
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకాన్ని పెద్ద రైతులకు కాకుండా, కేవలం ఐదెకరాల వరకు భూము లున్న రైతులకు మాత్రమే అమలు చేయాలని కోరు తూ నల్లగొండ జిల్లా కట్టంగూరు వ్యవసాయ విస్తర ణాధికారి (ఏఈవో) కల్లేపల్లి పరశురాములు ఏకంగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం వ్యవసాయశాఖలో సంచలనమైంది. అలా మిగిలిన సొమ్మును రైతులు పొలా లకు, చేన్లకు వెళ్లే డొంకలు, బండ్ల బాటల అభివృద్ధికి కేటాయించాలని సీఎంకు విన్నవించారు.
నగరాలుగా అభివృద్ధి చెందిన గ్రామాల్లో రియల్ ఎస్టేట్ భూము లకు, పంటలు పండించనటువంటి భూములకు రైతు బంధు ద్వారా వచ్చే డబ్బులు వృ«థా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లేఖను మంగళవారం రాసి సీఎంకు సాధా రణ పోస్టులో పంపించినట్లు తెలిపారు. గ్రామాల్లో రైతుల బాధలు చూశానని, వారి పొలాలకు వెళ్లే దారులు దారుణంగా మారా యని పేర్కొన్నారు. గతంలో వల సలు ఉండేవని, కానీ కేసీఆర్ నిర్ణ యాల వల్ల వలసలు ఆగిపోయాయ న్నారు.
రైతులు చల్కలు, పొలా ల దగ్గరకు వెళ్లే బండ్ల బాటలు నడ వడానికి కూడా కష్టంగా మారాయన్నారు. వాటిని బాగు చేయిస్తే రైతులు ప్రయోజనం పొందుతారన్నారు. తెలంగాణ అంటే ఒకప్పుడు మెట్ట భూమి. కానీ ఇప్పుడు తరి భూమి అయిందన్నారు. అలా ఎంతో సాధించిన కేసీఆర్‌ను జాతిపితగా ఏఈవో పరిగణించారు. ఈ లేఖ రాయడానికి కారణాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లా డుతూ, రైతుబంధు ధనికులకు ఇవ్వడం వల్ల డబ్బులు వృథా అవుతున్నాయనే ఆవేదన తనకు ఉందన్నారు. ఎవరికి చెప్పాలో అర్థంగాక తాను సీఎంకే లేఖ రాసినట్లు తెలిపారు. తమలాంటి వారికి దశాబ్దానికిపైగా పదో న్నతులు ఇవ్వలేదని, దీంతో నిరాశగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment