడుతూంటుందని, దాని మాటలు వినాలని గుర్తించడం మొదటి అడుగు. ఈ దశలో మీ బాల్యంలోని అనుభవాలను, భావోద్వేగాలను, అవసరాలను గుర్తించాలి.ఇన్నర్ చైల్డ్‌తో కనెక్ట్ అవ్వడంవిజువలైజేషన్ ఎక్సర్సైజ్లు, డైరీ రాయం, డైలాగ్ టెక్నిక్స్ ద్వారా మీ ఇన్నర్చైల్డ్తో కనెక్ట్ అవ్వచ్చు. ఉదాహరణకు.. మీరు కళ్ళు మూసుకుని, చిన్నతనంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవచ్చు, నిర్దిష్ట జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవచ్చు. లేదా మీ బాల్యం ఎలా ఉందో, ఎలా ఫీలయ్యేవారో ఊహించుకోవచ్చు. మీరెంత కరుణతో అర్థంచేసుకున్నారో మీ ఇన్నర్ చైల్డ్‌కు ఒక లేఖ రాయవచ్చు.ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఇలా...ఇన్నర్ చైల్డ్ చెప్పేది వినడం మీరు మీ ఇన్నర్ చైల్డ్‌తో కనెక్ట్ అయిన తర్వాత, తన భావాలు, భయాలు, అవగాహనను వినాలి. మీ ఇన్నర్ చైల్డ్‌ను ఎన్నో ఏళ్లుగా మీరు పట్టించుకుని ఉండరు. అందువల్ల తను మాట్లాడటానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. అందువల్ల తనను జడ్జ్ చేస్తారనే భయం లేకుండా తన భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలిగే అంతర్గత వాతావరణాన్ని కల్పించాలి. ఇందుకు చాలా ఓపిక, సహానుభూతి అవసరం.హీలింగ్ అండ్ రీపేరెంటింగ్ మీ చిన్నతనంలో లోపించిన ప్రేమ, సంరక్షణ, మద్దతు మీ యవ్వనానికి అందించడం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ లక్ష్యం. ‘రీపేరెంటింగ్’ అనే ఈ ప్రక్రియ.. మీరు మీ ఇన్నర్ చైల్డ్‌కు నచ్చిన వ్యక్తిగా మారడానికి అనుమతిస్తుంది. ‘నువ్వు సురక్షితంగా ఉన్నావు’, ‘నీకు నచ్చినట్టుగా నువ్వు ఫీలవ్వచ్చు’, ‘నిన్ను అందరూ ప్రేమిస్తున్నారు’ అని మీ ఇన్నర్ చైల్డ్‌కు భరోసా ఇవ్వడం ద్వారా మీ బాల్యంలో అందుకోలేకపోయిన ధైర్యాన్ని, ప్రేమను, ప్రోత్సాహాన్ని అందించాలి.ఇన్నర్ చైల్డ్ని ఇంటిగ్రేట్ చేయడం..మీ ఇన్నర్ చైల్డ్‌ను అడల్ట్ సెల్ఫ్‌తో ఇంటిగ్రేట్ చేయడం చివరిదశ. అంటే మీ ఇన్నర్ చైల్డ్ మీలో ఒక భాగమని అంగీకరించడం. మీ బాల్యంలోని అనుభవాలు, భావోద్వేగాలు మీ ఇప్పటి ఐడెంటిటీని ప్రభావితం చేస్తున్నాయని, మీరిద్దరూ ఒకటేనని గుర్తించడం. ఇది సెల్ఫ్ కంపాషన్ను, ఎమోషనల్ బ్యాలెన్స్‌ను పెంచుతుంది. – సైకాలజిస్ట్ విశేష్ -
‘దారి’లేక.. ఆస్పత్రికి చేరలేక
ఆసిఫాబాద్ రూరల్/నెన్నెల, వేములవాడ రూరల్: ‘దారీ’తెన్నూ లేని పల్లెలు.. వాగులు దాటి వైద్యం అందుకోలేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. శుక్రవారం ఒక్కరోజే వేర్వేరుచోట్ల రోడ్డు సరిగా లేక, అంబులెన్స్‌ల రాకకు వాగులు అడ్డొచి్చన క్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివాసీ దినోత్సవం నాడే ఓ ఆదివాసీ మహిళకు పుట్టెడు గర్భశోకం మిగిలింది. కడుపులో ఇద్దరు బిడ్డలను మోస్తూ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తూ.. వాగు ఒడ్డునే బిడ్డను ప్రసవించింది. పుట్టిన గంటకే బిడ్డ కన్నుమూసింది. కడుపులోని మరో బిడ్డతో ఆ మహిళ చికిత్స పొందుతోంది. ఈ దారుణం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా, మరో రెండు ఘటనల్లో ఓ యువకుడు, వృద్ధురాలు సైతం సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు ప్రాణాలు మోస్తూ.. ఆసిఫాబాద్ మండలం బండగూడకు చెందిన ఆత్రం కొండు, ఆత్రం ధర్మూబాయి దంపతులు రైతులు. వీరికి రెండేళ్ల పాప ఉండగా.. ప్రస్తుతం ధర్మూబాయి ఏడు నెలల గర్భిణి. శుక్రవారం మధ్యాహ్నం నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. గ్రామానికి వెళ్లే దారిలో వాగు అడ్డుగా ఉండడంతో 108 వాహనం వాగు ఒడ్డు వరకే వచి్చంది. స్థానికులు గర్భిణిని గ్రామం నుంచి కిలోమీటరున్నర దూరం నడిపించి వాగు దాటించారు. ఆ సమయంలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో భయాందోళనకు గురైన ధర్మూబాయికి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి.ఈ క్రమంలోనే వాగు ఒడ్డున ఆడశిశువుకు జన్మనిచి్చంది. కడుపులో మరో శిశువు ఉన్నట్లు గుర్తించిన 108 సిబ్బంది తల్లీబిడ్డను ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే పుట్టిన శిశువు మృతిచెందింది. కడుపులోని మరో శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని అదే వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శస్త్రచికిత్స చేసి ఆ బిడ్డను కాపాడారు. పుట్టిన శిశువు బరువు 800 గ్రాములే ఉండటంతో ఎన్‌ఎన్‌సీలో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు ఎంసీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ భీష్మ తెలిపారు. కాగా గతేడాది వర్షాకాలంలో ఈ వాగు దాటుతున్న సమయంలో వరదలో కొట్టుకుపోయి ఓ యువతి మృత్యువాత పడింది. అంబులెన్స్ వచ్చే దారిలేక.. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోణంపేటకు చెందిన జింజిరి జశ్వంత్ (17) పొలం పనులు ముగించుకుని ఇంటికొస్తూ ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. 108 అంబులెన్స్ వచి్చనా.. బురద కారణంగా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. వాహనం నిలిపిన చోటికి యువకుడిని తీసుకురావాలని అంబులెన్స్ సిబ్బంది సూచించారు. గ్రామస్తుల సహకారంతో జశ్వంత్‌ను ఎడ్లబండిలో తీసుకెళ్లారు. అంబులెన్స్‌లోకి ఎక్కించిన యువకుడిని సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతిచెందాడని చెప్పారు. రోడ్డు సరిగా ఉండుంటే జశ్వంత్ ప్రాణాలు దక్కేవని బంధువులు విలపించారు. సకాలంలో వైద్యం అందక..వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన ఐత లచ్చవ్వ (65) ఆస్తమాతో బాధపడుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె భర్త నారాయణ 108కు సమాచారమిచ్చాడు. నక్కవాగుపై వంతెన పూర్తికాకపోవడంతో వాగుకు అవతలి వైపే అంబులెన్స్ ఆగిపోయింది. లచ్చవ్వను గ్రామస్తులు ఇంటి నుంచి వాగుకు ఇటువైపు గడ్డ వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్ట్రెచర్‌పై దాదాపు 400 మీటర్ల దూరాన ఉన్న అంబులెన్స్ వరకు మోసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ.. పరిస్థితి విషమించి లచ్చవ్వ మృతి చెందింది. -
సెల్యులర్ రీప్రోగ్రామింగ్కి ఆ విటమిన్ అత్యంత కీలకం!
శరీర పనితీరుకు అవసరమైన కీలక మూలకం బీ12. అలాంటి బీ12తో జన్యు ఉత్ఫరివర్తనాలను రక్షించే డీఎన్ఏని సంశ్లేషించగలదని, దీంతో ఎన్నో రకాలా దీర్ఘకాలిక వ్యాధులతో సులభంగా పోరాడగలుగుతామని పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడించారు. అలాగే కణజాల పునరుత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు. ఈ బీ12 ఉపయోగాలు, ఎంతెంత మోతాదులో మానవులకు అవసరమో తదితర విశేషాల గురించే ఈ కథనం!. ఐఆర్బీ బార్సిలోనా పరిశోధకులు సెల్యులర్ రీ ప్రోగ్రామింగ్‌కి బీ12 ఎలా అవసరమో తమ అధ్యయనంలో వెల్లడించారు. అందుకోసం పెద్దప్రేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఆ ఎలుకలకు విటమిన్ బీ12 సప్లిమెంట్స్ ఇవ్వగా.. అది ఎలుకల కడుపులోని పొరను సరిచేసేలా పేగు కణాలు సెల్యులార్ని రీప్రోగ్రామింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు గుర్తించారు. అసలు ఈ సెల్యులర్ రీప్రోగామింగ్కి ఎలా విటమిన్ సరిపొతుందనే దిశగా మరింత లోతుగా అధ్యయనం చేయగా..బీ12 మిథైలేషన్ జీవక్రియను సులభతం చేయగలదని తెలుసుకున్నారు. నిజానికి కణజాల మరమత్తుకి మెదడు పనిచేసే కణాల డీఎన్ఏకి అధిక మొత్తంలో మిథైలేషన్ అవసరం. ఆ లోటును బీ12 భర్తి చేస్తుందని కనుగొన్నారు. అందువల్ల ఈ విటమిన్‌ని ఏదోరూపంలో శరీరానికి అందిస్తే దెబ్బతిన్న కణాజాల త్వరితగతిన రీప్రోగ్రామింగ్ చేయబడుతుందన్నారు. చెప్పాలంటే ముందుగా ఇది జన్యు పనితీరును మెరుగుపరిచడంతో చాలా సులభంగా కణజాలం రీప్రోగ్రామింగ్ చేయబడుతుందని తమ పరిశోధనల్లో వెల్లడించారు. ఇది చేతుల వాపులను కూడా తగ్గిస్తుందన్నారు. ఈ విటమిన్ దీర్ఘకాలిక వ్యాధులు, వయసు రీత్యా వచ్చే వ్యాధుల్లో పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు. వయసు పైబడిన ఎలుకలకు అధిక విటమిన్ B12 ఇవ్వగా వాటి రక్తప్రవాహంలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ IL-6, సీఆర్పీ స్థాయిలపై విలోమ ప్రభావాన్ని చూపుతునట్లు కనుగొన్నారు. అందువల్ల ఇది వయసు రీత్యా వచ్చే వ్యాధులను ఎదుర్కొవడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. దీన్ని ఆహారం నుంచి మాత్రమే తీసుకోగలం. పరిమిత మోతాదులో తీసుకోవడమే మంచిదన్నారు. వయసు రీత్యా పురుషులు, స్త్రీలు ఎంతెంత మోతాదుల్లో తీసుకోవాలి, అలాగే గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా వివరించారు. నిజానికి ఈ బీ12 విటమిన్ చేపలు, కాలేయం, ఎర్ర మాంసం, గుడ్లు, పాలు, చీజ్ వంటి ఉత్పత్తుల్లో లభిస్తుంది. ఇవేగాక ఈస్ట్ ఉత్పత్తులైన పట్టగొడుగులు, కొన్ని రకాల మొక్కలు, తృణధాన్యాల్లో కూడా ఉంటుందని అన్నారు. బలహీనమైన కండరాలు, వికారం, అలసట, అకస్మాత్తుగా హృదయ స్పందన రేటు పెరిగిపోవడం, ఎర్రరక్త కణాలు తక్కువగా ఉండటం తదితర సమస్యలను సులభంగా చెక్కుపెడుతుంది ఈ విటమిన్ బీ12. తద్వారా అనే రకాల దీర్ఘకాలిక రుగ్మతలు బారిన పడకుండా సురక్షితం ఉండగలుగుతామని నేచర్ మెటబాలిజం జర్నల్ వెల్లడించారు పరిశోధకులు. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో గురువారం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) విభాగం ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్పష్టమైన లక్ష్యంతో సీఎం ముందుకు వెళుతున్నారని చెప్పారు. గ్రామస్థాయి నుంచి మెడికల్ కళాశాలల బలోపేతం, నూతన వైద్య కళాశాలల నిర్మాణం, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఏకంగా రూ. 16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని వివరించారు. గడిచిన మూడేళ్లలో 40వేలకు పైగా నియామకాలు చేపట్టారని వెల్లడించారు. ప్రజలకు ఎక్కడా వైద్యం కోసం ఇబ్బందులు ఎదురవ్వకూడదన్నారు. ఆస్పత్రుల్లో మంచినీరు, పరిశుభ్రత, శుభ్రమైన మరుగుదొడ్లు ఉండేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాలని చెప్పారు. ప్రతి ఉద్యోగికి ఎక్కడ సమస్య ఎదురైనట్లు గుర్తించినా.. సదరు ఏజెన్సీలపై చర్యలకు వెనుకాడొద్దని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో మందుల కొరత ఉండకుండా చూడాలన్నారు. టెస్టులు, మందులు బయటకు రాయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి పీహెచ్సీలో నెలకు కనీసం 10 కాన్పులైనా జరిగేలా చూడాలన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.నివాస్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి, ఎన్హెచ్ఎం ఎస్పీఎం అప్పారావు, వివిధ కార్యక్రమాల అధికారులు డాక్టర్ అనీల్‌కుమార్, గణపతిరావు, డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వికటించిన వైద్యం: శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి
సాక్షి, తిరువళ్లూరు: వైద్యం వికటించడంతో శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి చెందిన ఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎంజీఆర్ నగర్‌కు చెందిన కుమార్‌కు లక్షిత(07) అనే కుమార్తె ఉంది. గతనెల 27న లక్షిత అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చిక్సిత చేయించారు. వైద్యులు ఇచ్చిన మందులను వాడిన రెండు రోజుల్లోనే బాలిక శరీరంపై బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు మళ్లీ అదే వైద్యశాలకు తీసుకెళ్లారు. చదవండి: (తల్లీకొడుకును బలిగొన్న బజ్జీలు) అయితే ఇక్కడ వైద్యం చేయలేమని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తుంది. దీంతో బాలికను పొన్నేరి వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చిక్సిత అందించిన తరువాత చెన్నై ఎగ్మూర్‌లో ఉన్న చిన్నపిల్లల వైద్యశాలకు తరలించారు. అక్కడ బాలిక చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు ప్రైవేటు వైద్యశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రిపై రాళ్లు రువ్వి వీరంగం సృష్టించారు. పోలీసు లు బాలిక బంధువులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం వైద్యశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: (విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి) -
ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా.. జాగ్రత్త!
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి జనాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువయ్యింది. ఇంటి, ఒంటి శుభ్రతతో పాటు తినే ఆహారంలో కూడా తగన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు బయటి ఆహారాన్నే ఇష్టపడ్డవారు సైతం ఇప్పుడు ఇంటి భోజనమే బెటర్ అంటున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచే తిండికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మన శరీరం చూపే కొన్ని లక్షణాలను బట్టి మన రోగనిరోధక శక్తి బలంగా ఉంది లేనిది అనే దాని గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అవేంటో చూడండి.. (చదవండి: నాటుకోడి నోరూరిస్తోంది..!) తరచు జలుబు, దగ్గు.. తరచుగా జలుబు చేసినా.. గొంతులో చిరాకుగా ఉండి దగ్గు సూచనలు కనిపించినా మీ ఇమ్యూనిటీ వీక్‌గా ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. ఒకవేళ మీకు గనక సంవత్సరంలో నాలుగు సార్లకంటే అధికంగా దగ్గు, జలుబు వచ్చాయంటే మీ ఇమ్మూనిటీ లెవల్స్ బలహీనంగా ఉన్నాయని అర్థం. నిద్ర లేచాక.. భారంగా ఉంటుందా.. రాత్రి నిద్రపోయాక తరచుగా మెలకువ వస్తుందా.. అలానే 7-8 గంటలు నిద్ర పోయి లేచిన తర్వాత కూడా మీకు భారంగా అనిపిస్తుందా. ఈ రెండు ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే.. మీ రోగ నిరోధక శక్తి ప్రమాదంలో ఉన్నట్లే. తరచుగా జీర్ణసంబంధ సమస్యలు తలెత్తడం.. మీరు బయట ఆహారం తిన్నారు.. కడుపులో అనిజీగి ఉందా. అయితే మీ ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లే. ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచే 70 శాతం కణజాలం జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మిగత శరీర భాగాలు కూడా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. గాయాలు నెమ్మదిగా నయమవుతున్నాయా.. దెబ్బ తగిలినప్పుడు.. కాలినప్పుడు కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అయ్యి ఆ గాయాలు మానిపోతాయి. అయితే ఈ ప్రక్రియకు చాలా సమయం తీసుకుంటే.. గాయాలు నెమ్మదిగా మానితే.. మీ రోగనిరోధక శక్తి మందగించిందని అర్థం. అంతేకాక మీ శరీరం, చర్మాన్ని రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలను అందించడం లేదనడానికి గుర్తు. తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారా.. మీరు జలుబు, దగ్గుతో పాటు మూత్ర, చెవి, సైనస్ సమస్యలకు తరచుగా గురవుతున్నారంటే ఇమ్యూనిటీ వీక్‌గా ఉందని అర్థం. మీ రోగనిరోధక వ్యవస్థ మీ శరీరంపై దాడి చేసిన వైరస్లు, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా తగినన్ని ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయలేకపోతుందనడానికి ఇది సంకేతం. ఈ పైలక్షణాలు మీకు కనిపిస్తే.. వెంటనే మీ రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం.. వ్యాయమాలు చేయడం ప్రారంభించండి అంటున్నారు వైద్యులు. (చదవండి: ‘ప్రోటీన్ల’ను పట్టించుకోరేమీ!) -
బతుకు చిన్నది.. వ్యాధి పెద్దది
భామిని: రోజువారీ కూలి పనులు చేసుకునే ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కుమారుడికి క్యాన్సర్ మహమ్మారి ప్రబలిందని తెలియడంతో ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు. మండలంలోని ఘనసర కాలనీకి చెందిన గిరిజన దంపతులు పాలపర్తి రమేష్, భారతీల కుమారుడు ఉదయ్‌కిరణ్ (రెండో సంతానం) ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. ఎనిమిదేళ్ల బాలుడికి క్యాన్సర్ ప్రబలందని ఈ వ్యాధి ప్రాథమిక దశలో ఉందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలోని పలు ఆస్పత్రులకు తిప్పారు. విశాఖ కేజీహెచ్‌కు తీసుకొని వెళ్లి వైద్య పరీక్షలు చేయించగా క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. ఐటీడీఏ పీఓ రూ.5 వేలు ఆర్థిక సాయం చేయడంతో విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కూడా చేయించారు. బియ్యం కార్డులో బాలుడి పేరు లేకవడంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆదుకోలేక పోతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబానికి దాతలు సాయం చేసి, తమ కుమారుడి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. దాతలు బ్యాంక్ ఖాతాకు నగదు పంపించాలని కోరుతున్నారు. బాధితుడు తండ్రి ఉదయ్‌కిరణ్ ఖాతా వివరాలు.. అకౌంట్ నంబర్: 35894805225, ఎస్బీఐ కొత్తూరు శాఖ, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0006636, ఫోన్ నంబర్: 9346692680. -
సేవకో రేటు!
సాక్షి, అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో కొందరు సిబ్బంది.. సేవలకు రేటు కట్టారు. ఒక్కోసేవకు రేటు ఫిక్స్ చేసి ఇక్కడికొచ్చేవారి జేబులు ఖాళీ చేస్తున్నారు. పేదలమని డబ్బులివ్వకపోతే...నోటికి పని చెబుతారు. అందరిముందే దుర్భాషలాడుతూ పరుపుతీస్తారు. అందుకే ధర్మాస్పత్రికి వచ్చేందుకే జనం జంకుతున్నారు. సిబ్బందితోనే... ఇబ్బంది సర్వజనాస్పత్రిలోని గైనిక్, లేబర్ వార్డు సిబ్బంది (వైద్యులు, స్టాఫ్‌నర్సులు కాదు) తీరుతో ఇక్కడికి ప్రసవాలకు వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది అడిగినంత ఇవ్వకపోతే పురిటి నొప్పుల కంటే ఇక్కడి సిబ్బంది పెట్టే టార్చరే ఎక్కువగా ఉంటుందని గర్భిణీలు, బాలింతలు వాపోతున్నారు. బాలింతలకు ‘జనని సురక్ష యోజన’ కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బు కన్నా ముందే సిబ్బందికి రూ.1,500 వరకు ముట్టజెప్పాల్సి వస్తోందంటున్నారు. రూ.500 సరిపోదమ్మా ‘‘సిజేరియన్ చేసిన వెంటనే బాబును శుభ్రం చేశాం. మరీ రూ.500 ఇస్తే ఏం సరిపోతుంది. మేము చాలా మందిమి ఉన్నాం...’’ అని వైద్యసిబ్బంది డిమాండ్ చేస్తున్నారని రాప్తాడు మండలం గొందిరెడ్డి పల్లికి చెందిన బాలింత సునీత వాపోయింది. ఆమెకు జూన్ 25న ఆస్పత్రిలోని లేబర్ వార్డులో సిజేరియన్ చేయగా...ఇక్కడి సిబ్బంది డబ్బుకోసం ఇబ్బంది పెట్టారని చెబుతోంది. ఇక స్ట్రెచ్చర్ నుంచి గైనిక్ వార్డుకి తీసుకొచ్చినందుకు రూ 100, చీర మార్చినందుకు రూ 100, కుట్లు శుభ్రం చేస్తున్నందుకూ రూ.50 తీసుకుంటున్నారని సునీత తల్లి సుశీల చెబుతున్నారు. ప్రసవం అయ్యాక శిశువును శుభ్రం చేయాలంటే.. రూ.500 బాలింతను స్ట్రెచ్చర్‌పై గైనిక్ వార్డుకు తీసుకొస్తే.. రూ 100 చీర మార్చినందుకు.. రూ 100 కుట్లు శుభ్రం చేస్తున్నందుకు.. రూ.50 కుట్లు విప్పేందుకు.. రూ. 200 వీల్‌చైర్‌లో అంబులెన్స్ వరకూ తీసుకెళ్తే.. రూ.100 ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రుల్లో సేవలకు చేసే చార్జ్ కాదు.. మన సర్వజనాస్పత్రిలోనే రోగుల నుంచి సిబ్బంది ముక్కు పిండి వసూలు చేస్తున్న మొత్తం. అడిగినంత ఇవ్వకపోతే ఇక బూతులే. డబ్బులివ్వకపోతే నరకమే! సర్వజనాస్పత్రికి వచ్చే వారంతా నిరుపేదలే. అందకూ కూలినాలి పనులు చేసుకునేవారే. అలాంటి వారినీ ఆస్పత్రిలోని లేబర్, గైనిక్ విభాగంలోని సిబ్బంది పీడిస్తున్నారు. ఆస్పత్రిలోని లేబర్‌వార్డులో రోజూ 30 నుంచి 40 ప్రసవాలు జరుగుతుండగా... వీటితో 10 నుంచి 12 సిజేరియన్లు ఉంటాయి. సిజేరియన్ అయిన వారి నుంచి సిబ్బంది భారీగా వసూలు చేస్తున్నారు. పైగా ఆమాత్రం ఇవ్వలేనోళ్లు కడుపెందుకు తెచ్చుకోవాలని నీచంగా మాట్లాడుతున్నట్లు గర్భిణులు వాపోతున్నారు. చీర మారిస్తే రూ.50 ప్రతి దానికి యాభైలు, వందలు. మేము యాడనుంచి తీసుకురావాలి. మా కోడలు అశ్వినికి పొద్దున్నే డ్రస్ మార్చాలంటే రూ.50 ఇస్తేనే చేస్తామంటారు. ఆ డబ్బుల్లేకనే గదా గవర్నమెంట్ ఆస్పత్రికి వచ్చింది. ఉన్నోళ్లుంటారు.. పూట గడవనోళ్లు ఉంటారు... లేనోళ్లను ఇబ్బంది పెట్టకండయ్యా. మీకు దండం పెడతాం. – ఆదెమ్మ, దంతలూరు, బీకేఎస్ మగబిడ్డ పుట్టాడు కదా... ఆ మాత్రం ఇవ్వలేవా..? ‘‘మగ బిడ్డ పుట్టాడు కదా...? ప్రసవమైనప్పుడు ఏమీ ఇవ్వలేదు. కనీసం బిడ్డను శుభ్రం చేసిన దానికి, యూరిన్ పైప్ వేసినందుకైనా డబ్బులివ్వు’’ అని అడుగుతున్నారని కూడేరు మండలం కలగళ్ల గ్రామానికి చెందిన బాలింత ఆదిలక్ష్మి వాపోయింది. ఆమె జూన్ 25న ప్రసవం కాగా..డబ్బుకోసం సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కన్నీటిపర్యంతమయ్యింది. డబ్బులివ్వకుంటే అందరి ముందే దూషిస్తున్నారని, పరువు పోతుందని భావించి డబ్బులిస్తున్నామని చెబుతోంది. కూలి పనులు చేసుకునే తమ లాంటి పేదోళ్లతో ఇలా డబ్బులు తీసుకోవడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చర్యలు తీసుకుంటాం ఆస్పత్రిలో వైద్య సేవలన్నీ ఉచితం. ఇక్కడ సిబ్బందికి చిల్లిగవ్వ ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే నా దృష్టికి తీసుకురావచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే గైనిక్, లేబర్ తదితర విభాగాల వైద్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి వాటికి ఫుల్స్టాప్ పెడతాం. – డాక్టర్ బాబూలాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
టీడీపీ నగర అధ్యక్షుడి గూండా గిరి
గుంటూరు ఈస్ట్: వైద్యం పేరుతో విడతల వారీగా రూ. 6 లక్షలు ఖర్చు చేయించి, చివరికి రోగి బతకడని చెప్పిన ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యానికి కొమ్ముకాస్తూ రోగి బంధువులను బెదిరించి తన అనుచరులతో దాడి చేయించాడో టీడీపీ నేత. ఈ ఘటన గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్డులో శనివారం కలకలం రేపింది. నూజెండ్ల మండలం కొండ్రపాడు గ్రామానికి చెందిన దాలి యలమందరావు కౌలు రైతుగా జీవనం సాగిస్తుంటాడు. అతను మే 18న రోడ్డు ప్రమాదంలో పక్కటెముకల లోపల గాయమయింది. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి సిఫారసుతో అదే రోజు రాత్రి యలమందరావును బంధువులు గుంటూరు సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం 24న వైద్యులు డిస్చార్జ్ చేశారు. అయితే ఒక్కరోజుకే మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో 26 రాత్రిన తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. 30న యలమందరావు ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ వైద్యులు డయాలసిస్ ప్రారంభించారు. అప్పటికే రూ. 6లక్షలు కట్టించుకున్నారు. ఆ తర్వాత 31న యలమందరావు బతికే అవకాశం తక్కువగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ సమయంలోనూ వైద్య పరీక్షలు అంటూ రూ. 20 వేలు కట్టించుకున్నారు. యలమందరావు బంధువులు ఆస్పత్రికి వచ్చి వైద్యం పేరుతో లక్షల రూపాయలు కట్టించుకొని ఇలా చేయడమేంటని వైద్యులను ప్రశ్నించారు. దీంతో వాగ్వావాదం జరిగింది. ఆస్పత్రి యాజమాన్యంతో సంబంధాలు కలిగిన టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ కలుగ చేసుకుని యలమంద బంధువులను బెదిరించాడు. యలమంద బావమరిది వెంకటేశ్వర్లు, మరో ఇద్దరిని గదిలోకి పిలిచి తలుపులు వేసి తీవ్ర పదజాలంతో దూషించాడు. ప్రభాకర్ అనుచరులు 30 మంది ఆస్పత్రి దగ్గరకు వచ్చి రోగి బంధువులపై దాడి చేశారు. మహిళలు, పిల్లలను కూడా చితకబాదారు. కొత్తపేట పోలీసులు ఇరువర్గాల వారిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. డేగల ప్రభాకర్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు అక్కడ ధర్నా చేశారు. ఈ ఘటనపై కొత్తపేట ఎస్హెచ్ఓ మధుసూదనరావు వివరణ ఇస్తూ.. ఘర్షణ నివారించడానికి ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించామని చెప్పారు. యలమందకు ఉచితంగా వైద్యం చేయడానికి ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో కేసు నమోదు చేయలేదని చెప్పారు. గతంతోనూ ఎస్‌హెచ్‌వోపై దౌర్జన్యం నగరంలోని అనేక ఆస్పత్రులు, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మెడికల్ షాపులు నిర్వహిస్తున్న డేగల ప్రభాకర్ టీడీపీ అధికారం ఉన్న సమయంలో అనేక దౌర్జన్యాలు చేసేవాడు. మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు అనుచరుడిగా ఉంటూ అనేక దారుణాలు చేశాడు. గతంలో కొత్తపేట భగత్‌సింగ్ సెంటర్లో ఓ ఆస్పత్రిని ఖాళీ చేయించే విషయంలో భవన యజమానిని బంధించాడు. దీనిని అడ్డుకోవడానికి వెళ్లిన అప్పటి ఎస్హెచ్ఓపై దాడికి దిగగా అతడు డేగల ప్రభాకర్‌పై కేసు నమోదు చేయడానికి ప్రయత్నించారు. చిన్నబాబు జోక్యంతో ఎస్‌హెచ్‌వో మిన్నకుండిపోయారు. -
చీకటి వైద్యం
కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి.కన్ను విప్పార్చి చూసినా కనపడని వెలుతురు.ఈ దేశంలో ఏ మూల అయినా ఇప్పుడు వెతక్కుండానే దొరికే నలుపు.మనిషి తన అవినీతికి దేన్నైనా పునాది చేసుకోవచ్చుగాని ఎదుటి మనిషి ఆరోగ్యాన్ని కాదు.స్టెతస్కోప్ ఒక విషపురుగు. ఆపరేషన్ గదే యమపురి.దీనిని అడ్డుకోవాలి. దీనిపై నిఘా ఉంచాలి. దీని నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. అందుకు దీనిని ఎదిరించేవారికి తోడుగా నిలవాలి.వెబ్ మూవీ ‘లాఖో మే ఏక్’ చెప్తున్న కథ అదే. 2016, జూన్.. హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో పదమూడు కాటరాక్ట్ ఆపరేషన్స్ జరిగాయి గుర్తుందా? అందులో ఆరుగురికి చూపు పోయింది. ఆపరేషన్ జరిగిన వెంటనే తలెత్తిన ఇన్ఫెక్షన్వల్ల. ఈ వార్త తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గుబులు పుట్టించింది. ప్రభుత్వాసుపత్రుల పనివిధానం మీద మరోసారి చర్చపెట్టింది. బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తలో లక్షరూపాయలు పరిహారం ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సిఫారసు చేసింది. ఈ సంఘటనే ‘‘లాఖో మే ఏక్’’ అనే వెబ్‌సిరీస్ సెకండ్ సీజన్‌కు లైన్.. ప్లాట్.. థీమ్ అన్నీ! ఆ కథలోకి.. శ్రేయా పథారే.. గ్రామీణ సేవలను ఇష్టంగా ఎంచుకున్న జూనియర్ డాక్టర్. ఓ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తూంటుంది. ఆ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్.. డాక్టర్ గోపాల్ పట్వర్థన్. ఆ హాస్పిటల్‌కు మందులు సప్లయ్ చేసే ఫార్మాకాంట్రాక్టర్కు కొన్ని నెలల పాతబకాయీలు చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం. పాత బకాయీలు చెల్లించే వరకు కొత్త ఇండెంట్ల డెలివరీ ఆపమని, మిగతా ఫార్మా కాంట్రాక్టర్స్ ఎవరూ సప్లయ్ చేయకుండా సమ్మెకు దిగమని ఆ కాంట్రాక్టర్‌ను బలవంతపెడ్తాడు స్థానిక (ప్రతిపక్ష) ఎమ్మెల్యే. లాభాపేక్షతో సమ్మెకు దిగుతారు ఆ ప్రాంతంలోని ఫార్మా కాంట్రాక్టర్లు. ఆ జిల్లాలో కాటరాక్ట్ ఆపరేషన్ల టార్గెట్ మిగిలిపోవడంతో ఎలక్షన్ల తేదీ ప్రకటించేలోపు పూర్తిచేయమని సీఎమ్ఓ డాక్టర్ గోపాల్ పట్వర్థన్‌కు ఆర్డర్ అందుతుంది. ఆ క్యాంప్ నిర్వహణ బాధ్యతను డాక్టర్ శ్రేయా పథారేకు అప్పజెప్తాడు సీఎమ్ఓ. అన్నిటికీ దూరం.. మారుమూల పల్లె సీత్లాపూర్‌లో క్యాంప్. ఆ ఊళ్లో పేరుకే నాలుగు పడకల సర్కారు దవాఖానా. శ్రేయా కన్నా సీనియర్ డాక్టర్, ఇద్దరు కంపౌండర్లు, ఇద్దరు నర్సులూ ఉంటారు. ఆ సీనియర్ మూడేళ్ల కిందటే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకుని... ఎప్పుడొస్తే అప్పుడు బదిలీపై వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆసుపత్రికి సంబంధించిన ఒక్క కన్సల్టేషన్ గది తప్ప మిగిలినవేవీ వాడకంలో ఉండవు. వెళ్లిన రోజు నుంచే క్యాంప్ కోసం కసరత్తు మొదలుపెడ్తుంది శ్రేయ. అక్కడున్న వైద్య సిబ్బంది ఎవరూ సహకరించరు. అయినా పట్టువదలదు ఆమె. వైద్యం కోసం ఆ ఆసుపత్రికి ఎవరూ రారు. అంతా గందరగోళంగా అనిపిస్తుంది శ్రేయకు. ప్రైవేట్ వైద్యం కంపౌండర్ భోలా సహాయంతో క్యాంప్ గురించి పాంఫ్లెట్స్ పంచుతుంది శ్రేయ. ఎవరూ పట్టించుకోరు. బాధేస్తుంది ఆమెకు. ఆ ఊరి ప్రజలు అమితంగా గౌరవించే జానపద వృద్ధ కళాకారుడిని కలుస్తుంది. కాటరాక్ట్ క్యాంప్ గురించి చెప్తుంది. అప్పటిదాకా సాదరంగా మాట్లాడిన అతను ఆమె ఈ విషయం చెప్పగానే నమస్కారం పెడ్తాడు ఇక దయచేయమన్నట్టు. అవమానంతో వెనుదిరుగుతుంది. దార్లో ఓ క్లినిక్ కనపడితే వెళ్లి.. అందులో డాక్టర్‌గా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని కలుస్తుంది. మెడికల్ సైన్స్ మీద అవగాహన లేమి, మూఢనమ్మకాల మీద విపరీతమైన భక్తిశ్రద్ధలున్న ఆ ఊరి ప్రజల అజ్ఞానం, అమాయకత్వం ఆసరాతో తనకు వచ్చీరాని వైద్యం చేస్తుంటాడు ఆ వ్యక్తి. అతని టేబుల్‌మీదున్న మందుల సీసాలను చూసి బెదిరిపోతుంది శ్రేయ. ‘‘ఇదేంటి? స్టెరాయిడ్స్ ఇస్తున్నారు? ఇవి ఇవ్వకూడదు’’ అంటూ అతనితో వాదనకు దిగుతుంది. పోలీసులకు ఫిర్యాదూ చేస్తుంది. ఆ వ్యక్తిని తమ దైవంగా కొలుస్తున్న ఆ ఊరి జనమంతా ఒక్కటై శ్రేయ మీద దాడికి వస్తారు. సర్కార్ దవాఖానాలోని సీనియర్ డాక్టర్.. ఆమెను కాపాడుతాడు. తమ డాక్టర్‌కు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు జనం. చెప్తుంది శ్రేయ. అప్పుడు ఆమెకు ఆ ఊరి చిత్రం పూర్తిగా అర్థమవుతుంది. ఇంకోవైపు క్యాంప్ ఆర్గనైజేషన్ గురించి సీఎమ్‌వో ఒత్తిడీ పెరుగుతుంది. ఇక తనవల్ల కాదని.. ఆ ఊరిని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది శ్రేయ. నర్సులు, కంపౌండర్లు సహా సీనియర్ డాక్టర్ కూడా ఆమెకు అదే సలహా ఇస్తుంటారు మొదటినుంచీ. ఆ రాత్రి.. తెల్లవారి ప్రయాణానికి సర్దుకుంటూండగా.. తన బస ముందే పెళ్లి బారాత్ సందడి వినిపిస్తుంది. కిటికీలోంచి చూస్తూంది శ్రేయ. ఒకతను డ్యాన్స్ చేస్తూ చేస్తూ పడిపోతాడు. కాలికి ఏదో గుచ్చుకుని గాయం అవుతుంది. ఒకటే రక్తస్రావం. ఆ బారాత్‌లో ఆ ఊరు వాళ్లు నమ్మే డాక్టర్ ఉంటాడు. అతను ఆ గాయాన్ని చూసి బెంబేలెత్తుతాడు. ఆ రక్తస్రావాన్ని ఎలా ఆపాలో తెలియక పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు. అవేవీ ఫలించక రక్త స్రావం ఎక్కువవుతుందే తప్ప తగ్గదు. కిటికీలోంచి ఇదంతా చూసి ‘‘నాకెందుకులే’’ అని తొలుత పట్టించుకోదు. కాని పరిస్థితి సీరియస్ అవుతుంటే పరిగెడ్తుంది. భోలా.. నర్సుల సహాయంతో గాయం అయిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుంది. దవాఖానాలోని సీనియర్ డాక్టర్‌తో కలిసి చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి గట్టెక్కిస్తారు ఆ వ్యక్తిని. ఆ క్షణం నుంచే శ్రేయ మీద గౌరవం, ఆ ఆసుపత్రి మీద నమ్మకం కలుగుతుంది ఆ ప్రజలకు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయాణాన్ని రద్దు చేసుకుంటుంది శ్రేయ. తెల్లవారినప్పటి నుంచి సర్కారు దవాఖాన ముందు జనాల క్యూ స్టార్ట్ అవుతుంది. క్యాంప్.. క్యాంప్ కోసం మళ్లీ క్యాంపెయిన్ ప్రారంభిస్తుంది. ఈసారి పేషంట్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు పేర్లు నమోదు చేసుకోవడానికి. అప్పుడే అక్కడున్న సీనియర్ డాక్టర్‌కు ట్రాన్స్ఫర్ వస్తుంది. ఓ విషాదమూ జరుగుతుంది. జానపద వృద్ధ కళాకారుడి మనవడికి ఆ ఊరి డాక్టర్ (అని పిలిపించుకునే) చేసే వైద్యం వల్ల జ్వరం తగ్గకపోగా ప్రాణంమీదకు వస్తుంది. ఆ పిల్లాడి తల్లిదండ్రులు డాక్టర్ శ్రేయను ఆశ్రయిస్తారు. ఫార్మా కాంట్రాక్టర్ల సమ్మె వల్ల ఊరి డిస్పెన్సరీలో మందులు ఉండవు. వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే పిల్లాడు బతకడని.. గత్యంతరంలేక బ్లాక్‌లో అమ్ముతున్న మెడిసిన్ తెప్పిస్తుంది శ్రేయ. దాంతో ఫస్ట్‌ఎయిడ్ చేసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్తుంది. అప్పటికే ఆరోగ్యం విషమించడంతో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోతాడు ఆ పిల్లాడు. దాంతో ప్రజలకు తమ ఊరి వైద్యుడి మీద పూర్తిగా విశ్వాసం పోతుంది. సర్కారు డాక్టర్లను దైవంగా కొలవడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే క్యాంప్ ఏర్పాట్ల వేగం పెంచుతుంది శ్రేయ. కంటి ఆపరేషన్లకు అంతా సిద్ధమవుతుంది. మందులు తప్ప. ఆ విషయమే సీఎమ్వోకి తెలియజేస్తుంది శ్రేయ. ఈలోపు సమ్మె విజయవంతం కాకపోగా స్టాక్ అంతా ఎక్స్పైర్ అవుతుంది. కంగారుపడ్డ ఫార్మా కాంట్రాక్టర్... సీఎమ్వోతో రాజీ కుదుర్చుకుంటాడు. ఎక్స్పైరీ డేట్ కనపడకుండా కొత్త లేబుల్ అతికించి స్టాక్‌నంతా క్లియర్ చేసుకుంటాడు ఫార్మాకాంట్రాక్టర్. వాటిల్లోంచే సీత్లాపూర్ గవర్నమెంట్ డిస్పెన్సరీకి సప్లై అవుతాయి. అందులో కాటరాక్ట్ ఆపరేషన్స్‌కు వాడిన సెలైన్ బాటిల్సూ ఉంటాయి. క్యాంప్ సక్సెస్ అయినందుకు ఆ రాత్రి శ్రేయ అండ్ టీమ్ పార్టీ కూడా చేసుకుంటారు. అయితే.. అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ అయిన ఓ వ్యక్తికి కన్ను ఎర్రబడి.. నొప్పి మొదలువుతుంది. తెల్లవారే సరికి మరో పదిహేనుమంది పరిస్థితీ అలాగే ఉంటుంది. హుటాహుటిన వాళ్లను జిల్లా ఆసుపత్రికి తరలిస్తారు శ్రేయ, కంటి డాక్టర్. ఈ సంగతి ఊర్లో తెలిసి సర్కారు దవాఖాన మీదకు దాడికి వస్తారు రాళ్లతో. మందుల బ్లాక్ మార్కెటింగ్‌లో ఆ దవాఖానాకు చెందిన కంపౌండర్లూ ఉంటారు. వాళ్లు రిజిష్టర్‌ను మాయం చేస్తారు. కాటరాక్ట్ క్యాంప్ ఫెయిల్ అయిందనే వార్త మీడియాకు అంది క్షణాల్లో సెన్సేషన్ అవుతుంది. దీనికంతటికీ డాక్టర్ శ్రేయా పథారే కారణమనీ వార్తలు అల్లుతారు. మంత్రికి తెలిసి అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. వెంటనే ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిస్తాడు. కమిటీ ముందు జవాబు చెప్పేందుకు టెస్టిమోనీ తయారు చేస్తాడు సీఎమ్‌వో ఆధారాలేవీ దొరక్కుండా. శ్రేయాతో బలవంతంగా సైన్ చేయిస్తారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఏమీ లేకపోవడంతో అందులో వైద్యసిబ్బంది తప్పేమీలేదని తేలుస్తుంది కమిటీ. పదహారు మంది కంటి చూపు కోల్పోతారు. ఆ తప్పిదానికి ఎవరూ బాధ్యత తీసుకోకపోవడం శ్రేయాను కలిచివేస్తుంది. ఎంత కష్టపడి వాళ్ల నమ్మకాన్ని సాధించింది తను? అంతా గంగలో కలిసిపోయింది. మళ్లీ ఆ స్టెరాయిడ్స్ ఇచ్చే వ్యక్తులే డాక్టర్లుగా ఊళ్లేలుతుంటారు. సర్కారు దవాఖానా అంటేనే జనాలు జడుసుకుని పారిపోతారు. ఇలా జరగడానికి వీల్లేదు. బాధ్యత తీసుకోవాలి.. ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆ రోజు ఆపరేషన్‌కు ఉపయోగించిన మెడిసిన్ లిస్ట్‌ను పరిశీలిస్తే తెలుస్తుంది.. గడువు అయిపోయినవి వాడినట్టు, అవి జిల్లా ఆసుపత్రి నుంచే క్యాంప్‌కి సప్లయ్ అయినట్టు. తెల్లవారి కమిటీ ముందు చెప్తుంది. మందుల బ్లాక్ మార్కెటింగ్ గురించి కూడా. వెంటనే సీఎమ్‌వో.. సీత్లాపూర్‌లో చనిపోయిన పిల్లాడి విషయంలో డాక్టర్ శ్రేయా కూడా బ్లాక్‌లో మందులు కొన్న విషయాన్ని గుర్తుచేసి ఆ రిసీట్ కూడా కమిటీ ముందు పెడ్తాడు. గవర్నమెంట్ డాక్టర్ అయ్యుండీ బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం నేరమని.. ఈ ప్రవృత్తే ఆ పేషంట్ల అంధత్వానికి కారణమైందని.. డాక్టర్ శ్రేయ పథారేను దోషిగా నిలబెడ్తుంది కమిటీ. ఇదీ లాఖో మే ఏక్ .. కహానీ. అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. లాఖ్ మే ఏక్ ఫస్ట్ సీజన్.. అస్తవ్యస్తమెన విద్యావిధానానికి చురకలు పెడితే సెకండ్ సీజన్.. వైద్యవిధానంలోని అవినీతిని బయట పెడుతుంది. – సరస్వతి రమ -
గ్రామాల్లోని వారికి వైద్యం అందించాలి
హైదరాబాద్: వైద్యాన్ని మారుమూల గ్రామాల ప్రజలకు అందించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సులో భాగంగా మంగళవారం కేంద్ర చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి కోటి 60 లక్షల మందికి పరీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. దీనిని ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకున్నాయని చెప్పారు. ఒక్కొక్క మండలానికి 12 మంది టీమ్‌లుగా ఏర్పాటు చేసి ఆపరేషన్లు, దృష్టి లోపం ఉన్న వారికి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలి పారు. రాష్ట్రవ్యాప్తంగా 844 మంది ప్రత్యేక సిబ్బంది కంటి వెలుగు శిబిరంలో పాల్గొని సేవలందించినట్లు తెలిపారు. వైద్య రంగం ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం ముందున్న ప్రధాన అంశమన్నారు. అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోగాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ వైద్య నిపుణులకు సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రభు త్వ సేవలను ప్రజల వద్దకు ఉచితంగా చేరువయ్యేలా చూడాలని వారికి సూచించారు. వైద్య సేవలను అందించడానికి ముందుకొచ్చిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ తమవంతు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నయం చేయడానికి మందులను అందించాలని వెల్లడించా రు. నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని వైద్య రంగంలో ముందుకు సాగాలన్నారు. ఎంటర్‌ప్రెన్యూ ర్స్, స్టార్టప్‌లకు ఎక్కువ అవకాశాలను అందజేయాలని కోరారు. తెలంగాణలో త్వరలోనే లైఫ్ సైన్స్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యార్థులు, స్టార్టప్‌లు, విద్యా వ్యవస్థ అనుసంధానంతో ఈ గ్రిడ్ ఉంటుందని తెలిపారు. రాబో యే రోజుల్లో కేన్సర్ వ్యా«ధి వేగంగా విస్తరిస్తుందని దాని నివారణకు తగిన రీతిలో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. -
ఎముకల వైద్యంలో నిమ్స్‌కు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: బొక్కల దవాఖానాగా గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక నిమ్స్(నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ఆస్ప త్రి అందుకు తగ్గట్లుగానే ఎముకల చికిత్సల విభాగంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా చికిత్సలు చేయడమే కాదు.. టాప్–5 ఆస్పత్రుల జాబితాలో చోటు సంపాదించింది. ఈ చికిత్సల్లో ఎయిమ్స్ మొద టిస్థానంలో ఉండగా, తమిళనాడులోని వేలూరు సీఎంసీ రెండోస్థానంలో, చండీగఢ్‌లోని పీజీఐ మూడోస్థానంలో నిలిచాయి. ఆ తర్వాతిస్థానంలో నిమ్స్ ఉన్నది. అత్యంత క్లిష్టమైన స్పైన్ స్కోలియోటిక్ (వెన్నెముక వంకరగా ఉండటం) చికిత్సల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఆర్థోపెడిక్ విభాగంలో గతేడాది 3 వేలకుపైగా సర్జరీలు నిర్వహించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కేవ లం రెండుశాతం చికిత్సలు జరుగగా, 98 శాతం కేసులు ఇక్కడే జరుగుతున్నాయి. ఈ చికిత్సకు కార్పొరేట్ దవాఖానాల్లో రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుండగా నిమ్స్‌లో కేవలం రూ.1.5 లక్షలకే నిర్వహిస్తున్నారు. మోకాలు, కీళ్ల మార్పిడి చికిత్సలకు నిమ్స్‌లోని ఆర్థోవిభాగం ప్రత్యేక గుర్తింపు పొందింది. -
వైద్యం కోసం ఎన్ని పాట్లో..!
నార్నూర్: ఆత్మహత్యకు యత్నించిన భార్యను కాపాడుకునేందుకు ఆమె భర్త చేసిన ప్రయత్నం విఫలమైంది. భుజంపై ఎత్తుకుని వాగు దాటి ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రీలో సోమవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రాథోడ్ రాము, పుష్ప దంపతులు ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశారు. ఇటీవల వర్షానికి పత్తి పంట దెబ్బ తినడంతో ఆందోళనకు గురైంది. పంట అంతంత మాత్రంగానే ఉండటంతో చేసిన అప్పులు ఎలా తీర్చా లో తెలియక మనస్తాపం చెందింది. సోమవారం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. పుష్పను ఆమె భర్త గ్రామంలోని ఓ వ్యక్తి సహాయంతో వాగు వరకు 2 కిలోమీటర్ల దూరం బైక్‌పై తీసుకొచ్చాడు. మండల కేంద్రం నార్నూర్‌లోని ఆస్పత్రికి తరలించాలంటే గ్రామ సమీపంలోని వాగు దాటాల్సిందే. మోకాళ్లలోతు నీళ్లు ఉండటంతో గత్యంతరం లేక తన భుజంపై ఎత్తుకుని వాగు దాటించాడు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. వైద్యం అందకుండానే మార్గమధ్యంలోనే పుష్ప మృతిచెందింది. -
రంగుల ఎక్స్‌రే...
వైద్యం ఎంతో అభివృద్ధి చెందింది అనుకున్న ఈ కాలంలో కూడా ఎక్స్‌రే నలుపు తెలుపుల్లోనే ఉండటం ఏమిటని మీకెప్పుడైనా అనిపించిందా? త్వరలోనే ఈ పరిస్థితి మారిపోనుంది. శరీరం లోపలి భాగాలను రంగుల్లో చూసుకునేందుకు రంగం సిద్ధమైంది. మార్స్ బయో సెన్సింగ్ అనే న్యూజిల్యాండ్ కంపెనీ పరిశోధనల పుణ్యమా అని అందుబాటులోకి రానున్న త్రీడీ స్కానర్ ఎముకలు, కండరాలతో పాటు కొవ్వులను కూడా రంగుల్లో చూపుతుంది. స్విట్జర్లాండ్ సరిహద్దుల్లోని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగశాల సీఈఆర్ఎన్ శాస్త్రవేత్తలు ఈ స్కానర్ కోసం ప్రత్యేకమైన మైక్రోప్రాసెసర్‌ను తయారు చేయడం విశేషం. సంప్రదాయ సీటీ స్కాన్ల ద్వారా శరీరం లోపలికి ఎక్స్‌రే కిరణాలు ప్రసరించినప్పుడు దాని తీవ్రతలో వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా ఎక్స్‌రే తయారవుతుంది. ఎముకల గుండా ప్రయాణించినప్పుడు శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఆ ప్రాంతం తెల్లగానూ, తగ్గని కండరాల ప్రాంతం నల్లగానూ ఉంటుందన్నమాట. ఇలా కాకుండా లోపలి పదార్థాన్ని బట్టి తగు తరంగ దైర్ఘ్యమున్న కిరణాలను పంపగల స్పక్ట్రల్ స్కానర్లను వాడటం ద్వారా మార్స్ బయో సెన్సింగ్ కలర్ ఎక్స్‌రే యంత్రాలను సిద్ధం చేసింది. ఇప్పటికే ఓ నమూనా యంత్రాన్ని విజయవంతంగా పరీక్షించిన ఈ కంపెనీ త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
పంటిగాటు చికిత్స!
చికిత్సలందు ఈ చికిత్స వేరయా అనాల్సిందే ఎవరైనా.. ఎందుకంటే ఆమె వైద్యం ఓ ఆశ్చర్యం. రక్త ప్రసరణ సరిగ్గా జరిగేందుకు ఆమె వినూత్నమైన వైద్యాన్ని కనుగొన్నారు. ఆ వైద్యం గురించి తెలిస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే. ఇంతకీ ఆమె ఏం చేస్తుందో తెలుసా.. తన పళ్లతో వీపు భాగంలో కొరుకుతుంది. ఆ వింత డాక్టర్ పేరు డొరోతీ స్టీన్. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన స్టీన్.. చిన్నప్పుడు తన తల్లికి మసాజ్ చేసేందుకు చేతులు బలంగా లేకపోవడంతో తన పళ్లతో కొరకమని చెప్పిందట. దీంతో స్టీన్ తల్లికి ఉపశమనం అనిపించేదట. నాలుగు దశాబ్దాల తర్వాత కూడా స్టీన్ ఆ విద్యను అలాగే కొనసాగిస్తున్నారు. ఓ రకంగా ఈ మసాజ్ వల్ల న్యూజెర్సీలో టాప్ సెలబ్రిటీ అయిపోయారు. ఆమె క్లినిక్‌కు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోయిందట. తొలుత ఉచితంగానే ఈ మసాజ్‌ను చేసేవారట. కానీ ఇప్పుడు ఒకసెషన్కు ఫీజు కింద దాదాపు రూ.10 వేలు తీసుకుంటున్నారట. చాలా కాస్ట్లీనే. -
దండాలు డాక్టరమ్మా!
‘పణప్పుర ఊరు’.. కేరళలో మారుమూల ఆదివాసీ గ్రామం. నిలంబూర్ అడవుల్లో ఉంది. పణప్పుర ఊరికి మలప్పురం తాలూకా కేంద్రం నుంచి ఓ బృందం బయలుదేరింది. కొంతదూరం కారులో సాగింది ప్రయాణం. కొంత దూరం జీప్‌లో వెళ్లారు. ఆ తర్వాత ఇక ఏ వాహనమూ వెళ్లే వీలు కనిపించలేదు. కనీసం టూ వీలర్ కూడా. ట్రెకింగ్ మొదలుపెట్టిందా టీమ్. స్థానికులు కొడవళ్లు, గొడ్డళ్లతో దారిలో అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు, తీగలను నరికేస్తూ వారికి దారి చేస్తున్నారు. ‘చెట్టు కొమ్మలనయితే నరికారు, మమ్మల్నేం చేస్తారు’ అన్నట్లు పెద్ద బండరాళ్లు! తాళ్లను పట్టుకుని ఆ బండల్ని ఎక్కారందరూ. కొండవాలులో మట్టి తడిసి ముద్దయి అడుగు పెడితే చాలు కాలు జారిపోతోంది. అలాంటి సాహసోపేతమైన ట్రెకింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిందా బృందం. వైద్యం చేయడానికి! దాదాపు పదిమంది ఇంత కష్టతరమైన దారిలో ప్రయాణించి పణప్పుర ఊరు వెళ్లింది అడ్వెంచర్ టూర్ కోసం కాదు. ఒక రోగికి వైద్యం చేయడానికి. ఎంత ఆశ్చర్యపోయినా సరే... ఇది నిజం. ఆ పేషెంట్ సెలబ్రిటీ ఏమీ కాదు. అంతరించిపోతున్న చోళ నాయకన్ ఆదివాసి జాతికి చెందిన రవి. యాభై ఏళ్ల రవికి డయాబెటిస్ ఉంది, కాలి వేలికి గాయమైంది. రక్తస్రావం ఆగడం లేదు. మనిషి చిక్కి శల్యమయ్యాడు. ఇన్ఫెక్షన్ కూడా సోకింది. అడవిలో తెలిసిన ఆకు పసర్లేవో వేసుకుంటూ వ్యాధి ముదర పెట్టుకున్నాడు. అంతకంటే మెరుగైన వైద్యం ఉందని తెలియదు కూడా అతడికి. ఫారెస్ట్ సిబ్బంది ఈ సంగతిని డాక్టర్ అశ్వతి సోమన్‌కు చెప్పారు. డాక్టర్ అశ్వతి సోమన్ నిలంబూర్ మొబైల్ డిస్పెన్సరీలో మెడికల్ ఆఫీసర్. రవికి వైద్యం చేయడానికి తనకు ఉన్న మౌలిక వసతులు సరిపోవు. అందుకే అశ్వతి... మలప్పురం తాలూకా హాస్పిటల్ సిబ్బందిని, ఆపరేషన్‌కు అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నారు. మెడికల్ టీమ్‌తో ఫారెస్ట్ సిబ్బంది సహాయంతో అడవి దారి పట్టారు. రవిని పరీక్షించి సర్జరీ చేసి ‘గాంగరిన్’ అయిన వేలిని తొలగించి, కట్టుకట్టారు. డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకు వస్తే కానీ మిగతా చికిత్స ఇవ్వలేమని, అందుకు తాలూకా కేంద్రంలో ఉన్న హాస్పిటల్లో చేరాల్సిందేనని, తమతోపాటు వస్తే తీసుకువెళ్తామని చెప్పారు రవికి. డాక్టర్ వైద్యం చేస్తాను రమ్మన్నప్పటికీ రవి మాత్రం తన గూడెం వదిలి వచ్చే పనే లేదన్నాడు. దాంతో ‘‘డయాబెటిస్‌ను, గాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అప్పుడు వేలిని తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు మంచి వైద్యం అందితే ఆరోగ్యం బాగవుతుంది. అలా చేయకపోతే రేపటి రోజున కాలిని తొలగించాల్సి రావచ్చు, ఇంకా ముదిరిపోతే ప్రాణం మీదకే రావచ్చు’’ అని గట్టిగా హెచ్చరించారు అశ్వతి. ఆ భయంతో అతడు హాస్పిటల్‌కి రావడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడతడు మణప్పురం తాలూకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. రోగి దగ్గరకు డాక్టరే వెళ్లాలి ఇంతమంది తరలి వెళ్లడం కంటే ఆ పేషెంట్‌నే హాస్పిటల్‌కి తెచ్చే ప్రయత్నం చేయవచ్చు కదా అని అడిగిన వాళ్లతో డాక్టర్ అశ్వతి ఒకే మాట చెప్పారు. ‘వైద్యరంగంలో నేర్పించే మొదటి పాఠం... డాక్టర్ దగ్గరకు పేషెంట్ కాదు, పేషెంట్ దగ్గరకు డాక్టర్ వెళ్లాలని. ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది... ఈ పేషెంట్ వైద్యం కోసం హాస్పిటల్‌కు వచ్చే ఉద్దేశంలో లేడు. అలాంటప్పుడు డాక్టరే వెళ్లాలి. మాది రోగి ప్రాణాన్ని నిలపాల్సిన కర్తవ్యం’’ అన్నారు. పోలిక ఎక్కడ? మన దగ్గర అరకు, పాడేరు వంటి గిరిజన గ్రామాలు విషజ్వరాలతో మంచం పడితే వారి చెయ్యి పట్టుకుని నాడి చూడడానికి ఒక్క డాక్టరూ కనిపించట్లేదు. నొప్పులు పడుతున్న గర్భిణిని ప్రసవం కోసం మంచం మీద మోసుకు రావాల్సిన దుస్థితి. తరచూ ఇలాంటి సంఘటనలనే చూస్తున్న మనకు కేరళలో ఓ యువతి, వైద్యరంగంలోకి వచ్చి ఐదేళ్లు కూడా నిండని యువతి... పేషెంట్ కోసం ఇంతటి సాహసం చేసిందంటే ఆమెకు పాదాభివందనం చేయాలనిపిస్తుంది. డాక్టర్స్ డే రోజున ఇలాంటి డాక్టర్‌ను తలుచుకోవడం సంతోషంగా ఉంటుంది. వైద్యో నారాయణో హరి అని అందుకే అంటారు. ఇలాంటి డాక్టర్ని చూస్తే ఆ మాట మళ్లీ మళ్లీ అనాలనిపిస్తుంది. – మంజీర -
సంక్షేమమా..అదెక్కడ!?
సాక్షి, అమరావతి: గత నాలుగేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమాన్ని అటకెక్కించింది. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలుకాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలైన ఏజెన్సీల్లో ఆదివాసీల జీవితాలు దారుణంగా ఉన్నాయి. విద్య, వైద్యం పూర్తిస్థాయిలో వారికి అందటంలేదు. విజయనగరం జిల్లా పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏల పరిధిలోని ఆదివాసీల పరిస్థితి దారుణంగా ఉంది. గూడేలకు కనీస వసతుల్లేవు. తాగేందుకు ఊట చెలిమల నుంచి వస్తున్న నీరే దిక్కు. గూడేలకు దూరంగా వైద్యశాలలు ఉండటం, సిబ్బంది సకాలంలో చేరుకునే పరిస్థితి లేకపోవడంతో వైద్యం అందని ద్రాక్షలా మారింది. రోడ్డు సౌకర్యాల్లేవు. రూ.400 కోట్లతో రోడ్లు వేస్తున్నామని మాత్రం ప్రభుత్వం నాలుగేళ్లుగా ప్రచారం చేసుకుంటోంది. గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ నిర్వీర్యమైంది. బినామీల గుప్పెట్లో ఎస్సీల ఫలాలు ఇక ఎస్సీ సంక్షేమ పథకాలు బినామీలు ఎగరేసుకుపోతున్నారు. ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం కార్ల కొనుగోలు పథకం ప్రభుత్వం చేపట్టింది. అయితే, ఇవి ఎస్సీల పేరుతో పలువురు ఎమ్మెల్యేల బంధువులు, మంత్రుల బంధువుల వద్దకు చేరాయి. భూమి కొనుగోలు పథకాన్ని అమలుచేసినట్లు ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసుకుంటోంది. రూ.200 కోట్లతో 4333 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు 75శాతం సబ్సిడీపై ఇచ్చినట్లు ప్రకటించింది. కానీ, నాలుగేళ్లలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. - ఇక ఫీజు రీయింబర్స్మెంట్ విషయానికి వస్తే మొత్తం రూ.2,500కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంకా రూ.800కోట్లు బకాయి ఉన్నారు. - మైనార్టీలకు రూ.500కోట్లకు మించి ఖర్చుపెట్టిన దాఖలాల్లేవు. వైఎస్సార్ హయాంలో స్వర్ణ యుగాన్ని చవిచూసిన ఆ వర్గం పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. - బీసీల్లో కుల వృత్తుల వారికి ఇస్తామన్న ఆదరణ పనిముట్లు ఇప్పటివరకూ ఇవ్వలేదు. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బీసీలు ఉంటే ఏటా రుణాలు ఇచ్చేందుకు 50వేల మందినే ఎంపిక చేస్తున్నారు. అయినా, అందులో 25వేల మందికి కూడా ఇవ్వడంలేదు. - ఆదాయ పరిమితి పెట్టడంవల్ల చాలా కుటుంబాల వారు ‘పెళ్లి కానుక’ పథకానికి దూరమవుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన వధూవరులు 3,034 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్క జంటకు కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు. - అలాగే, గిరిజనులకు ఉద్దేశించిన గిరిపుత్రిక కళ్యాణ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒక్క కొత్త జంటకు కూడా ప్రభుత్వం సాయం చేయలేదు. ముస్లింల కోసం ప్రవేశపెట్టిన దుల్హన్ పథకం కూడా అలంకారప్రాయంగా మారింది. ఒక్కరికీ ఈ పథకం లబ్ధిచేకూర్చలేదు. అలాగే, బీసీలకు ప్రభుత్వం కొత్తగా రూ.35వేలు ఇస్తామని ప్రకటించింది. వీరి విషయంలోనూ పూర్తిస్థాయిలో అమలుకాలేదు. కులాంతర వివాహాలు చేసుకున్నా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు మాత్రమే అర్హులని ప్రభుత్వం మెలిక పెట్టింది. - సంప్రదాయ చర్మకారుల జీవనోపాధి కోసం రూ.60 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతున్నా ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు. - మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి గత ఏడాది రూ.60 కోట్లు, ఈ సంవత్సరం రూ.100 కోట్లు కేటాయించారు. ఒక్కరికి కూడా సాయం అందించలేదు. స్టడీ సర్కిళ్లు నిర్వీర్యం ఇదిలా ఉంటే.. సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న స్టడీ సర్కిళ్లు నిర్వీర్యమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ప్రభుత్వం వాటి గురించి ఆలోచించడం మానేసింది. దీంతో.. ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్ కోచింగ్‌కు దూరమవుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఉన్నా వాటిల్లో ఫ్యాకల్టీలు లేరు. మొక్కుబడిగా ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ ఈ పథకం కింద విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఏడాదికి రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థి యూనివర్సిటీలో చేరి అడ్మిషన్ వివరాలు పంపిస్తే మొదటి విడతగా రూ.5లక్షలు విడుదల చేస్తారు. సంవత్సరం ముగిసే సమయంలో మరో రూ.5లక్షలు ఇస్తారు. కానీ, విదేశాల్లో పీజీ చదవాలంటే కనీసం రూ.30 లక్షలు ఖర్చవుతాయి. బ్యాంకుల నుంచి రూ.10 లక్షలు రుణం ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. ఉన్నతి లేని ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ పథకం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్‌లో ఉచిత కోచింగ్‌కు సంబంధించి గత ఏడాది బీసీ, ఈబీసీలు కలిపి 1,240 మందికి, కాపులు 700 మందికి, ఎస్సీలు 700 మంది, ఎస్టీలు 300 మందిని ఎంపిక చేసి శిక్షణకు పంపించారు. ఒక్క బీసీలే సుమారు 50వేల మంది వరకు పరీక్ష రాశారు. మెరిట్ ప్రకారం ఎక్కువమందికి కోచింగ్ ఇప్పిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, శిక్షణ పొందిన వారికి నేటికి కూడా స్టైఫండ్ పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. దీంతో హాస్టళ్ల నిర్వాహకులు డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. అక్కరకు రాని ‘చంద్రన్న బీమా’ ఇక ‘చంద్రన్న బీమా’ పథకం ద్వారా పేదలకు సకాలంలో సాయం అందటంలేదు. ఈ పథకానికి కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి సుమారు రూ.600కోట్లు దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి బీమా సొమ్ములో సగం కేంద్ర ప్రభుత్వ వాటా కాగా, మిగిలిన సగం రాష్ట్రానిది. కానీ, బడ్జెట్ నుంచి చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. తన వాటాను కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి తీసుకుని చెల్లిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, చిన్న పిల్లలకు తప్ప పెద్ద పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడంలేదు. అలాగే, 60 ఏళ్లు పైబడిన కార్మికులకు రూ.2,000లు పింఛన్ ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అదీ ఇవ్వడంలేదు. ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం రాష్ట్రంలో ఐదేళ్లలో 13 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నా పథకం మాత్రం ముందుకు సాగడంలేదు. బిల్లులు చెల్లించకపోవడమే కారణం. మరోవైపు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తోంది. 23వేల ఇళ్లు నిర్మించామని రాష్ట్రం అంటే.. కాదు, 7,749మాత్రమే అని కేంద్రం అంటోంది. దీంతో కేంద్రం బిల్లులు చెల్లించడంలేదు. అలాగే, మరో 20.97 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రానికి రాష్ట్రం మరో ఉత్తరం రాసింది. దీంతో.. మొదట 23 వేల ఇళ్లకు లెక్కలు చెప్పండి అంటూ కేంద్రం ప్రత్యుత్తరం ఇవ్వడంతో ఇద్దరి మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఇక అర్బన్ హౌసింగ్ పథకం కింద దాదాపు 6 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 4,934 ఇళ్లు మాత్రమే పూర్తిచేశారు. 2019 నాటికి 5 లక్షల గృహాలు పూర్తిచేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినా ఆ మేరకు నిర్మాణాలు మాత్రం చేపట్టడంలేదు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ఇళ్ల కోసం 12 లక్షల మంది పేదలు దరఖాస్తు చేసుకున్నా వీరి గురించి పట్టించుకునే నాథుడేలేడు. చేనేత, మత్స్య కారులందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని.. మధ్య తరగతి వర్గాల కోసం ప్రత్యేక గృహ నిర్మాణ పథకం ప్రవేశపెడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ఇప్పటివరకు అతీగతీలేదు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత దానిని రూ.1.50 లక్షలకు కుదించి పేదలను మోసం చేశారు. ఇలా హామీల మీద హామీలు ఇవ్వడం మినహా పేదలకు మాత్రం సొంతింటి కల నెరవేర్చలేదు. సంక్షేమ హాస్టళ్ల రద్దు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ హాస్టళ్ల రద్దు పర్వం మొదలైంది. మెరుగైన విద్యను అందించేందుకు హాస్టళ్లను రద్దుచేసి ఆ స్థానాల్లో గురుకుల విద్యాలయాలు పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించి పేదలను మోసం చేసింది. - మొత్తం ప్రీమెట్రిక్ కింద ఎస్సీల హాస్టళ్లు 1,450కు గాను ఇప్పటివరకు 648 రద్దయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య 27,917 మంది. - అలాగే, మొత్తం 197 ఎస్టీ హాస్టళ్లకుగాను అన్నీ రద్దయ్యాయి. వీటిలో 16,250మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. - బీసీ హాస్టళ్లదీ దాదాపు ఇదే పరిస్థితి. మొత్తం 897 హాస్టళ్లకుగాను 201 రద్దయ్యాయి. వీటిలో 13,000మంది విద్యనభ్యసిస్తున్నారు. - ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఒక్క గురుకుల పాఠశాల కూడా నిర్మించలేదు. రద్దుచేసిన ఎస్టీ హాస్టళ్ల స్థానంలో 80 హాస్టల్ కన్వర్టెడ్ గురుకుల పాఠశాలలు, ఏజెన్సీలో 30 ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటుచేశారు. ఇవన్నీ రద్దుచేసిన పాత భవనాల్లోనే కొనసాగుతుండగా అక్కడి పరిస్థితులు పాత హాస్టళ్ల కంటే అధ్వాన్నంగా ఉన్నాయి. - కేంద్ర ప్రభుత్వం 14 ఏకల్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసి భవన నిర్మాణాలకు నిధులిచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే విషయంలో తలెత్తిన వివాదం కోర్టుకు చేరడంతో ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కమీషన్ల విషయంలో తేడా రావడంతో ఈ భవనాలు ఆగిపోయినట్లు సమాచారం. -
మూగజీవాల మృత్యువాత
సాక్షిప్రతినిధి, నల్లగొండ: పాలమూరు జిల్లా నుంచి గొర్రెల మందలు తీసుకువచ్చిన కాపర్లకు పెద్ద కష్టమే వచ్చిపడింది. మేత కోసం నల్లగొండ జిల్లాకు వచ్చిన జీవాలు అంతుపట్టని వ్యాధి సోకి పిట్టల్లా రాలిపోతున్నాయి. నాలుగు రోజుల్లో 300 దాకా గొర్లు చనిపోవడంతో వారికి దిక్కు తోచడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లా రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన ఐదుగురు, దేవరకద్ర మండలం గద్దెగూడ గ్రామానికి చెందిన ఇద్దరు, అవంగపట్నంకు చెందిన ముగ్గురు, వేముల గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపరులు సుమారు మూడువేల గొర్రెల మందను తీసుకుని జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మందలో కొన్ని గొర్రెలు మేత మేయకుండా నలతగా ఉండడాన్ని గమనించిన కాపరులు గుంటూరు జిల్లా మాచర్లనుంచి మందులు కొనుక్కువచ్చి చికిత్స చేశారు. అయినా, ఈనెల 27వ తేదీనుంచి ఒక్కొక్కటిగా జీవాలు చనిపోవడం మొదలు పెట్టాయి. సమాచారం తెలుసుకున్న సంచార వైద్య సిబ్బంది 1962 వాహనంతో వచ్చి జీవాలకు చికిత్స అందించారు. అయినా, మరణాలను ఆపలేక పోయారు. ఇలా.. వరుసగా శుక్రవారం దాకా మందలోని గొర్లు చనిపోతూనే ఉన్నాయి. మిర్యాలగూడ మండలం తుంగ పాడుకు చేరుకున్న మందలో శుక్రవారం సైతం మరో అరవై గొర్రెలు చనిపోయాయి. సుమారు 3వేల మందను నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద హాలియా, నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్ మండలాల్లో మేత కోసం తీసుకువచ్చామని బాధితులు చెప్పారు. తాము తిరిగి జూలైలో వానలు పడడంతో వెనక్కి వెళ్లిపోతామని, ఈ సారి తమను దురదృష్టం వెంటాడుతోందని వాపోతున్నారు. గొర్రెలు మృతిచెందడంతో పాలమూరునుంచి మేతకోసం పంపించిన యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. పనిచేయని వైద్యం.. కొద్ది రోజులుగా జీవాలు మృత్యువాత పడు తుండగా, పశువైద్య సిబ్బంది వైద్యం అందిస్తున్నా ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదు. అసలు గొర్లకు వచ్చిన వ్యాధి ఏమిటో కూడా వైద్యులు చెప్పకపోవడంతో కాపరులు ఆందోళన చెందుతున్నారు. వైద్య సిబ్బంది నాలుగు రోజులుగా వైద్యశిబిరం ఏర్పాటు చేసి గొర్రెలకు చికిత్స అందిస్తున్నారు. కొన్ని గొర్రెలకు ఆపరేషన్ చేసి పరీక్షించగా కడుపులో కాలేయం పూర్తిగా దెబ్బతిని ముక్కలు అయిందని చెబుతున్నారు. బీటీ పత్తి ఆకులు కూడా అరగక పచ్చి ముద్దలా కనిపిస్తోందని వైద్యసిబ్బంది అంటున్నారు. వెటర్నరీ బయొలాజికల్ రీసెర్చ్ సంస్థ బృందం గొర్రెల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసి, మందలో ఉన్న గొర్రెల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపింది. ఆ రిపోర్టు ఇంకా అందక పోవడంతో ఏ విషయం చెప్పలేకపోతున్నారు. ఆంత్రాక్స్‌గా అనుమానం? మృతిచెందిన గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి సోకిందేమోనని కాపరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాపరుల సొంత గొర్రెలతో పాటు సబ్సిడీ గొర్రెలు కూడా మంద వెంట ఉన్నాయి. సబ్సిడీ గొర్రెల ద్వారా ఏమైనా వ్యాధి ప్రబలిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరో వైపు కలుషిత నీరు తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆంత్రాక్స్ కాదు.. ఆందోళన వద్దు శుక్రవారం చనిపోయిన గొర్రెలకు నట్టలు ఉన్నాయి. వాటికి సంబంధించి చికిత్స చేస్తున్నాం. లెఫ్టో పైరోసిస్, మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవి చనిపోయాయి. దీనిని గుర్తించి చికిత్స అందివ్వడం ఫలితాలను ఇచ్చింది. ఇలా చనిపోయిన గొర్రెల నుంచి వైరస్ విస్తరించి ఇతర గొర్రెలు కూడా చనిపోయే ముప్పు ఉండటంతో పూడ్పించాం. ఆంత్రాక్స్ సోకి గొర్లు చనిపోతున్నాయడం వాస్తవం కాదు. రిపోర్టులు అందాక పూర్తి నిర్ధారణకు వస్తాం. –రమేశ్, జిల్లా పశువైద్యాధికారి -
కేంద్ర ఉద్యోగులకు సులువుగా ప్రైవేట్ వైద్యం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) లబ్ధిదారులు ఇకపై ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ తేలిగ్గా వైద్య సేవలు పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా ఎటువంటి రెఫరల్ గానీ, అనుమతి గానీ అవసరం లేదని పేర్కొంది. ఈ పథకం కింద గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే విధానాన్ని మరింత సరళీకృతం చేయాలంటూ పలు అభ్యర్థనలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పింఛనుదారులు, మాజీ ఎంపీలు, సమరయోధులు, సాధారణ ఉద్యోగులు నగదు రహిత విధానంలో వైద్యం పొందవచ్చని వివరించింది. ఉద్యోగులు, వారి సంబంధీకులు చికిత్స పూర్తయిన అనంతరం సీజీహెచ్ఎస్ వైద్యాధికారి లేదా ప్రభుత్వ వైద్య నిపుణుడు జారీ చేసిన ప్రిస్క్రిప్షన్‌ను ఆస్పత్రి బిల్లుకు జత చేసి సంబంధిత అధికారికి అందజేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటిదాకా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలనుకునే ఉద్యోగులు ముందుగా ప్రభుత్వ వైద్యాధికారుల రెఫరల్ లేదా అనుమతి తీసుకుని వెళ్లాల్సి ఉండేది. ఇకపై చికిత్స పూర్తయిన అనంతరమే దీనిని అందజేయవచ్చని పేర్కొంది. -
‘అమ్మ’ను ఆదుకుంటాం..
ధర్మపురి: ‘అమ్మా.. మాట్లాడమ్మా’ శీర్షికన గురువారం ‘సాక్షి’మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ స్పందించారు. అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన కొమురమ్మకు ప్రభుత్వపరంగా మంచి వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ధర్మపురి మండలం బూర్గుపల్లెకు చెందిన సాదాని కొమురమ్మ అనారోగ్యం కారణంగా మంచం పట్టగా.. ఆమె చంటిబిడ్డల.. కుటుంబ దీనస్థితిని ‘సాక్షి’ ప్రచు రించింది. ఈ కథనాన్ని కలెక్టర్ పూర్తిగా చదివి.. బాధిత మహిళ స్థితిగతులు తెలుసుకొని నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ నవీన్‌కుమార్‌ను గురు వారం ఆదేశించారు. దీంతో ఆయన గ్రామానికి వచ్చి కొమురమ్మతో.. ఆమె భర్త రాజయ్యతో మాట్లాడి వివరాలు సేకరించారు. సాయంత్రం ధర్మపురి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. కలెక్టర్‌ను బాధితురాలి భర్త రాజయ్య కలసి తన దీన పరిస్థితిపై వివరించారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని పూర్తిగా చదివానని, మంచి వైద్యం కోసం రిఫర్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
అమ్మా.. మాట్లాడమ్మా..!
ధర్మపురి: తల్లి మంచం పట్టింది. ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. గోరుముద్దలు తినిపించాల్సిన మాతృమూర్తి అచేతనావస్థలో పడి ఉంది. ‘అమ్మా..అమ్మా..’అంటూ ఆ పసిపిల్లలు పిలిస్తే చూడటంతప్ప దగ్గరకు తీసుకోలేని దైన్య పరిస్థితి. మరోపక్క చేతనైనంత వరకు వైద్యం చేయించిన భర్త.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ కుటుంబం తమను ఆదుకునే దిక్కుకోసం ఎదురు చూస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బూర్గుపల్లెకి చెందిన సౌదాని రాజయ్య, కొమురమ్మ దంపతులు. వీరికి కుమారుడు నాగేశ్ (6 సంవత్సరాలు), ఆల్య, అహల్య(6 నెలలు) కవలలు ఉన్నారు. రాజయ్య గొర్రెలు మేపుకుంటూ, కొమురమ్మ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 40 రోజుల క్రితం ఉదయం ఇంటి వద్ద ఇద్దరు పసికందులకు పాలు తాగిస్తుండగా... కొమురమ్మ ఒక్కసారి పక్కకు పడిపోయింది. ఒడిలో ఉన్న ఇద్దరు చిన్నారులు రోదిస్తుండగా.. అప్పుడే ఇంటికి వచ్చిన భర్త రాజయ్య భార్యను లేపడానికి ప్రయత్నించాడు. కానీ, అచేతనావాస్థకు చేరింది. కాళ్లూచేతులు చచ్చుబడిపోయాయి. మాట్లాడటానికి ప్రయత్నించినా నోరు పెగలలేని పరిస్థితి. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనపై రాజయ్య షాక్‌కు గురయ్యాడు. వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు పరీక్షించి ‘యూరో పెరాలసిస్’గా గుర్తించారు. ఈ జబ్బు వేలల్లో ఒకరికి వస్తుందన్నారు. ఆస్పత్రిలో రూ. ఐదు లక్షలు ఖర్చు కొమురమ్మ చికిత్స కోసం ఇప్పటి వరకు రూ. 5 లక్షలు ఖర్చు చేశాడు. ఆస్పత్రిలో చేరిన తొలినాళ్లలో ఒక్క ఇంజెక్షన్ రూ. 18,300 పెట్టి కొనుగోలు చేశాడు. ఇలా రోజుకు 4 ఇంజెక్షన్లు వేయాల్సి వచ్చింది. వరుసగా ఐదు రోజుల పాటు ఇలా ఇంజెక్షన్లు చేయించినా.. వ్యాధి నయం కాలేదు. 20 రోజులకు పైగా ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించారు. పూర్తిగా నయం కావాలంటే మరో రూ. 5 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. అయితే, కొమురయ్య చేతిలో చిల్లిగవ్వలేదు. వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో 15 రోజుల క్రితం ఆస్పత్రినుంచి ఇంటికి తీసుకొచ్చారు. చెట్ల పసర్ల వైద్యం కోసం స్వగ్రామమైన నిర్మల్ జిల్లా కడెం మండలం మద్దికుంటకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. 55 గొర్లెను అమ్మిన.. కొమురమ్మ వైద్యం కోసం చేతిలో డబ్బు లేకుండే. నా దగ్గరున్న 55 గొర్రెలు అమ్మగా.. రూ.2 లక్షల యాభై వేలు వచ్చినయి. మరో రూ.2.5 లక్షలు అప్పు చేసిన. మొత్తం రూ.5 లక్షలకు పైగా ఖర్చయింది. అయినా నయం కాలే. మరికొన్ని రోజులుంటే నయమైతదని డాక్టర్లు చెప్పారు. ఇక చేతిలో చిల్లిగవ్వ లేదు. కేసీఆర్ ఇచ్చిన 19 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. దిక్కులేక చెట్ల పసరు పోయిస్తున్న. – రాజయ్య, భర్త -
సాయానికి ఎదురు‘చూపు’
♦ చదువుల తల్లికి అరుదైన కంటి వ్యాధి ♦ చూపు కోల్పోయిన ప్రతిభావంతురాలు ♦ వైద్యం చేయించని పేద కుటుంబం ♦ దాతలు కరుణించాలని వినతి పసివాడో ఏమిటో ఆ పైవాడు.. తను చేసిన బొమ్మలతో తలపడతాడు.. అని రాశాడో సినీకవి. విజ్ఞానంతో విరిసిన ఆ నయనాలు నల్ల కలువలవుతుంటే ఈ గీతమే గుర్తొస్తోంది. బంగారు స్వప్నాల్ని కన్న కనులను అంధకారం కమ్మేస్తుంటే ప్రతి కన్ను చెమర్చుతోంది. అరుదైన కంటి జబ్బు అభం శుభం తెలియని చిన్నారిని కాటేస్తుంటే పాషాణుల్ని సైతం కరిగిస్తుంది. ఆ దురదృష్టవంతురాలు.. కొత్తవలస మండలం కంటకాపల్లికి చెందిన విద్యార్థిని శ్రావణి. ఈ ప్రతిభావంతురాలి బతుకులో ‘టాకయ్యాస్‘ అనే నరాల వ్యాధి నిప్పులు పోసింది. కంటిచూపును కబళించేసింది. అత్యంత ఖరీదైన వైద్యం చేయిస్తే తప్ప చూపు దక్కదని తెలిసిన ఆమె ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తోంది. కొత్తవలస రూరల్: కంటకాపల్లి ఎస్సీ కాలనీలో నివసిస్తున్న మాడుగుల సూర్యనారాయణ, వెంకటలక్ష్మికి ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె శ్రావణి ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. సూర్యనారాయణ శారదా కంపెనీలో కాంట్రాక్ట్ వర్కర్. శ్రావణి ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఎనిమిదో తరగతి వరకూ స్కూల్ టాపర్. చదువుల్లోనే కాదు ఆటపాటలు, వ్యాసరచన, అన్నింటిలోనూ ప్రథమస్థానమే. పోటీలకు వెళ్తే పతకం రావలసిందే. ఇంతటి ప్రతిభావంతురాలు ‘టాకయ్యాస్‘ అనే నరాల వ్యాధి ప్రభావంతో కంటిచూపును కోల్పోయింది. ఇంజక్షన్ ఖరీదు రూ.70 వేలు శ్రావణికి ఈఏడాది వేసవి సెలవుల్లో చూపు తగ్గటంతో విశాఖపట్నం వైద్యుల్ని సంప్రదించారు. వారు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు సిఫార్సు చేశారు. అక్కడి వైద్యులు శ్రావణిని పరీక్షించి లక్షమందిలో వచ్చే వ్యాధిగా గుర్తించారు. దీంతో ఈమెకు నెలకు రూ.70 వేల విలువైన ఇంజక్షన్ (స్టెరాయిడ్స్), రూ.2వేల విలువైన మాత్రలను ఆరు డోసులు ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రులు అతి కష్టంమీద 3 డోసులు వేయించారు. ఆర్థిక స్తోమత చాలక పోవటంతో దాతలు కరుణించాలని కన్నీటితో ప్రాధేయపడుతున్నారు. దాతలు 94910601931 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు. మనసున్న నేస్తాలు శ్రావణి సహ విద్యార్థులు తమ ఇంటి వద్ద, దాచుకున్నవి, గ్రామంలో మొత్తం సుమారు రూ.లక్ష సేకరించి స్నేహితురాలి కంటిచూపు మెరుగుకు కృషి చేస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా తమ వంతు సాయం చేయాలని సంకల్పించారు. వెలుగు ప్రసాదించండి చదువులో ఎప్పుడూ ప్రథమ స్థానంలో నిలుస్తుండటంతో మా కుమార్తె ఉన్నత విద్య చదువుతుందని మురిసిపోయాం. కానీ భగవంతుడు ఇలా చేస్తాడని అనుకోలేదు. నరాల్లో ఎర్ర రక్తకణాలు స్పందించటం లేదని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. దాతలు స్పందించి మా కుమార్తె బతుకులో వెలుగు ప్రసాదించాలి. – సూర్యనారాయణ, తండ్రి ప్రభుత్వం ఆదుకోవాలి అప్పులు చేసి ఇప్పటి వరకూ మూడు డోసులు వేయించాం. ఇంకా మూడు డోసులు వేయించాల్సి ఉంది. ఆ తరువాత వైద్యులు ఏం చెబుతారో భయంగా ఉంది. ప్రభుత్వం సాయం చేసి నా చిట్టి తల్లికి చూపు తెప్పించాలి. – వెంకటలక్ష్మి, తల్లి -
హెల్త్‌కార్డు..ఎప్పుడొస్తదో!
♦ ఎదురుచూస్తున్న ‘సెర్ప్’ ఉద్యోగులు ♦ రాష్ట్రంలో సెర్ప్ ఉద్యోగులు4,200 ♦ హెల్త్ కార్డులు లేకున్నా వైద్యం చేయించుకున్న వారు 209 ♦ వైద్యానికి అయిన ఖర్చు రూ.89.82.లక్షలు సెర్ప్‌లో 4,200 మంది పని చేస్తు న్నారు. వీరు ఒక్కొ క్కరు తమ వాటా ధనంగా రూ.4,000 చెల్లిస్తే ప్రభుత్వం రూ.4,000 చెల్లి స్తుంది. దీంతో ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు, తల్లిదం డ్రులకు రూ.2 లక్షల వరకు వైద్యం అందుతుంది. యాదాద్రి భువనగిరి నుంచి యంబ నర్సింహులు: రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ)లో పని చేస్తున్న ఉద్యోగులకు హెల్త్‌కార్డులను ప్రభుత్వం రెన్యువల్ చేయ కపోవడంతో వారంతా ఇబ్బందుల్లో పడ్డారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో సరైన వైద్యం చేయించుకోలేక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ఉద్యోగులు చనిపోయారు. ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించాల్సిన వాటాధనం చెల్లించకపోవడంతో హెల్త్ ఇన్సూ రెన్స్ పథకం నిలిచిపోయింది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 209 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సలు పొంది రూ.89,82,839 లక్షలు సొం తంగా చెల్లించారు. గత ఏడాది కాలంగా సెర్ప్‌లో పనిచేస్తున్న హెచ్ఆర్ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించాల్సి ఉంది. అప్పుల పాలవుతున్న ఉద్యోగులు.. ఫిబ్రవరి 8 నుంచి ప్రభుత్వం చెల్లింపులు ఆపేయడంతో ఎక్కడికక్కడ వైద్యసేవలు నిలిచిపోయా యి. అయితే తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు ఉద్యోగులు సొంత డబ్బులతో వైద్యం చేయిం చుకుంటున్నారు. ఆర్థిక స్థోమతలేని మరికొందరు తాత్కాలిక వైద్య సేవలు పొందుతూ హెల్త్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వనపర్తి జిల్లాలో ఒక ఉద్యోగి రూ.1,19,933 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకుని అప్పుల పాలయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 19 మంది, సంగారెడ్డిలో 19, రంగారెడ్డిలో 18, సిద్దిపేటలో 18, నిజామాబాద్‌లో 18, కరీంనగర్లో 10, ఎస్పీఎంయూ (హైదరాబాద్ కేంద్ర కార్యాలయం) 11మంది హెల్త్‌కార్డులు లేకుండానే సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్నారు. -
నేరెళ్ల బాధితులకు వైద్యం అందించాలి
కాంగ్రెస్ నేత జానారెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితులపై కేసులు పెట్టి, చిత్రహింసలకు పాల్పడిన ప్రభుత్వం, ఇప్పుడు వారికి వైద్యం కూడా అందకుండా అడ్డుకుంటోందని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితులను పోలీసులు నిర్బంధించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని విమర్శించారు. ప్రభుత్వం దళితుల పట్ల కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని అన్నారు. బాధిత దళితులకు వైద్యం అందించకుండా అడ్డుకుంటే పక్కరాష్ట్రాల్లో చేయిస్తామని చెప్పారు. పోలీసులు తీవ్రంగా హింసించడంతో వారు అనారోగ్యానికి గురయ్యారని వారిని నిమ్స్‌లో చేర్పిస్తే పాలకులు బెదిరించారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. నిమ్స్ ఆసుపత్రి అధికారులకు అర్ధరాత్రి ఫోన్లు చేసి, దళితులను బయటకు గెంటేశారన్నారు. ఇంత నియంతృత్వ పాలనను ఎక్కడా చూడలేదన్నారు. బాధితులను కాపాడే ప్రయత్నాలు చేయకుంటే ఈ నెల 15న నేరెళ్లలో దీక్షలు చేస్తామని హెచ్చరించారు. -
జెండావిష్కరణలో వివాదం
సూర్యాపేటలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. దామోదర్‌రెడ్డి ధర్నా సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట పబ్లిక్ క్లబ్లో జెండావిష్కరణ అంశం వివాదాస్పదంగా మారింది. జెండావిష్కరణను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో పాల్గొన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడటంతో పాటు స్పృహ కోల్పోయారు. ఆయనను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. అసలేం జరిగిందంటే..: సూర్యాపేట పట్టణంలో క్లబ్ అపెక్స్ కమిటీ, కాంగ్రెస్ నాయకుడు వేణారెడ్డి వర్గం మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. వేణురెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలసి క్లబ్లో మంగళవారం ఉదయం జెండా ఎగుర వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వేణారెడ్డి, కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి మేళ్లచెరువు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ నాయకుల అరెస్టును నిరసిస్తూ సూర్యాపేటలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి కార్యకర్తలతో కలసి నిరసనకు దిగారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు.. దామోదర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో దామోదర్‌రెడ్డి తలకు గాయం కావడంతో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ను పోలీసు వ్యాన్‌లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్ ఆస్పపత్రికి తరలించారు. దామోదర్‌రెడ్డి అరెస్టును ఎమ్మెల్యే పద్మావతితోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఖండించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్బంధాలతో కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఏం చేయలేరన్నారు. -
మృత పిండంతో మూడు రోజులు..
- వైద్యం కోసం వస్తే చేతులెత్తేసిన వైద్యులు - కలెక్టర్ జోక్యం చేసుకుంటే తప్ప అందని వైద్యం చింతపల్లి (దేవరకొండ): ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పేదలకు సరైన వైద్యం అందకుండా పోతోంది. చేతిలో చిల్లి గవ్వలేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ.. ఓ గర్భిణీ మృతపిండంతో 3 రోజులు నరకయాతన అనుభవించింది. చివరకు కలెక్టర్ జోక్యం చేసుకోవడంతో వైద్యులు స్పందించారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గడియ గౌరారం గ్రామానికి చెందిన గ్యారపాటి యాదమ్మ, గెల్వయ్య దంపతులు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. యాదమ్మ ఆరు నెలల గర్భవతి. ఈ క్రమంలో ఈ నెల 12న రాత్రి కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో స్కా నింగ్ చేయగా కడుపులోనే పిండం మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతపిండాన్ని తొలగించాల్సిన వైద్యులు నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చారు. తమది నిరుపేద కుటుంబమని, ఆర్థిక స్థోమత లేదని ఆపరేషన్ చేసి మృత పిండాన్ని తొలగించాలని వైద్యులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. రాత్రంతా దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలోనే గడిపారు. ఈ నెల 13న నల్లగొండ జిల్లా ఆ స్పత్రికి ఆర్టీసీ బస్సులో వెళ్లామని బాధిత దంపతులు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి వైద్యపరీక్షలు చేసిన వైద్యులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి రిఫర్ చేశారు. సోమవారం కామినేని ఆస్పత్రికి వెళ్లేందుకు నల్లగొండ బస్టాండ్ వరకు వచ్చారు. కలెక్టర్ జోక్యం విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ వెంటనే వైద్యులతో మాట్లాడారు. అంబులెన్స్ పిలిపించి ఆమెను తిరిగి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సూపరింటెండెంట్ వివరణ ఈ విషయమై ‘సాక్షి’జిల్లా కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ పి.నర్సింగరావును వివరణ కోరగా మృత పిండంతో ఆస్పత్రికి వచ్చిన ఆమెకు వైద్యం అందించామని తెలిపారు. రక్తహీనత కారణంగా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించామన్నారు. -
మహిళపై ఆర్ఎంపీ లైంగికదాడికి యత్నం
బొమ్మలరామారం (ఆలేరు): వైద్యం కోసం వెళ్లిన మహిళపై ఓ ఆర్ఎంపీ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన ఓ మహిళ ఈ నెల 27న కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ గాజులరామారంలోని ప్రజా నర్సింగ్ హోమ్‌కు తన తల్లితో వెళ్లింది. ఆస్పత్రి నిర్వాహకుడు (ఆర్ఎంపీ) ఇజాజ్ పాషా వైద్యపరీక్షల కోసమని ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. దీంతో జరిగిన విషయాన్ని ఆమె తన భర్తకు తెలిపింది. బాధితురాలి భర్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్ఎంపీనకు ఫోన్ చేసి ఆస్పత్రికి వస్తున్నామని ఉండాలన్నాడు. దీంతో భయాందోళన చెందిన ఆర్ఎంపీ బాధితురాలి ఊరికి వెళ్లి తనది పొరపాటేనని చెప్పుకొచ్చాడు. దీంతో బాధితురాలి భర్త, మరో వ్యక్తి కలసి ఆర్ఎంపీపై దాడికి పాల్పడ్డారు. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. తనని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి దాడి చేశారని ఆర్ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాధిత మహిళ తనపై ఆర్ఎంపీ లైంగికదాడికి యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరువర్గాలపైనా కేసులు నమోదైనట్లు తెలిసింది. -
చిగురు నొప్పంటే.. దవడ తొలగించారు!
- 16 సార్లు ఆపరేషన్ చేశారు - వైద్యుల నిర్లక్ష్యంతో జీవితం నాశనమైపోయింది - అధికారులే అమెరికాకు పంపి వైద్యం చేయించాలి - నిమ్స్ పాత భవనం ఎక్కి యువకుడు హల్చల్ హైదరాబాద్: పంటి చిగురు నొప్పి ఉందని నిమ్స్‌కు వస్తే దవడ తొలగించారని, 16 సార్లు ఆపరేషన్ చేసి ప్రస్తుతం తమవల్ల కాదు అమెరికాకో, చైనాకో వెళ్లి వైద్యం చేయించుకోమ్మంటున్నారని ఓ బాధితుడు నిమ్స్ పాతభవనం ఎక్కి దూకేందుకు యత్నించాడు. వైద్యుల నిర్లక్ష్యంతో తన జీవితం నాశనమైందని, దానికి బాధ్యత వహిస్తూ వైద్యులే అమెరికాకు పంపి చికిత్స చేయించాలని రెండున్నర గంటలపాటు హల్ చల్ చేశాడు. నిమ్స్ ఉన్నతాధికారులు, పోలీసులు ఎంతమంది నచ్చజెప్పినా వినకపోవడంతో చివరికి చికిత్స అందిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు. అనంతరం వివరాలను బాధితుడు మీడియాకు వెల్లడించాడు. కుత్బుల్లాపూర్‌కు చెందిన శీలం ప్రదీప్ (27).. 2007లో పంటి చిగురు వద్ద ఉండే నరం వాచి తీవ్ర నొప్పి ఉండడంతో నిమ్స్‌కు వచ్చాడు. నిమ్స్ ప్లాస్టిక్ సర్జరీ విభాగ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా.. వికటించడంతో మరో శస్త్రచికిత్స నిర్వహించి దవడ, కింది దంతాలను తొలగించారు. కాళ్లు, చేతుల వద్ద కండరాలు తీసి దవడ వద్ద అమర్చేందుకు 16 సార్లు ఆపరేషన్ చేశారు. మొదట ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ జరిగినా తర్వాత మూడున్నర లక్షలకు పైగా ఖర్చయింది. ప్రస్తుతం వైద్యులను సంప్రదిస్తే మ్యాక్సో ఫేషియల్ సర్జరీ చేయాలని, దానికి ఇక్కడ చికిత్స లేదని చైనాకో, అమెరికాకో వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారని ప్రదీప్ వాపోయాడు. తనకు హిమోగ్లోబిన్ లెవల్ కూడా పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై తాను న్యాయస్థానానికి కూడా వెళ్లినట్లు బాధితుడు తెలిపారు. భవనం పైనుంచి దూకేందుకు యత్నం... శనివారం ఉదయం 7:30 ప్రాంతంలో నిమ్స్ పాత భవనం 4వ అంతçస్తులోని ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి వచ్చిన ప్రదీప్, వార్డు లోపలి నుంచి రేయిలింగ్ ద్వారా భవనం పైకి ఎక్కి దూకేందుకు యత్నించాడు. గమనించిన సెక్యురిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న నిమ్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ అతన్ని సముదాయించే యత్నం చేశారు. తనకు లిఖిత పూర్వక హామీ కావాలని, ఎవరైనా దగ్గరకు వస్తే కిందకు దూకుతానని హెచ్చరించాడు. చొరవచూపిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ ... సాక్షి బంజారాహిల్స్ జోన్ ఫోటోగ్రాఫర్ దయాకర్.. అతను నిలబడ్డ చోటుకు సమీపం వరకు వెళ్లి సుమారు అరగంట పాటు మాట్లాడి సమస్య పూర్తిగా తెలుసుకుని ఆత్మహత్య సరికాదని కౌన్సెలింగ్ ఇచ్చాడు. అంతలోపు నిమ్స్ యాజమాన్యం వైద్యం చేయిస్తామని ఓ లేఖ తయారు చేసి తీసుకురాగా, దయాకర్ దాన్ని తీసుకుని అతనికి ఇచ్చాడు. నెమ్మదిగా మాటల్లో పెట్టి పట్టుకోగానే పోలీసులు వెళ్లి అతన్ని కిందకు తీసుకువచ్చారు. 7:30కి భవనం ఎక్కిన ప్రదీప్ 9:55కు కిందకు వచ్చాడు. పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు. -
ఎయిడ్స్ రోగా... ప్రసవం చేయం
♦ నాగర్‌కర్నూల్‌లో గర్భిణీకి వైద్యం నిరాకరించిన డాక్టర్లు సాక్షి, నాగర్ కర్నూల్: ఎయిడ్స్ సోకిన గర్భిణికి ప్రసవం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా చేదు అనుభవం ఎదురైంది. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ మహిళ గర్భం దాల్చిన సమయంలో వైద్యపరీక్షలు చేయించగా హెచ్ఐవీ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే, ఆమె భర్తకు వ్యాధి లేకపోవడంతో.. టీకాల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ఆమెకు వ్యాధి సోకిందని కుటుంబీకులు నిర్ధారణకు వచ్చారు. ప్రసవం సమయం సమీపిస్తుండగా ఏ ఆస్పత్రిలో సంప్రదించినా వైద్యులు అంగీకరించలేదు. హైదరాబాద్‌లోని జడ్జిఖానా ఆస్పత్రిలో మాత్రమే ఇలాంటి వారికి ఆపరేషన్లు చేస్తారని, అక్కడికి వెళ్లాల్సిందేనంటూ ఐసీటీసీ అడ్వైజర్ సలహా ఇచ్చారు. కానీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. సదరు మహిళకు బుధవారం రాత్రి పురిటి నొప్పులు ఆరంభమయ్యాయి. గ్రామంలోని మంత్రసానులు ప్రసవం చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో సంప్రదిస్తే రిపోర్టులు చూసిన వైద్యులు కాన్పు చేయలేమని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో ఆమె తనకు ఉన్న వ్యాధితో పాటు పేరును మార్చి చెప్పి నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో చేరింది. దీంతో ఆమెకు బుధవారం రాత్రి శస్త్రచికిత్స చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కాగా, ప్రసవం చేశాక ఆమెకు హెచ్ఐవీ ఉన్నట్లు వైద్యులు గుర్తించి ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. విషయాన్ని ముందే చెప్పకపోవడంతో తమతో పాటు సిబ్బందికి వ్యాధి సోకే ప్రమాదముందని పేర్కొంటూ ఆమెపై కేసు నమోదు చేయాలని కోరారు. అయితే, తప్పని పరిస్థితుల్లో తామిలా చేయాల్సి వచ్చిందంటూ గర్భిణి మహిళ తరఫున వారి బంధువులు డాక్టర్లను వేడుకున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి
కెరమెరి(ఆసిఫాబాద్): వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. కుమ్రం భీం జిల్లాలోని కెరమెరి మండలం గోండ్ కరం జివాడ గ్రామానికి చెందిన సిడాం బ్రహ్మ (11)ను బుధవారం వేకువజామున పాము కాటు వేసింది. గమనించిన తల్లిదండ్రులు సిడాం యాదోరావు, దుర్పాబాయిలు వెం టనే కెరమెరి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యుడు సుంకన్న వైద్యం చేయ కుండానే ఆదిలాబాద్‌కు రిఫర్ చేశారు. 108 వాహనం లేకపోవడంతో తిరిగి ఇంటికి తీసుకువెళ్తుండగా బ్రహ్మ మృతి చెందాడు. దీంతో కుటుం బీకులు, గ్రామస్తులు పీహెచ్సీ తిరిగి వెళ్లి గేటు ఎదుట మృత దేహంతో ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బందిని బయటికి వెళ్ల కుండా అడ్డుకు న్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం వచ్చి కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేస్తా మని హామీ ఇవ్వ డంతో కుటుంబీకులు శాంతించారు. బ్రహ్మ సిర్పూర్(యూ) పంగిడి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. -
‘ఆశ’లకు నిరాశేనా?
- రూ.6 వేలు వేతనమిస్తామన్న సీఎం హామీకి అధికారుల కొర్రీలు - ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆశ వర్కర్లు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా ‘ఆశ’ కార్యకర్తలకు ఇచ్చిన హామీ అమలుకు అధికారుల కొర్రీలు అడ్డంకిగా మారుతున్నాయి. ‘ఆశ’ కార్యకర్తలకు రూ.6 వేలు గౌరవ వేతనంగా అందజేస్తామని సీఎం ప్రకటించగా... అలాకాకుండా ఇప్పుడి స్తున్న దానికి రెట్టింపు సొమ్ము ఇవ్వాలంటూ అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇదే జరిగితే అత్యధికశాతం మందికి గరిష్టంగా రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ‘ఆశ’ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అతి తక్కువ మందికి మాత్రమే రూ.6 వేలు అందుతాయని చెబుతున్నారు. అందరికీ రూ.6 వేలు గౌరవ వేతనం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా.. రాష్ట్రంలో 27,045 మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. పదేళ్ల కింద జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) మార్గదర్శకాల ప్రకారం వారిని నియమించారు. కుటుంబ నియంత్రణ, ఆసుపత్రిలో కాన్పు, ఇమ్యునైజేషన్ వంటి వాటిని ప్రోత్సహించడంతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారు. 104, 108, ఆరోగ్యశ్రీ పథకాలకు తోడ్పాటు, హెచ్ఐవీ రోగులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. కుష్టు, టీబీ రోగులకు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు వచ్చే వ్యాధులను గుర్తించడం, అవసరమైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు తీసుకెళ్లడం, అక్కడ తగిన వైద్యం అందుబాటులో లేకుంటే పైఆసుపత్రికి రిఫర్ చేయడం వంటివి చేస్తున్నారు. ఈ పనులన్నింటికీ ప్రభుత్వం నామమాత్రపు పారితోషికాలనే చెల్లిస్తోంది. పనిని బట్టి నెలకు ఒక్కో ఆశ వర్కర్‌కు రూ.400 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే అందుతున్నాయి. రోజంతా పల్లెల్లో సేవలందిస్తున్నా ప్రభుత్వం తగిన పారితోషికం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటోందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ఆశ’ వర్కర్లకు ప్రయోజనం కలిగించేలా నెలకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ దీనికి అధికారులు కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. -
అసంఘటిత కార్మికులకు మెరుగైన వైద్యం
ఈఎస్ఐ ద్వారా అందిస్తామన్న దత్తాత్రేయ హైదరాబాద్: రాజధానిలో భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఇందులో భాగంగానే కవాడిగూడలో 30 పడకలు, చిక్కడపల్లిలో 6 పడకలు, గోషామహల్లో రూ.100 కోట్లతో 100 పడకలు, పాత బస్తీలో 100 పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రుల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే అందుకు అనువైన స్థలాలను చూపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటివరకు స్పందన రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమీక్ష నిర్వహించి ఆసుపత్రుల నిర్మాణానికి స్థలం కేటాయించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రముఖ చర్మ వైద్యులు డాక్టర్ ఆశిష్ భాగ్యనగర్, డాక్టర్ కీర్తి సుబ్రహ్మణ్యం నల్లకుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్స్కిన్ మెడికల్ సెంటర్‌ను ఆదివారం అంబర్‌పేట శాసన సభ్యుడు జి.కిషన్‌రెడ్డి, ఐఎంఎస్ (ఈఎస్ఐ) డైరెక్టర్ సీహెచ్ దేవికారాణితో కలిసి దత్తాత్రేయ ప్రారంభించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో 9,800 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర వాటాగా ఇంటికి రూ.1.5 లక్షల చొప్పున రూ.17 కోట్లు విడుదల చేసిందని దత్తాత్రేయ చెప్పారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టక పోవడం శోచనీయమన్నారు. సొంతింటి కల నిజం చేస్తాం... ప్రతి పీఎఫ్ ఖాతాదారుడికీ సొంతింటి కల నిజం చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. ఆదివారం ఈపీఎఫ్ఓ ఉద్యోగ సంఘాలు ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో మంత్రి మట్లాడుతూ... గృహ నిర్మాణాలకు సంబంధించి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామన్నారు. భవిష్యనిధి విభాగం ప్రాంతీయ కమిషనర్ శ్రీకృష్ణ పాల్గొన్నారు. -
చనిపోయిన బాలుడికి వైద్యం
- డబ్బుకోసం వైద్యుల డ్రామా - మృతుడి కుటుంబీకుల ఆందోళన మహబూబ్‌నగర్ క్రైం: చనిపోయిన ఆరు నెలల బాలుడి మృతదేహానికి.. వైద్యులు డబ్బుపై ఉన్న ఆశతో వైద్యం అందించారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు..స్థానికులు కథనం ప్రకారం..నవాబ్‌పేట మండలం మరికల్ గ్రామానికి చెందిన వెంకటయ్య, అలివేలు దంపతులకు మూడో సంతానంలో బాబు పుట్టాడు. గురువారం ఉదయం బాబుకు జ్వరం వస్తే పట్టణంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకువెళ్లారు. అక్కడ పని చేస్తున్న వైద్యులు..నర్సులు తెలిసీ తెలియని వైద్యంతో అధిక డోస్ కలిగిన ఇంజక్షన్స్, సంబంధంలేని సెలైన్లు ఎక్కించారు. దీంతో బాబు పరిస్థితి విషమంగా మారింది. ఆలస్యంగా తేరుకున్న క్లినిక్ వైద్యులు వారి అంబులెన్స్‌లో తెలంగాణ చౌరస్తాలో ఉన్న మరో ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే మృతిచెందిన బాబుకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి చికిత్స చేస్తున్నట్లు డ్రామా చేశారు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. బంధువులు వైద్యులను నిలదీయడంతో బాబు మృతి చెందాడని చెప్పారు. దీంతో వారు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి టూటౌన్ సీఐ డీవీపీ రాజు, ఎస్ఐలు రాఘవేందర్, నసర్ చేరుకోని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. -
పేద అమ్మపై కేసు..
భర్త వైద్యం కోసం బిడ్డను అమ్మినందుకు.. ఓదెల(పెద్దపల్లి): భర్తకు వైద్యం చేయించేందుకు కన్నకొడుకును అమ్మిన పేద తల్లితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లె తండాకు చెందిన గుగులోతు కవిత కన్నబిడ్డను రూ. లక్షకు అమ్మేయడం.. ఆ తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుడు రాజకుమారస్వామి నుంచి పొత్కపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. దీంతో బిడ్డ తల్లిదండ్రులు కవిత, తేజతో పాటు నానమ్మ తార, బిడ్డను కొనుగోలు చేసిన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన ఇందారపు నర్సయ్య, సుజాత దంపతులు, మధ్యవర్తిత్వం వహించిన నాంసానిపల్లికి చెందిన గుగులోతు లింగేశ్, శ్రీనివాస్, కందుల సందయ్యపై ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ జరుపుతున్నట్లు ఎస్సై పర్శ రమేశ్ తెలిపారు. గుగులోతు కవిత–తేజ దంపతుల ఆర్థిక పరిస్థితి బాగోలేక బాబును సంతానం లేని నర్సయ్య–సుజాత దంపతులకు విక్రయించి దత్తత ఇచ్చినట్టు కాగితం రాసుకున్నారని ఎస్సై వివరించారు. బాబును తల్లి కవితకు అప్పగించామని పేర్కొన్నారు. -
ఓ తల్లి కథ..!
భర్త వైద్యం కోసం.. పసికందును అమ్మేసిన వైనం ఓదెల(పెద్దపల్లి): ఓ వైపు చచ్చుబడిన కాళ్లతో మంచాన పడ్డ భర్త.. మరోవైపు ఆకలితో అల మటిస్తున్న ముగ్గురు పిల్లలకు బువ్వ పెట్టలేని దైన్యం.. చివరకు భర్తకు వైద్యం చేయించేందుకు, ఆకలితో కడుపు మాడుతున్న పసి హృదయాల గోస చూడలేక పేగుబంధాన్ని మరిచి ఆరు నెలల పసిగుడ్డును అమ్మేసింది. పదిరోజుల తర్వాత కొడుకుపై మమ కారం చావక బాబును ఇప్పిం చాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది ఓ మాతృమూర్తి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లె తండాకు చెందిన గుగులోతు తేజ, కవిత దంపతులకు ముగ్గురు సంతానం. మహేశ్(5), కుమార్తె మహదేవి (3), బాబు (6 నెలలు) ఉన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని గిరిజన కుటుంబం. చిన్న ఇల్లు తప్ప ఆస్తి పాస్తులు లేవు. భార్యాభర్తలిద్దరూ రోజూ కూలీలు. ఆరునెలల క్రితం తేజ వెన్నెముకకు టీబీ వ్యాధి సోకి రెండు కాళ్లు చచ్చుబడిపో యాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెన్నెముకకు ఆపరేషన్ చేయించినా ఫలితం లేకపోయింది. తేజ పూర్తిగా మంచానికే పరి మితమయ్యాడు.దీంతో రోజు కూలికి వెళ్లే కవిత భర్తకు సపర్యలు చేస్తూ ఇంటివద్దే ఉంటుండగా పూట గడవడం కష్టంగా మారింది. మరోవైపు పిల్లలను సాకలేని పరిస్థితి. కవిత తన భర్త కాళ్లను బాగు చేసుకుని కుటుంబాన్ని చక్కదిద్దు కోవాలనుకుంది. గత నెల 31న అదే గ్రామానికి చెందిన సంతానం లేని సింగరేణి కార్మికుడికి తన చిన్న కుమారున్ని మధ్యవర్తి ద్వారా లక్ష రూపాయలకు అమ్మేసింది. వారు గోదావరి ఖనిలో నివాసముంటున్నారు. స్థానికంగా దత్తత తీసుకున్నట్టు ప్రచారం చేశారు. కవిత బిడ్డను అమ్మగా వచ్చిన డబ్బుల్లోంచి రూ.60 వేలను కుమార్తె పేరిట డిపాజిట్ చేసింది. మిగతా రూ.40 వేలను భర్త కోసం, కుటుంబఖర్చుల కోసం వెచ్చించింది. వారం నుంచి చిన్న కుమారుడిపై మమకారం చావక ముభావంగా ఉంటోంది. కొడుకుపై ప్రేమను చంపుకోలేక బిడ్డను ఇప్పించాలంటూ మధ్య వర్తిని ఆశ్రయించింది. కాళ్లావేళ్లా పడి బతిమి లాడింది. చివరకు ఇచ్చిన రూ.లక్ష వాపసు తీసుకొచ్చి ఇస్తే బిడ్డను ఇచ్చేస్తామని వారు చెప్పారు. దీంతో చేతిలో చిల్లిగవ్వలేక మూడు రోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లింది. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం తన బాబును ఇప్పించాలని ఫిర్యాదు చేసింది. బాబును అమ్మించిన మధ్యవర్తిని పిలిపించి మాట్లాడుతున్నట్టు ఎస్సై రమేశ్ తెలిపారు. కాగా, భర్త వైద్యం కోసం కన్న కొడుకునే అమ్మడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
వైద్యం అందక చిన్నారి మృతి
- వైద్యులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ – వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆలూరు రూరల్ : వైద్యం అందక ఎనిమిదిఏళ్ల బాలుడు ఆదివారం మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడి మృతికి ఆలూరు ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే కారణమని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే... ఆలూరు మండల పరిధిలోని అరికెరతండాకు చెందిన సోమ్లానాయక్, దుర్గీబాయిల కుమారుడు(మొదటి సంతానం) సుంకానాయక్(8ఏళ్లు) ఆలూరులోని ఓ ప్రయివేట్ పాఠశాలలో ఫస్ట్‌క్లాసు చదువుతున్నాడు. ఆ విద్యార్థి గత మూడు రోజులుగా తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. శనివారం తల్లిదండ్రులు చికిత్స కోసం ఆలూరు ఆస్పత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న మత్తుమందు డాక్టర్ గయాజ్, ఆస్పత్రి సిబ్బంది అప్పటికప్పుడు ప్రాథమికంగా చికిత్స అందించి సెలీన్బాటిల్ ఎక్కించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఆ చిన్నారి ఆరోగ్యం కుదటపడకపోగా అస్వస్థలోనే ఉండిపోయాడు. దిక్కుతోచని పరిస్థితిలో కుటుంబసభ్యులు నియోజకవర్గకేంద్రమైన ఆలూరులోని ఓ మంత్రగాడు (ఆర్ఎంపీ డాక్టర్) వద్దకు ఆ బాలుడిని తీసుకెళ్లారు. అక్కడ ఆయన అంత్రం వేసి ఓ ఇంజక్షన్ వేసినట్లు తెలిసింది. అప్పటికే తీవ్ర అస్వస్థతలో ఉన్న చిన్నారికి అంత్రం, తంత్రం పేరుతో దాదాపు రెండుగంటలు బయటకు తీసుకెళ్లడంతో ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. దీంతో అంత్రం వేయించి బయటకు తీసుకొచ్చేలోపే సృహకోల్పోయాడు. గమనించిన తల్లిదండ్రులు, బంధువులు మరోమారు ఆలూరు ఆస్పత్రికి చికిత్స తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యసిబ్బంది చిన్నారి మృతిచెందినట్లు నిర్ధారించారు. – వైద్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తమ కుమారుడికి సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందకపోవడంతోనే మృతిచెందాడని, బాధ్యులైన వైద్యసిబ్బందిపై కేసులు నమోదు చేయాలని చిన్నారి తల్లిదండ్రులు సోమ్లానాయక్, దుర్గీబాయి డిమాండ్ చేశారు. ఆదివారం కూడా తమ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైనప్పటికీ విధి నిర్వహణలో ఉన్న వైద్యులు తమ కుమారుడిని పరీక్షించలేదని వారు ఆరోపించారు. తప్పని పరిస్థితుల్లో తాము అంత్రం వేయించేందుకు తీసుకెళ్లామన్నారు. -
డోలీయే దిక్కు..!
► వైద్యం కోసం ‘గిరి’జన కష్టాలు ► రాళ్ల దారులపై నరకయాతన ► అక్కరకురాని 108, 102 వాహన సేవలు ► కిలో మీటర్ల మేర డోలి సాయంతోనే రోగుల తరలింపు ► గాలిలో కలుస్తున్న గిరిజనుల ప్రాణాలు ► పట్టించుకోని పాలకులు, అధికారులు విమానాలపై మనిషి గుండెను తరలించి రోగులకు అమర్చుతున్న రోజుల్లో.. ఒకేసారి పదుల సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించే మేధావులున్న కాలంలో.. అమాయకులైన గిరిజనులు వైద్యం కోసం అర్రులు చాస్తున్నారు. మందుబిళ్లలు అందించేవారు లేక అనారోగ్యం పాలవుతున్నారు. జబ్బుచేస్తే పసర మందులు మింగుతున్నారు. ప్రాణాల మీదకు వస్తే ఆస్పత్రులకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గూడ వాసులందరూ కలిసి డోలీ సహాయంతో కొండలపై నుంచి రోగులను, గర్భిణులను ఆస్పత్రులకు చేరుస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలు ‘గిరి’జన గూడల్లో నిత్యకృత్యంగా మారినా.. ఆపద సమయంలో వైద్యం అందక గిరిజనుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో నిలదీస్తున్నా.. గిరిజనుల తరఫున గోడు వినిపిస్తున్నా యంత్రాంగంలో ఇసుమంతైనా కదలిక లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విజయనగరంఫోర్ట్: విజయనగరం జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 11 సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. వీటి పరిధిలో 431 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఏటా వైద్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. గిరిజన గూడలకు వెళ్లి చూస్తే ఈ లెక్కలకు, ఆస్పత్రుల సంఖ్యకు అర్థం ఉండదు. పల్లెల్లో మందుబిళ్లలు ఇచ్చేవారు కానరారు. రోడ్డు సదుపాయం లేక వాహన సేవలు అక్కరకురావు. 108, 102 సర్వీసులకు ఫోన్ చేసినా.. కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయే పరిస్థితి. వర్షమైనా.. ఎండకాస్తున్నా గిరిజన రోగులను డోలీ సహాయంతో కిలోమీటర్ల మేర తరలించాల్సిందే. అత్యవసర వేళ కనీసం ప్రాథమిక వైద్య సేవలు అందించేవారు లేక గిరిజనుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇదీ పరిస్థితి... జిల్లాలో సుమారు 2.60 వేల మంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరికి వైద్య సేవలు అందించేందుకు 20 పీహెచ్‌సీలు, సుమారు వంద ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో రహదారి లేని గ్రామాలు, కొండ శిఖర గూడలు వందలాది ఉన్నాయి. వీరికి వైద్యం అందని ద్రాక్షగా మారింది. అనారోగ్యం పాలైతే డోలీతోనే నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలకు చేర్చాలి. దీనికోసం సుమారు మూడునాలుగు గంటల పాటు రాళ్లదారిపై ప్రయాణించాల్సిందే. ఆ సమయంలో ఆరోగ్య ఉపకేంద్రాల్లో సిబ్బంది ఉంటే ప్రాథమిక వైద్యం అందుతోంది. లేదంటే.. సమస్య జఠిలంగా మారుతోంది. ఇటీవల కాలంలో వైద్యం సకాలంలో అందక గిరిజన పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న 11 మంది విద్యార్థులు తనువుచాలించారు. ఈ ఏడాదిలో ఇలాంటి మరణాలు సుమారు 30 వరకు సంభవించాయని గిరిజన సంఘాల నాయకులు చెబుతున్నారు. నేతలు మారుతున్నా.. దశాబ్దాలు గడుస్తున్నా గిరిజనులకు వైద్య కష్టాలు వీడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలకు దూరంగా బతుకుతున్నామంటూ గగ్గోలు పెడుతున్నారు. గిరిజన గూడలకు దగ్గరగా ఆరోగ్య ఉపకేంద్రాలు, పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని, వైద్యులు, సిబ్బంది స్థానికంగా నివసించేలా చూడాలని కోరుతున్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర గిరిజన కష్టాలను శాసనసభలో ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి గిరిజనులకు వైద్య సేవలను చేరువ చేయాలని కోరుతున్నారు. -
ఆదాయం పెరిగితేనే సాయం : ఏపీ సీఎం
-
ఆదాయం పెరిగితేనే సాయం
పెన్షనర్లకు సీఎం స్పష్టీకరణ సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిస్థాయిలో పెరగలేదని, ఆదాయం పెరిగితేనే పెన్షనర్లకు సహాయం చేసే వెసులుబాటు వస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. 70 ఏళ్లు దాటిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పెన్షనర్లు ఇంట్లో కూర్చోకుండా రోజుకు నాలుగైదు గంటలు సమాజసేవ చేయాలని సూచించారు. దీంతో వారికి ఆరోగ్యం, మాససిక ఉల్లాసం లభిస్తాయని చెప్పారు. విజయవాడలోని ఎ–కన్వెన్షన్ హాలులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం 40వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ఎన్జీవోలతో పాటు పెన్షనర్లకు కూడా హెల్త్‌కార్డులు జారీ చేశామని, అయితే కార్పొరేట్ ఆస్పత్రులు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నందువల్ల వైద్యంలో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా కష్టపడతారని, ఆ అసూయతో అమెరికాలో తెలుగువారిపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వారికి భద్రత కల్పించే విషయంలో అమెరికా ప్రభుత్వంపై కేంద్రం తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని సీఎం కోరారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొణకంచి సోమేశ్వరరావు మాట్లాడుతూ 70 ఏళ్లు దాటినవారికి 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేసినా అమలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
విధానాలు మారకపోతే అధోగతే
రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారుతుండటంపై సెస్ ఆందోళన ♦ ఇప్పటికీ వెనుకబాటులోనే పలు జిల్లాలు ♦ వేధిస్తున్న విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కొరత ♦ నిధుల కేటాయింపులో వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యత లేదు ♦ ప్రభుత్వం ఇప్పటి విధానాలను మారిస్తేనే మెరుగైన ఫలితాలు ♦ ఏపీలో 2015లో ప్రజల స్థితిగతులపై ‘సెస్’ అధ్యయనం ♦ మానవాభివృద్ధి సూచిలో అట్టడుగు స్థానాల్లో విజయనగరం, కర్నూలు, శ్రీకాకుళం, అనంతపురం ♦ వైఎస్ హయాంలో చేపట్టిన చర్యలవల్ల ప్రమాణాలు మెరుగుపడ్డాయి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారుతుండటం పట్ల సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ(సెస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలను ఇలాగే కొనసాగిస్తే ప్రజల జీవన ప్రమాణాల్లో ఏమాత్రం మార్పు వచ్చే అవకాశాలు లేవని తేల్చిచెప్పింది. పాత విధానాలను సమూలంగా మార్చుకొని, నూతన విధానాలను చిత్తశుద్ధితో అమలు చేస్తేనే పరిస్థితులు మెరుగవు తాయని స్పష్టం చేసింది. విద్య, వైద్యంతోపాటు కనీస మౌలిక సదుపాయాల కల్పనపై తక్షణమే దృష్టి సారించాలని సూచించింది. ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచే పథకాలకు రూపకల్పన చేసి, సమర్థవంతంగా అమలు చేసినప్పుడే వారి జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో మెరుగు పడతాయని పేర్కొంది. 2015లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల స్థితిగతులపై ‘సెస్’ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ఫలితాలతో ఒక నివేదికను రూపొందించింది. జాతీయ మానవాభివృద్ధి సూచి(హెచ్‌డీఐ)లో ఆంధ్రప్రదేశ్ స్థానం దిగజారిందని తేల్చింది. రాష్ట్రంలో కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు మినహా మిగతా జిల్లాల్లో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని ‘సెస్’ నివేదిక తేల్చి చెప్పింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంది? ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? వాటిని మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ‘సెస్’ అధ్యయనం చేసింది. నిధుల కేటాయింపులో వెనుకబడిన జిల్లాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని సూచించింది. మెరుగ్గా ఉన్న జిల్లాలకు కేటాయించిన నిధులను ప్రాధాన్యత రంగాల్లో ఖర్చు చేసి, దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలపాలని పేర్కొంది. నెల్లూరు.. ఐదు నుంచి మూడోస్థానానికి.. నెలవారీగా తలసరి వ్యయం, శిశు మరణాలు, 15 ఏళ్లలోపు పిల్లల అక్షరాస్యత, 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు పాఠశాలల్లో ఉండటం, నిరుద్యోగం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని మానవాభివృద్ధి సూచిని ‘సెస్’ లెక్కగట్టింది. విద్య, వైద్యం, తలసరి వ్యయం, కనీస మౌలిక సదుపాయాలు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెరుగ్గా ఉన్నట్లు తేల్చింది. 2015లో మానవాభివృద్ధి సూచిలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినట్లు వెల్లడించింది. గతంలో ఐదో స్థానంలో ఉన్న నెల్లూరు జిల్లాలో పరిస్థితులు మెరుగుపడి, మూడో స్థానానికి చేరడం ఒక్కటే సానుకూలమైన అంశమని పేర్కొంది. వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పరిస్థితులు మరింత దిగజారడం.. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారడం ప్రతికూలమని తేల్చిచెప్పింది. ‘సెస్’ సూచనలు మానవాభివృద్ధి సూచిలో కాస్త మెరుగ్గా ఉన్న ఆరు జిల్లాల్లో పరిస్థితులను మరింత మెరుగుపర్చడానికి, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జిల్లాలను దేశంలో అగ్రగామిగా నిలపడానికి చర్యలు తీసుకోవాలని ‘సెస్’ సూచించింది. సెస్ సూచనలు.. ► అత్యంత వెనుకబడిన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయాలి. ► తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖ, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు నిధుల కేటాయింపులో ప్రాధన్యం ఇచ్చి.. వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. ► మానవాభివృద్ధి సూచిలో మెరుగ్గా ఉన్న కృష్ణ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలను దేశంలో అగ్రగామి జిల్లాల సరసన చేర్చడానికి ప్రణాళికలు రచించాలి. ► ఆర్థిక అసమానతలు తగ్గించేలా నిధులను ఖర్చు చేయాలి. ► ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడే పథకాలను రూపొందించి, అమలు చేయాలి. ► పౌష్టికాహారం, మెరుగైన వైద్య సహాయం, కనీస మౌలిక సదుపాయాలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ► విద్యా రంగాన్ని మెరుగుపర్చాలి. 15 ఏళ్లలోపు పిల్లలందరూ బడికి వెళ్లి చదువుకునేలా చర్యలు తీసుకోవాలి. టాప్ 10 నుంచి ఏపీ గల్లంతు ఉమ్మడి రాష్ట్రంలో 1995 ఆగస్టు నుంచి నుంచి 2004 మే వరకూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పని చేశారు. అప్పట్లో రాష్ట్రంలోని పరిస్థితులపై సెస్ అధ్యయనం చేసి 2005లో నివేదిక ఇచ్చింది. దేశంలో 2004–05లో మానవాభివృద్ధి సూచిలో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానానికి పరిమితమైనట్లు పేర్కొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన చర్యల వల్ల 2005–10 మధ్య కాలంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. దేశంలో 2011–12 మానవాభివృద్ధి సూచిలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానానికి చేరినట్లు ‘సెస్’ తన నివేదికలో పేర్కొంది. మానవాభివృద్ధి సూచిలో టాప్ 10లో ఆంధ్రప్రదేశ్ చేరడం అదే ప్రథమం. 2015లో ‘సెస్’ అధ్యయనంలో దేశంలో మానవాభివృద్ధి సూచిలో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. కానీ, ఏపీ స్థానం టాప్ 10 నుంచి గల్లంతైంది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఏపీ ఏ స్థానంలో నిలిచిందన్నది సెస్ నివేదికలో వెల్లడించకపోవడం గమనార్హం. పౌష్టికాహార లోపం తీవ్రం అత్యంత వెనుకబడిన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉన్నట్లు ‘సెస్’ తేల్చింది. ఎక్కువ శాతం మంది పిల్లలు ఎనీమియా(రక్తహీనత)తో బాధపడుతున్నారని వెల్లడించింది. మాతా, శిశు మరణాల రేటు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. పరిశుభ్రమైన తాగునీరు ప్రజలకు అందుబాటులో లేదని తెలిపింది. అవసరమైన మేరకు వైద్య సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు అధిక శాతం ఖర్చును వైద్యం కోసమే చేస్తున్నారని వివరించింది. విద్యారంగం తీసికట్టు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఏమాత్రం మెరుగ్గా లేవని ‘సెస్’ స్పష్టం చేసింది. దీనివల్ల ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతూ విద్య కోసం అధికంగా సొమ్మును ఖర్చు చేస్తున్నారని తెలిపింది. అత్యంత వెనుకబడిన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతోపాటు వైఎస్సార్, ప్రకాశం, విశాఖ, గుంటూరు, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ విద్య కోసం నిధులను ఎక్కువగా ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయని వెల్లడించింది. ఇప్పటికీ బాల్య వివాహాలు మానవాభివృద్ధి సూచిలో అగ్రభాగాన నిలిచిన కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో బాల్య వివాహాలు కొనసాగుతున్నాయని సెస్ గుర్తించింది. అత్యంత వెనుకబడిన అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ బాల్య వివాహాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది. తక్కువ తలసరి ఆదాయం, అక్షరాస్యత మెరుగుపడక పోవడమే బాల్య వివాహాలకు కారణమని తెలియజేసింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగతున్నాయని పేర్కొంది. -
ఎయిడ్స్ రోగికి వైద్యం నిరాకరణ!
► ఆశ్రయం ఇవ్వడానికి బంధువుల నిరాకరణ ► స్థానికుల చొరవతో ఆస్పత్రికి.. మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి వైద్యులు ఓ రోగికి వైద్యం చేసేందుకు నిరాకరించారు. ఇటు బంధువులూ.. అద్దె ఇంటి వారు దగ్గరకు రానివ్వలేదు. తొర్రూ రు మండలంలోని కంఠాయపాలెం కు చెందిన మహ్మద్ పాషా, రజి యాలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పాషా సుతారీ మేస్త్రీ. ఈ కుటుంబం జిల్లా కేంద్రంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటోంది. రజియాకు హెచ్ఐవీ ఉన్నట్లు వరంగల్ ఎంజీ ఎం వైద్యులు నిర్ధారించారు. 15 రోజుల క్రితం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, హెచ్‌ఐవీతోపాటు టీబీ కూడా ఉందని చెప్పారు.. దీంతో ఆమెను హన్మకొండ భీమారంలో టీబీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వారు పట్టించుకోలేదు. దీంతో ఆ కుటుంబం అద్దె ఇంటికి తిరిగి వచ్చింది. అయితే, అద్దె ఇంటి యజమాని రజియా వ్యాధిగురించి తెలిసి ఇంటికి రానివ్వలేదు. ఈ క్రమంలో మంగళవారం మళ్లీ మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు అడ్మిట్ చేసుకోమని చెప్పారు. స్వగ్రామంలోని సోదరుడి ఇంటికి వెళ్లినా.. ఆశ్రయం లభించలేదు. తిరిగి మహబూబాబాద్‌కు వచ్చిన పాషా పట్టణ శివారులో రోడ్డు పక్కన రజియాను పడుకోబెట్టాడు. రాత్రంతా తన పిల్లలతో జాగరణ చేశాడు. దీంతో స్థానికులు 108 సమాచారం అందించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రజి యాను అడ్మిట్ చేసుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనిని వచ్చి వివరాలు సేకరించారు. -
పొద్దుపొద్దున్నే పరగడుపున వద్దువద్దండీ!
థీమ్.. త న న ఇవి తినండి, అవి తినకండి అని డాక్టర్లు సలహాలు ఇస్తుంటారు. అవన్నీ గుర్తుంచుకుని పాటించడం కాస్త కష్టమే. అయినా అన్నీ బుర్రతోనే గుర్తుపెట్టుకోవాలనేముందీ? ఈ పది పదార్థాలనీ కళ్లతో స్కాన్ చేసేయండి. పరగడుపునే తినడం మానేయండి. తింటే ఏమవుతుందో కూడా తెలుసుకోండి. ఇవీ డాక్టర్లు చెప్పినవే. సందేహించకుండా ఫాలో అవండి. స్వీట్లు ఉదయాన్నే చిన్న చాక్లెట్ నోట్లో వేసుకుంటే బుర్ర ఫ్రెష్‌గా ఉంటుందని వైద్యంలో ఓ థియరీ! దాన్నొదిలేయండి. ఉదయాన్నే కడుపులోకి తీపి పదార్థాలు వెళ్తే ఒంట్లో ఇన్సులిన్ లెవల్స్ ఎక్కువౌతాయి. దీనర్థం ఏమిటంటే.. షుగర్‌ను కంట్రోల్ చేసే హార్మోన్ అయిన ఇన్సులిన్... పరగడుపునే వచ్చి పడిన స్వీట్‌ని కంట్రోల్ చెయ్యడానికి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే పాంక్రియాస్ గ్రంథి మీద లోడ్ ఎక్కువౌతుంది. ఇలా లోడ్ పెరుగుతూ పోతుంటే డయాబెటిస్ వచ్చేస్తుంది! పేస్త్రీలు, పఫ్ పేస్త్రీలు ఉదయాన్నే ఇవి ఎవరు తింటారండీ బాబూ అని మీరు అనుకోవచ్చు. రాత్రి తిన్నవి తినగా మిగిలిపోతే.. ఎవరో ఎందుకు మీరే తింటారు తెలుసా! సరే, తిన్నాక ఏం జరుగుతుంది? కడుపులోపలి మృదువైన పొర ల్లో మంట రేగుతుంది. గ్యాస్ ఫామ్ అవుతుంది. కడుపుబ్బరం వచ్చేస్తుంది. త్రేన్పులు వస్తాయి. ఉదయాన్నే వీటిని అలవాటుగా తినేవారికి అనతికాలంలోనే కడుపులో ఐపీఎల్ (మ్యాచ్ అన్నమాట) స్టార్ట్ అవుతుంది. పెరుగు, పులియబెట్టిన పాల పదార్థాలు పరగడుపునే పెరుగు తినేస్తే కడుపులో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ల మోతాదులు ఎక్కువౌతాయి. ఈ ఆసిడ్లు ఏం చేస్తాయంటే.. మనకు మేలు చేసే లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియాను చంపేస్తాయి. ఆ కారణంగా తిన్నదేదీ ఒంటికి పట్టదు. అంటే.. పోషకాలను లోనికి లాక్కునే శక్తిని మన బాడీ కోల్పోతుంది. పెరుగు ఒక్కటే కాదు. పాలతో చేసినవి ఏవి తిన్నా ఇంతే. దోసకాయలు, పచ్చని కాయగూరలు దోసకాయలు, ఇతర కాయగూరలు పచ్చివి తింటే ఆరోగ్యం అని మీరు వినే ఉంటారు. కానీ... ఖాళీ కడుపుతో తింటే.. ఈ మంచివి కూడా చెడ్డవి అయిపోతాయి! కడుపులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కడుపు నొప్పి, ఛాతీనొప్పి కూడా వస్తాయి. పియర్స్ (బేరీ పండ్లు) ఇప్పుడివి మార్కెట్లో బాగా కనిపిస్తున్నాయి. సేమ్ ఇవే కాకున్నా, ఈ జాతి పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. చూడగానే ఆకర్షించడం ఈ పండ్ల ప్రత్యేకత. ఉదయాన్నే మాత్రం మీరు వీటి ఆకర్షణకు లోను కాకండి. బేరీ çపండ్లలోని ముతగ్గా (రఫ్‌గా) ఉండే పీచుపదార్థం మీ ఖాళీ కడుపులోని మృదువైన ‘మ్యూకస్ మెంబ్రేన్’ (సున్నితమైన కణజాలం)ని గిన్నెల్ని తోమినట్టు తోమేస్తుంది. ఫలితం.. కడుపులో ట్వంటీ ట్వంటీ. (ఇదీ మ్యాచే). పుల్లని పండ్లు నారింజ, ఇతర పుల్లని పండ్లలో టన్నులకొద్దీ ఆసిడ్లు ఉంటాయి. వాటిని సాధారణ పరిభాషలో ఫ్రూట్ ఆసిడ్స్ అంటారు. పరగడుపునే వీటిని తినడం అస్సలు మంచిది కాదు. గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్లు, హార్ట్ బర్న్.. ఇదిగో ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. శీతలపానీయాలు అంటే.. కూల్ డ్రింక్స్. వీటిల్లో టేస్ట్ కోసం కొద్దిగానైనా కార్బన్‌డైఆక్సైడ్‌ని చొప్పిస్తారు. అందుకే వీటిని కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటారు. అందరికీ తెలిసిన పేరు ‘సాఫ్ట్ డ్రింక్స్’. ఉదయాన్నే ఖాళీ కడుపుతో సాఫ్ట్ డ్రింక్ తాగితే కడుపు హార్డ్ అయిపోతుంది. బిగుసుకుపోతుందని కాదు. కడుపు మన మాట వినదని. మరి వీటిల్లోని కెఫీన్ రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆక్చువల్లీ కెఫిన్ ఇంకో పని కూడా చేస్తుంది. పేగుల లోపలి కణజాలాన్ని దెబ్బతీస్తుంది. దాంతో కడుపు కండరాలకు రక్తం సరఫరా మందగించి జీర్ణక్రియల శక్తి సన్నగిల్లుతుంది. ఏదైనా జీర్ణం కాకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా! త్రేప్పులు, గుండె మంట వగైరా. టమాటాలు టమాటా జ్యూస్ ఆకలిని రేకెత్తిస్తుందని అంటారు. నిజమే. స్టార్టర్‌గా కొన్నిచోట్ల భోజనానికి ముందు టమాటా సూప్ ఇస్తారు. అయితే చేదునిజం ఏమిటంటే.. ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్‌ను తీసుకుంటే టమాటాల్లోని ట్యానిక్ ఆసిడ్లు అసిడిటీని పెంచి, పేగులు పుండ్లు పడేలా చేస్తాయి. అరటిపండ్లు ఒంట్లో మెగ్నీషియం ఎక్కువైతే గుండెకు హాని కలుగుతుంది. అరటిపండ్లలోని ఒక చెడ్డ గుణం ఏమిటంటే... అవి ఒంట్లోని మెగ్నీషియం మోతాదులను సర్రున పెంచేస్తాయి. వట్టప్పుడు తింటే ఏం కాదు కానీ, పరగడుపున అరటిపండ్లను తింటే మాత్రం మన లోపలి మెగ్నీషియంకు ఇక అడ్డూఆపూ లేకుండా పోతుంది. మసాలాలు అసలు విలన్ దగ్గరికి వచ్చేశాం. మసాలాలు అంటే.. స్పైసీ ఫుడ్. ఉదయాన్నే బ్రెష్ చేసుకున్న వెంటనే ఆకలిగా ఉందని చెప్పి.. ‘అమ్మడు.. కుమ్ముడు’ టైప్‌లో స్పైసీ ఫుడ్డుని లాగిస్తే గొంతు నుంచి కడుపు వరకు ‘పిచ్’ రెడీ అయిపోతుంది. నానా రకాల గ్యాస్‌లు జట్లుగా విడిపోయి ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్, బౌలింగ్ చేసేస్తుంటాయి. -
మానవ మృగం
బాలికలపై తండ్రికాని తండ్రి అఘాయిత్యం తాజాగా వెలుగులోకి వచ్చిన దారుణం భయంతో వణికిపోతున్న బాధితులు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వైద్యపరీక్షలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అతడో మానవ మృగం... తండ్రిలా నటించే మేకవన్నె పులి. పగలు ప్రేమ ఒలకబోస్తూ అదును కోసం ఆరాటపడే పచ్చి దుర్మార్గుడు. కూతురు వరుసైన ఆడపిల్లలపై విరుచుకు పడి కోర్కెలు తీర్చుకున్న కీచకుడు. వావి వరుసలు విస్మరించి సభ్య సమాజం తలదించుకునేలా అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రి కాని తండ్రి వికృత చేష్టలివి. జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పలేక భయంతో బిక్కుబిక్కుమంటోన్న బాలికలు రెండ్రోజుల కిందటే ధైర్యాన్ని కూడదీసుకుని అసలు సంగతి బయట పెట్టారు. దీంతో బిడ్డలతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఎక్కడో జరిగిన దారుణం కాదిది. తిరుపతి శివారు ప్రాంతంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతి : తమిళనాడుకు చెందిన లక్ష్మి అనే మహిళ పదిహేనేళ్ల కిందట భర్తతో కలిసి తిరుపతి చేరుకుంది. ఈ దంపతులకు అప్పటికే ముగ్గురు సంతానం. పదేళ్ల కిందట గుండె జబ్బుతో భర్త కన్నుమూశాడు. దీంతో కుటుంబం ఆలనా పాలనా కష్టమైంది. ఆడపిల్లలను పెంచడం పూర్తిగా భారమైంది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన వంశీ అనే వ్యక్తితో పరిచయమైంది. పరిచయం కాస్తా చనువుగా మారడంతో ఇద్దరూ కలిసి ఏడేళ్ల నుంచి సహజీవనం సాగిస్తున్నారు. వీరికిద్దరు పిల్లలు. అయితే అడ్డమైన ఆలోచనలు కలిగిన వంశీ చూపులు మొదటి భర్తకు పుట్టిన ఆడపిల్లలపై పడింది. ఇటీవల తల్లి ఊరెళ్లిన సమయంలో పెద్దమ్మాయి(13)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడు రోజుల పాటు మృగాడు కీచకుడిగా మారాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల అనంతరం చిన్నమ్మాయి పైనా ఇదేవిధంగా పైశాచికం ప్రదర్శించాడు. దీంతో తండ్రి కాని తండ్రి కనిపిస్తే ఆడపిల్లలు చిగురుటాకులా వణికిపోవడం మొదలైంది. ఇదేమీ తెలియని తల్లి ఈ మధ్య పిల్లలందరినీ వెంటబెట్టుకుని చంద్రగిరి మండలంలోని తన సొంతూరు వెళ్లింది. రెండు రోజుల తరువాత తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో ఆడపిల్లలు మొండికేశారు. తిరుపతి రామని తేల్చి చెప్పారు. ఎందుకు రారని తల్లి నిలదీస్తే అసలు విషయాన్ని బయట పెట్టారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి పిల్ల లను వెంటబెట్టుకుని మంగళవారం సాయంత్రం ఎమ్మార్‌పల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వంశీపై కేసు నమోదు చేసి వైద్య పరీక్షల కోసం బాలికలను ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలికలకు వైద్యం అందుతోంది. వైద్యులిచ్చే రిపోర్టుల ఆధారంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాణం మీదికి తెచ్చిన పెద్దనోట్ల రద్దు
- క్యూలో నిలబడి స్పృహ తప్పి కింద పడడంతో గాయాలు - ఆస్పత్రికి తరలిస్తుండగా రైతు కొమురయ్య మృతి సుల్తానాబాద్ రూరల్: పెద్దనోట్ల రద్దు వ్యవహారం ఒక రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. పత్తి విక్రయించగా వచ్చిన డబ్బుల కోసం క్యూలో నిలబడి స్పృహ కోల్పోయి గాయాలపాలై మృతిచెందిన సంఘటన విషాదాన్ని నింపింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచిరామి గ్రామానికి చెందిన రైతు గోపిరెడ్డి కొమురయ్య(67) పత్తి విక్రయించగా.. రూ. 15 వేలు వచ్చాయి. ఈ డబ్బులకు వ్యాపారి చెక్కు ఇచ్చాడు. దాన్ని నుకుల ఎస్బీహెచ్ బ్యాంకులో సోమవారం జమ చేసిన కొమురయ్య రూ.4 వేలు డ్రా చేశాడు. మిగిలిన డబ్బుల కోసం బుధవారం ఉదయం బ్యాంకుకు వెళ్లి క్యూ కట్టాడు. బారులు తీరి ఉన్న క్రమంలో స్పృహ తప్పి పడి పోయాడు. దీంతో తలకు గాయంకాగా అక్కడున్న వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో మనుమడు అనిల్ అతడిని కాట్నపల్లిలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేసే కొమురయ్య కుమారుడు భూమేశ్ వద్దకు ఆటోలో తీసుకువెళ్లాడు. ప్రాథమిక వైద్యం నిర్వహించిన అనంతరం భూమేశ్ 108 వాహనం కోసం ప్రయత్నించాడు. అక్కడికి వాహనం రాకపోవ డంతో తన కారులో కరీంనగర్ సమీపంలోని చల్మెడ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆస్ప త్రికి చేరేలోగానే కొము రయ్య మరణించాడు. ఆయన మృతదేహాన్ని సుల్తానా బాద్‌లోని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. రైతు లైన్లో నిలబడి కిందపడి గాయాలై మృతి చెందినట్లు కేసు నమోదు చేసినట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. తలకు గాయం కావడం తో తలలో రక్తం సరఫరా నిలిచి పోయి ప్రాణాలకు ముప్పు వచ్చిందని తెలిపారు. -
పెద్ద నోట్లు చెల్లక.. వైద్యం అందక..
యాదాద్రి భువ నగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం గౌరా యపల్లికి చెందిన సూరారాం చంద్రం (55) కొద్దిరో జులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతు న్నాడు. చేతిలో పెద్ద నోట్లు న్నారుు. ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళితే చిల్లర కావాలన్నారు. మరో ఆస్పత్రికి వెళ్లినా ఇదే పరిస్థితి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు సరిగా పట్టించుకోకపోవడంతో సరైన వైద్యం అందలేదు. ఇంటికి తిరిగివచ్చిన రాంచంద్రం గురువారం ఉదయం తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించాడు. పెద్ద నోట్లు చెల్లక సకాలంలో వైద్యం అందక తన భర్త మరణించాడని రాంచంద్రం భార్య ఎల్లమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. -
ప్రాణం తీసిన పెద్ద నోట్లు
రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి సాక్షి, నెట్వర్క్: పెద్ద నోట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారుు. నోట్ల మార్పిడికి వెళ్లిన ముగ్గురు వేర్వేరు ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయారు. వైద్యానికి డబ్బుల్లేక..: వైద్యం చేరుుంచుకునేందుకు డబ్బులందక గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రుకు చెందిన గొట్టిపాటి ప్రసాద్(35) మృతి చెందాడు.ప్రసాద్‌కు జ్వరం,పచ్చకామెర్లు వచ్చారుు. చికిత్స కోసం గుంటూరు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.ప్రసాద్ తల్లిదండ్రులు అకౌంట్లో ఉన్న డబ్బులు తెచ్చుకునేందుకు బ్యాంకు, ఏటీఎంల చుట్టూతిరిగా రు.ప్రయోజనం లేకపోవడంతో డబ్బులు తర్వాత ఇస్తామని ప్రాధేయపడటంతో వైద్యులు సమ్మతించి, స్కానింగ్ చేరుుంచమని సూచించారు. దీనికి ఇబ్బందులు ఏర్పడి చివరకు వైద్యం అందక ప్రసాద్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. రుణం చెల్లించడానికి వెళ్లి..: చిత్తూరులోని కాజూరు కాలనీకు చెందిన రత్నం పిళ్లై (72) గతేడాది శేషాపిరాన్వీధిలోని ఇండియన్ బ్యాంకులో బంగారు నగలు కుదవపెట్టి రుణం తీసుకున్నాడు. ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేయడంతో పిళ్లై తన వద్ద ఉన్న రూ.500 నోట్లతో రుణం చెల్లించేందుకని కుమారుడు ప్రసాద్‌తో కలసి బుధవారం ఉదయం బ్యాంకుకు వెళ్లాడు. పిళ్లై క్యూ లైన్లో ఉండగా, రుణం విషయం మాట్లాడ టానికి ప్రసాద్ బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లాడు. అయితే అరగంటకు పైగా క్యూలైన్లో నిలబడ్డ పిళ్లై కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో ఆయన తలకు దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. కొడుకు తండ్రిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో వృద్ధురాలి మృతి కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామానికి చెందిన కనకమేడల విజయలక్ష్మి(71) బుధవారం నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందింది. విజయలక్ష్మి తన వద్ద ఉన్న రెండు రూ.500 నోట్లు మార్చుకునేందుకు మేనకోడలు కస్తూరితో ఉయ్యూరులోని ఎస్బీఐ బ్రాంచ్ వద్దకు వచ్చింది. ఆటో దిగి బ్యాంకు లోపలకు వెళ్తున్న క్రమంలో గుండెపోటు వచ్చి కుప్పకూలింది. -
కోఠీ ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమి
- హైకోర్టుకు అడ్వొకేట్ కమిషన్ నివేదిక - కానరాని వెంటిలేటర్లు.. అధ్వానంగా అంబులెన్సలు - ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని - సర్కారుకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని కోఠీ ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమితో వైద్యం కోసం వచ్చినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు నియమించిన అడ్వొకేట్ కమి షన్ ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. ఆస్ప త్రిలో వెంటిలేటర్ సౌకర్యంలేదని, అవసరం వచ్చినప్పుడు రోగులను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పంపుతున్నారని కమిషన్ తెలి పింది. ఆస్పత్రిలో అపరిశుభ్రత తాండవిస్తోం దని వివ రించింది. రోగులకు సరిపడా సిబ్బంది లేరని, ఉన్న 2 అంబులెన్సలు అధ్వాన స్థితిలో ఉన్నాయని, ఖాళీల భర్తీకి సర్కారు చర్యలు తీసుకోవడంలేదని కోర్టు దృష్టికి తెచ్చింది. నివేదికను పరిశీలించిన హైకోర్టు...ఇందులో లేవనెత్తిన లోటుపాట్లపై ఏం చర్యలు తీసుకుం టున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. విచారణను ఈ నెల 15కు వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూతి ఆస్పత్రిలో సౌకర్యాల్లేక చెట్ల కింద గర్భిణులు పడుతున్న ఇబ్బందులపై పత్రికల్లో కథనాలు వచ్చారుు. ఈ కథనాలపై స్పందించిన హైకోర్టు వాటిని సుమోటోగా పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని మహిళా న్యాయ వాదులు పద్మజ, జయంతి లతో అడ్వొకేట్ కమిషన్‌ను నియమించింది. ఆస్పత్రిని సందర్శించి అక్కడి లోటుపాట్లపై హైకోర్టుకు వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. ఆస్పత్రిలో రక్త నమూనాల కోసం నిరీక్షించాల్సి వస్తోందని పద్మజ తన నివేదికలో పేర్కొన్నారు. వార్డులు అపరిశుభ్రంగా ఉన్నాయని, రోజుకు 40-50 వరకు ప్రసవాలు చేయాల్సి వస్తున్నందున శుభ్రం చేసే సమయం సిబ్బందికి దొరకడం లేదని తెలిపారు. పోస్టులు 154 మంజూరు కాగా, 109 భర్తీ అయ్యాయన్నారు. -
విద్య, వైద్యరంగాలపై పోరుబాట
టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రైతుదీక్ష విజయవంతమైన స్ఫూర్తితో విద్య, వైద్యం, యువతకు ఉపాధికల్పన అంశాలపై పోరాడాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా వైద్యరంగంపై నవంబర్ 13న సదస్సును నిర్వహించాలని, నవంబర్ చివరివారంలోనే విద్యా పరిరక్షణ యాత్రను నిర్వహించాలని, దీనిద్వారా విద్యారంగ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. రైతుదీక్షపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ, జేఏసీ నిర్మాణం, వివిధ రంగాల్లో పరిస్థితులపై అధ్యయనం వంటి అంశాలపై కీలక నిర్ణయాలను సమావేశంలో తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో జేఏసీ కమిటీని పునర్వ్యవస్థీకరించడంతో పాటు జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిదాకా నిర్మాణాన్ని నవంబర్‌లోగానే పూర్తిచేసుకోవాలని తీర్మానించారు. ప్రైవేటు పరిశ్రమల్లోనూ 85 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని కోరుతూ డిసెంబర్లో పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. -
హే గాంధీ!
సాక్షి, సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట్: గాంధీ జనరల్ ఆస్పత్రికి సుస్తీ చేసింది. నయం చేయాల్సిన ప్రభుత్వం తమకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో అత్యవసర విభాగానికి చేరుకున్నా... సకాలంలో వైద్యం అందక ... వ్యాధి నిర్ధారణ యంత్రాలు పని చేయక... ఎంతో మంది క్షతగాత్రులు మృత్యువాత పడుతున్నారు. 1255 పడకల సామ«ర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ఔట్ పేషెంట్ విభాగానికి నిత్యం 2500–3000 మంది వస్తుండగా.. ఇన్‌పేషెంట్ విభాగంలో 1500 మందికిపైగా చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజుకు సగటున 200 మంది వస్తే... వీరిలో 80 శాతం రక్తమోడుతున్న వారే. వీరిలో చాలా మందికి సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. నిపుణులు అందుబాటులో లేక కొంతమంది... సీటీ, ఎంఆర్ఐ వంటి సేవలు అందక మరికొంతమంది చనిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పని చేయని సీటీస్కాన్ ఆస్పత్రిలోని సీటీస్కాన్ యంత్రం ఐదు రోజులుగా పని చేయడం లేదు. దీనికి మరమ్మతులు చేయాలంటే జర్మనీ నుంచి ప్రత్యేక నిపుణులు రావాల్సిందే. సకాలంలో నిర్వహణ ఖర్చులు చెల్లించక పోవడంతో సదరు సంస్థ ప్రతినిధులు మరమ్మతులకు ముందుకు రావడం లేదు. దీంతో రోగులను వైద్యులు ఉస్మానియాకు సిఫారసు చేస్తున్నారు. తీరా అక్కడి సీటీస్కాన్‌కు 15 రోజులు... ఎంఆర్ఐకి రెండు నుంచి మూడు నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇలా గాంధీలోనే ప్రస్తుతం 400 మందికిపైగా ఎంఆర్ఐ కోసం ఎదురు చూస్తున్నారు. -
పేదలకు ప్రాణదాత
ఆదర్శం ‘‘మమ్మీ..! కాకాను చూస్తే ఏడుపొస్తోంది.. మనం ఏ హెల్ప్ చేయలేమా? అందరూ కాకాకు క్యాన్సర్ వచ్చిందని, ఇక ఆయన ఎక్కువ కాలం బతకలేడని అంటున్నారు. మరి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే కాకా బతుకుతాడు కదా మమ్మీ’’ అన్నాడు ఓ ఎనిమిదేళ్ల బాలుడు. ‘‘మన దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి కన్నా. మీ నాన్న సంపాదన అంతంత మాత్రమే కదా. అయినా డబ్బున్న వాళ్లకే ఆస్పత్రులన్నీ. మనలాంటి పేదవాళ్లకు రోగాలొస్తే చావాల్సిందే. డాక్టర్లు డబ్బులు లేకుండా వైద్యం చేయరు’’ అన్నది ఆ తల్లి కొడుకు తలపై నిమురుతూ. అప్పుడు ఆ బాలుడి నోట ఓ మాట వచ్చింది... ‘‘నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతా మమ్మీ.. పేదలందరికీ ఫ్రీగా వైద్యం చేస్తా’’ అని. 2011 మే 1న స్వప్నిల్ మాణే అనే యువ డాక్టర్ ఆంకాలజీ సర్జన్‌గా సమాజానికి పరిచయమయ్యారు. ఈ స్వప్నిల్ మాణేనే ఆ ఎనిమిదేళ్ల బాలుడు. మెరిసేదంతా బంగారం కాదన్నట్లు... డాక్టర్లందరూ సంపన్నులు కాదు కదా. అలాగే ఈ స్వప్నిల్ కూడా ధనవంతుడేమీ కాదు. దాంతో ముంబైలో తాను చదువుకున్న కాలేజీ ‘టాటా మెమోరియల్ హాస్పిటల్’లోనే ఉద్యోగంలో చేరారు. జీవితం బాగానే సాగుతోంది.. కానీ మనసులో మాత్రం ఏదో వెలితి. అదే పేదలకు ఉచితంగా వైద్యం అందడం లేదని. రోజులు ఏదోలా గడుస్తున్నాయి కానీ మనసు మాత్రం ఆనందంగా లేదు. ఓ రోజు హాస్పిటల్ లాబీలో కూర్చున్న పేషెంట్‌ను ‘ఏంటి మీ సమస్య. ఎందుకలా బాధగా ఉన్నారు?’ అని అడిగారు డాక్టర్ స్వప్నిల్. దానికి సమాధానంగా ఆ పేషెంట్ ‘‘నేనో క్యాన్సర్ పేషెంట్‌ని. వెంట తెచ్చుకున్న డబ్బులన్నీ ముంబైకి రావడానికే సరిపోయాయి. ఇప్పుడిక్కడ వైద్యం చేయించుకుంటే... హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలి? తిరిగి ఊరికెలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నా’’ అని చెప్పాడు. ఆ మాటతో స్వప్నిల్ మనసు చలించిపోయింది. అప్పుడు ఆ పేషెంట్ ట్రీట్మెంట్కు ఓ ఎన్జీఓ తరఫు నుంచి స్పాన్సర్షిప్ ఇప్పించి, వైద్యం చేయించారు. అతను పూర్తిగా కోలుకున్నాక ఊరెళ్లడానికి డబ్బులు ఇచ్చి పంపారు. అదే రోజు స్వప్నిల్ ఒక నిర్ణయానికొచ్చారు. ఇకపై తన ప్రాక్టీసంతా మారుమూల పల్లెల్లోనే... అని నిశ్చయించుకొని ప్రశాంతంగా నిద్ర పోయారు. అనుకున్నదే తడవుగా పుణే సమీపంలోని రాహురీ గ్రామంలో హెల్త్‌క్యాంప్ మొదలుపెట్టారు. ఆ గ్రామస్తులంతా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారే. ఆ ఊళ్లో ఎవరికైనా క్యాన్సర్ వస్తే... హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకునే స్థోమత లేదని గ్రహించారు స్వప్నిల్‌తో పాటు ఆయన భార్య డాక్టర్ సోనాలీ మాణే. దాంతో మిగతా డాక్టర్ల కంటే చాలా తక్కువ డబ్బు తీసుకొని వైద్యం చేయడం ప్రారంభించారు. అలా నెమ్మదిగా ఓ బిల్డింగ్‌ను అద్దెకు తీసుకొని, ‘డాక్టర్ మాణే మెడికల్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్’ను స్థాపించారు. ఎంతోమంది పేషెంట్స్ ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో తమ వ్యాధుల నుంచి బయటపడి హాయిగా జీవిస్తున్నారు. షిర్డీకి 40 కిమీల దూరంలో ఉన్న ఈ ముఫ్పై పడకల చారిటబుల్ హాస్పిటల్ ఇప్పటి వరకు మొత్తం 349 క్యాన్సర్ సర్జరీలను ఉచితంగా చేసింది. ఇంకా దాదాపు 60 మంది ఆపరేషన్‌కు రెడీగా ఉన్నారు. అలాగే స్వప్నిల్ టీమ్ మారుమూల గ్రామాల్లో 47 క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపులు నిర్వహించింది. ఈ క్యాంపుల ద్వారా క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నవారిని గుర్తించి, వారిని క్యాన్సర్ నుంచి బయటపడేసింది. అంతేకాదు, క్యాన్సర్ పేషెంట్స్ శారీరకంగా కంటే మానసికంగా బాగా కుంగిపోతుంటారు. అందుకే ఈ హాస్పిటల్‌కు వచ్చిన పేషెంట్లకు ఫ్రీగా మెడిటేషన్ క్లాసులు చెప్పిస్తుంటారు. అలా వారికి మానసిక ప్రశాంతత, ఆత్మస్థైర్యం పెంపొందించేలా చేస్తారు. ‘‘మా టీమ్‌లో మొత్తం 13మంది డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు. అందరూ సేవా దృక్పథంతో పనిచేసేవారే. ఇప్పటి వరకు మేము మహారాష్ట్రలో 52 గ్రామాల్లో ఫ్రీ క్యాన్సర్ చెకప్, అలాగే మందుల పంపిణీ క్యాంపులు నిర్వహించాం. మనదేశంలో ఏడాదికి 50వేల మంది మహిళలు సెర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్)తో మరణిస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. అందుకే మా టీమ్ మైస్గావ్, తహారాబాద్ అనే రెండు మారుమూల గ్రామాలను దత్తత తీసుకుంది. అక్కడ 550 మంది పేషెంట్లకు ఫ్రీగా సెర్వికల్ క్యాన్సర్ ఆపరేషన్ చేశాం. అలాగే 106 క్యాన్సర్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. కేవలం రెండేళ్లలో అక్కడ సెర్వికల్ క్యాన్సర్ అన్న మాటే లేకుండా చేశాం. వ్యాధి ముదరక ముందే, దాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే... ప్రస్తుతం క్యాన్సర్ పెద్ద జబ్బే కాదు’’ అని ఆనందంగా చెప్పారు స్వప్నిల్. ఇలాంటి మానవతామూర్తులు ప్రతి చోటా ఉంటే... పేదరికంలో మగ్గుతున్న వ్యాధిగ్రస్తులు మరణశయ్య ఎక్కవలసిన అవసరం ఉండదు. వారి ఆనందమే మాకు చాలు... చారిటబుల్ హాస్పిటల్ గురించి స్వప్నిల్ చెప్పినప్పుడు సంతోషించాను. ఆయనెప్పుడూ పేద రోగుల గురించే ఆలోచించే వారు. కేవలం డబ్బు లేదనే కారణంగా ఎంతోమంది చనిపోతున్నారని బాధపడేవారు. ఆయన వల్లే నేనూ ఈ పుణ్యకార్యంలో చేయి కలిపాను. అద్దె బిల్డింగ్‌తో కష్టమవుతోందని, ‘సాయిధామ్’ పేరుతో సొంత చారిటబుల్ హాస్పిటల్‌ను ప్రారంభించాం. పేషెంట్లు కోలుకున్నాక, వారి కళ్లలో కనిపించే ఆనందాన్నే మా సంపదగా భావిస్తాం. -
అంతా మా ఇష్టం..
♦ డాక్టర్లకు మనసుంటే వైద్యం.. లేదంటే రెఫర్ ♦ సాధారణ కేసులూ వికారాబాద్, హైదరాబాద్‌కు ♦ నగరానికి పంపిన 10 నిమిషాలకే అంబులెన్స్‌లో కాన్పు.. తల్లీ బిడ్డా క్షేమం ♦ ఇక్కడ కాన్పు కష్టమంటూ వికారాబాద్‌కు పంపించిన వైద్యులు ♦ సిటీకి తీసుకు వెళుతుండగా మార్గమధ్యలోనే కాన్పు ♦ ఇంత పెద్ద క్లస్టర్ ఆస్పత్రిలో నీడిల్స్ లేని వైనం.. పరిగి: మాకు ఇష్టమైతే వైద్యం చేస్తాం.. లేదంటే రెఫర్ చేస్తాం.. రోగి సీరియస్ కండిషన్లో.. ఉందా..? లేదా..?? అనే దాంతో సంబంధం లేదు.. ఇది పరిగి ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల పని తీరు.. పరిగి సీహెచ్ఎన్సీ (కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ క్లస్టర్) ఆస్పత్రిలో శనివారం ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. పరిగి మండలంలోని రూప్ఖాన్పేట్కు చెందిన కల్పన (21) గర్భవతి.. ఆమెకు నొప్పులు రావటంతో శనివారం ఉదయం భర్త రఘు ఇతర కుటుంబసభ్యులు ఆమెను కాన్పు కోసం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొద్దిసేపటికి ఆమెను పరీక్షించిన డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఇక్కడ కాన్పు కావడం కష్టంగా ఉందన్నారు. వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుటుంబసభ్యులకు సూచించారు. వెంటనే వికారాబాద్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. పరిగి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ ఆస్పత్రికి కుటుంబసభ్యులు ఆ గ్రామ ఆశ వర్కర్ కలిసి పరిగి ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్‌లో తీసుకువెళ్లారు. అయితే పరిగి నుంచి బయలు దేరి 10 నిమిషాలు కాగానే.. వికారాబాద్ చేరుకోకుండానే మార్గమధ్యలో అంబులెన్స్‌లోనే సాధారణ కాన్పు అయింది. కల్పన మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. పరిస్థితి బాగా లేదు.. ఇక్కడ కాన్పు కష్టం అని వైద్యురాలు రెఫర్ చేయగా 10 నిమిషాల్లోనే తీసుకువెళుతున్న అంబులెన్స్‌లో కాన్పు కావటంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్పు చేయడం తప్పించుకోవడానికే రెఫర్ చేశారని వారు ఆరోపించారు. ఓ పక్క ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పీహెచ్‌సీల్లో సైతం కాన్పులు చేయాలని చెబుతుంటే.. నియోజకవర్గస్థాయి ఆస్పత్రుల్లో సైతం ఇలా చేతులకు పనిలేకుండా రెఫర్ మంత్రం పఠిస్తున్నారు. ఆస్పత్రిలో నీడిల్స్ కూడా లేవట.. మరో పక్క ప్రతీ చిన్న విషయానికి చిన్న చిన్న ముందులు కూడా బయటి నుంచి తీసుకురావాలని చెప్పడం పరిగి ఆస్పత్రిలో సర్వసాధారణమైంది. కనీసం నీడిల్స్ కూడా పరిగి క్లస్టర్ ఆస్పత్రిలో లేవట.. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి పరిగి ఆస్పత్రిని సందర్శించిన సమయంలో మందులు బయటకు రాసే విషయమై కొందరు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో స్థానికులు పెద్ద గొడవ చేశారు. ఆ సమయంలో అవసరమైతే ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుంచి కొనుగోలు చేయాలని, బయటకు రాయొద్దని ఖరాకండిగా చెప్పారు. కంగా సంబంధిత శాఖ మంత్రి చెప్పి వారం తిరక్కుండానే మళ్లీ కథ మొదటికి వచ్చింది. మందు బిళ్లలు, నీడిల్స్ బయటినుంచి తీసుకురావాలని రాస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఉన్న చిన్నచిన్న దుకాణాల్లో కూడా నీడిల్స్ విక్రయిస్తున్నారు. -
కన్నపేగు కాటేసింది
- అనారోగ్యంతో ఉన్న తండ్రిని చంపిన తనయుడు - చికిత్స పేరిట అడవిలోకి తీసుకెళ్లి.. తల పగులగొట్టి ఉరి - 4 రోజుల తర్వాత వెలుగులోకి జిన్నారం/హత్నూర: అనారోగ్యంతో ఉన్న తండ్రికి వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుందని భావించి ఓ కుమారుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. వైద్యం పేరిట అడవిలోకి తీసుకెళ్లి తల పగులగొట్టి.. ఆపై ఉరివేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా హత్నూర మండలం లింగాపూర్‌లో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పూల పోచయ్య(70)కు కుమారుడు భిక్షపతి, కుమార్తె దుర్గమ్మ ఉన్నారు. అతని భార్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. కొడుకు, కోడలు, ఇద్దరు మనుమలతో కలసి పోచయ్య గ్రామంలోనే ఉంటున్నాడు. పోచయ్యను భిక్షపతి భారంగా భావించి తరచూ ఘర్షణకు దిగేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన పోచయ్య అనారోగ్యానికి గురయ్యాడు. కళ్లు సరిగా కనబడకపోవడంతోపాటు 4 రోజులుగా వాంతులు, విరేచనాలు చేసుకుంటున్నాడు. తీవ్ర అసహనానికి గురైన భిక్షపతి.. హైదరాబాద్‌లో వైద్యం చేయిస్తానని నమ్మబలికి స్నేహితుడు అంజాగౌడ్తో కలసి తండ్రిని ఈ నెల 19న బయటకు తీసుకెళ్లాడు. నల్లవల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పోచయ్య తలపై రాయితో మోది, చెట్టుకు ఉరి వేసి వెళ్లిపోయారు. తండ్రి కనిపించకపోవడంతో దుర్గమ్మ ఆరా తీసింది. ఆస్పత్రిలో చూపించిన తర్వాత కనబడలేదని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని భిక్షపతి చెప్పాడు. రెండు రోజులవుతున్నా ఆచూకీ తెలియకపోవడంతో దుర్గమ్మ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టింది. వారు ఒత్తిడి చేయడంతో అసలు విషయాన్ని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కుళ్లిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నాడు. -
ఆటోడ్రైవర్లకు వైద్యం.. అందని వైనం!
సాక్షి, హైదరాబాద్: ఆటో డ్రైవర్లకు కేంద్ర కార్మికశాఖ ప్రకటించిన ఈఎస్ఐ వైద్య సౌకర్యానికి అతీగతీ లేదు. ఈ పథకం ప్రారంభించి ఐదునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. దీనిపై కేంద్ర కార్మికశాఖ నుంచి నోటిఫికేషన్ ఇంకా రాలేదని చెబుతూ అధికారులు మొహం చాటేస్తున్నారు. ఆటోడ్రైవర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు, ఇళ్లలో పనిచేసేవారు.. ఇలా అసంఘటిత రంగ కార్మికులందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఏడాదికాలంగా పదే పదే ప్రకటిస్తున్నారు. మొదటగా ఆటోడ్రైవర్లకు ఈఎస్ఐ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామంటూ ఈ ఏడాది జనవరి మొదటివారంలో హైదరాబాద్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. కొంతమందికి ఈఎస్ఐ కార్డులను కూడా పంపిణీ చేశారు. ఆటోడ్రైవర్లకు కల్పించిన ఈఎస్ఐ మెడికల్ స్కీం కింద కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని, అందుకోసం ఒక్కో ఆటోడ్రైవర్ తన వాటాగా ఆరు నెలలకోసారి రూ.1500 చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. ఈఎస్ఐ బ్రాంచ్‌లలో డబ్బులు చెల్లించి కార్డులు తీసుకోవాలని, ఈ కార్డు ద్వారా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అన్ని వైద్యసేవలతోపాటు మందులను కూడా ఉచితంగా పొందవచ్చని తెలిపింది. కానీ, ఇప్పటి వరకు ఆటోడ్రైవర్ల నుంచి ఒక్క దరఖాస్తును కూడా స్వీకరించలేదు. దీంతో హైదరాబాద్‌లోని దాదాపు 1.5 లక్షల మంది ఆటోడ్రైవర్లు ఈఎస్ఐ వైద్యసేవల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆటోడ్రైవర్లు నిత్యం ఈఎస్ఐ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిరాశగా వెనుదిరుగుతున్నారు. -
22 ఏళ్ల తర్వాత చూపొచ్చింది
హూస్టన్: 20 ఏళ్లుగా చూపులేకుండా అంధకారంలో మగ్గిన 70 ఏళ్ల మహిళ తన గదిలో జారి పడి, తలకు దెబ్బ తగిలి తిరిగి చూపు పొందింది. ఫ్లోరిడాకు చెందిన మేరీ ఆన్ ఫ్రాంకో 1993లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. వెన్నముకకు గాయమై క్రమంగా చూపు కోల్పోయింది. 22 ఏళ్ల తర్వాత.. గత ఆగస్టులో ఆన్ తన గదిలో తలుపు ైవె పు వెళ్తుండగా కాలు జారి కిందపడింది. తల.. నేలకు బలంగా తాకింది. అప్పటి నుంచి కొన్ని వారాల క్రితం ఆపరేషన్ జరిగే దాకా అచేతనంగా ఉంది. మెడకు శస్త్ర చికి త్స చేశారు. మత్తు నుంచి కోలుకున్న తరువాత తనకు చూపు తిరిగొచ్చిందన్న సంగతిని గుర్తించింది. ‘‘ ఆన్ విషయంలో జరిగింది అద్భుతం. దీన్ని శాస్త్రీయంగా వివరించలేక పోతున్నాం’ అని ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ జాన్ అఫ్సర్ అన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యం ..
► మహిళకు శాపం ► పురిటి నొప్పులతో ఉస్మానియాకు వచ్చిన గర్భిణి ► క్యాజువాలిటీలోనే కవల పిల్లలను ప్రసవించి మృతి చెందిన వుహిళ ► వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి భర్త ఆరోపణ ► తమ వద్దకు రాలేదంటూ ఆస్పత్రి వైద్యుల బుకాయింపు గన్‌ఫౌండ్రీ: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి ఉస్మానియా ఆస్పత్రికి చేరుకొని సకాలంలో వైద్యం అందక క్యాజువాలిటీలో కవలలకు జన్మనిచ్చి మృత్యుఒడికి చేరింది. దీంతో వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్స్‌లో ఆమెను నయాపూల్ ప్రసూతి ఆస్పత్రికి తరలించి చేతులు దులుపుకోవడమేగాక, ఆస్పత్రికి ఎవరూ ఆస్పత్రికి రాలేదని గోప్యంగా ఉంచేందుకు యత్నించిన సంఘటన గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లాకు చెందిన కమార్ భార్య అపర్ణ(25) గర్భవతి. వైద్యం కోసం దంపతులు గురువారం నగరానికి వచ్చారు. ఎంజీబీఎస్ సమీపంలోకి రాగానే అపర్ణకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త ఆటోలో ఎక్కి ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కోరాడు. దీంతో ఆటోవాలా సమీపంలోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. క్యాజువాలిటీలోకి వెళ్లగానే అపర్ణ పరిస్థితిని గమనించిన వైద్యులు వెంటనే నయాపూల్ ప్రసూతి ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అప్పటికే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో నయాపూల్ ప్రసూతి ఆస్పత్రికి వెళ్లేందుకు సాధ్యం కాకపోవడంతో ఆమె ఆస్పత్రి క్యాజువాలిటీ ఆవరణలోనే కవలలకు జన్మనిచ్చి తాను కన్నుమూసింది. దీంతో ఆస్పత్రి వైద్యులు అపర్ణతో పాటు కవల పిల్లలను అంబులెన్స్‌లో నయాపూల్ ప్రసూతి ఆస్పత్రికి పంపగా, అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతిచెందిందని ఆమె భర్త కుమార్ ఆరోపించారు. ఆస్పత్రి వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా నయాపూల్ ప్రసూతి ఆస్పత్రికి తరలించారని, ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఉస్మానియాలో ప్రసవం జరగలేదు: సీఎంవో డాక్టర్ శంకర్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పురిటి నొప్పులతో వచ్చిన ఓ గర్భిణి మరణించిందన్న విషయం పూర్తిగా అవాస్తవమని ఉస్మానియా ఆస్పత్రి సీఎంవో డాక్టర్ శంకర్ అన్నారు. ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగి పేరును రిజిస్ట్రార్‌లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. అపర్ణ అనే గర్భిణి కవలలకు జన్మనిచ్చి మరణించిందన్న వార్తలో నిజం లేదని, ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారన్నారు. -
మంత్రి బర్త్‌డేనా.. మజాకా!
ఆస్పత్రిలో బెడ్లు, మంచాలు బయట పడేసిన టీడీపీ శ్రేణులు రోగులకు సెలైన్లు కట్, ఆస్పత్రిలో ఆగిన ఓపీ సేవలు ప్రేక్షకపాత్ర వహించిన ఆస్పత్రి అధికారులు వైద్యం అందక రోగులకు ఇక్కట్లు ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందాన మంత్రిగారి బర్త్‌డే వేడుకలు రోగులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు ఆస్పత్రి ఆవరణమంతా ఫ్లెక్సీలతో నిండిపోవడంతో గందరగోళానికి గురయ్యారు. ఓపీ సేవలు నిలిపివేయడంతో చేసేదేమీలేక నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మరికొంతమంది వైద్యం కోసం మధ్యాహ్నం వరకూ ఆస్పత్రి ఆవరణలోని చెట్ల కింద పడిగాపులు కాశారు. శ్రీకాళహస్తి: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 68వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల నిర్వహణ కోసం ఆస్పత్రిలో ఓపీ సేవలు నిలిపివేశారు. రక్తపరీక్షలు, ల్యాబ్‌లు మూసివేశారు. గుండె, కిడ్నీలు తదితర వ్యాధులకు వూత్రమే పరీక్షలు చేస్తున్నారని, వైద్యం అందిస్తున్నారని తెలిసి రోగులు నిరాశకు గురయ్యారు. అపోలో వైద్య బృందంతో ఆస్పత్రి ఆవరణలో వైద్యశిబిరం నిర్వహించారు. శిబిరంలో గుండె, కిడ్నీలు తదితర వ్యాధులకు వూత్రమే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరం నిర్వహణకు ఆస్పత్రిలోని పరుపులు, వుంచాలు అడ్డంగా ఉంటాయుని టీడీపీ కార్యకర్తలు వాటిని బయుట పడేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ టీడీపీ కార్యకర్తలు హంగామా చేస్తున్నా ప్రేక్షకపాత్ర వహించారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు రోజూ ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచాలు లేకపోవడంతో రోగులకు సెలైన్ పెట్టేందుకు వీలులేకుండా పోయింది. ఓపీ సేవలు లేకపోవడంతో రోగులు వుధ్యాహ్నం 1.30 గంటల వరకు పడిగాపులు కాసి, వెనుదిరిగారు. సాధారణంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలనుకుంటే ఖాళీ స్థలంలో లేదా తమ వ్యక్తిగత భవనాల్లో నిర్వహించుకోవాలి. అరుుతే అధికారం వారిదే గనుక ప్రైవేటు వైద్యశిబిరం ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించాలని తెలుగు తమ్ముళ్లు భావించారు. దీంతో ఆస్పత్రి అధికారులు బదులు చెప్పలేక మిన్నకుండిపోయారు. ఆస్పత్రా, టీడీపీ కార్యాలయుమా ? ప్రభుత్వాస్పత్రిలో ఎటు చూసినా టీడీపీ నేతల హంగావూతో కనిపించింది. ఆస్పత్రిలో వుంత్రికి పార్టీ నేతలు, వివిధశాఖల అధికారులు శుభాకాంక్షలు చెప్పడానికి క్యూ కట్టారు. వురోవైపు పెద్దఎత్తున స్థానిక టీడీపీ నేతలు పూలవూలలు, శాలువాలతో మంత్రి సత్కరించడం మొదలెట్టడంతో ఆస్పత్రి ఆవరణమంతా మైకుల శబ్దాలతో మార్మోగింది. జిల్లా ప్రభుత్వ వైద్యాధికారులు కూడా ఈ హంగామాను చూసి మౌనం వహించారు. ఆస్పత్రిలో పలు విభాగాల అధికారులు కూడా బొజ్జల బర్త్‌డే సంబరాల్లో మునిగిపోవడం మరో విశేషం! ఓపీ ఇవ్వలేదు మంత్రి బర్త్‌డే సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అపోలో వైద్యులే ఆస్పత్రిని చూస్తారని టీడీపీ నాయకులు చెప్పారు. దీంతో మేము అత్యవసర కేసులు వూత్రమే చూశాం. అందువల్ల ఓపీ ఇవ్వలేదు. సాధారణంగా రోజూ 600 వుంది ఓపీలు తీసుకుంటారు. వుంత్రి బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో వారే అన్ని కార్యక్రవూలు చూసుకున్నారు. - బాలసుబ్రమణ్యం, సూపరింటెండె ంట్ -
‘హెల్త్’ బిజినెస్
వైద్యం.. వ్యాపారం నగరంలో పెరుగుతున్న ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు హోర్డింగులతో రోగులకు వల సీఐ నిబంధనలు గాలికి అక్రమార్జన కోసం అర్రులు చాస్తున్న పలువురు డాక్టర్లు ఎంజీఎం : బట్టల దుకాణాల్లో డిస్కౌంట్లతో ప్రజలను ఆకర్షించే ప్రకటనలు మనం ఇప్పటి వరకు చూశాం.. వన్‌ప్లస్ వన్ స్కీమ్‌తో వినియోగదారులను తమవైపునకు తిప్పుకునే షాపింగ్‌మాల్స్‌ను కూడా గమనిస్తున్నాం. అయితే ఈ ట్రెండ్ ప్రస్తుతం వైద్య రంగానికి కూడా ఎగబాకింది. లండన్‌లో ప్రముఖ వైద్యుడు.. అమెరికాలో పేరుగాంచిన గొప్ప డాక్టర్.. మా ఆస్పత్రికి వస్తున్నారు.. మేము చేయబోయే శస్త్రచికిత్సల్లో ఆయన కూడా పాల్గొంటారు.. మా ఆస్పత్రిలో మెరుగైనా వైద్యం అందిస్తాం.. ఫలానా శస్త్ర చికిత్సలు అవసరమున్న వారు ఈ సెల్‌నంబర్ ద్వారా తమ పేరు రిజిస్టర్ చేసుకోండి.. అంటూ నగరంలోని పలు ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు ఇప్పుడు కొత్తరకం వైద్య వ్యాపారానికి తెరతీస్తున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను తుంగలో తొక్కుతూ తమ నర్సింగ్ హోమ్ వైపునకు రోగులు తరలివచ్చేలా పత్రికల్లో ప్రకటనలు వేరుుస్తూ.. ప్రధానకూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేరుుస్తూ ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారుు. జోరుగా ప్రచారం.. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు రోగులను ఆకర్షించుకునేందుకు ప్రచారమే ప్రధాన అస్త్రంగా భావిస్తున్నాయి. నగరంలో ప్రధాన హోర్డింగుల నుంచి మొదలుపెడితే ప్రజలు వెళ్లే ఆటో రిక్షాలను వరకు దేనిని వదిలిపెట్టడం లేదు. వీటితోపాటు ఎఫ్ఎం రేడియోలు, వైద్య సంఘాలైన ఐఎంఏ, తానా వంటి సంఘాలు చేసే కార్యక్రమాల్లో సైతం తమ నర్సింగ్ హోమ్‌ల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ప్రధాన అకర్షణగా ప్రదర్శిస్తూ ప్రచారం కల్పిస్తున్నారు. అసలు ప్రచారాల్లో ఆయా నర్సింగ్ హోమ్‌ల వైద్యులు పేర్లు ఉండకూడదనేది ఎంసీఐ స్పష్టం చేస్తుంది. కానీ.. వైద్యుడు ఇంటి పేరుతో కానీ.. ఆయన పేరుతో ఆస్పత్రి నెలకొల్పిన కొంత మంది వైద్యులు తెలివిగా ఐఎంఎలో కీలకంగా వ్యవహరిస్తూ తమదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చడం వైద్యవర్గాల్లో సైతం విస్మయాన్ని కలిగిస్తుంది. నాన్ మెడికల్ వ్యాపారుల హవా... పెద్ద పెద్ద నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నస్టిక్స్ కేంద్రాలు, మెడికల్ కళాశాలలు నెలకొల్పి ప్రచారాన్ని అస్త్రంగా చేసుకుని వైద్య రంగాన్ని పూర్తి వ్యాపార రంగంగా మార్చుకుంటూ అడుగులు వేస్తున్నారుు. ఈ క్రమంలో ప్రజల ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య స్థితిగతులను పక్కకు నెట్టి వైద్య మాఫియాగా మారి ధనదోపిడే లక్ష్యంగా కార్పొరేట్ ముసుగులో యథేచ్ఛగా వైద్య వ్యాపారం సాగిస్తున్నారు. కాగా, కొందరు డాక్టర్లు చేస్తున్న ఈ వ్యాపారానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల అండదండలు పుష్కలంగా ఉండడం గమనార్హం. అమెరికా వైద్యుడి రాక పేరుతో వ్యాపారం.. నగరంలోని జేపీఎన్ రోడ్డులో ఉన్న ఓ ఆస్పత్రిలో ఈనెల 13న జరిగే కీలు మార్పిడి శస్త్రచికిత్సకు అమెరికా కు చెందిన వైద్యు నిపుణులు వస్తున్నారని నిర్వాహకులు ఏకంగా ఓ పత్రికలో ప్రకటన చేయడం వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతే కాకుండా సదరు వైద్యుడు శస్త్ర చికిత్సలో పాల్గొనడంతోపాటు ఏకంగా అతడి వద్ద వైద్య సలహాలు తీసుకునేందుకు రోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నంబర్‌ను సైతం వ్యాపార ప్రకటనలా ఇవ్వడం చర్చనీయూంశంగా మారింది. ఇలాంటి ప్రకటనలు వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ యజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎంసీఐని లెక్క చేయడం లేదని తెలుస్తుంది. ప్రకటనలు నిబంధనలకు విరుద్ధం.. డాక్టర్లు తమ పేరుతో ప్రకటనలు చేసుకోవడం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధం. నగరంలో ఆస్పత్రులు ప్రారంభించే వైద్యులు విదేశాల్లో ఏదైనా కోర్సు పూర్తి చేసి పునః ప్రారంభ సమయంలో మాత్రమే ప్రకటనలు చేసుకోవాలి. అంతేకాకుండా భారీ హోర్డింగులతో, కరపత్రాలతో ప్రచారం చేసుకోవడం ఎంసీఐ నిబంధనలకు విరు ద్ధం. ఇలాంటి ప్రకటనలపై చర్యలు తీసుకునేందుకు నాలుగు రోజులు క్రితం హైదరాబాద్‌లో ఎంసీఐ సమావేశం నిర్వహించాం. నగరంలో ఇటీవల జరిగిన కార్యక్రమంపై విచారణ చేసి చర్యలు చేపడుతాం. -రాజ్సిద్ధార్థ్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటీవ్ సభ్యుడు విదేశీ వైద్యుల రాక ప్రకటన సరికాదు విదేశీ వైద్యులు మా నర్సింగ్ హోమ్‌కు వస్తున్నారు.. రోగులు ఈ నంబర్‌కు ఫోన్ చేసి తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ప్రకటనలు చేసుకోవడం ఎంసీఐ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఎవరైనా విదేశీ వైద్యులు ఎంసీఐ తాత్కాలిక అనుమతితోనే కాన్ఫరెన్స్ శస్త్ర చికిత్సల్లో మాత్రమే పాల్గొనాలి. వ్యక్తిగత నర్సింగ్ హోమ్‌లలో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధం. -డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, ఐఎంఏ క్రమశిక్షణ సంఘం చైర్మన్ -
పేద బతుకుల్లో.. పెద్దకష్టం
♦ కొడుకు వైద్యం కోసం ఊర్లు తిరుగుతున్న తల్లిదండ్రులు ♦ అనంతపురం జిల్లా దంపతుల దయనీయ స్థితి సాక్షి, విజయవాడ బ్యూరో: అసలే పేదరికం.. ఆపై కరువు సీమలో బతుకు దుర్భరం.. ఏడేళ్ల నిరీక్షణతో దక్కిన ఏకైక మగ సంతానం.. ఐదేళ్లుగా నరాల బలహీనతతో ఆ బాలుడి దయనీయ స్థితి.. కన్నకొడుక్కి వైద్యం చేయించలేని నిస్సహాయస్థితిలో ఆ కన్నవారికి ఏడ్చి ఏడ్చి కన్నీరు సైతం ఇంకిపోయింది.. ఇది అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం కండ్లగూడూరు గ్రామానికి చెందిన మక్కాల బాలపెద్దయ్య, అనసూయమ్మ దంపతుల దీనస్థితి. శుక్రవారం అనంతపురం నుంచి విజయవాడ వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకుని, నగరంలో ఎవరైనా సాయం చేయకపోతారా అన్న ఆశతో తిరుగుతున్న వారిని ‘సాక్షి’ పలకరించడంతో తమ దయనీయ స్థితిని గురించి చెప్పుకున్నారు. గ్రామంలో కూలి పని చేసుకుని జీవనం సాగించే బాలపెద్దయ్య, అనసూయమ్మ దంపతులకు ఒకే ఒక మగ సంతానం కలిగింది. ఏడేళ్ల నిరీక్షణ తరువాత కొడుకు పుట్టాడన్నా ఆనందం క్రమేణా ఆవిరవుతూ వచ్చింది. రాన్రాను తల సరిగ్గా నిలబెట్టలేకపోవడం, కాళ్లు, చేతులు సరిగ్గా పనిచేయకపోవడం, తరచు ఫిట్స్ రావడంతో కంగారుపడిన వారు వైద్యులకు చూపించారు. పిల్లోడు నరాల బలహీనతతో బాధపడుతున్నాడని, ప్రతీ రోజు మందులు వాడుతూ, తగిన వైద్యం చేయిస్తే పరిస్థితి మెరుగవుతుందని వైద్యులు నిర్ధారించారు. నెలవారీగా కనీసం రూ. 4,200 పెట్టి మందులు కొనడం.. కూలి పని చేసుకుని బతికేవారికి భారమైంది. శరీర భాగాలు సైతం కదల్చలేక, తల నిలబెట్టలేని స్థితిలో ఉన్న కుమారుడికి అన్నం తినిపించాలంటే దాదాపు రెండున్నర గంటలపాటు అవస్థలు పడాల్సివస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో బతుకు గడవడమే కష్టమవడంతో పలు జిల్లాలు తిరిగి తమ దీనస్థితిని దాతలకు చెప్పుకుని సాయం కోరుతున్నారు. తమ బిడ్డకు నెలనెల అవసరమైన వైద్యం, మందులు ఇప్పిస్తే మామూలు మనిషి అవుతాడని అందుకు దాతలు సాయం చేయాలని కోరుతున్నారు. సాయం చేసే వారు సెల్ నంబర్ 81870 71012 సంప్రదించాలని వేడుకుంటున్నారు. -
ఈ-వైద్యం.. జిల్లా అంతటా!
ప్రస్తుతం విజయవాడ, జగ్గయ్యపేటల్లో త్వరలో కైకలూరులో.. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ బాబు.ఎ వెల్లడి మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లా అంతటా త్వరలో ఈ-వైద్యం అమలుచేయనున్నట్లు కలెక్టర్ బాబు.ఎ చెప్పారు. ఈ-హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టంపై గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని ఆస్పత్రుల వివరాలు, అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య తదితర వివరాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ బాబు అక్కడినుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ.. ఈ-వైద్యం ద్వారా ఆన్లైన్లో రోగి లక్షణాలను పొందుపరుస్తామని చెప్పారు. వాటిని వైద్యులు చూసి వైద్యపరీక్షలు అవసరమైన వారికి సూచనలు చేస్తారన్నారు. వైద్యపరీక్షలు పూర్తయ్యాక రిపోర్టులను ఆన్లైన్లో ఉంచితే వైద్యాధికారి సమస్యను గుర్తించి మందులు ఇస్తారన్నారు. రోగులు ఆస్పత్రికి వెళ్లకుండా ఈ-వైద్యాన్ని వినియోగించుకుని ఆన్లైన్ ద్వారా వైద్యసేవలు పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం విజయవాడ, జగ్గయ్యపేటల్లో ఈ సేవలు అందిస్తున్నామని, త్వరలో కైకలూరు, ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా అమలుపరుస్తామని కలెక్టర్ వివరించారు. -
కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడితే పక్షవాతం వస్తుందా..?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 44ఏళ్లు. తొమ్మిదేళ్ల క్రితం నా కుడికాలికి ఫ్రాక్చర్ అయ్యింది. నా కుటుంబ సభ్యులు నాకు నాటువైద్యం చేయించారు. వాళ్లు నాలుగు నెలల పాటు బ్యాండేజీ వేయించారు. దాంతో ఎలాంటి సమస్యా లేదు. అయితే ఏడాది క్రితం మళ్లీ నా ఎడమకాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఇప్పుడు కూడా నేను అక్కడికే వెళ్లాను. నాలుగు నెలల క్రితం మళ్లీ అక్కడికి వెళ్లాను. వాళ్లు పూర్తిగా నయమైందని చెబుతున్నారు. కానీ నాకు మోకాలు చాలా బిగుసుపోయినట్లుగా అయిపోయి, విపరీతమైన నొప్పి వస్తోంది. నేను మోకాలు వంచలేకపోతున్నాను. నడవలేకపోతున్నాను. ఈసారి నా చికిత్స ఎందుకు బాగా జరగలేదు. లోపల ఏదైనా ప్రమాదం జరిగిందా? - సుధాకర్, శ్రీకాళహస్తి ఎముకలకు ఒక విశిష్టమైన గుణం ఉంటుంది. అవి చాలావరకు తమ గాయాలను తామే మాన్పుకుంటాయి. ఎముకలకు ఉండే ఈ లక్షణమే జంతువులకు తోడ్పడుతుంది. అడవిలోని జంతువుల ఎముకలకు గాయాలైనప్పుడు అవి వాటంతట అవే మానుతుంటాయి. ఇక మనుషుల్లో చికిత్స ఎందుకు కావాలంటే... ఎముకలు సరైన పొజిషన్లో ఉండి మానడానికి మీకు వచ్చినట్లే కీళ్ల వద్ద బిగుసుకుపోకూడదని మనం వీలైనంత త్వరగా తమ నార్మల్ దినచర్యలు చేపట్టాలని. నాటువైద్యం జరిగినా, నకిలీవైద్యులు వైద్యం చేసినా ఎముకలు వాటంతట అవే స్వాభావికంగానే నయమయ్యే గుణం వల్ల ఫ్రాక్చర్స్ నార్మల్ అయిపోతుంటాయి. ఇక ఇప్పుడు మీకు అయిన గాయం మానిందా లేదా అని తెలుసుకోడానికి, కీలు బిగుసుకుపోయిన స్థితి మళ్లీ నార్మల్ కావడానికి, మరీ ముఖ్యంగా కీళ్లలో ఏదైనా ఫ్రాక్చర్ అయితే అవి మునుపటిలా తమ నునుపుదనాన్ని మళ్లీ పొందడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మీకు వేసిన బ్యాండేజీ దీర్ఘకాలం పాటు ఉంచడం వల్ల కూడా కీలు బిగుసుకుపోయినట్లుగా అయి ఉండవచ్చు. అది బలహీనపడి ఉండవచ్చు. ఈసారైనా మీరు నాటు వైద్యులను సంప్రదించకుండా వీలైనంత త్వరగా నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, పూర్తిగా శాస్త్రీయపద్ధతుల్లో అన్ని పరీక్షలూ చేయంచి, తగిన చికిత్స తీసుకోండి. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందనే అనిపిస్తోంది. కౌన్సెలింగ్ ఫర్ అడాలసెంట్ గాళ్స్ ప్రాబ్లమ్స్ నా కూతురి వయసు 16 ఏళ్లు. ఆమెకు ముఖమంతా వెంట్రుకలు ఉన్నాయి. అంతేకాదు ముఖం నిండా మొటిమలు వస్తున్నాయి. ఈ అవాంఛిత రోమాలు, మొటిమల వల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఆమె చాలా ఇబ్బంది పడుతోంది. తన గురించి నాకు బెంగగా ఉంది. మాకు సరైన సలహా ఇవ్వండి. - మహేశ్వరి, బెంగళూరు మీరు చెప్పిన అంశాలు మీ అమ్మాయి లాంటి కౌమార ప్రాయంలో ఉన్నవారికి చాలా బాధాకరంగా పరిణమిస్తాయి. మీ అమ్మాయికి పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా అన్న అంశాన్ని ముందుగా చూడాలి. తర్వాత ఆమె బరువుపెరుగుతోందా, స్వరంలో మార్పులు వస్తున్నాయా, మాడు మీద జుట్టు రాలుతోందా అన్న అంశాలనూ చూడాలి. ఇవన్నీ వెంటనే జరగాల్సిన పనులు. వీటితో పాటు మీ కుటుంబంలో ఇలాంటి చరిత్ర ఉండా అన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆమె ముఖం మీద ఉన్న అవాంఛిత రోమాల తీవ్రతనూ, అవి వచ్చిన వ్యవధిని బట్టి ఆమె పరిస్థితిని అంచనా వేయవచ్చు. సాధారణంగా టీనేజర్లలో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నవారిలో సాధారణంగా మొటిమలు వస్తుంటాయి. అయితే చాలా అరుదుగా కనిపించే ఓవరిస్లో నీటి తిత్తులు, అడ్రినల్ గ్రంథుల సమస్యలు కూడా మీరు చెప్పే లక్షణాలను కనబరచవచ్చు. అందుకే మీ అమ్మాయి సమస్య నిర్ధారణ కోసం కొన్ని రక్తపరీక్షలు, స్కానింగ్ పరీక్షలు చేయించాలి. కొన్ని సందర్భాల్లో కేవలం జీవనశైలి మార్పులు, కౌన్సెలింగ్ వంటి చాలా మామూలు అంశాలతోనే పరిస్థితిని చక్కబరచవచ్చు. కొందరిలో వాక్సింగ్, బ్లీచింగ్ వంటి సాధారణ కాస్మటిక్ చికిత్సలే సరిపోతాయి. ఎలక్ట్రోలైసిస్, లేజర్స్ థెరపీతో కూడా అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. ఇక అవసరాన్ని బట్టి హార్మోనల్ చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. కొంతమంది అమ్మాయికి సాధారణ కౌన్సెలింగే సరిపోతోంది. సరైన పరీక్షలతో అవసరమైన చికిత్సతో పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 27 ఏళ్లు. మూడేళ్ల క్రితం నాకు వివాహం జరిగింది. ప్రస్తుతం నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంతకాలం పాటు మేము పిల్లలు వద్దనుకున్నాం. దానికోసం నేను గత మూడేళ్లుగా కాంట్రసెప్టివ్ పిల్స్‌ను వాడుతున్నాను. అయితే నాకు ఇటీవల తలనొప్పి ఎక్కువగా వస్తోంది. కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నేను ఇటీవల కొన్ని పత్రికల్లో చదివాను. ఈ వార్త చదివినప్పటి నుంచి నాలో ఆందోళన రెట్టింపు అయ్యింది. మా నాన్నగారు కూడా పక్షవాతం కారణంగానే చాలా కాలంగా మంచాన పడ్డారు. దయచేసి దీని గురించి వివరంగా తెలుపగలరు. - మాధవి, వరంగల్ ఎక్కువకాలం కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం అంత మంచిది కాదు. ఒకవేళ వాడాల్సి వచ్చినా పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. ఎక్కువ కాలం ఈ మాత్రలు వాడటం వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధానంగా పని ఒత్తిడి, కుటుంబపరమైన ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మారుతున్న జీవనశైలి, జంక్ఫుడ్స్, ఒత్తిడి, స్థూలకాయం, మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి కారణాలతో ఎక్కువ మంది మైగ్రేన్, పక్షవాతం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. పక్షవాతం పురుషుల కంటే స్త్రీలలోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంట్రసెప్టివ్ పిల్స్ వాడటం, రుతుస్రావం, కుటుంబపరమైన ఒత్తిడి, ఉద్యోగాలు చేసే మహిళల్లో పని ఒత్తిడి వంటి కారణాల వల్ల హార్మోన్లలో తేడాలు వస్తుంటాయి. దాంతో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు సుమారు మూడు సంవత్సరాలుగా కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతున్నట్లు తెలిపారు. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి, వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో నిర్థారించుకోండి. జన్యుపరమైన కారణాల వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ నాన్నగారికి ఇప్పటికే పక్షవాతం వచ్చింది కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ డి, విటమిన్ బి12 లోపం వల్ల కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు మధుమేహంగానీ, రక్తపోటు గానీ ఉంటే వాటిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. మీ ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే అధిక బరువు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా నడకగానీ, వ్యాయామంగానీ చేయండి. తాజా ఆకుకూరలు, పండ్లతో పాటు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోండి. ఉదయం వేళల్లో కొంత సమయం ఎండలో నడవడానికి ప్రయత్నించండి. సూర్యరశ్మి ద్వారానే డి విటమిన్ లభిస్తుంది. హార్మోన్ల సమతుల్యత కాపాడుకోవడానికి ప్రయత్నించండి. -
నాలుగేళ్ల బాలికపై బాలుడి లైంగిక దాడి
లబ్బీపేట/ఇబ్రహీంపట్నం: నాలుగేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఎదురింట్లో నివసించే బాలుడు నమ్మకంగా ఇంట్లోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బాలుడు ఇబ్రహీంపట్నం పోలీసుల అదుపులో ఉన్నాడు. వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యం వీధిలో నివసించే తమ్మిశెట్టి సిద్ధయ్య కుటుంబం వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటుంది. అతడికి 7వ తరగతి చదివే 14 ఏళ్ల కొడుకు ఉన్నాడు. సిద్ధయ్య, అతని భార్య బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లగా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం 4 గంటల సమయంలో బాలిక ఇంటి వద్ద రోడ్డుపై ఆడుకుంటుండగా బాలుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతుండగా ఆమె ఏడవడంతో పక్కింటి వారికి అనుమానం వచ్చింది. తలుపులు వేసి ఉన్న ఇంట్లో బాలిక ఏడుపు వినపడడంతో కిటికీలో నుంచి చూడగా బాలుడి నిర్వాకం వెల్లడైంది. తలుపులు కొట్టడంతో కొద్దిసేపటికి దుస్తులు వేసుకుంటూ బయటికి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, బాలుడిని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ‘రోజూ బాలికతో ఆడు కుంటున్నాడు..అలాగే తీసుకెళ్లాడనుకున్నాం .. కానీ, ఇంత దారుణానికి పాల్పడతాడని భావించలేదం’టూ బాలిక బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో బాలిక బంధువులు, కాలనీకి చెందిన వారు ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తవాతావరణం నెలకొంది. కేసులేనిదే వైద్యం చేయబోమన్న వైద్యులు.. లైంగికదాడికి గురైన బాలికను వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకొస్తే, పోలీసులు కేసునమోదు చేయనిదే వైద్యం చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో బాలిక బంధువులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించగా, సీఐ చవాన్ ఆస్పత్రికి చేరుకుని స్టేట్మెంట్ రికార్డు చేసి శోధన వెహికల్‌ను రప్పించి అక్కడే ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. అనంతరం బాలికను వైద్యులు పాపను అడ్మిట్ చేసుకున్నారు. విచారణ జరుపుతున్నాం: చవాన్, ఇబ్రహీంపట్నం సీఐ నాలుగేళ్ల బాలికపై ఎదురింటిలో నివసించే బాలుడు లైంగికదాడికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తు నిర్వహిస్తాం. -
వికటిస్తే విరుగుడు
చేయూతనివ్వాల్సింది... చేటుతెచ్చారు... కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం అంటే లక్షల్లో ఖర్చు తప్పనిసరి. అంత ఖర్చు భరించినా... అక్కడా మోసం జరిగితే ఎవరిని అడగాలి?! కేతిరి సాయిరెడ్డి కరీంనగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. హైదరాబాద్‌లో వ్యాధికి తగిన వైద్యం చేయని ఓ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యంపై అతను ఎలాంటి పోరాటం చేశారో ఆయన మాటల్లోనే... భుజం నొప్పి అని ఆసుపత్రికి వెళితే... ‘‘ఓ రోజు అర్ధ్దరాత్రి.. కుడి భుజం నుంచి చేతి వరకు విపరీతమైన నొప్పి. తెల్లవార్లూ నొప్పిని ఓర్చుకుని, ఇక భరించలేక హైదరాబాద్‌లోని ఓ పెద్ద హాస్పిటల్‌కి వెళ్లాను. మంచి అనుభవజ్ఞుడనే పేరున్న న్యూరో ఫిజీషియన్ వచ్చారు. అన్ని చెకప్లూ చేశారు. వారు తేల్చి చెప్పినదేంటంటే.. ‘ఇది చాలా అరుదుగా వచ్చే గులియన్‌బ్యారీ సిండ్రోమ్’ అని. శరీరంలో ఒక్కో అవయం చచ్చుపడేలా చేయడం ఆ వ్యాధి లక్షణం అని చెప్పారు. చాలా భయపడ్డాను. ఇతర మందులతో పాటు ఐదు రోజుల పాటు ఐదు ఇంజెక్షన్లు చేయించుకోవాలన్నారు. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.7,500లు. చెప్పినట్టే చేయించుకున్నాను. మూడు నెలలు ఫిజియోథెరపీ అవసరం అంటే, అన్ని రోజులూ ఫిజియోకేర్లో చేరాను. చెప్పినవన్నీ వాడాను. చెయ్యమన్నవన్నీ చేశాను. అయినా ఫలితం లేదు. మళ్లీ అదే ఆసుపత్రిలో నెల రోజులు చికిత్స తీసుకున్నాను. ఏడాది పాటు... ఇలాగే గడిచింది. ఒక సమస్యకు బదులు మరో సమస్య... మా స్నేహితుడు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యుడు. నన్ను కలవడానికి వచ్చి, రిపోర్టులు చూశాడు. ‘ఇది స్పాండిలోసిస్ సమస్య, ట్రీట్మెంట్ తప్పుగా జరిగింది. మెడలో ఉండో నరాలు కంప్రెషన్‌కు లోనయితే ఇలాంటి నొప్పి వస్తుంది’ అన్నాడు. నమ్మబుద్ధి కాలేదు. మా స్నేహితుడే మరో ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరకు తీసుకెళ్లాడు. అతను కూడా అదే నిర్ధారించాడు. ‘ఏడాది క్రితం కార్పొరేట్ హాస్సిటల్లో తీసిన ఎక్స్‌రేలో కూడా ఇదే విషయం స్పష్టంగా చూపుతోంది’ అని చెప్పాడు. ఆశ్చర్యపోయాను. తర్వాత, వాళ్లు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకున్నాను. మొదట్లో సరైన వైద్యం అందకపోవడం వల్లే చెయ్యికి బలం లేకుండా పోయింది. ఆ ప్రభావం వల్ల అన్నం కూడా సరిగ్గా కలుపుకొని తినలేను. ఏం చేయాలి? ఏడాది పాటు నేను అనుభవించిన నరకం, మానసిక క్షోభ, డబ్బు ఖర్చు...ఎంతో నమ్మకం మీద పెద్ద ఆసుపత్రిలో చేరితే ఇలా జరిగింది. ఫోరంలో కేసు... కార్పొరేట్ ఆసుపత్రి ఇచ్చిన అన్ని రిపోర్టులను, బిల్లులను జత చేసి, వినియోగదారుల ఫోరంలో కేసు వేశాను. స్టేట్ కమిషన్ ఉస్మానియా వైద్యులతో చర్చించింది. మొదటి రిపోర్ట్‌లోనే ఎలాంటి సమస్య ఉందో తేల్చింది. వెంటనే రూ.25,000 లు ఆసుపత్రి నుంచి నష్టపరిహారం అందేలా చూసింది. అయితే నేను అనుభవించిన క్షోభకు ఇది పెద్ద అమౌంట్ కాదు. అందుకని జాతీయ వినియోగదారుల ఫోరంలో మళ్లీ కేసు వేశాను. అక్కడ 2 లక్షల రూపాయల ఫైన్ ఆసుపత్రికి వేసి, ఆ మొత్తం నాకు వచ్చేలా చేసింది. ఇందుకు 5-6 ఏళ్ల పాటు సమయం పట్టింది. కానీ, జరిగిన నష్టానికి కొంతైన పరిహారం అందింది. భయపడకుండా న్యాయం కోసం పోరాడితే మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించవచ్చు.’’ - కేతిరి సాయిరెడ్డి, కరీంనగర్ మీకూ ఇలాంటి సమస్య ఎదురైతే... వెంటనే వినియోగదారుల ఫోరమ్‌కి ఫిర్యాదు చేయండి. వినియోగదారుల హక్కుల రక్షణకు, పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో వినియోగదారుల రక్షణ మండళ్లను ఏర్పాటు చేశారు. ఎలా ఫిర్యాదు చేయాలంటే... వస్తు, సేవలు పొందిన రోజు నుండి రెండు సంవత్సరాలలోగా ఫిర్యాదును దాఖలు చేయవచ్చు.ఫిర్యాదు పత్రంలో ఫిర్యాదుదారు పేరు, చిరునామా, వృత్తి, నిందితుల వివరాలు సమగ్రంగా పేర్కొనాలి. బాధితుడు తనకు జరిగిన నష్టంపై వివరించాలి. నష్టాన్ని ధ్రువపరిచే పత్రాలను, బిల్లులను ఐదు సెట్లు తయారు చేసి, ఫిర్యాదు దరఖాస్తుతో జతచేయాలి. ఏ మేరకు నష్టపరిహారాన్ని కోరుతున్నామో స్పష్టంగా రాయాలి. జిల్లాఫోరంలో అయితే లక్ష రూపాయల లోపు నష్టపరిహారానికి రూ.100లు, ఐదు లక్షల లోపు అయితే రూ.200, పది లక్షల లోపు అయితే రూ.400, అదే 20 లక్షల లోపు అయితే 500 చొప్పున రుసుం చెల్లించాలి. -
సహాయ నిధి స్వాహా!
సీఎం రిలీప్ఫండ్ గోల్మాల్ చికిత్సలు లేకుండానే నకిలీ బిల్లులు జిల్లా నుంచే ఎక్కువ! గుర్తించిన సీఎంఆర్ఎఫ్ అధికారులు విచారణకు త్వరలో జిల్లాకు రానున్న సీఐడీ సాక్షి, ఖమ్మం: ముఖ్యమంత్రి సహాయ నిధిలో నకిలీ బిల్లుల వ్యవహారం చర్చనీయాంశమైంది. జిల్లా నుంచి కూడా చాలా వరకు బిల్లులు ఉండడంతో నకిలీల బండారం బయటపడనుంది. సూత్రధారులెవరో.. పాత్రధారులెవరో తేలనుంది. ఈ విషయంలో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు, నకిలీ బిల్లులు సృష్టించిన వారి వెన్నులో వణుకు పుడుతోంది. తమ నియోజకవర్గాల పరిధిలో ఎవరైనా ప్రమాదవశాత్తు, లేక ఇతర ఆరోగ్య పరమైన చికిత్సలు చేయించుకుని ఆర్థికసాయం కోసం వస్తే ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రతిపాదనలు పంపుతారు. అయితే.. చికిత్స చేయకున్నా చేయించినట్లు నకిలీ బిల్లులు పెట్టి కొందరు రిలీఫ్ ఫండ్ తీసుకున్నట్లు సీఎం కార్యాలయ అధికారులు గుర్తించారు. ఇలా నల్లగొండ, వరంగల్ జిల్లాతోపాటు మన జిల్లా నుంచి ఇలా నకిలీ బిల్లులు అందాయి. అంతేకాకుండా చికిత్సకు అయిన బిల్లు స్వల్పంగా ఉంటే భారీగా చూపుతూ బిల్లులు పంపారు. ప్రజాప్రతినిధులే సీఎంఆర్ఎఫ్కు ఈ బిల్లులను సిఫార్సు చేశారు. తెలంగాన ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా బిల్లులు మంజూరు కాగా ఇందులో జిల్లాలో వందల సంఖ్యలో బిల్లులు ఉన్నాయి. నకిలీ బిల్లుల్లో మన జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు సీఎంఆర్ఎఫ్ అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. త్వరలో ఈ బృందం జిల్లాకు వచ్చి అసలు బిల్లు మంజూరైన లబ్ధిదారులు ఎక్కడ ఉంటున్నారు.. వారు ఏ ఆస్పత్రిలో చికిత్స పొందారు.. ఆస్పత్రి యాజమాన్యం ఎంత బిల్లు వేసింది..? తదితర వివరాలు అన్ని సేకరించనుంది. ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించడంతో ప్రజప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. సహాయం కోసం వచ్చే వారికి సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, బిల్లులు నకిలీవని ఎలా గుర్తుపట్టాలని వారు పేర్కొంటున్నారు. సీఐడీ విచారణ చేస్తే జిల్లా వ్యాప్తంగా నకిలీ బిల్లుల వ్యవహారం గుట్టురట్టు కానుంది. ఈ వ్యవహారంలో ఎవరైనా ప్రజాప్రతినిధులకు సంబంధం ఉన్నట్లు తేలితే ఇక నుంచి వారు సీఎం కార్యాలయానికి వైద్యం కోసం సహాయం అందించే ప్రతిపాదలను తిరస్కరించే అవకాశం ఉంది. అయితే 2012 నుంచి ఇప్పటి వరకు జిల్లాకు 362 బిల్లులకు వైద్యం కోసం సహాయం అందింది. ఇందులో ఇంకా 11 బిల్లులు పంపిణీ చేయాల్సి ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి నేరుగా సీఎం కార్యాలయానికి వచ్చే బిల్లుల వ్యవహారంలోనే నకిలీవి వచ్చినట్లు కార్యాలయ అధికారులు గుర్తించారు. -
ముగ్గురిపై వేటు
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో లంచావతారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడంతో హడలిపోతున్నారు. వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులను డబ్బుల కోసం జలగల్లా పీడిస్తున్న ముగ్గురు ఆస్పత్రి నాలుగో తరగతి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కలెక్టర్ టీకే శ్రీదేవి బుధవారం వెల్లడించారు. సంబంధిత మెటర్నిటీ వార్డు ఇన్చార్జి వైద్యుడికి మెమో జారీచేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో కొడుకు పుడితే రూ.వెయ్యి, కూతురు పుడితే రూ.500 వసూలు చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు. కాగా, ఇటీవల జిల్లా ఆస్పత్రిలో సిబ్బందికి డబ్బులు ఇవ్వలేక.. భార్యకు వైద్యం చేయించుకోలేక మనస్తాపానికి గురై రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడిన జడ్చర్లవాసి చెన్నకేశవులు హత్యోదంతంతో జిల్లా అధికారయంత్రాంగం కదిలింది. విచారణ కోసం ప్రత్యేకాధికారిగా ఇన్చార్జి జేసీ డాక్టర్ రాజారాంను కలెక్టర్ టీకే శ్రీదేవి నియమించారు. దీంతో ఆయన నేతృత్వంలోని ప్రత్యేక బృందం రెండురోజుల పాటు జిల్లా ఆస్పత్రిలో విచారణ జరిపింది. ఆత్మహత్యకు దారిన పరిస్థితులపై ఆరాతీశారు. ఆస్పత్రి సిబ్బంది డబ్బుల కోసం వేధించడం వల్లే చెన్నకేశవులు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా, ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా దుమారం లేవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే సిబ్బంది సస్పెన్షన్ వివరాలను డీసీహెచ్ పద్మజా, డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మోరే, సూపరిటెండెంట్‌శామ్యూల్ వెల్లడించకపోవడం గమనార్హం. -
డబ్బు జబ్బు
సాక్షి, కర్నూలు : ఠాగూర్ చిత్రంలోని ఆస్పత్రి సన్నివేశం అందరికీ తెలిసిందే.. శవానికి వైద్యం చేస్తున్నట్లు నటించి లక్షలాది రూపాయలు లాగే వైద్యుల ఉదంతం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. నిజ జీవితంలో కూడా ‘ఠాగూర్’ తరహా వైద్యులు కోకొల్లులుగా ఉన్నారు.. మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తించే వైద్యులు కర్నూలులో గల్లీగల్లీకి తయారయ్యారు. తుమ్ములు, దగ్గులకు కూడా వేలకు వేలు బిల్లులు లాగే పరిస్థితి దాపురించింది. పరీక్షలు, ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు, అవసరానికి మించి మందులు రాస్తూ.. రోగులను దోపిడీ చేస్తున్నారు.. పైసలు పోయినా ప్రాణం దక్కుతుందా? అంటే అదీలేదు.. ప్రభుత్వ ఆస్పత్రుల తరహాలోనే, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 197 ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయి. మరో 99 వరకు సింగిల్ కౌంటర్ ఆస్పత్రులు ఉన్నాయి. మరో 26 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. 12 సిటీ స్కాన్, 5 ఎంఆర్ఐ స్కాన్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కర్నూలు నగరంలోనే 200 వరకు ఉన్నాయి. ఈ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అత్యంత ఖరీదైపోయింది. ‘వైద్యో నారాయణో హరి!’ అనే నానుడి కనుమరుగైంది. మానవత్వానికి చిరునామా అనేది లేకుండా పోయింది. దినసరి లక్ష్యాలు పెట్టుకుని మరీ వైద్యులు ముందుకు సాగుతున్నారు. రోజుకు రూ. 30 వేల నుంచి రూ. 50 వేలు జేబులో వేసుకోనిదే ఇళ్లకు వెళ్లలేని వైద్యులు కూడా కర్నూలులో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రాణభయంతో ఆస్పత్రికి వెళ్లిన రోగులకు డాక్టర్లు చుక్కలు చూపిస్తున్నారు. చిన్నాచితకా రోగాలకు సైతం లక్షల రూపాయల్లో బిల్లులు వేస్తున్నారు. ముందస్తుగా డబ్బులు డిపాజిట్ చేస్తేనే చికిత్స ప్రారంభిస్తున్నారు. లేకపోతే మెడలు పట్టి మరీ ఆస్పత్రి నుంచి గెంటేస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న పేషెంట్లపై కూడా కనికరం చూపే పరిస్థితి లేదు. మెడికల్ షాపుల నిర్వహణ కూడా వైద్యులే చేస్తున్నారు. కుటుంబ సభ్యులను కూర్చోబెడుతున్నారు. అవసరానికి మించి మందులు రాస్తూ, టర్నోవర్‌ను గణనీయంగా పెంచుకుంటున్నారు. మెడికల్ స్టోర్ ఇతరులది ఉంటే.. వారిని ‘ఏటీఎం’ తరహాలో వినియోగించుకుంటున్నారు. మందుల విక్రయాలు, ల్యాబుల్లో చేసే పరీక్షలపై వైద్యులు కమీషన్ తీసుకుంటున్నారు. ‘శాంపిల్ మెడిసిన్స్’, శాంపిల్ కిట్స్‌ను కూడా సొమ్ము చేసుకుంటున్నారు. కన్సల్టెన్సీ ఫీజును రూ. 50 నుంచి అమాంతంగా 150లకు పెంచేశారు. అతితక్కువ మంది వైద్యులు రూ. 100 తీసుకుంటున్నారు. నెలలోపు రెండోసారి వస్తే ఉచితంగానే చూసేవారు. ఇప్పుడా గడువును వారం నుంచి రెండు వారాలకు తగ్గించారు. దీంతో రెండోసారి వచ్చేవారు మళ్లీ రూ. 150 వెచ్చించి కొత్త టోకెన్ తీసుకోవాల్సి వస్తోంది. మందుల కంపెనీలతో కూడా వైద్యులు కుమ్మక్కయ్యారు. కమీషన్లు పుచ్చుకుంటూ వారు సూచించిన మందులనే పేషెంట్లకు అంటగడుతున్నారు. ‘ఐసీయూ’ చికిత్స ఖరీదైపోయింది. రూ. లక్షలు ధారపోస్తే తప్ప ‘ఐసీయూ’లో బెర్తు దొరికే పరిస్థితి లేదు. రోగితో ఎవరిని ఉంచకుండా, ఆస్పత్రి సిబ్బందే అంతా చూసుకుంటారు. ఈక్రమంలో కొనుగోలు చేసిన మందుల్లో 25 శాతం వినియోగిస్తున్నారు. మిగిలిన 75 శాతం మందులను దొడ్డిదారిలో మెడికల్ స్టోరుకు తరలిస్తున్నారు. ఒకే ప్రిస్కిప్షన్‌పై రూ. 4 వేల విలువైన మందులు రాసే యూరాలజిస్టులు, ఫిజీషియన్లు కూడా లేకపోలేదు. ఆరోగ్యశ్రీని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. తక్కువ ట్రీట్మెంట్ చేసి ఎక్కువ బిల్లును ప్రభుత్వం నుంచి రికవరీ చేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటున్నారు. ఆదివారం నరకయాతన.. ఆదివారం వచ్చిందంటే చాలు.. వైద్యం చేసే దిక్కులేకుండా పోతోంది. శనివారం సాయంత్రం కాగానే, వైద్యులు హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. అక్కడ రిలాక్స్ అయి సోమవారం తిరిగి జిల్లాకు వస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే వారిని పట్టించుకునే నాధుడే ఉండడం లేదు. ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్లను ఉదయమొకసారి, సాయంత్రమొకసారి వైద్యులు స్వయంగా చూస్తుంటారు. కాని ఆదివారం సెలవు పేరుతో శనివారం నుంచి సోమవారం వరకు ఇన్ పేషెంట్లను పట్టించుకునే దిక్కులేదు. ఒకరిద్దరు కంపౌండర్లను ఉంచేసి వెళ్తున్నారు. వైద్యుని దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూడడం ఇక నిత్యకృత్యమైపోయింది. ప్రాణాలు.. గాలిలో దీపాలు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం ఖరీదైనప్పటికీ ప్రాణాలకు కూడా భద్రతలేదు. ప్రాణభయంతో ఆస్పత్రికి వెళ్లిన రోగుల పరిస్థితి గాలిలో దీపంలా తయారవుతోంది. నగరంలోని నరసింగరావు పేటలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్, మెటర్నిటి ఆసుపత్రిలో తొమ్మిది నెలల పాటు గర్భిణీకి వైద్యసేవలందించారు.వేలాది రూపాయలు వసూలు చేశారు. చివరి నిమిషంలో బిడ్డ అడ్డం తిరిగిందని మరో ఆసుపత్రికి పంపించారు. వేరే ఆసుపత్రికి తరలించేలోపే కడుపులో శిశువు మృతి చెందింది. బంధువు లు ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. గాయత్రి ఎస్టేట్‌లోని మరో ప్రైవే టు ఆసుపత్రిలో ప్రసూతి కోసం చేరితే రూ.70 వేలు బిల్లు వేసి మృత శిశువును చేతిలో పెట్టారని బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పారు. అలాగే నగరంలోనే ఇంకో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ వైద్యం వికటించడంతో ఓ మహిళ మృతి చెందింది. ఆసుపత్రి వద్ద గొడవ జరిగింది. ఇలాంటి ఇలాంటి సంఘటనలు జిల్లావ్యాప్తంగా నిత్యం ఒకటి, రెండు జరుగుతున్నాయి. -
వ్యాధులు బాబోయ్!
స్వైన్‌ఫ్లూతో ఒకరు, అతిసారతో మరొకరి మృతి ఓ వైపు చాపకింద నీరులా విస్తరిస్తున్న స్వైన్‌ఫ్లూ ఒకరిని కబళించేసింది.. అస్వస్థతకు గురైన ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ మృత్యువాతపడ్డాడు. మరోవైపు అతిసార భూతం పంజా విసిరింది.. గద్వాలలో కలుషితనీరు తాగి ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో 11మంది అనారోగ్యానికి గురయ్యారు. ఈ రెండు సంఘటనలు సోమవారం చోటుచేసుకున్నాయి. చనాగర్కర్నూల్ రూరల్: నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన ఎన్నం రాకేష్(33) కొంతకాలంగా ఆత్మకూర్‌లోని వికాస్ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. వనపర్తిలోని కేడీఆర్ నగర్‌లోని ఓ అద్దెఇంట్లో నివాసం ఉంటూ ఆత్మకూరుకు రాకపోకలు సాగిస్తున్నాడు. ఇదిలాఉండగా, వారం రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో వనపర్తిలో వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. మెరుగైన వైద్యచికిత్సల కోసం సమీప బంధువు రాకేష్‌ను ఆదివారం హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించగా స్వైన్‌ఫ్లూగా నిర్ధారణ అయింది. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో సోమవారం మృతిచెందాడు. మృతుడికి తండ్రి కృష్ణయ్య, తల్లి జయమ్మ ఉన్నారు. వ్యవసాయం చేస్తూ తమ ఇద్దరి కొడుకులను చదివించారు. ఎమ్మెస్సీ వరకు చదివిన రాకేష్ ఏడాదిన్నర క్రితమే వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా వనపర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. రాకేష్ మృతితో శ్రీరంగాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పంజావిసిరిన అతిసార గద్వాలటౌన్: పట్టణంలోని ఒంటెలపేట కాలనీకి చెందిన చాంద్‌పాష(55) రెండురోజులుగా వాంతులు, విరేచనాలకు గురయ్యాడు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. అదే కాలనీలో నివాసముంటున్న షరీఫ్, గౌస్మైనుద్దీన్, అన్వర్, సలాంమియా, రిహాన్, షరీఫ్, మెహ్రాజ్‌బేగం, గంజిపేటకు చెందిన గిరి, జమ్మిచేడు గ్రామానికి చెందిన నాగరాజు అతిసార బారినపడ్డారు. ప్రస్తుతం వీరు గద్వాల ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వీరిలో సలాంమియా, రిహాన్ల పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. ఒంటెలపేట కాలనీలో తాగునీరు కలుషితం కావడం వల్లే స్థానికులు అతిసార బారినపడ్డారని, పైప్లైన్లు లీకేజీ కావడంతోనే నీరు కలుషితమైందని మునిసిపల్ అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే పరామర్శ.. స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ అతిసారబారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. మృతుడు చాంద్‌పాష కుటుంబసభ్యులను ఆమె పరామర్శించి ఓదార్చారు. -
స్టెతస్కోప్ వదిలేసి చోరీల బాట
దొంగగా అవతారమెత్తిన ఆర్ఎంపీ అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు రూ.9 లక్షల సొత్తు స్వాధీనం పరారీలో మరో నిందితుడు వరంగల్ క్రైం : వైద్యంపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఓ ఆర్ఎంపీ దొంగగా అవతారమెత్తాడు. అప్పటికే ఇళ్లకు కన్నాలేసే విద్యలో ఆరితేరిన తన అన్నతమ్ముడిలాగే తాను చోరీల బాటపట్టాడు. చివరికి వరంగల్ సీసీఎస్ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతడి నుంచి పోలీసులు రూ.9 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా కథనం ప్రకారం. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం రామారం గ్రామాని కి చెందిన రాంటెంకి రాజ్‌కుమార్ అలియాస్ రాజు ఆర్ఎంపీగా పనిచేస్తుండేవాడు. అతడి అన్న శ్రీనివాస్, తమ్ముడు సారయ్య ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ జల్సాలు చేసేవారు. గతంలో ఆదిలాబాద్, కరీంనగర్లో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిన వారిద్దరు మేలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఆర్ఎంపీగా పనిచేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజ్‌కుమార్ కూడా దొంగతనాలకు పాల్పడాలనే ఆలోచనకు వచ్చాడు. అనంతరం అతడు తన తమ్ముడు సారయ్యతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. ఇద్దరు కలిసి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దొంగతనాలు చేశారు. వీరు తాళం వేసిన ఎనిమిది ఇళ్లలో చోరీలకు పాల్పడ డమేగాక.. పది మంది మహిళల మెడలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సహకార నగర్, ఎక్సైజ్‌కాలనీ, మిల్స్‌కాలనీ పరిధిలోని శివనగర్ , మామునూరు పరిధిలోని గణేష్‌నగర్, కాజీపేటలోని ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. సుబేదారి పోలీ స్‌స్టేషన్ పరిధిలోని విజయ్పాల్కాలనీ, రాంనగర్, అశోకకాలనీ, మట్టెవాడ పరిధిలోని మర్రి వెంకటయ్య కాలనీ, బ్యాంకు కాలనీ, ఇంతెజార్గంజ్ పరిధిలోని గిర్మాజీపేట, కాజీపేట రైల్వేక్వార్టర్స్ ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లారు. రాజ్‌కుమార్ తాను చోరీ చేసిన సొత్తును బుధవారం వరంగల్ బులియన్ మార్కెట్లో అమ్ముకునేందుకు రాగా సమాచారం అందుకున్న సీసీఎస్ సీఐ ఆదినారాయణ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.9 లక్షల విలువైన 442 గ్రాముల బంగా రం, వంద గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడైన రాజ్‌కుమార్ తమ్ముడు సారయ్య పరారీలో ఉన్నాడు. -
వైద్యం పూజ్యం
నెల్లూరు (వైద్యం): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏళ్ల తరబడి ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రతి ఏటా భారీగా నిధులు విడుదలవుతున్నాయి. కాని వాటిని సద్వినియోగం చేయడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పీహెచ్‌సీలన్నీ సమస్యలతో విలవిలలాడుతున్నాయి. ఉదాహరణకు ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం పీహెచ్సీలో కొన్ని నెలలుగా వైద్యులు లేరు. ఇటీవల ఆ ఆస్పత్రి ఫార్మసిస్ట్ దగదర్తికి బదిలీ అయ్యారు. కనీసం ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేకపోవడం వైద్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టకు నిదర్శనమని చెప్పవచ్చు. ఈ ఆస్పత్రికి నిత్యం 70 మందికి పైగా ఔట్‌పేషంట్లు వస్తుంటారు. వీరికి ఏఎన్‌ఎమ్‌లే వైద్యసేవలు అందించడం గమనార్హం. జిల్లాలో మొత్తం 74 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులు, రెండు పీపీ యూనిట్లు, 17 క్లస్టర్లు ఉన్నాయి. పోస్ట్‌లు అవసరం పని చేస్తున్నవారు ఖాళీలు వైద్యులు 172 151 21 స్టాఫ్ నర్సులు 135 99 36 ఏఎన్ఎమ్ 477 325 152 కాంట్రాక్ట్ఏఎన్ఎం 477 394 83 ఫార్మాసిస్ట్లు 66 42 24 ల్యాబ్ టెక్నీషియన్ 62 15 47 -
విషాదం తల్లిడిల్లిపోయి..
కాలిన గాయాలతో ఆ చిన్నారి విలవిలలాడింది.. కొద్దిసేపటికే శ్వాస ఆగిపోయింది.. ‘తాతా’ నొప్పిగా ఉందంటూ మరో పసిప్రాణం రోదించింది.. ‘ఏం కాదులే నాన్నా’ అంటూ ఉబుకుతున్న క న్నీళ్లను అదిమిపెట్టుకుని ఆ తాత ఓదార్చాడు.. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశాడు.. అత్తామామలు పెడుతున్న వేధింపులు తాళలేక ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తికి చెందిన కల్పన బుధవారం పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది.. తాను లేకుంటే తన పిల్లలను ఎవరు చూసుకుంటారని అనుకుందేమో.. వారిపైనా పెట్రోలు పోసి నిప్పంటించింది.. తీవ్రంగా గాయపడిన తల్లి కల్పన, చిన్నారులు విశాల్‌రెడ్డి (3), అక్షేశ్వరి(1) ఒకరి తర్వాత మరొకరు ఈలోకం నుంచి వెళ్లిపోయారు. ప్రొద్దుటూరు క్రైం/ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చలివిండ్ల కల్పన (25) కుమారుడు విశాల్‌రెడ్డి (3), కుమార్తె అక్షేశ్వరి (1)పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఆ చిన్నారులు మంటల్లో కాలుతుండగానే తనపై కూడా పెట్రోల్ పోసుకొని తగులబెట్టుకుంది. ముగ్గురిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా కొద్ది సేపటికే తల్లీపిల్లలు తనువు చాలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడటంతో హనుమనగుత్తిలో విషాదం అలముకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... హనుమనగుత్తికి చెందిన చలివెండ్ల మునిరెడ్డి ప్రొద్దుటూరులో వోడా సెల్‌ఫోన్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి ఐదేళ్ల క్రితం జమ్మలమడుగు మండలం బొమ్మేపల్లి గ్రామానికి చెందిన కల్పనతో వివాహమైంది. వివాహ సమయంలో కట్నకానుకల కింద సుమారు రూ.3.75 లక్షలు దాకా ఇచ్చారు. మునిరెడ్డి తల్లి దండ్రులు లలితమ్మ, రాజగోపాల్‌రెడ్డి, తమ్ముడు, చెల్లెలు కూడా ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు. భర్త బాగానే చూసుకుంటున్నప్పటికీ అత్తామామల వేధింపులపై కలత చెందేది. కొన్ని రోజుల నుంచి అత్తామామల వేధింపులు అధికమైనట్లు కల్పన తన సోదరుడికి ఫోన్ చేసి తెలిపేది. రెండు రోజుల క్రితం కూడా ఫోన్ చేయగా తాను వచ్చి మాట్లాడతానని చెప్పాడు. ఇంతలోనే ఘోరం జరిగి పోయింది. అధికమైన వేధింపులు ఇటీవల పిల్లలతో పాటు కల్పనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు గాను సుమారు రూ. 5 వేలు దాకా ఖర్చు అయింది. ఈ డబ్బు విషయమై అత్త లలితమ్మ రెండు మూడు రోజుల నుంచి అడుగుతుండేది. ఖర్చు అయిన డబ్బును పుట్టింటి నుంచి తీసుకుని రమ్మని వేధించేది. దీంతో కల్పన రెండు రోజుల క్రితం అన్న శౌరెడ్డికి ఫోన్ చేసింది. వెంటనే డబ్బు పంపాలని కోరింది. తీసుకుని వస్తానని చెల్లెలుకు అన్న భరోసా ఇచ్చాడు. మంగళవారం రాత్రి ఏం జరిగిందో కానీ బుధవారం ఉదయం కూడా తన అన్నకు కల్పన ఫోన్ చేసి రమ్మని చెప్పింది. ఇంతలోనే ఇంట్లో ఎవరూ లేనిది చూసుకుని బయట ఆడుకుంటున్న పిల్లలను ఇంట్లోకి పిలిచింది. పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంట్లోకి తీసుకుని వెళ్లి పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. తర్వాత తాను కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలుతున్న వాసన రావడంతో స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ఘోరం వెలుగుచూసింది. హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే లోపే కల్పన మృతి చెందగా, కొద్ది సేపటి తర్వాత చిన్నారి అక్షేశ్వరి చనిపోయింది. బాలుడి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని భావించిన కుటుంబ సభ్యులు వైద్యుల సూచన మేరకు వెంటనే కర్నూలుకు తరలించారు. అయితే మార్గం మధ్యలోనే విశాల్‌రెడ్డి తనవు చాలించాడు. విషయం తెలియడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. కల్పనతో పాటు పిల్లల మృత దేహాలను చూసి కంట తడిపెట్టారు. గాయాలతో పిల్లల రోదనలు కాలిన గాయాల బాధను భరించలేని చిన్నారులు రోదించారు. ఆస్పత్రికి చే ర్చిన కొద్ది సేపటి తర్వాత అక్షేశ్వరి శ్వాస ఆగిపోయింది. విశాల్‌రెడ్డి మాత్రం నొప్పిగా ఉందంటూ తాతతో చెబుతూ ఏడవసాగాడు. ఏం కాదులే నాన్నా.. బాగవుతుందిలే అంటూ మనువడికి ఆ తాత ధైర్యం చెప్పాడు. అత్తామామలపై కేసు నమోదు కల్పన సోదరుడు శౌరెడ్డి ఫిర్యాదు మేరకు మామ రాజగోపాల్‌రెడ్డి, అత్త లలితమ్మ, ఆడపడచు, మరిదిలపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల ఎస్ఐ భానుమూర్తి తెలిపారు. నా బంగారు బిడ్డా..వెళ్లిపోయావా.. కల్పన మరణ వార్త విన్న తల్లి రామాంజులమ్మ, సోదరుడు శౌరెడ్డి బొమ్మేపల్లి నుంచి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారు వచ్చేలోపే కల్పన, అక్షేశ్వరి మృతి చెందారు. కల్పన మృత దేహాన్ని చూసిన తల్లి హృదయం తల్లడిల్లి పోయింది. నా బంగారు బిడ్డా వెళ్లిపోయావా.. ఎంత కష్టం వచ్చిందే తల్లి నీకు.. ఇంత అఘాయిత్యం ఎలా చేసుకున్నావంటూ రోదించింది. ఊరికి రమ్మంటే దీపావళి పండుగకు వస్తానని చెప్పావే.. ఇంతలోనే ఇలా చేశావే అంటూ విలపించసాగింది. కల్పన తండ్రి 12 ఏళ్ల క్రితం కరెంట్ షాక్‌తో చనిపోయాడు. -
బతక లేక.. మెతుకు లేక..
కష్టాల కడలిలో ‘చెన్నమ్మ’ దెబ్బతిన్న కుమారుడి రెండు కిడ్నీలు ఓ కిడ్నీని దానం చేసిన తల్లి కాళ్లు విరిగిన భర్త దిక్కూమొక్కు లేక దీనావస్థలో పేద కుటుంబం మెరుగైన వైద్యం కోసం దాతల వైపు చూపు సాక్షి, సిటీబ్యూరో: ఆ నిరుపేద కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. సమస్యల మీద సమస్యలు రావడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. అటు బతుకుదెరువు సాగక, ఇటు వైద్యం చేయించుకునే పరిస్థితి లేక ఆ కుటుంబం సతమతమవుతోంది. కొడుకు రెండు కిడ్నీలు పాడైతే తల్లే ఓ కిడ్నీ దానం చేసింది. అదే సమయంలో భర్త గాయపడి మంచాన పడ్డాడు. ఇన్ని సమస్యల మధ్య ఆమె ఒక్కతే పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భర్త, కుమారుడి వైద్యం కోసం దాతల వైపు దీనంగా ఎదురు చూస్తోంది చెన్నమ్మ. మాలపాటి బాల చెన్నయ్య(38), చెన్నమ్మ(36)లు దంపతులు. వీరికి బాలు(14) అనే కుమారుడున్నాడు. వీరిది గుంటూరు జిల్లా నరసారావుపేట వెంగళరెడ్డి నగర్. నిరుపేద దళిత వర్గానికి చెందిన వీరు కూలి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు బాలు స్థానికంగా ఏడోతరగతి చదువుతున్నాడు. గత ఏడాది బాలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. నగరంలోని ఉస్మానియాలో వైద్యులు పరీక్షించి అతడి రెండు కిడ్నీలు చెడిపోయాయని తేల్చారు. బాలుకు ప్రాణం పోసేం దుకు తల్లి చెన్నమ్మ ముందుకు వచ్చింది. తన కిడ్నీని కుమారుడికి దానం చేసింది. నిమ్స్‌లో ఆపరేషన్‌కు ఆరోగ్యశ్రీ కింద వచ్చిన రూ.2 లక్షలతోపాటు ఇళ్లు అమ్మగా వచ్చిన రూ.9 లక్షలు కలిపి మొత్తం రూ.11 లక్షలు ఖర్చు చేశారు. నెలనెలా డయాలసిస్‌కు హైదరాబాద్‌కు రాలేక ఇక్కడే కూకట్పల్లి ప్రాంతంలోని ప్రగతినగర్‌లో భవన నిర్మాణ కూలీగా పనికి కుదిరా డు చెన్నయ్య. నాలుగు నెలల క్రితం చెన్నయ్య పనులు చేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డాడు. రెండు కాళ్లు విరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. అటు కుమారుడి పరిస్థితి బాగాలేక ఇటు భర్త మంచాన పడడంతో చెన్నమ్మ తల్లడిల్లిపోయింది. ఆమె కిడ్నీ దానం చేసినందున నెలకు 30 రోజులు పని చేయలేని పరిస్థితి. అయినా ఎలాగోలా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. భర్త, కుమారుడి మందులకే నెలకు రూ.15 నుంచి 20 వేలు ఖర్చు అవుతోందని ఆమె చెబుతోంది. తనకు డబ్బులు చేతికివ్వాల్సిన అవసరం లేదని, కుమారుడుకి నెలనెలా డయాలసిస్, భర్త కోలుకునే వరకు మందులకు సహాయం చేస్తే చాలునని చెన్నమ్మ రెండు చేతులు జోడించి వేడుకొంటోంది. కరుణ చూపేవారెవరైనా 8106187906 నంబర్లో సంప్రదించాలని ఆమె కోరుతోంది. -
నిర్లక్ష్యం నీడలో అంగన్వాడీలు
రెడ్డిగూడెం : మతా శిశు మరణాలను అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు, కార్యకర్తల నిర్లక్ష్యం ఫలితంగా నిరుపయోగంగా మారుతున్నాయి. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు తరచూ గాయాల పాలవుతున్నారు. తాజాగా మండలంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాంబార్లో పడి చిన్నారికి తీవ్రగాయాలు మద్దులపర్వ గ్రామంలోని 173వ సెంటర్లో కొనంత మంగమ్మ అనే చిన్నారి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం తయారు చేసిన సాంబరులో ప్రమాదశాత్తు పడిపోయింది. దీంతో చిన్నారి వీపుభాగం కాలిపోయింది. ఈ సంఘటన అంగన్వాడీ కార్యకర్త కె.నిర్మల ఉన్నతాధికారులకు తెలుపకుండా గోప్యంగా ఉంచారు. సూపర్వైజర్ బి.కృష్ణకుమారి కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లినప్పుడు ఈవిషయం ఆమె దృష్టికి వచ్చి ంది. దీంతో అవాక్కన ఆమె చిన్నారి వివరాలు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విస్సన్నపేటలో చికిత్స పొందుతున్న చిన్నారి వద్దకు వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబమని, వైద్యం చేయించడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని చిన్నారి తల్లిదండ్రులుకోరగా, ఐసీడీఎస్ సీడీపీవో ఇందిరాకుమారి చిన్నారి తల్లిదండ్రులకు రూ.250 ఇచ్చారు. ఇంత జరిగినా అంగన్వాడీ కార్యకర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించకపోవడం గమనార్హం. గుడ్డు అడిగితే కేసా..? ఇదే అంగన్ వాడీ కేంద్రంలో.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నెలకు 16 గుడ్లు, మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు,అరకేజీనూనె ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పంపిణీ చేయాల్సి ఉంది. ఇవి లబ్ధిదారులకు సక్రమంగా అందకపోవడంతో వారు అంగన్వాడీ కార్యకర్తను అడగ్గా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇద్దరూ బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీడీపీవో ఇందిరాకుమారిని వివరణ కోరగా 173వ కేంద్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తకు మెమో జారీచేశామని, పౌష్టికాహారం పంపిణీపై విచారణ జరిపి నివేదకను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. -
‘ఓపీ’క ఉంటే రండి!
నిమ్స్‌లో ఓపీ సేవలకు గ్రహణం రోజుల తరబడి రోగుల పడిగాపులు సమయానికి రాని వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: వైద్యం కోసం అవుట్ పేషెంట్ విభాగానికి వచ్చే రోగులకు నిమ్స్ వైద్యులు చుక్కలు చూపిస్తున్నారు. మెరుగైన వైద్యం సంగతి దేవుడెరుగు... కనీసం ఓపీ సేవలూ సక్రమంగా అందడం లేదు. రాజకీయ పలుకుబడి ఉన్న ‘పెద్ద ల’కు, బడా వ్యక్తులకు ఎర్రతివాచీ పరుస్తున్న వైద్యులు సుదూర ప్రాంతాల నుంచి ఓపీకి చేరుకునే సాధారణ, మధ్య తరగతి రోగులను కనీసం పట్టించుకోవడం లేదు. నిజానికి అవుట్ పేషెంట్ విభాగానికి ఉదయం 8.30 గంటలకు చేరుకుంటే... వైద్యుడు రాసిన పరీక్షలన్నీ చేయించుకుని, సాయంత్రానికల్లా మందులు తీసుకొని ఇంటికి చేరుకోవాల్సిన రోగులు రెండు రోజుల పాటు ఓపీలోనే పడిగాపులుకాయాల్సి వస్తోంది. సకాలంలో వైద్యులు రాకపోవడం, ఒకవేళ వచ్చినా మెడికల్ రిపోర్టులు సమయానికి అందకపోవడం వ ంటి కారణాలతో సేవలు జాప్యమవుతున్నాయి. తప్పని నిరీక్షణ సుమారు వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి నిత్యం 1500 మంది రోగులు వస్తుంటారు. వీరిలో రోజుకు సగటున 100-150 మంది అడ్మిట్ అవుతుంటారు. మిగతా విభాగాలతో పోలిస్తే, ఆర్థో, న్యూరో సర్జరీ, యూరాలజీ, గుండె జబ్బుల విభాగాలకు రోగుల తాకిడి ఎక్కువ. తలకు బలమైన గాయాలై ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రులు, పక్షవాతంతో బాధ పడుతున ్న రోగులకు ఆస్పత్రిలో అడ్మిషన్ కూడా దొరకడం లేదు. న్యూరో సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆరోగ్యశ్రీ రోగులను ప్రైవేటు ఆస్పత్రులు చేర్చుకోకపోవడంతో వీరంతా నిమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వైద్యం చేయించుకోవాలంటే 15నుంచి నెల రోజుల పాటు ఎదురు చూడాల్సి వ స్తోంది. ఇలా ఇప్పటికే 300 మందికిపైగా సర్జరీల కోసం ఎదురు చూస్తున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. దీంతో కొత్తగా ఎవరైనా వస్తే చేర్చుకోవడం లేదు. ఇక దెబ్బతిన్న వెన్నుపూస జాయింట్లను సరిచేయాలంటే సియరమ్ అనే వైద ్య పరికరం అవసరం. ఆస్పత్రిలోని ఈ పరికరం నెలరోజుల క్రితం పాడైంది. మరమ్మతుల విషయమై సంబంధిత విభాగం వైద్యులు పట్టించుకోవడం లేదు. గుండెను పిండేస్తున్న నిర్లక్ష్యం కార్డియాలజీ విభాగంలో శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన వైద్య పరికరం తమ వద్ద లేదని చెబుతూ రోగులను చేర్చుకోకుండా తిప్పి పంపుతున్నారు. అడపా దడపా చేర్చుకున్నా సకాలంలో శస్త్ర చికిత్స చేయకపోవడంతో హృద్రోగంతో బాధ పడుతున్న వారు ఆస్పత్రిలోనే మృత్యువాత పడుతున్నారు. ఇక యూరాలజీ విభాగంలో రోగుల సంఖ్యకు సరిపడే వైద్యులు లేకపోవడంతో చికిత్సల్లో తీవ్ర జాప్యం తప్పడం లేదు. దాదాపు ప్రతి విభాగంలోనూ ఏదో సమస్య ఎదురవుతుండడంతో ఓపీకి వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. -
రహదారులు రక్తసిక్తం
జిల్లాలో గురువారం జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. నందిగామ మండలం మునగచర్ల, గుడ్లవల్లేరు మండలం అంగలూరు, జంక్షన్ సమీపంలోని శేరినరసన్నపాలెంలో ఈ ఘటనలు జరిగాయి. మృతుల్లో ఒకరు బాలుడు. మునగచర్ల సమీపంలో జరిగిన ఘటనలో ఇద్దరు రైతులు మరణించారు. నందిగామ రూరల్ : నందిగామ మండలం మునగచర్ల సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు మహిళలతో సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సేకరించిన సమాచారం ప్రకారం.. నందిగామ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ మునగచర్ల సమీపంలోకి రాగానే డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని తగ్గిం చాడు. ఆ సమయంలో లారీ వెనుక మోటార్ సైకిల్, దాని వెనుక కారు వస్తున్నాయి. లారీ డ్రైవర్ అకస్మాత్తుగా వేగాన్ని తగ్గించడంతో వెనుక వస్తున్న కారును డ్రైవర్ నియంత్రించలేకపోయాడు. దీంతో కారు బైక్‌ను, లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు లారీ, కారు మధ్య నలిగి అక్కడికక్కడే మరణించారు. మృతులిద్దరూ పెనుగంచిప్రోలు మండలం బండిపాలెం గ్రామానికి చెందిన రైతులు కాట్ల రమేష్(35), కాసరగడ్డ శ్రీనివాసరావు(50)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన యనగాల నూకానమ్మ (బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు), నందిగామ మండలం కొండూరుకు చెందిన ఎం కనకదుర్గ, నందిగామకు చెందిన వాసిరెడ్డి పూర్ణచంద్రరావు, నందిగామ మండలం సోమవరానికి చెందిన బాదినేని రామారావుకు తీవ్ర గాయాలయ్యాయి. నూకానమ్మ తలకు బలమైన గాయమైంది. గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరుకుల కోసమని వచ్చి... బండిపాలెం గ్రామానికి చెందిన రైతులు కాట్ల రమేష్, కాసరగడ్డ శ్రీనివాసరావు బైక్‌పై నంది గామ వచ్చారు. సరుకులు, కూరగాయలు, వ్యవసాయానికి సంబంధించి కొన్ని విత్తనాలు కొనుగోలు చేశారు. వాటితో స్వ గ్రామం తిరిగి వెళుతుండగా ఈ దుర్ఘటన జరి గింది. ఘటనా స్థలిని నందిగామ ఇన్స్పెక్టర్ భాస్కరరావు సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. కన్నీరు మున్నీరైన కుటుంబీకులు.. ప్రమాద వార్త తెలియగానే బండిపాలెం గ్రామం నుంచి మృతుల కుటుంబ సభ్యులతో పాటు పలువురు ఘటనాస్థలికి వచ్చారు. ఛిద్రమైన మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించడం అక్కడ ఉన్నవారి కంట తడి పెట్టించింది. ఘటనా స్థలిలో కూరగాయలు, సరుకులు, పలు రకాల విత్తనాలు చిందరవందరగా పడి ఉన్నాయి. రమేష్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కార్మికుడి ఉసురు తీసిన బస్సు శేరినరసన్నపాలెం (హనుమాన్‌జంక్షన్ రూరల్) : చెన్నై-కోల్కత్తా జాతీయ రహదారిపై మండలంలోని శేరినరసన్నపాలెంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయనగరం వెళ్లి తిరిగి వస్తోంది. శేరినరసన్నపాలెం గ్రామంలో డెల్టా సుగర్స్ వద్ద సైకిలుపై గడ్డి మోపుతో వెళుతున్న చెరువూరి వెంకట కృష్ణారావు(55)ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించాడు. గ్రామంలోని ముందడుగు కాలనీకి చెందిన కృష్ణారావు డెల్టాసుగర్స్లో సీజనల్ కార్మికుడు. అదే కాల నీ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలియగానే కాలనీవాసులు అక్కడకు చేరుకున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తె లు, కుమారుడు ఉన్నారు. ఎస్సై పాటి వాసు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. బస్ డ్రైవర్ సి.శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జెడ్పీసీటీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, సంజీవరావు దంపతులు వచ్చి కృష్ణారావు మృతదేహం వద్ద నివాళులర్పించారు. బాలుడి పాలిట మృత్యుశకటం అంగలూరు(గుడ్లవల్లేరు) : పొలం వద్దకు వెళ్లిన తల్లిని కలుసుకునేందుకు సైకిల్‌పై బయలుదేరిన బాలుడి ప్రాణాలను లారీ మృత్యువు రూపంలో కబళించింది. పోలీసులు తెలిపిన తెలిపిన సమాచారం ప్రకారం.. మండలంలోని అంగలూరు గ్రామానికి చెందిన దాసి చిలకమ్మ గురువారం పొలానికి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుమారుడు రవితేజ(14) సైకిల్‌పై ఆమె వద్దకు బయలుదేరాడు. ఊరి శివారులో మలుపు వద్ద తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి సైకిల్‌ను ఢీకొట్టింది. అప్పటికీ డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో లారీ ముందున్న మరో సైకిల్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రవితేజ అక్కడికక్కడే మరణించాడు. మరో సైకిల్‌పై వెళుతున్న ఉచ్చుల రాఘవులు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఎ.గణేష్‌కుమార్ సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన లారీ డ్రైవర్ పెంటుమాల్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం గురించి తెలియగానే రవితేజ తల్లి చిలకమ్మ ఘటనాస్థలికి వచ్చింది. కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. చేతికంది వస్తున్న కుమారుడిని కాలం కాటేసిందం టూ ఆమె విలపించడం అక్కడ ఉన్న వారిని ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. -
మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన రేణుక
కొత్తగూడ : మెదడు సంబంధ వ్యాధితో 12 రోజులుగా మృత్యువుతో పోరాడిన పీజీ విద్యార్థి గొంది రేణుక(22) తుదిశ్వాస విడిచింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. మండలంలోని ముస్మి గ్రామానికి చెందిన రేణుక చిన్నతనం నుంచి చదువుల్లో ముందుండేది. ఇటీవల జ్వరం రావడం తో మెదడులో గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు వైద్యం అందించే సమయానికే కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. రేణుక పరిస్థితిపై ‘సాక్షి’లో కూడా ఈ నెల 24న ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం రాజయ్య స్పందించి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని, అందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆమెను మృత్యువు కబలించింది. రేణుక మృతితో ఆమె సహవిద్యార్థులు కన్నీరుమున్నీరయ్యూరు. మృతదేహం వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. అశ్రునయనాల మధ్య ముస్మిలో ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. -
నిమ్స్ పనులను వేగవంతం చేయాలి
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బీబీనగర్: తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం చేపట్టిన నిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సంబంధిత నిర్మాణ సంస్థ అయిన నాగార్జున కన్స్ట్రక్షన్ అధికారులను ఆదేశించారు. నిమ్స్ యూనివర్సిటీ భవనంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పునఃప్రారంభించారు. అంతకుముందు భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు నెలల్లో నిమ్స్ భవనంలోని బీ, డీ బ్లాక్‌ల నిర్మాణ పనులను పూర్తిచేసి వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిమ్స్ విషయంలో అలసత్వం వహించకుండా అధికారులు ముమ్మరంగా పనులు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించామని, బకాయి ఉన్న రూ.34 లక్షల విద్యుత్ బిల్లును ట్రాన్స్‌కో శాఖకు చెల్లించినట్లు తెలిపారు. అలాగే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. నిమ్స్ అధికారులకు, కాంట్రాక్టర్‌కు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో నిమ్స్ డిప్యూటీ డెరైక్టర్ కేటీరెడ్డి, నాగార్జున కాంట్రాక్ట్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణారెడ్డి, నాయకులు జడల అమరేందర్, పిట్టల అశోక్, గాదె నరేందర్‌రెడ్డి, కొల్పుల అమరేందర్, కొలను దేవేందర్‌రెడ్డి, పంజాల బాల్‌రాజు, రవికుమార్, కిరణ్‌కుమార్, నరహరి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య వంటలు
జ్ఞానం మనం పెంచుకుంటే మనమే బాగుంటాం. మనకున్న జ్ఞానాన్ని పదిమందికీ పంచిపెడితే... ఎందరికో మేలు చేసినవాళ్లమవుతాం. ఈ విషయాన్ని నందిత షా బాగా నమ్ముతారు. అందుకే తనకు తెలిసిన మంచి సంగతుల్ని అందరికీ తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారామె. వృత్తిరీత్యా డాక్టర్ అయిన నందిత... వైద్యం మాత్రమే చేయరు. వైద్యం అవసరమే ఎవరికీ లేకుండా చేయాలని తపన పడతారు! రోగులు ఎక్కువమంది వస్తే హాస్పిటల్ బాగా నడుస్తుందని ఏ డాక్టరైనా అనుకుంటారు. కానీ తన హాస్పిటల్ ఎప్పుడూ ఖాళీగా ఉండాలని కోరుకునే డాక్టర్ ఎవరైనా ఉంటారా? ఉంటారు. కాదు, ఉన్నారు. ఆవిడే నందిత షా. రోగుల్ని ప్రేమించే నందిత... రోగాల పేరెత్తితే మాత్రం విసుక్కుంటారు. అసలు రోగం ఎందుకు రావాలి, ఎందుకు మనల్ని ఇబ్బంది పెట్టాలి, మన దగ్గరకు రాకుండా దాన్ని మనం ఎందుకు ఆపలేకపోతున్నాం అంటూ ఎమోషనల్‌గా మాట్లాడతారు. అలాగని ఆమె కేవలం మాటల మనిషి కాదు. చేతల మనిషి. చేరాలనుకున్న గమ్యాన్ని అందుకోవడం కోసం జీవితాన్నే అంకితం చేసే మనిషి! లక్ష్యం మారిందలా... కొందరు జీవించడానికి తింటారు. కొందరు తినడమే జీవితం అన్నంతగా ఆహారాన్ని ప్రేమిస్తుంటారు. అసలు అదే పెద్ద రోగం అంటారు నందిత. అలాంటి వారిలో మార్పు తీసుకు రావడమే లక్ష్యంగా ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారామె. అది పెరిగి పెరిగి... చివరకు ఓ పెద్ద ఉద్యమంలా తయారైంది. 1981లో... ముంబైలోని సీఎం పీహెచ్ మెడికల్ కాలేజీ నుంచి హోమియోపతి డాక్టర్ పట్టా పుచ్చు కున్నారు నందిత. వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఉత్సాహంగా వైద్యం చేయసా గారు. కొన్నాళ్లు గడిచేసరికి ఆమె ఒక విషయం గమనించారు. అదేంటంటే... ఎక్కువగా మధుమేహ వ్యాధిగ్రస్తులే ఆమె దగ్గరకు వస్తున్నారు. చక్కెర వ్యాధి ఒక్కసారి వచ్చిం దంటే జీవితాంతం వెంటాడు తూనే ఉంటుంది. అంతకాలం మందులు వాడటం చిన్న విషయం కాదు. అందుకే చాలామంది హోమియోపతిని ఆశ్రయిం చడం మొదలు పెట్టారు. ఆ విషయం అర్థం అయినప్పటి నుంచి నందిత మనసు మధు మేహం చుట్టూ తిరగసాగింది. దాని గురించి బాగా అధ్యయనం చేశారామె. ఆ భయంకర మైన వ్యాధికి అసలు కారణం అనారోగ్య కరమైన ఆహారపుటలవాట్లే అని అర్థం చేసుకున్నారు. వాటిని మార్చి తీరాలని బలంగా నిశ్చయించుకున్నారు. నాటి నుంచీ నందిత నడిచే మార్గంలో మార్పు వచ్చింది. అంతవరకూ రోగులకు వైద్యం చేయడమే తన కర్తవ్యమనుకున్న ఆమెకు మరో కొత్త గమ్యం ఏర్పడింది. భారత దేశాన్ని మధుమేహ రహిత దేశంగా మార్చడమే ఆమె లక్ష్యమైంది. ఆహార ఉద్యమ సారథి... ‘‘ఆరోగ్యంగా జీవించడంలోనే ఆనందం ఉంది. ఆరోగ్యమే లేనప్పుడు మనకేది ఉన్నా, ఎన్ని ఉన్నా ఉపయోగం ఉండదు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మన ప్రథమ లక్ష్యం కావాలి’’ అంటారు నందిత. మన దేశం నుంచి మధుమేహాన్ని తరిమికొట్టాలని నిర్ణ యించుకున్న ఆమె... ఆ వ్యాధికి కారణ మవుతున్న ఆహారపుటలవాట్ల మీద యుద్ధం ప్రక టించారు. ఆహార ఉద్యమాన్ని లేవదీశారు. డయా బెటిస్ని తిప్పి కొడదాం అనే నినాదంతో ‘రివర్స డయా బెటిస్’ అనే కార్యక్రమానికి తెర తీశారు. దేశంలోని ప్రముఖ పట్టణాలన్నింటి లోనూ వర్కషాపులు, సెమినార్లు ఏర్పాటుచేసి... ఆహారపు టలవాట్లు మధుమేహానికి, గుండె వ్యాధులకు ఎలా కారణమవుతున్నాయో చెప్పడం మొదలుపెట్టారు. అంతేకాదు... సహజ సిద్ధమైన దినుసులతో రుచికరమైన ఆహారాన్ని ఎలా వండుకోవాలో నేర్పించడం మొదలుపెట్టారు నందిత. ఆవిడ వంటకాలను రుచి చూసినవాళ్లంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. రుచులకు దూరం కాకుండా, అనారోగ్యాన్ని మాత్రమే దూరంగా పెట్టే ఆ ఆహార విధానాలను ఆమె వద్ద నుంచి నేర్చుకోవడానికి ముందుకొచ్చారు. అలా ఇరవయ్యేళ్లలో కొన్ని వేల మందిని, వారి జీవన విధానాలను మార్చేశారు నందిత. ‘‘ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే నోరు కట్టేసుకోవడం కాదు. కావలసినంత తినొచ్చు. కావలసినన్నిసార్లు తినొచ్చు. కానీ ఆ తినేది ఏంటి అన్న విషయంలో మాత్రం స్పష్టత ఉండాలి’’ అని చెప్పే నందిత... ఆహారం కోసం ప్రకృతి మీద ఆధారపడితే చాలంటారు. ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన ఆహారం తిన్నంతవరకూ ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావనే ఆమె... ఆ విషయం గురించి తెలియజేయడానికి 2005లో ‘షారన్ (SHARAN - Sanctuary of health and reconnection to animals and nature) అనే సంస్థను కూడా స్థాపించారు. మరికొందరు వైద్యులు, వాలంటీర్లతో కలిసి తన లక్ష్యసాధనలో మునిగిపోయారు. షారన్ పేరుతో ఆరువిల్లె (తమిళనాడు), అహ్మదాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో వెజిటేరియన్ రెస్టారెంట్లు కూడా తెరిచారు. సహజసిద్ధంగా పండించిన ఆహార పదార్థాలను దేశమంతా సరఫరా చేస్తున్నారు. డెన్మార్క, జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, అమెరికా, బ్రిటన్లతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా తన భావనలను, విధానాలను విస్తరించిన నందిత... త్వరలోనే మధుమేహరహిత భారతదేశాన్ని చూపి స్తాను అంటారు విశ్వాసంతో. రోగులను అనారోగ్యాల బారి నుంచి కాపాడా లనుకునే వైద్యులు చాలామంది ఉంటారు. కానీ అసలు అనారోగ్యమన్నదాన్నే రూపుమాపాలని ఆలో చించే నందిత షా లాంటివాళ్లు ఎక్కడా కనిపించరు. ఆమె లక్షల్లో ఒకరు. లక్ష్యసాధనలో ఆమెకు సాటి రారెవ్వరూ! - సమీర నేలపూడి ఆరోగ్యానికి హాని కలగకూడదన్న ఉద్దేశంతో చక్కెర, నెయ్యి లాంటి కొన్ని పదార్థాలను వినియోగించవద్దని వైద్యులు అంటారు కదా! కానీ నందిత వాటిని వాడొద్దని చెప్పరు. అవి లేకుం డానూ వండరు. ప్రతి పదార్థం గురించీ ఆమెకు స్పష్టంగా తెలుసు. ఏది ఎంత తింటే ప్రమాదం ఉండదో అంత వరకే వినియోగించి వండుకోవడం ఎలానో నేర్పుతారామె. ఆమె వంటకాలకి డిమాండ్ బాగా పెరిగింది. విదేశాల నుంచి సైతం వచ్చి రకరకాల రెసిపీలు నేర్చుకుని వెళ్తుంటారు చాలామంది. ‘షారన్’ వెబ్సైట్ చూసి కూడా కొన్ని నేర్చుకోవచ్చు. ఇంకా తెలుసు కోవాలంటే నందిత నడిపే వర్కషాప్కి వెళ్లడమే. ఒక్క రోజులో బోలెడు నేర్పుతారామె. -
వాయిదా వేయొద్దు..
ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన.. పాట తరహాలోనే మనం చాలా విషయాలను వాయిదావేసేస్తుంటాం. ఆ తర్వాత ఆఖరు నిమిషంలో ఆదరాబాదరాగా పరుగెడుతుంటాం. ఆర్థికపరమైన ప్లానింగ్ విషయాల్లో ఇలాంటి ధోరణి మరింతగా ఉంటుంది. దీనికి తోడు .. కొన్ని అంశాల్లో స్థిరమైన అభిప్రాయాన్ని పెట్టేసుకుని.. విపరీతమైన కాన్ఫిడెన్సుతో రావాల్సిన ప్రయోజనాలను కూడా పోగొట్టుకుంటూ ఉంటాం. అలాంటి కొన్ని అపోహలు.. వాటికి పరిష్కార మార్గాల సమాహారమే ఈ కథనం.. రిటైర్మెంట్ ప్లానింగ్ ఇప్పుడే ఎందుకు పదవీ విరమణ తర్వాత ఆదాయం గణనీయంగా తగ్గి ఖర్చులు పెరుగుతుంటాయి. ఇందుకోసం కెరియర్ ప్రారంభం నుంచే ప్రణాళిక వేసుకుంటే అప్పుడు కంగారు పడనక్కర్లేదు. కానీ, రిటైర్మెంట్ ఎప్పుడో వస్తుంది.. ఇప్పట్నుంచి ప్లానింగ్ ఎందుకు అని మనలో చాలా మంది పక్కన పెడుతుంటారు. ఏడాదంతా ఆటల్లో గడిపేసి సరిగ్గా పరీక్షల ముందు రోజు పుస్తకం తీసినట్లుగా.. రేపో ఎల్లుండో రిటైర్ అవుతున్నామనగా అప్పుడు హడావుడి పడుతుంటారు. కానీ ఒక్కరోజులోనో లేదా అయిదేళ్లలోనో రిటైర్మెంట్ అవసరాలకు కావాల్సినంత డబ్బును సమకూర్చుకోవడం సాధ్యం కాదు కదా. కాబట్టి, పెరిగే ధరలు, వైద్యం ఖర్చు లు, పదవీ విరమణ చేసిన తర్వాత ఎదురయ్యే అనిశ్చితి పరిస్థితులను ధీమాగా ఎదుర్కొనేందుకు ఎంత ముందు నుంచి ప్రణాళిక వేసుకుంటే అంత మంచిది. ఇప్పటి లైఫ్‌స్టయిల్‌నే రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగించాలంటే ఎంత డబ్బు పోగు చేసుకోవాలన్నది లెక్కలు వేసుకుని, ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలి. దీన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేయకుండా ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటే తప్ప నిశ్చింతగా రిటైర్మెంట్ సాధ్యం కాదు. ఇప్పుడప్పుడే ఇన్వెస్ట్ చేయలేను భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా అంటే ఠక్కున సమాధానం చెప్పగలిగే వారు ఏ కొందరో ఉంటారు. మిగతా వారంతా ఇంటి ఖర్చులు, ఈఎంఐలు మొదలైన సమస్యల గురించి చెప్పుకొస్తారు. ఇవన్నీ తీరితే గానీ ఇన్వెస్ట్మెంట్ల వైపు చూడలేమంటారు. ఈలోగా సమయం కాస్తా గడిచిపోతుంది. అలా కాకుండా.. అవసరమైతే వినోదం, టూర్లు వంటి ఖర్చుల్లో కొంత కోత పెట్టుకునైనా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టడం మంచిది. ఎంత ఇన్వెస్ట్ చేశామన్నదాని కన్నా ఎంతో కొంతైనా దాచిపెట్టగలగడం మంచిదని గుర్తుంచుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు చాల్లే .. సరే.. ఇన్వెస్ట్ చేయాలని బలంగా అనుకున్న తర్వాత మనం పెట్టుబడి అత్యంత సురక్షితంగా ఉండాలనే కోరుకుంటాం. షేర్లు వగైరా లాంటి రిస్కీ సాధనాల్లోకి వెడితే అసలుకే మోసం వస్తుందని... సురక్షితంగా ఉంటుందని ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు చూస్తుంటాం. ఈ జాగ్రత్తల్లో పడి పన్నులు పోగా ఎఫ్డీలపై ఎంత రాబడి వస్తుంది, పెరిగిపోతున్న ధరలను ఆ రాబడితో ఎదుర్కొనగలమా లేదా అన్నది అంతగా లెక్కలు కట్టుకోము. కాబట్టి, దీర్ఘకాలానికి సంబంధించిన ఎఫ్డీలనే నమ్ముకుని కూర్చోకుండా ఇతరత్రా ఇన్వెస్ట్మెంట్ సాధనాలవైపు కూడా చూడాలి. మ్యూచువల్ ఫండ్లలో డబ్బు పోతుంది సర్వసాధారణంగా వినిపించే మరో విషయం ఇది. వాహనం నడపడం నేర్చుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు కింద పడిపోయామని నేర్చుకోవడమూ మానేయము.. నడపడమూ మానేయం. ఇదీ అలాంటిదే. ఎందులో ఇన్వెస్ట్ చేసినా ఎంతో కొంత రిస్కు ఉంటుంది. దీర్ఘకాలిక అవసరాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు పరిస్థితులను బట్టి కొన్ని సార్లు పెట్టుబడుల విలువ హెచ్చుతగ్గులకు లోను కావొచ్చు. అంత మాత్రం చేత అసలు దాని జోలికే వెళ్లకూడదనుకుంటే అధిక రాబడులు వచ్చే అవకాశాలను కోల్పోవచ్చు. షేర్లలోనూ, డెట్ సాధనాల్లో .. ఈ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ పథకాలూ ఉన్నాయి. మన రిస్కు సామర్థ్యం, లక్ష్యాన్ని చేరడానికి కావాల్సిన సమయం లాంటివి అంచనా వేసుకుని తగిన పథకాన్ని ఎంచుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ దండగ వ్యవహారం.. పైసా పెట్టుబడి పెడుతున్నామంటే... దానిపై ఎంతో కొంత రావాలని ఆశిస్తాం. ఆఖరికి జీవిత బీమా విషయంలో కూడా అలాగే అనుకుంటాం. జీవితానికి భరోసా కల్పించే బీమా వేరు .. రాబడులు అందించే పెట్టుబడి సాధనాలు వేరు అన్న సంగతి మర్చిపోతుంటాం. రెండింటినీ ఒకే గాటన కట్టేసి బీమా కోసం కట్టే డబ్బు సైతం తిరిగిరావాల్సిందే అని భావిస్తాం. కానీ, బీమా ఫీచర్లతో రాబడులు కూడా అందించే ఇతర పాలసీలు కాస్త ఖరీదైనవిగా ఉంటాయి. కట్టిన ప్రీమియం తిరిగి రాకపోయినా.. ఇతర పాలసీలతో పోలిస్తే టర్మ్ పాలసీలు అత్యంత తక్కువ ఖర్చుతో అత్యధిక రక్షణ కల్పిస్తాయని గుర్తెరగాలి. నాకెవ్వరూ సలహాలివ్వక్కర్లేదు.. ఆర్థిక విషయాలకు సంబంధించి చాలా సందర్భాల్లో మనకు మనం ఇలా సర్ది చెప్పుకుంటూ ఉంటాం. డబ్బు విషయాలను మేనేజ్ చేసుకోవడం చాలా సులభమైన విషయం.. ఇందుకోసం ఫైనాన్షియల్ ప్లానర్ల సహాయమో లేదా మరొకరి సలహాలో అనవసరం అనుకుంటాం. ఏముందీ.. పన్నులు గట్రా చూసుకోవడం, పీఎఫ్, ఎఫ్డీలు మొదలైనవి చేసుకుంటే సరిపోతుందని భావిస్తాం. కానీ, ఆరోగ్య సమస్య వస్తే డాక్టరు దగ్గరికి, చట్టపరమైన సమస్యలు వస్తే లాయర్ల దగ్గరికి ఎలా వెళ్లక తప్పదో ఆర్థిక అంశాల విషయంలోనూ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఖర్చులను అదుపు చేసుకోగలం.. ప్రత్యేకంగా బడ్జెట్ వేసుకోనక్కర్లేదు.. ఖర్చులను అదుపు చేసుకునే సామర్ధ్యం మనకి ఉంది అను కుంటాం. అదే ఉద్దేశంతో క్రెడిట్ కార్డులనూ తీసుకుంటాం. అవసరమైనప్పుడే వాటిని వాడుతున్నామనీ సర్ది చెప్పుకుంటాం. కానీ అప్పు ఏదైనా అప్పే. క్రెడిట్ కార్డులతో రివార్డు పాయింట్లని కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. సరైన సమయానికి బిల్లు కట్టకపోతే కష్టమే. కాబట్టి సరైన బడ్జెట్ వేసుకుని, దానికి కట్టుబడి ఉంటేనే పురోగమించగలం. ఎమర్జెన్సీకి వ్యక్తిగత రుణం.. అత్యవసర పరిస్థితి తలెత్తిందంటే అర్జెంటుగా పర్సనల్ లోన్ ఎక్కడ దొరుకుతుందా అని వెతికేస్తాం. కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లపైనా, బంగారం పైనా, బీమా పాలసీలపైనా, ప్రావిడెంట్ ఫండ్‌పైనా లోన్ తీసుకునే అవకాశం ఉందన్న సంగతి ఠక్కున గుర్తుకురాదు. ఇవి వ్యక్తిగత రుణాల కన్నా తక్కువ వడ్డీ రేటుకే లభిస్తాయి కూడా. అయితే, అత్యవసర పరిస్థితుల్లో రుణాల కోసం తిరగాల్సిన పరిస్థితి లేకుండా ముందునుంచే ఇలాంటి సందర్భాల కోసం కొంత అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఆఫీసు ఇచ్చే వైద్య బీమా చాలు.. ఉద్యోగం చేసే కంపెనీ ఎలాగూ వైద్య బీమా సదుపాయం కల్పిస్తోంది కాబట్టి.. వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకోవడం దండగ అనుకుంటాం. కానీ ఇది నిజంగా సరిపోతుందా అంటే కచ్చితంగా సరిపోదు. సదరు కంపెనీలో పనిచేసినంత కాలం మాత్రమే కవరేజి లభిస్తుంది. మరో కంపెనీకి మారినా, ఉద్యోగం మానేసినా ఆ కవరేజి పోయినట్లే. కాబట్టి, కంపెనీ మెడి క్లెయిమ్ పాలసీ ఇచ్చినప్పటికీ ముందునుంచి వ్యక్తిగతంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం మంచిది.