హైదరాబాద్: వైద్యాన్ని మారుమూల గ్రామాల ప్రజలకు అందించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సులో భాగంగా మంగళవారం కేంద్ర చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి కోటి 60 లక్షల మందికి పరీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. దీనిని ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకున్నాయని చెప్పారు. ఒక్కొక్క మండలానికి 12 మంది టీమ్‌లుగా ఏర్పాటు చేసి ఆపరేషన్లు, దృష్టి లోపం ఉన్న వారికి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలి పారు. రాష్ట్రవ్యాప్తంగా 844 మంది ప్రత్యేక సిబ్బంది కంటి వెలుగు శిబిరంలో పాల్గొని సేవలందించినట్లు తెలిపారు. వైద్య రంగం ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం ముందున్న ప్రధాన అంశమన్నారు.
అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి..
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోగాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ వైద్య నిపుణులకు సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రభు త్వ సేవలను ప్రజల వద్దకు ఉచితంగా చేరువయ్యేలా చూడాలని వారికి సూచించారు. వైద్య సేవలను అందించడానికి ముందుకొచ్చిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ తమవంతు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నయం చేయడానికి మందులను అందించాలని వెల్లడించా రు.
నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని వైద్య రంగంలో ముందుకు సాగాలన్నారు. ఎంటర్‌ప్రెన్యూ ర్స్, స్టార్టప్‌లకు ఎక్కువ అవకాశాలను అందజేయాలని కోరారు. తెలంగాణలో త్వరలోనే లైఫ్ సైన్స్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యార్థులు, స్టార్టప్‌లు, విద్యా వ్యవస్థ అనుసంధానంతో ఈ గ్రిడ్ ఉంటుందని తెలిపారు. రాబో యే రోజుల్లో కేన్సర్ వ్యా«ధి వేగంగా విస్తరిస్తుందని దాని నివారణకు తగిన రీతిలో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment