hicc hyderabad
-
సృజనాత్మకతలో దూసుకుపోతున్న పరిశ్రమ
వీడియో గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతలో దూసుకుపోతోందని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్(ఐడీజీసీ)-2024 బుధవారం 16వ ఎడిషన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గేమింగ్ డెవలపర్లు, గేమింగ్ స్టూడియోలు, ఇతర గేమింగ్ ఔత్సాహికులు తమ ఆలోచనలు పంచుకోనున్నారు.ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ..‘ప్రభుత్వం గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ రంగంలో అధిక నాణ్యత ప్రతిభావంతులను తయారు చేసేందుకు పని చేస్తోంది. ప్రపంచ గేమింగ్ రంగంలో ఇండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. వీడియో గేమింగ్, ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ, రియల్ మనీ గేమింగ్ ఇండస్ట్రీకి మధ్య స్పష్టమైన తేడా ప్రభుత్వానికి తెలుసు. వీడియో గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతలో ముందంజలో ఉంది’ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీడీఏఐ) ఛైర్పర్సన్ శ్రీధర్ ముప్పిడి మాట్లాడారు. వీడియో గేమ్ డెవలపర్లు, వీడియో గేమింగ్ స్టూడియోలు ఈ పరిశ్రమలో ఇతర వాటాదారులతో ప్రాతినిధ్యం వహించేలా అపెక్స్ బాడీగా జీడీఏఐ వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దుఈ ఈవెంట్ మొదటి రోజున 6000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం నవంబర్ 15 వరకు జరుగుతుందన్నారు. ఐజీడీసీ 2024 100+ గ్లోబల్, లోకల్ గేమింగ్ డెవలపర్లు, పబ్లిషర్లు, సందర్శకులకు వేదికగా నిలుస్తుందన్నారు. -
హెచ్ఐసిసి లో జరిగిన హైలైఫ్ ఎగ్జిబిషన్ లో ముద్దుగుమ్మల సందడి (ఫొటోలు)
-
ఎలినోర్ 1.0 ఫ్యాషన్..
మాదాపూర్: మోడల్స్, సినీతారలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తు హోయలోలికించారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మంగళవారం ఎలినోర్ 1.0 ఫ్యాషన్ ఫర్ ఫండ్‌రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్యాషన్‌షోను వినూత్న పద్ధతిలో సంగీతం, నృత్యం, పాఠశాల విద్యార్థులతో థియోటర్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రావణ్‌కుమార్ థీమ్‌కు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన భారతీయ ఫ్యాషన్ వర్ణచిత్రాన్ని ప్రదర్శించారు. బ్రిటిష్ పాలనలో, స్వదేశీ ఉద్యమం తరువాత, రేగల్ వర్గాల వైభవంతో, ఆధునిక భారతదేశం వరకూ వస్త్రధారణ ధోరణులను ప్రదర్శించారు. ఈ మొత్తాన్ని జిల్లా పరిషత్ పాఠశాలలో 700 మంది చిన్నారులకు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి వెచి్చంచనున్నట్లు శ్రవంతి కందారు తెలిపారు. ర్యాంప్‌వాక్‌లో సినీతారలు సంయుక్తమీనన్, ఫరియా అబ్దుల్లా, మిస్ ఇండియా వరల్డ్ 2023 నందినిగుప్త, సిమ్రాన్ చౌదరి, యుక్తిథారేజా, సాన్వే మేఘన, శివాతి్మక రాజశేఖర్, పావని కరణం, దీప్తివర్మ, భరత్ గార్లపాటి, రాహుల్ విజయ్ పాల్గొన్నారు. -
సైబరాబాద్‌లో నేరం.. బెంగళూరులో కేసు
సాక్షి, హైదరాబాద్: భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అమలులోకి వచి్చన 20 రోజులకు అందులోని నిబంధనల ఆధారంగా కర్ణాటక రాజధాని బెంగళూరు పోలీసులు తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్కడి కూబన్ పార్క్ పోలీసుస్టేషన్లో శనివారం నమోదైన ఈ కేసు సైబరాబాద్ పరిధిలో జరిగిన నేరంపై కావడం గమనార్హం. ఈ కేసును ఇక్కడి పోలీసులకు బదిలీ చేయడానికి ఆ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. బెంగళూరులోని వసంత్‌నగర్‌కు చెందిన అపూర్వ్ ప్రకాష్ అక్కడి విఠల్ మాల్యాలోని ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. ఈ నెల 9న గచి్చ»ౌలిలోని హెచ్ఐసీసీలో జరిగిన ఓ సదస్సుకు ఆయన హాజరయ్యారు. తన ల్యాప్‌టాప్, రూ.70 వేల నగదుతో కూడిన బ్యాగ్ తస్కరణకు గురైనట్లు సదస్సు పూర్తయిన తర్వాత గమనించారు. ఆ రోజు సాయంత్రమే బెంగళూరు తిరిగి వెళ్లాల్సి ఉండటం, విమాన టిక్కెట్లు సైతం బుక్ కావడంతో వెంటనే పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోయారు. దీంతో బెంగళూరు వెళ్లిన ప్రకాష్ శనివారం కూబన్ పార్క్ ఠాణాలో కంప్లైంట్ ఇచ్చారు. బీఎన్ఎస్ఎస్ అమలులోకి రాకముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆరీ్పసీ) అమలులో ఉండేది. దీని ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. దీంతో బా«ధితులు నేరం జరిగిన ప్రాంతం ఏ ఠాణా పరిధిలోకి వస్తే అక్కడకే ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. అయితే బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 173 ప్రకారం దేశంలోని ఏ ప్రాంతంలో బాధితుడిగా మారినా తమకు ఉన్న అవకాశాన్ని బట్టి ఏదైనా ఠాణాలో ఫిర్యాదు చేయవచ్చు. దీని ప్రకారం కేసు నమోదు చేయడం ఫిర్యాదు స్వీకరించిన పోలీసుల బాధ్యత. దీంతో ప్రకాష్ శనివారం కూబన్ పార్క్ ఠాణాకు వెళ్లి సైబరాబాద్‌లోని హెచ్ఐసీసీలో తస్కరణకు గురైన బ్యాగ్‌పై ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కూబన్ పార్క్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 305 (ఎ) ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును సైబరాబాద్‌కు పంపాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. అక్కడ నుంచి గచి్చ»ౌలి ఠాణాకు ఈ కేసు చేరిన తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్‌తో రీ–రిజిస్టర్ చేసే పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో పాటు ఘటనాస్థలి సందర్శన, పంచనామా నిర్వహణ తదితర ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆసియాలోనే అతిపెద్ద వేదిక.. జీవశాస్త్రాలకు నెపుణ్యపు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: జీవశాస్త్ర, ఆరోగ్య రక్షణ రంగాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద వేదిక.. ‘బయో ఆసియా’20వ వార్షిక సదస్సుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ‘బయో ఆసియా 2023’పేరిట, నాణ్యమైన వైద్యం..అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా.. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) ప్రాంగణంలో ఉదయం 10.30కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు దీనిని ప్రారంభిస్తారు. ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్.. షేపింగ్ ది నెక్ట్స్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్’అనే నినాదంతో నిర్వహిస్తున్న సదస్సులో ఆరోగ్య రంగాన్ని మరింత మానవీయంగా మార్చడం అనే అంశంపై సుదీర్ఘ చర్చలు, ఉపన్యాసాలు, ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు చోటు చేసుకోనున్నాయి. ఆయా రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు 70 మందికి పైగా ప్రసంగించనున్నారు. 50కి పైగా దేశాల నుంచి సుమారు 2,500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో సుమారు 800 కార్పొరేట్ సంస్థలు పాల్గొంటున్నాయి. వివిధ దేశాల ప్రతినిధుల మధ్య వేయికి పైగా భాగస్వామ్య సమావేశాలు జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా ఇస్తున్న ‘జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్’పురస్కారాన్ని ఈసారి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీపై కృషి చేసిన ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్‌కు అందజేయనున్నారు. సదస్సు నిర్వహణలో బ్రిటన్ భాగస్వామ్యం వహిస్తుండగా, స్థానిక పార్ట్నర్గా ప్లాండర్స్ వ్యవహరిస్తోంది. ప్రముఖ సంస్థ ‘ఆపిల్’తొలిసారిగా బయో ఆసియా సదస్సులో పాల్గొంటోంది. నోవార్టిస్ సీఈఓ వాస్ నరసింహన్ కీలకోపన్యాసం చేస్తారు. ప్లీనరీ టాక్‌లో యూకేకి చెందిన డా.రిచర్డ్ హాచెట్ ప్రసంగిస్తారు. 5 ఆవిష్కరణలు వివరించనున్న సార్టప్‌లు జీవ శాస్త్ర (లైఫ్ సైన్సెస్) రంగం విలువ, ఉద్యోగాల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బయో ఆసియా సదస్సును నిర్వహిస్తోంది. 2021 నాటికి హైదరాబాద్ సహా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో పనిచేస్తున్న కంపెనీల నికర విలువ రూ.50 బిలియన్ డాలర్లు కాగా.. 2028 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ రంగంలో ప్రస్తుతం 4 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసి 8 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఈ సదస్సులో బయోటెక్, లైఫ్‌సైన్సెస్ విభాగంలో స్టార్టప్‌లకు పోటీలు నిర్వహిస్తున్నారు. సుమారు 400 స్టార్టప్‌లు బయో ఆసియాలో తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు దరఖాస్తు చేసుకోగా ఇందులో 75 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. వీటి నుంచి ఐదింటిని ఎంపిక చేసి నగదు పురస్కారం ఇవ్వడంతో పాటు వాటి ఆవిష్కరణలను వివరించేందుకు అవకాశం ఇస్తారు. ఇప్పటివరకు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 19 ఏళ్ల క్రితం ప్రారంభమైన బయో ఆసియా సదస్సు రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన బయో ఆసియా సదస్సుల్లో సత్య నాదెళ్ల వంటి ప్రముఖ కంపెనీల సీఈఓలు, శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలు ప్రసంగించగా, 20 వేలకు పైగా భాగస్వామ్య సమావేశాలు జరిగాయి. 250కి పైగా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరగా, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు లైఫ్ సైన్సెస్, అనుబంధ రంగాల్లోకి వచ్చాయి. లైఫ్‌సైన్సెస్‌పై సర్కారు కీలక ప్రకటన! 20వ సదస్సులోనూ ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశముందని భావిస్తున్నారు. ఫార్మా సిటీలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు, లైఫ్ సైన్సెస్ రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముంది. -
టీటీఎఫ్ హైదరాబాద్ 2022: ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్)హైదరాబాద్- 2022 రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 4 దేశాలు, 150 స్టాళ్లు, 19 రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిజం ప్రతినిధులు టూరిజం ప్రచారంలో భాగంగా టూరిజం స్టాల్స్ ను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యటకాభివృద్ధి కోసం అనేక చర్యలను చేపట్టారన్నారు. కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు లభించిందన్నారు. అలాగే భూదాన్ పోచంపల్లికి వరల్డ్ బెస్ట్ టూరిజం గ్రామంగా గుర్తింపు లభించిందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రాచుర్యం లభించేలా టూరిజంప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మితమైన ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కరివేన, ఉద్ధండ పూర్ రిజర్వాయర్ల ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధిని సీఎం నేతృత్వంలో చేస్తున్నామని మంత్రి చెప్పారు. దేశంలో అతిపెద్ద అర్బన్ ఎకో టూరిజం పార్క్, కేసీఆర్ ఎకో పార్క్, అతిపెద్ద జలపాతాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల గత రెం డేళ్లనుంచి పర్యాటక రంగం ఎంతో నష్టపోయిందన్నారు. ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో టూరిజంలో అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఇండియా టూరిజం రీజినల్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, టీటీఎఫ్ చైర్మన్ సంజీవ్ అగర్వాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
HYD: హెచ్ఐసీసీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు అలర్ట్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వస్తున్న వేళ హెచ్ఐసీసీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు హెచ్ఐసీసీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చే సమయంలో ఆయనను అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలు భావించినట్టు సమాచారం. దీంతో, ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో కేంద్ర మంత్రికి చేదు అనుభవం -
ఎక్కడికక్కడ అప్రమత్తం .. భద్రత కట్టుదిట్టం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో.. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమావేశాలు జరిగే మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)తోపాటు నోవాటెల్, రాజ్‌భవన్, బేగంపేట.. మోదీసభ జరిగే పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పెద్దయెత్తున భద్రతాబలగాలు మోహరిస్తున్నాయి. స్పెష ల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ), కేంద్ర బలగాలతో కలిసి నాలుగంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 15 వేల మంది భద్రత, బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, ఆక్టోపస్, శాంతిభద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు రంగంలోకి దిగుతున్నాయి. నగరవ్యాప్తంగా నిఘా, తనిఖీతోపాటు భారీగా మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రధాని తిరిగే మార్గాల్లో రూట్పార్టీలు ఉంటాయి. దుర్భేద్యంగా హెచ్ఐసీసీ జాగిలాలతో హెచ్ఐసీసీ, నోవాటెల్ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఎత్తైన భవనాల పైనుంచి రూఫ్‌టాప్ వాచ్ చేస్తున్నారు. పాస్ ఉన్న వాహనాలు, వ్యక్తులను మాత్రమే హెచ్ఐసీసీ లోపలికి అనుమతిస్తున్నారు. హైటెక్స్ లోపలికి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్నీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పాస్‌లేని పోలీస్ వాహనాలను సైతం తిప్పి పంపి స్తున్నారు. హెచ్ఐసీసీ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ కేంద్రాలలో కరోనా పరీక్షలు నిర్వహించాకే లోపలికి అను మతి ఇస్తున్నారు. ఈ నెల 4వ తేదీ వరకు సైబరాబాద్ కమి షనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడితే అరెస్టు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. శుక్రవా రం పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లిన హైదరా బాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులతో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు సమీక్షించారు. మరోపక్క బేగంపేట విమానాశ్రయం నుం చి పరేడ్ గ్రౌండ్స్‌కు, అక్కడ నుంచి రాజ్‌భవన్ వరకు సెక్యూరిటీ, కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. గ్రౌండ్స్ ను శనివారం ఎస్పీజీ అ«ధీనంలోకి తీసుకోనుంది. శుక్రవా రం నుంచే బేగంపేట విమానాశ్రయం, పరేడ్ గ్రౌండ్స్, బాంబు నిర్వీర్యబృందాలతో తనిఖీ చేస్తున్నారు. ముందస్తు అరెస్టులు.. ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు విధ్వంసానికి దారితీయడం, ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వటంతో ప్రధాని పర్యటన నేపథ్యంలో అకస్మాత్తుగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ శనివారం సడక్‌బంద్‌కు పిలుపు ఇవ్వటంతో అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా సైబరాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. నేరచరితులు, రౌడీషీటర్లకు బైండోవర్లు విధిం చా రు. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలో ఎమ్మార్పీఎస్ పార్టీ కన్వీనర్ రాచమల్ల రాజును పోలీసులు అరెస్టు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు.. హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాలలో శని, ఆదివారాల్లో పలు మార్గాలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్, మియాపూర్ నుంచి కొత్తగూడ, కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ, బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ, నారాయణమ్మ కాలేజ్ నుంచి గచ్చిబౌలి మార్గాలలో భారీ వాహనాలకు ప్రవేశం లేదు. ట్రాఫిక్ మళ్లింపు మార్గాలివే.. ►నీరూస్ జంక్షన్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలను దుర్గం చెరువు – ఇనార్బిట్ – ఐటీసీ కోహినూర్ – ఐకియా – బయోడైవర్సిటీ – గచ్చి బౌలి మీదుగా సీవోడీ జంక్షన్‌కు మళ్లిస్తారు. సైబర్ టవర్స్, హైటెక్స్ జంక్షన్ల మీదుగా ప్రవేశం లేదు. ►మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట మీదుగా హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలు రోలింగ్ హిల్స్ – ఏఐజీ హాస్పిటల్ – ఐకియా – ఇన్నార్బిట్ – దుర్గం చెరువు రోడ్ మీదుగా వెళ్లాలి. ►ఆర్సీపురం, చందానగర్ మీదుగా మాదాపూర్, గచ్చిబౌలి వైపునకు వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్ – నల్లగండ్ల – హెచ్‌సీయూ – ఐఐఐటీ – గచ్చిబౌలి రోడ్డు మీదుగా వెళ్లాలి. అల్విన్, కొండాపూర్ రోడ్లో వాహనాలకు ప్రవేశం లేదు. -
జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో.. జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇందుకోసం సుమారు పది రోజుల క్రితం ప్రారంభమైన ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తికాగా, వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం భోజనాల ఏర్పాట్లు మంగళవారం రాత్రి నుంచే ప్రారంభించారు. అందరి దృష్టీ ‘జాతీయ రాజకీయాలపైనే’ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి గమ్యాన్ని చేరడమే కాకుండా వరుసగా రెండు పర్యాయాలు అధికార పగ్గాలు చేపట్టింది. 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తమ పార్టీ మేజర్ అయిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషిస్తుందనే అంశంపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ప్లీనరీలో మొత్తం 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనుండగా, జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించాల్సిన పాత్ర, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలన వైఫల్యాలు ఎండగట్టడమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని పార్టీ నేతలు వెల్లడించారు. అలాగే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషించాలని కోరుతూ తీర్మానం ఆమోదించనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా తీర్మానాలు చేయనున్నారు. ఇప్పటికే తీర్మానాల వారీగా వక్తల పేర్లను ఖరారు చేశారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ రాక సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు గులాబీరంగు దుస్తులను ధరించి రావాలని ఆదేశించారు. ప్రతినిధులందరికీ ప్రత్యేక కిట్‌లో తీర్మానాల ప్రతులు, పెన్నులు, ప్యాడ్లు, పార్టీ జెండాలు తదితరాలు అందజేస్తారు. హెచ్ఐసీసీ ప్రాంగణంలో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ప్రతినిధుల పేర్లు నమోదు చేసి, పాస్‌ను పరిశీలించి లోని కి అనుమతిస్తారు. కేసీఆర్ ఉదయం 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. కేసీఆర్ ప్రా రంభోపన్యాసం తర్వాత తీర్మానాలపై చర్చ మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ తీర్మానాలు ఇవే.. ► యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం ► దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం ► ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం ► చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ► భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం ► బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ► తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ► రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్ రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం ► నదీ జలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్వహించాలని ఈమేరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ► భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం ► తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ఊరూరా టీఆర్ఎస్ జెండా పండుగ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,618 మున్సిపల్ డివిజన్లు, వార్డుల్లో జెండా పండుగ నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులు జెండా పండుగలో పాల్గొనాలని, గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఉదయం 9 గంటలకు తెలంగాణలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ పతాకావిష్కరణ నిర్వహించాలన్నారు. బార్కోడ్ పాస్‌తో ప్రవేశం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని మొత్తం 22 కేటగిరీలకు చెందిన సుమారు 3 వేల మంది ప్రజా ప్రతినిధులు, నాయకులకు మాత్రమే పార్టీ ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. సుమారు 65 లక్షల మంది పార్టీ సభ్యులు ఉన్నా.. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు పంపించామని, ఆహ్వానాలు అందని వారు మన్నించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జీల ద్వారా ఆహ్వానాలు వెళ్లగా తొలిసారిగా ‘బార్కోడ్’తో కూడిన పాస్‌ను ఉపయోగించి సమావేశ ప్రాంగణంలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. సభాస్థలిలో ప్రధాన వేదికతో పాటు మరో ఐదు డిజిటల్ తెరలను ఏర్పాటు చేశారు. 33 రకాల వంటకాలు సమావేశ ప్రాంగణమంతా కేసీఆర్ భారీ కటౌట్లు, పార్టీ జెండాలతో గులాబీమయం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ నగరానికి దారితీసే ప్రధాన మార్గాలతో పాటు నగరంలోని ముఖ్య కూడళ్లలో పార్టీ నేతలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రతినిధుల కోసం 33 రకాల వంటకాలు సిద్ధం చేయడంతోపాటు హెచ్ఐసీసీలో వేర్వేరు చోట్ల భోజన వసతి కల్పిస్తున్నారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఇప్పటికే జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు విభాగంతో పార్టీ నేతలు సమన్వయం చేసుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన గద్వాల, భద్రాచలం, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన నేతలు మంగళవారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. -
ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అందాల అనన్య
-
సూత్ర ఎగ్జిబిషన్ ప్రారంభం..
-
హైదరాబాద్ బ్రాండ్ ఏ పార్టీది కాదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో హైదరాబాద్ నగర శాంతిభద్రతలు బాగున్నాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అత్యున్నతస్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. ఆయన ఆదివారం హెచ్ఐసీసీలో నిర్వహించిన బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. హైదరాబాద్ అద్భుత నగరమని, ప్రకృతి వైపరిత్యాలు లేని ప్రాంతమని తెలిపారు. పెట్టుబడులకు అనుకూల ప్రాంతం హైదరాబాద్ అని పేర్కొన్నారు. 2014తో పోలిస్తే ఐటీ ఎగుమతులు పెరిగాయని, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ హైదరబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. పెట్టుబడుదారులకు హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అమెజాన్ కంపెనీతో అనేక చర్చలు జరిపి వారికి నమ్మకాన్ని కల్పించామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: ప్రగతికి పట్టం కట్టండి : కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి కాదని, భాగ్యనగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. హైదరాబద్ భారత దేశంలోనే అత్యంత అరుదైన, చారిత్రాత్మక నగరమని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ హైదరాబాద్ ఆకర్షిస్తోందని, ఆరేళ్ల కింద హైదరాబాద్‌లో అనేక సమస్యలు ఉండేవన్నారు. హైదరాబాద్‌లో గొడవలు వద్దు అభివృద్ధి కావడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతీ బిడ్డ తెలంగాణ గడ్డకు చెందినవాడే అని సీఎం కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. చదవండి: గ్రేటర్ బరి: మేయర్ పీఠంపై మహిళ గురి నోయిడా, ఘజియాబాద్ లాంటి ప్రాంతాలు కాదని హైదరాబాద్‌కు పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారితో పాటు, పాతవారికి కూడా సమున్నత స్థాయిలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇన్నోవేషన్ మీద దృష్టి పెట్టామని, ఐదు టాప్ ఫైవ్ కంపెనీలు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమేజాన్, ఫేస్బుక్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని ఆయన గుర్తు చేశారు. ఇది హైదరాబాద్ గొప్పతనమని, దాన్ని కాపాడుతున్నామని తెలిపారు. ఇక్కడ పెట్టుబడిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమానికి (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) హైసియా అధ్యక్షుడు మోడరేటర్‌గా వ్యవహరించారు. చదవండి: బీజేపీలోకి బిగ్‌బాస్ ఫేం కత్తి కార్తీక..! -
‘హైలైఫ్’ సందడి
-
‘జీవన శైలి మార్చుకోవాలి’
మాదాపూర్ : ఆహారపు అలవాట్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఆధ్వర్యంలో 27వ వార్షిక సదస్సు ఐయాన్‌కాన్–2019ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఆహారపు అలవాట్లు, ఎప్పుడు కూర్చొని ఉండే మన జీవన శైలితో ప్రజలకు ప్రధానంగా భారత్ వాసులకు పెనుముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. గత రెండు దశాబ్దాలుగా సంభవించిన మరణాల్లో దాదాపు 55 శాతం కేవలం అంటువ్యాధులు, జీవన శైలి వ్యాధుల కారణంగా వచ్చినవే అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని అన్నారు. దీనిపై భారత వాసులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఐయాన్‌కాన్ లాంటి సదస్సులు పలు జబ్బులపై ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో న్యూరాలజీతో పాటు ఎన్నో రంగాలకు చెందిన వైద్య నిపుణులు పాలు పంచుకునేలా కృషి చేస్తున్న నిర్వాహక కమిటీ సేవలను ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ ఖాదీల్కర్ కొనియాడారు. 18 దేశాల న్యూరో ఫిజీషియన్లు.. ఈ సదస్సులో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల నుంచి అనేక మంది న్యూరో ఫిజీషియన్లు ఇతర రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఈ సదస్సును బ్రెయిన్ అండ్ స్పైన్ సొసైటీ ఆ«ఫ్ ఇండియాతో కలిసి ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ వీలియం కరోల్, కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొలినేని భాస్కర్‌రావు, ఐయాన్‌కాన్–2019 నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ మోహన్‌దాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీతాజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
తక్కువ ధరకే మందులు అందించాలి
మాదాపూర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి తక్కువ ధరకే మందులు అందించేందుకు కృషి జరగాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో శనివారం జరిగిన ‘ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్, ట్రాన్స్ ఫార్మింగ్ హెల్త్ కేర్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ముగింపు కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణలో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్త ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారా వైద్యాన్ని సామాన్యులకు మరింత చేరువ చేయాలన్నారు. ఆరోగ్య రాష్ట్రం దిశగా అడుగులు: ఈటల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికీ ‘కంటి వెలుగు’ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. త్వరలో ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ తయారు చేయబోతున్నామన్నారు. టీ–డయాగ్నొస్టిక్, టీ–డయాలజీ లాంటి సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశం ఆరోగ్య భద్రతకు ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం చూపిస్తోందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్లకు బహుమతులు, మెమెంటోలనకు గవర్నర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి, శోభన కామినేనిలతో పాటు డాక్టర్లు, 2,500 మంది ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లోని వారికి వైద్యం అందించాలి
హైదరాబాద్: వైద్యాన్ని మారుమూల గ్రామాల ప్రజలకు అందించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సులో భాగంగా మంగళవారం కేంద్ర చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి కోటి 60 లక్షల మందికి పరీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. దీనిని ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకున్నాయని చెప్పారు. ఒక్కొక్క మండలానికి 12 మంది టీమ్‌లుగా ఏర్పాటు చేసి ఆపరేషన్లు, దృష్టి లోపం ఉన్న వారికి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలి పారు. రాష్ట్రవ్యాప్తంగా 844 మంది ప్రత్యేక సిబ్బంది కంటి వెలుగు శిబిరంలో పాల్గొని సేవలందించినట్లు తెలిపారు. వైద్య రంగం ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం ముందున్న ప్రధాన అంశమన్నారు. అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోగాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ వైద్య నిపుణులకు సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రభు త్వ సేవలను ప్రజల వద్దకు ఉచితంగా చేరువయ్యేలా చూడాలని వారికి సూచించారు. వైద్య సేవలను అందించడానికి ముందుకొచ్చిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ తమవంతు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నయం చేయడానికి మందులను అందించాలని వెల్లడించా రు. నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని వైద్య రంగంలో ముందుకు సాగాలన్నారు. ఎంటర్‌ప్రెన్యూ ర్స్, స్టార్టప్‌లకు ఎక్కువ అవకాశాలను అందజేయాలని కోరారు. తెలంగాణలో త్వరలోనే లైఫ్ సైన్స్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యార్థులు, స్టార్టప్‌లు, విద్యా వ్యవస్థ అనుసంధానంతో ఈ గ్రిడ్ ఉంటుందని తెలిపారు. రాబో యే రోజుల్లో కేన్సర్ వ్యా«ధి వేగంగా విస్తరిస్తుందని దాని నివారణకు తగిన రీతిలో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. -
వ్యవసాయాధికారులతో 4న సీఎం భేటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో వచ్చే నెల 4న మూడు వేల మంది వ్యవసాయాధికారులు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక సమావేశానికి ఆదేశాలు జారీ చేశారు. రైతుబంధు పథకం అమలు తీరుపై ఈ కార్యక్రమంలో సీఎం సమీక్షించనున్నారు. అలాగే రైతు బీమా పథకం అమలు కార్యాచరణకు సూచనలు ఆహ్వానించనున్నారు. ఈ సమావేశానికి మండల స్థాయిలో పనిచేసే 2,500 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), జిల్లా వ్యవసాయాధికారులు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులను ఆహ్వానించారు. ప్రోత్సాహకానికి సర్కార్‌కు విన్నపం! అయితే పెట్టుబడి చెక్కుల పంపిణీలో కీలకపాత్ర పోషించినందున.. గత కొన్ని నెలలుగా దీనిపై ప్రత్యేకంగా పనిచేస్తున్నందున ఓ నెల వేతనం ప్రోత్సాహకంగా ఇవ్వాలని వ్యవసాయశాఖాధికారులు సర్కార్‌కు విన్నవించాలని యోచిస్తున్నారు. 4న సభలో ఇదే విషయమై ప్రత్యేకంగా సీఎంకు విన్నవించాలని పలువురు వ్యవసాయ ఉద్యోగ నేతలు భావిస్తున్నారు. -
భగీరథ ప్రయత్నం.. భారతీయ వస్త్రధారణం