
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో వచ్చే నెల 4న మూడు వేల మంది వ్యవసాయాధికారులు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక సమావేశానికి ఆదేశాలు జారీ చేశారు. రైతుబంధు పథకం అమలు తీరుపై ఈ కార్యక్రమంలో సీఎం సమీక్షించనున్నారు. అలాగే రైతు బీమా పథకం అమలు కార్యాచరణకు సూచనలు ఆహ్వానించనున్నారు. ఈ సమావేశానికి మండల స్థాయిలో పనిచేసే 2,500 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), జిల్లా వ్యవసాయాధికారులు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులను ఆహ్వానించారు.
ప్రోత్సాహకానికి సర్కార్‌కు విన్నపం!
అయితే పెట్టుబడి చెక్కుల పంపిణీలో కీలకపాత్ర పోషించినందున.. గత కొన్ని నెలలుగా దీనిపై ప్రత్యేకంగా పనిచేస్తున్నందున ఓ నెల వేతనం ప్రోత్సాహకంగా ఇవ్వాలని వ్యవసాయశాఖాధికారులు సర్కార్‌కు విన్నవించాలని యోచిస్తున్నారు. 4న సభలో ఇదే విషయమై ప్రత్యేకంగా సీఎంకు విన్నవించాలని పలువురు వ్యవసాయ ఉద్యోగ నేతలు భావిస్తున్నారు.