AEO
-
ఏఈవోల్లో చీలిక!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరిస్తున్న వ్యవసాయ విస్తరణాధికారుల్లో చీలిక ఏర్పడింది.ప్రభుత్వం 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడంతో అనేకమంది వెనక్కి తగ్గినట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపితో బుధవారం జరిగిన చర్చల్లో కొందరు ఏఈవోలు సానుకూలత వ్యక్తం చేశారు. వారి సమస్యలపై వచ్చే సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు అవకాశం కల్పిస్తానని డైరెక్టర్ హామీ ఇవ్వడంతో ఏఈవోలు తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నామని, డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు సిద్ధమేనని ఆయనకు తెలిపారు. వచ్చే వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని, ఏఈవోల సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు ఏఈఓలు డిజిటల్ సర్వేలో పాల్గొంటారంటూ డైరెక్టర్ గోపీ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో కొందరు ఏఈవో సంఘం నేతలు గురువారం నుంచి డిజిటల్ క్రాప్ సర్వే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సర్వే చేస్తామని తెలిపారు. మొత్తంగా సగం మంది ఏఈఓలు సర్వే చేస్తామని చెబుతుండగా, సగంమంది సర్వే చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా ఏఈఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేయమని చెబుతున్నట్టు తెలిసింది.దీంతో ఏఈవోలు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బుధవారం జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన ఏఈవోలు వ్యవసాయ కమిషనరేట్ వద్ద నిరసనకు దిగారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని, సస్పెండ్ చేసిన ఏఈవోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దశలో కమిషనరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ముందస్తుగా పోలీసులను మోహరించారు. ఏఈవోల సస్పెన్షన్‌తో వ్యవసాయ కార్యక్రమాలపై ప్రభావం కక్ష సాధింపు చర్య వల్లే సస్పెండ్ చేశారని ఏఈవోలు మండిపడుతున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే విషయంలో ఇంతమందిని సస్పెండ్ చేయడం వల్ల అనేక పథకాలు, వ్యవసాయశాఖ చేపట్టే కార్యక్రమాలకు విఘాతం కలగనుంది. ఇప్పుడు గ్రామాల్లో ధాన్యం, పత్తి మార్కెట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఏఈవోలు కీలకంగా వ్యవహరిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే, రైతులకు అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సింది కూడా ఏఈవోలే. ఇలాంటి కీలక సమయంలో ఏఈవోలపై ఉక్కుపాదం మోపడం పట్ల వ్యవసాయ ఉద్యోగులు మండిపడుతున్నారు. కాగా, ఏఈవోలు దారికొస్తే సరేసరి లేకుంటే మరికొందరిపైనా కఠిన చర్యలు చేపడతామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఏఈవోలకు ప్రత్యేక భారం ఏమీ ఉండదని, వారం పది రోజులపాటు నిర్వహించే డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరించాల్సిన అవసరం ఏంటని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. కావాలని ఏఈవోలు ఇదంతా చేస్తున్నారని, వారిని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని అంటున్నారు. మరోవైపు సమ్మెకు సిద్ధమైన ఏఈవోలకు కొన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటిస్తుండగా, మరోవైపు పేరొందిన పలు ఉద్యోగ సంఘాల నేతలు బెదిరింపులకు దిగినట్టుగా తెలిసింది. ఏ విధంగానైనా సరే ఏఈవోలను సమ్మెకు వెళ్లకుండా వారు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. -
165 మంది ఏఈవోల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నేపథ్యంలో రగిలిపోయిన ఏఈవోలు మంగళవారం జిల్లాల నుంచి హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా ధర్నా జరుగుతున్నా వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ఏమాత్రం పట్టించుకోకుండానే పోలీసుల భద్రత నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహంతో ఉన్న ఏఈవోలు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ప్రకటించారు. కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 2,600 మంది ఏఈవోలు సెలవుల్లో ఉంటామని వెల్లడించారు. నేతలు రాజ్‌కుమార్ రాజు, పరశురాములు, సుమన్, వెంకన్న శ్రీనివాస్ జానయ్య, వినోద్, సత్యంల నాయకత్వంలో ధర్నాలో పెద్ద సంఖ్యలో ఏఈవోలు పాల్గొన్నారు.కక్ష సాధింపు ధోరణిడిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడమే 165 మంది ఏఈవోల సస్పెన్షన్‌కు కారణమని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం రైతుబీమా నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతుల వివరాల నమోదులో ఏఈవోలు నిర్లక్ష్యంగా వహించారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ సస్పెన్షన్లని ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఏఈవోలను సస్పెండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. బుధవారం మరో కారణంతో మరికొంతమందిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేశారని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఎలా అప్లోడ్ చేయాలి?నిబంధనల ప్రకారం రైతు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు అన్ని రకాల పత్రాలను జత చేసి..సదరు ఏఈవో రైతుబీమా పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. అయితే రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కనీసం 11 రోజుల వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి సమయం పడు తుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులు వివరాలు అందించేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇది గతం నుంచి కొనసాగుతుందంటున్నారు. అలాంటప్పుడు కేవలం నాలుగు రోజుల్లో వివరాలు ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. సస్పెండ్ చేయడం సరికాదు డిజిటల్ క్రాప్ సర్వేను నిరాకరించినందుకు తనను సస్పెండ్ చేయడం సరికాదని హనుమకొండ జిల్లా శాయంపేట క్లస్టర్ ఏఈఓ అర్చన అన్నారు. 15వేల మందితో చేయించాల్సిన సర్వేని 2,600 మందితో చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని అన్నారు. రైతు బీమాలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా సస్పెండ్ చేశారని తెలిపారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు డిజిటల్ సర్వే చేసే విషయంలో భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి గురిచేశారని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ ఏఈఓ ప్రవళిక చెప్పారు. కనీస వసతులు లేకుండా సర్వే చేయలేమని విన్నవించినా, వినకుండా రైతు బీమా కారణం చూపించారన్నారు. కనీసం మెమో గానీ షోకాజ్ నోటీస్ గానీ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.పంట సర్వే ఏఈవోల ప్రాథమిక బాధ్యత వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీపంట నమోదు కార్యక్రమం ఏఈవోల ప్రాథమిక బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీ తెలిపారు. కొందరు ఏఈవోలు పంట పొలాన్ని సందర్శించకుండా సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 165 మంది ఏఈవోలను వ్యవసాయశాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంచాలకుడు డాక్టర్ గోపీ స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి గుంటలో సాగైన పంట వివరాలు కచ్చితంగా తెలుసుకో వడానికి, పంటలకు కావాల్సిన ఉత్పాదకాలను అంచనా వేయడానికి, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, పంట బీమా అమలు, పంట రుణాలు పొందటానికి రైతు బీమా, రైతు భరోసా పథకాల అమలుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు. -
రైతుబంధు, రైతుబీమా నిధులు పక్కదారి!
కొందుర్గు: రైతుబంధు, రైతుబీమా నిధులను దారి మళ్లించిన కారణంగా రంగారెడ్డి జిల్లాలో ఒక ఏఈవోను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2020 నుంచి ఇప్పటివరకు దాదాపు 20 మందికిపైగా రైతుబీమా డబ్బులు, 130 మంది రైతుబంధు డబ్బులు పక్కదారి పట్టినట్లు తెలిసింది. రైతుబీమాకు సంబంధించి క్లెయిమ్ చేసే సమయంలో నామినీ వివరాలు, తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సదరు ఏఈవో తన ఖాతా, కుటుంబసభ్యుల ఖాతా, బంధువులు, స్నేహితుల ఖాతా నంబర్లను ఎడిట్ చేసి బీమా కంపెనీకి పంపినట్లు సమాచారం. ఒకే ఖాతాకు వరుసగా డబ్బులు జమ అవుతున్నాయని అనుమానం వచ్చిన బీమా కంపెనీవారు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. సంబంధిత అధికారుల సూచన మేరకు హైదరాబాద్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఏఈవోను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రైతుబంధు డబ్బులను కూడా ఇలాగే నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కాజేసినట్లు ప్రచారం జరుగుతోంది. రైతుబంధు, రైతుబీమా కలిపి సుమారు రూ.2 కోట్ల వరకు కాజేసినట్లు సమాచారం. హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని మరో ఇంట్లో కూడా విచారణ జరిపినట్లు సమాచారం. సదరు ఏఈవో కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడంలేదు. -
రైతుబంధు ఐదెకరాలకే పరిమితం చేయండి
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకాన్ని పెద్ద రైతులకు కాకుండా, కేవలం ఐదెకరాల వరకు భూము లున్న రైతులకు మాత్రమే అమలు చేయాలని కోరు తూ నల్లగొండ జిల్లా కట్టంగూరు వ్యవసాయ విస్తర ణాధికారి (ఏఈవో) కల్లేపల్లి పరశురాములు ఏకంగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం వ్యవసాయశాఖలో సంచలనమైంది. అలా మిగిలిన సొమ్మును రైతులు పొలా లకు, చేన్లకు వెళ్లే డొంకలు, బండ్ల బాటల అభివృద్ధికి కేటాయించాలని సీఎంకు విన్నవించారు. నగరాలుగా అభివృద్ధి చెందిన గ్రామాల్లో రియల్ ఎస్టేట్ భూము లకు, పంటలు పండించనటువంటి భూములకు రైతు బంధు ద్వారా వచ్చే డబ్బులు వృ«థా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లేఖను మంగళవారం రాసి సీఎంకు సాధా రణ పోస్టులో పంపించినట్లు తెలిపారు. గ్రామాల్లో రైతుల బాధలు చూశానని, వారి పొలాలకు వెళ్లే దారులు దారుణంగా మారా యని పేర్కొన్నారు. గతంలో వల సలు ఉండేవని, కానీ కేసీఆర్ నిర్ణ యాల వల్ల వలసలు ఆగిపోయాయ న్నారు. రైతులు చల్కలు, పొలా ల దగ్గరకు వెళ్లే బండ్ల బాటలు నడ వడానికి కూడా కష్టంగా మారాయన్నారు. వాటిని బాగు చేయిస్తే రైతులు ప్రయోజనం పొందుతారన్నారు. తెలంగాణ అంటే ఒకప్పుడు మెట్ట భూమి. కానీ ఇప్పుడు తరి భూమి అయిందన్నారు. అలా ఎంతో సాధించిన కేసీఆర్‌ను జాతిపితగా ఏఈవో పరిగణించారు. ఈ లేఖ రాయడానికి కారణాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లా డుతూ, రైతుబంధు ధనికులకు ఇవ్వడం వల్ల డబ్బులు వృథా అవుతున్నాయనే ఆవేదన తనకు ఉందన్నారు. ఎవరికి చెప్పాలో అర్థంగాక తాను సీఎంకే లేఖ రాసినట్లు తెలిపారు. తమలాంటి వారికి దశాబ్దానికిపైగా పదో న్నతులు ఇవ్వలేదని, దీంతో నిరాశగా ఉందన్నారు. -
కొత్తగా 300 ఏఈవో పోస్టులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 300కుపైగా వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) పోస్టులు రానున్నాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రం సాగుభూమి పెరగడం, ఏఈవో క్లస్టర్ల పరిమాణం పెరగడంతో వాటిని హేతుబద్ధీకరించాలని.. అవసరమైన చోట కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త క్లస్టర్ల అవసరం, వాటికి ఏఈవోల నియామకంపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. క్లస్టర్ల ఏర్పాటు అమల్లోకి రాగానే, కొత్త ఏఈవో పోస్టులు కూడా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ద్వారా వాటిని భర్తీ చేస్తారు. సాగుభూమి పెరగడంతో.. రాష్ట్ర ప్రభుత్వం 2018లో వ్యవసాయ భూములను క్లస్టర్ల వారీగా విభజించి వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. దాదాపు 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. అప్పుడు వానాకాలం సీజన్లో దాదాపు కోటి ఎకరాల వరకు సాగయ్యేది. కాస్త చిన్న, పెద్ద కలిపి 2,601 క్లస్టర్లు ఏర్పాట య్యాయి. ప్రతీ క్లస్టర్‌కు ఒక ఏఈవో ఉంటారు. ఆ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ భూమిని పర్యవేక్షించడం, రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడం, రైతు వేదికల నిర్వహణ, రైతుబంధు, రైతుబీమా లబ్ధిదారుల గుర్తింపు, వారికి అవసర మైన సహాయ సహకారాలు అందించడం వంటి బాధ్యతలను ఏఈవోలు నిర్వర్తిస్తారు. క్లస్టర్ పరిదిలో ఏయే పంటలు సాగు చేస్తున్నారనే సమగ్ర సమాచారాన్ని ట్యాబ్‌ల ద్వారా అప్లోడ్ చేస్తారు. అయితే కాళేశ్వరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం, రైతుబంధు వంటి కారణా లతో రాష్ట్రంలో సాగయ్యే భూమి విస్తీర్ణం 1.46 కోట్ల ఎకరాలకు చేరిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. దీనితో చాలా క్లస్టర్ల పరిధిలో సాగు భూమి ఐదు వేల ఎకరాలకు మించి పెరిగింది. 300కుపైగా క్లస్టర్లలో 6 వేల నుంచి 12 వేల ఎకరాల వరకు సాగుభూమి ఉన్నట్టు గుర్తించారు. ఈ కస్ట ర్లకు సంబంధించిన ఏఈవోలపై పనిభారం పెరిగింది. పర్యవేక్షణ ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సాగుభూమి పెరిగిన, తక్కువగా ఉన్న క్లస్టర్లను హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. ఏఈవో క్లస్టర్లలో.. పంటల వారీగా క్లస్టర్లు రాష్ట్రంలో పంటల వారీగా క్లస్టర్లను కూడా ప్రభు త్వం గతేడాది గుర్తించింది. ఏ పంట ఏ క్లస్టర్లలో అధికంగా సాగవుతుందో నిర్ధారించింది. ఆ ప్రకా రం రానున్న సీజన్లో గుర్తించిన క్లస్టర్లలో పంటలను ప్రత్యేకంగా ప్రోత్సహించనున్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. పంట కోత అనంతరం క్లస్టర్లను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. దీనివల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందనేది సర్కారు ఉద్దేశం. రాష్ట్రంలో ప్రధాన పంటలకు సంబంధించి 2,613 క్లస్టర్లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అత్యధికంగా పత్తి పంటకు 1,081 క్లస్టర్లు, వరికి 1,064 పంట క్లస్టర్లు, కందులకు 71 క్లస్టర్లు, సోయాబీన్‌కు 21 క్లస్టర్లు, మొక్కజొన్నలకు తొమ్మిది క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
జియో ట్యాగింగ్‌కు ‘అగ్రి’ అవడం లేదు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో జియో ట్యాగింగ్ నిఘా రచ్చకు దారితీసింది. వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై జియో ట్యాగింగ్‌తో నిఘా ఏర్పాటు చేసి, తద్వారా అదే పద్ధతిలో హాజరు వేసుకోవాలని నిర్ణయించారు. లేకుంటే గైర్హాజరుగా భావించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ తేల్చిచెప్పడంతో పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై ఏఈవోలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మండల వ్యవసాయాధికారులు(ఏవో), డివిజనల్ వ్యవసాయాధికారులకు కూడా ఇదే పద్ధతిలో హాజరును ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. దీంతో ఈ పద్ధతిని ఎత్తేయాలని 21 జిల్లాలకు చెందిన పలువురు అధికారులు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటివరకు ఉన్నతస్థాయి అధికారులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. యాక్టివిటీ లాగర్ యాప్... రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసే 2,600 మంది ఏఈవోలు ఉన్నారు. ప్రతీ రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక ఏఈవో ఉంటారు. రైతు వేదికలే వారి కార్యాలయాలు. ఏఈవో ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పటికప్పడూ వారి కార్యకలాలపాలను తెలుసుకునేందుకు ప్రత్యేక యాక్టివిటీ లాగర్ యాప్ పేరుతో జియో ట్యాగింగ్ చేసే జీపీఎస్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఏఈవోలు వారి క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకంగా ఒక నిర్దేశిత స్థలాన్ని నమోదు చేసుకోవాలి. స్పాట్‌లోకి వెళ్లి ‘మార్క్ మై ప్రెజెన్స్’అని నొక్కి ఫింగర్ ప్రింట్ నమోదు చేయాలి. లాంగిట్యూడ్, లాట్యిట్యూడ్ ఆధారంగా గుర్తించిన తర్వాతే హాజరు పడుతుంది. నిర్దేశిత గ్రామంలో ఏ రైతును కలిశారు? రైతుతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లారా? ఇంకా ఎవరైనా అధికారి వచ్చారా? రైతు వేదిక వద్ద ఏం చేశారు? ఆ రోజు షెడ్యూల్ ఏంటి? క్రాప్ బుకింగ్, రైతు బీమా, సీడ్ పర్మిట్ స్లిప్‌లు లాంటివి రోజుకు 17 రకాలు, అందులో మళ్లీ ఒక్కోదానికి రెండు, మూడు ఆప్షన్లతో అప్డేట్ చేసి నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి రోజువారీ హాజరు, పనితీరు రికార్డు అవుతుంది. ఇలా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంపై ఏఈవోలు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: ‘ధరణి’లో పరిష్కారం కాని సమస్యలు.. భూ లబ్ధిదారులకు తిప్పలు -
వీఆర్వోలను ఏంచేద్దాం?
సాక్షి, హైదరాబాద్: గ్రామ పాలన వ్యవస్థకు ప్రస్తుతం పట్టుగొమ్మగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెవెన్యూ వ్యవస్థను సమూలంగా సంస్కరించాలని భావిస్తోన్న ప్రభుత్వం.. కిందిస్థాయిలో కీలకమైన వీఆర్వో వ్యవస్థను రద్దుచేసే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఒకవేళ కొనసాగించినా, వారి విధుల్లో భారీగా కత్తెర పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. వీఆర్వో వ్యవస్థను రద్దుచేస్తే వారి విధులను పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలకు బదలాయించేలా ప్రాథమికంగా ప్రతిపాదనలు తయారుచేసింది. రెవెన్యూ, గ్రామ రికార్డుల నిర్వహణ బాధ్యతలను వ్యవసాయ విస్తరణాధికారులకు.. రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్ల పంపిణీ తదితరాలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించాలని యోచిస్తోంది. తహసీల్దార్ల అధికారాల్లో కోత ఆలోచనకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో వీఆర్వోల అధికారాలనూ కుదించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విధులు, బదలాయింపులపై కసరత్తు రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి, అధికారుల విధుల్లో మార్పుచేర్పులు చేయడమేగాక కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తయినా భూవివాదాలు సమసిపోకపోవడం, పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలో జాప్యం వంటి వాటికి కిందిస్థాయి అధికారుల చేతివాటమే కారణమని అంచనాకొచ్చిన సీఎం.. గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డుల సంరక్షకుడిగా పరిగణించే వీఆర్వోలతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వీఆర్వో వ్యవస్థ రద్దు కానుందనే ప్రచారానికి బలం చేకూరింది. దీనికి కొనసాగింపుగా.. వీఆర్వోలను కొనసాగిస్తే వారి వి«ధులెలా ఉండాలి? వేటిని ఇతర శాఖలకు బదలాయించాలి? కాలం చెల్లినవాటిలో వేటికి మంగళం పాడాలనే దానిపై రెవెన్యూశాఖ అంతర్గత ప్రతి పాదనలతో జాబ్‌చార్ట్ తయారుచేసింది. ఒకవేళ వీఆర్వో వ్యవస్థను రద్దుచేస్తే.. వారి విధులను పంచాయతీ కార్యదర్శులు, మండల వ్యవసాయ విçస్తరణాధికారులకు బదలాయించే అంశాన్నీ పరిశీలిస్తోంది. దీనిపై సీఎం తీసుకునే నిర్ణయం మేరకు నడుచుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పక్కనపెడితే ఏంచేయాలి? భూరికార్డుల ప్రక్షాళనలో వీఆర్వోల భాగస్వామ్యంతో అక్రమాలు జరిగాయని అంచనాకొచ్చిన ప్రభుత్వం.. భూ రికార్డుల నిర్వహణ నుంచి వారిని పూర్తిగా తప్పించాలని నిర్ణయించింది. భూ రికార్డుల్లో కాస్తు కాలమ్‌ను తొలగించినందున, క్షేత్రస్థాయిలో వీరి అవసరం కూడా లేదనే భావనకొచ్చింది. అయితే, వీఆర్వో వ్యవస్థను పూర్తిస్థాయిలో రద్దుచేస్తే ఉద్యోగ సంఘాల ప్రతికూలత వస్తుందని భావిస్తున్న సర్కార్.. వీరి సేవలను వేరే విధంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. నైపుణ్యం ఉన్నవారిని రెవెన్యూలోనే కొనసాగించి.. ఇతరులను పూలింగ్‌లో పెట్టడం ద్వారా పంచాయతీరాజ్, వ్యవసాయశాఖల్లో విలీనంచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థను గనుక రద్దుచేస్తే క్వాలిఫైడ్ వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా నిర్వచిస్తూ ప్రస్తుత శాఖలోనే కొనసాగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఏఈవోల పరిధిపై గందరగోళం వీఆర్వో వ్యవస్థ రద్దు, అధికారాల కుదింపు/బదలాయింపు అంశంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తహసీల్దార్ల అధికారాలకు కత్తెరపెట్టాలని యోచిస్తోన్న సర్కారు.. గ్రామకంఠం లోని భూ వ్యవహారాలను ఎంపీడీవోలకు, మిగతా రెవెన్యూ వ్యవహారాలను తహసీల్దార్లకు అప్పగించాలని భావిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం వీఆర్వోలు నిర్వహిస్తున్న విధుల్లో అధికశాతం వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)కు కట్టబెట్టాలని యోచిస్తోంది. అయితే, మండలానికి సగటున ముగ్గురు ఉండే ఏఈవోలకు గ్రామ రెవెన్యూ రికార్డులు, గ్రామ ఖాతాల నిర్వహణ బాధ్యతలూ అప్పగించాలనే ప్రభుత్వ ప్రతిపాదన ఆచరణ యోగ్యం కాదనే అభిప్రాయాలున్నాయి. ఏకకాలంలో రెవెన్యూ, వ్యవసాయ విస్తరణ వ్యవహారాల నిర్వహణ సాధ్యపడదనే వాదన వినిపిస్తోంది. రెవెన్యూ వ్యవహారాలకు గుండెకాయలాంటి ఆర్వోఆర్ చట్టంపై పరిజ్ఞానం లేని ఏఈవోలకు రెవెన్యూ రికార్డులు, విలేజ్ అకౌంట్స్ అప్పగిస్తే మరింత గందరగోళం తలెత్తే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మండల వ్యవసాయాధికారుల పరిధిలో పనిచేసే ఏఈవోల కు భూ వ్యవహారాలను అప్పగిస్తే ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తారనే దానిపైనా అనిశ్చితి ఉంది. ప్ర భుత్వ నిర్ణయం తర్వాతే దీనిపై స్పష్టత రానుంది. వీఆర్వో వ్యవస్థ ఉంటే లేదా పంచాయతీ కార్యదర్శులకు బదలాయిస్తే వారికి ప్రతిపాదించిన విధులు ► కుల, ఆదాయ, స్థానిక సర్టిఫికెట్ల ధ్రువపత్రాల విచారణ ► తుపాను, వరదలు, అగ్ని ప్రమాదాలు, ప్రమాదాలు, విపత్తుల సమాచారాన్ని పైస్థాయి అధికారులకు చేరవేయడం ► విపత్తుల వల్ల వాటిల్లిన నష్టపరిహారాన్నిఅంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించడం ► పురాతన భవనాల కూల్చివేతలు, స్మారక కట్టడాల పరిరక్షణ, శాసనాలకు సంబంధించిన సమాచారం, చట్టపరమైన సమన్లు, నోటీసులు అందించడంలో అధికారులకు సహాయకారిగా వ్యవహరించడం ► ఆయా సందర్భాల్లో ప్రభుత్వ ఆదేశాలను ప్రజలకు ‘టాంటాం’ద్వారా తెలియజేయడం ► రుణవసూళ్లలో సహాయపడడం, క్లెయిమ్ చేయని ఆస్తులకు పంచనామా నిర్వహించడం, ప్రభుత్వ స్వాధీనంలోని ఆస్తుల పరిరక్షణ ► ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల విధుల నిర్వహణ రద్దయ్యే విధులు! ► భూమిశిస్తు, పన్నులు, రెవెన్యూ ఆదాయం, ఇతర బకాయిల వసూళ్లు ► రైల్వే ప్రమాదాలు, ఆకస్మాత్తుగా సంభవించే వరదలపై స్టేషన్ మాస్టర్‌కు సమాచారమివ్వడం, తమ పరిధిలో విమాన ప్రమాదం జరిగితే, ఆ సమాచారాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరవేయడం, గ్రామస్థాయిలో విద్యుత్‌శాఖ ఆస్తుల చౌర్యంపై ఫిర్యాదులు, బదిలీ, సస్పెన్షన్, తొలగింపు, డిస్మిస్, పదవీ విరమణ సమాచారాన్ని సంబంధితులకు చేరవేయడం, పోలీసు శాఖ సేవల నుంచి మినహాయింపు. ఇతర శాఖల్లోని అధికారులకు బదలాయింపులిలా.. ► వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ): గ్రామ రికార్డుల నిర్వహణ, సాగు లెక్కల సమాచారం, రెవెన్యూ రికార్డులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ ► సంబంధిత శాఖలకు..: ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, ఆక్రమణలపై నిఘా, ప్రజల మౌలిక అవసరాలైన రోడ్లు, వీధులు, బహిరంగ ప్రదేశాల స్థలాలను కాపాడడం, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం, కబ్జాలు తదితర సమాచారాన్ని తహసీల్దార్లకు చేరవేయడం, దాన్ని అమలు చేయడం ► మండల స్థాయి అధికారి: గ్రామ సహాయకుల వేతన బిల్లుల తయారీ ► అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ): చెరువుల పరిరక్షణ ► పంచాయతీ కార్యదర్శి: గ్రామస్థాయి సమావేశాల నిర్వహణ, తన పరిధిలో పింఛన్ల మంజూరు– పంపిణీ, ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థ పర్యవేక్షణలో ఉన్న రేషన్‌కార్డుల జారీ, ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారాలు, జనన, మరణ రికార్డుల నిర్వహణ, కనీస వేతనచట్టం–1948 అమలు, గ్రామ చావిడీల నిర్వహణ బాధ్యతలు -
సూక్ష్మస్థాయిలో పంటల సాగుపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మస్థాయిలో పంటల సాగుపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. మండలాల్లో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పరిధి మేరకు ఉన్న క్లస్టర్లను ఆధారం చేసుకుని ఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో అంచనా వేసే కసరత్తు మొదలైంది. ఈ మేరకు ఆ ప్రక్రియ పూర్తి చేసి సమగ్ర నివేదికివ్వాలని వ్యవసాయ శాఖ శుక్రవారం జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ నిపుణులతో కలసి ఏ పంట ఏ జిల్లాలో ఎంత విస్తీర్ణంలో వేయాలనే దానిపై నివేదిక రూపొందించారు. దీనిపై ఇటీవల సీఎం కేసీఆర్ చర్చించి పలు మార్పులు చేశారు. ఆ ప్రకారం ఇప్పుడు క్లస్టర్ల వారీగా సాగు విస్తీర్ణం వివరాలను వ్యవసాయశాఖ సేకరిస్తుంది. ఆ మేరకు క్లస్టర్ల వారీగా పంటల సాగు వివరాలను ఏఈవోలు నివేదిస్తారు. ఏ పంట ఎన్ని ఎకరాలు.. రాష్ట్రంలో 2,600 వరకు ఏఈవో స్థాయి క్లస్టర్లు ఉన్న విషయం విదితమే. ఒక్కో క్లస్టర్ పరిధిలో 5 వేల ఎకరాలున్నాయి. మొత్తంగా దాదాపు 1.30 కోట్ల ఎకరాలున్నట్లు అంచనా వేశారు. ఇప్పుడు ఆ మొత్తం విస్తీర్ణంలో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారన్న దానిపై ఏఈవోలు సమాచారం సేకరిస్తారు. ఏఈవోలు సంబంధిత క్లస్టర్లలోని గ్రామాలకు వెళ్లి రైతులు వేసే పంటలు, వేయాల్సిన వాటిపై సమాచారం తీసుకుంటారు. అవసరమైతే వేయాల్సిన పంటలపై రైతులను ఒప్పిస్తారు. గ్రామాల వారీగా పంటల సాగు విస్తీర్ణం, ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు వేస్తారన్న దానిపై సూక్ష్మస్థాయి అంచనాకు వస్తారు. ఆ వివరాలను మండల స్థాయిలోనూ క్రోడీకరించి జిల్లా వ్యవసాయశాఖకు అందజేస్తారు. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను ముందస్తుగా జిల్లాల వారీగా సిద్ధం చేసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి 61.24 లక్షల ఎకరాల నుంచి గరిష్టంగా 70 లక్షల ఎకరాలు అంచనా వేస్తున్నారు. కందులు 13 లక్షల ఎకరాల నుంచి 15 లక్షల ఎకరాలు, వరి 40 లక్షల ఎకరాల నుంచి 41 లక్షల ఎకరాలు, పెసర 1.98 లక్షల ఎకరాలుగా ఉంది. ఈ వానకాలంలో జొన్నలు 1.54 లక్షల ఎకరాలు, మినుములు 59 వేల ఎకరాలు, ఆముదం 92 వేల ఎకరాలు, వేరుశనగ 42 వేల ఎకరాల్లో సాగు చేసేలా ప్రతిపాదించారు. రూ. 400 కోట్ల రుణమాఫీ.. ఇక రూ.25 వేల లోపున్న రైతుల రుణమాఫీ సొమ్ము జమ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.400 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. మొదటి విడతలో దాదాపు 6 లక్షల మంది రైతులకు రూ.25 వేల చొప్పున రూ.1,200 కోట్ల మాఫీ సొమ్మును జమ చేయాల్సి ఉంది. వారం రోజుల్లోపు మొదటి విడత రుణమాఫీ పూర్తి చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
వానాకాలం వ్యవసాయంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్లో వ్యవసాయ సన్నద్ధతపై సీఎం కేసీఆర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లు మొదలు వ్యవసాయ శాఖకు చెందిన కిందిస్థాయి ఏఈవో నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు ఇందులో పాల్గొననున్నారు. అలాగే ఉద్యాన, మార్కెటింగ్ జిల్లా ఉన్నతాధికారులు, మార్క్‌ఫెడ్ మేనేజర్లు, ఆగ్రోస్ రీజనల్ మేనేజర్లు, విత్తన కార్పొరేషన్ జిల్లా మేనేజర్లు, జిల్లా సహకారశాఖ అధికారులు, రైతుబంధు సమితి గ్రామ, మండల, జిల్లా కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. కాన్ఫరెన్స్ ఎజెండా అంశాలను వ్యవసాయశాఖ ఆదివారం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు అందజేసింది. ఎజెండా అంశాలు ఇవే... గ్రామాలు, మండలాల వారీగా ప్రస్తుత వానాకాలం సీజన్లో సాగు చేయాల్సిన వరి, మేలు రకం విత్తనాలు } గ్రామాలు, మండలాలవారీగా మొక్కజొన్న ప్రత్యామ్నాయ పంటల సాగు, ∙గ్రామాలు, మండలాలవారీగా కంది పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు అవకాశాలపై సలహాలు గ్రామాలు, మండలాలవారీగా పత్తి పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు గల అవకాశాలపై చర్చ ఆయిల్‌పామ్, నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడానికి అనుకూలమైన మండలాలు, గ్రామాల వారీగావివరాలు ∙పచ్చిరొట్టను ప్రోత్సహించడంపై వివిధ రకాల పంటలకు సంబంధించి అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ఎరువుల సరఫరా, ప్రస్తుతం అందుబాటులో ఉన్నది ఎంత? జిల్లాలు, మండలాల వారీగా పంటల మ్యాపింగ్ -
సాగు లెక్క..ఇక పక్కా
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్) : ప్రభుత్వం జిల్లాల వారీగా పంట కాలనీల ఏర్పాటుకు వీలుగా ఫిబ్రవరిలో ప్రారంభించిన రైతు సమగ్ర సర్వే ఇటీవల పూర్తయింది. వ్యవసాయాధికారులు జిల్లాలో ప్రతి రైతు కుటుంబం వివరాలు, వారు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకున్నారు. అధికారులు సర్వే ఫారాల్లో ముందుగానే ప్రింట్ చేసిన 13 అంశాలు కాకుండా మరో 14అంశాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. రైతుకు మేలు చేసేందుకు పంటకాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగా రైతుల వివరాలు సేకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం కాలనీల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇదీ సాగు లెక్కా.. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రైతు సమగ్ర సర్వేలో మొత్తం 5.10లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతున్నట్లు తేలింది. 1.21లక్షల మంది రైతులు ఉండగా, ప్రధానంగా పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తి తరువాత సోయా, అంతర పంటగా కంది పంటలు తరువాత స్థానంలో నిలిచాయి. మొత్తం 18మండలాల్లోని 102 క్లస్టర్ల పరిధిలోని 508 గ్రామాల్లో ఈ సర్వే కొనసాగింది. మొత్తం 105మంది సిబ్బంది జిల్లా వ్యాప్తంగా 90వేల రైతు కుటుంబాలను జూన్ వరకు సర్వే చేపట్టారు. జిల్లాలో అత్యధికంగా జైనథ్ మండలంలో 14113మంది రైతులు ఉండగా, మావల మండలంలో అత్యల్పంగా కేవలం 775మంది రైతులు మాత్రమే ఉన్నారు. పంట కాలనీల ఏర్పాటుకు... ప్రభుత్వం జిల్లాల వారీగా పంట కాలనీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉండటంతో రైతుల పక్కా సమాచారం అవసరమైంది. అయితే వ్యవసాయ శాఖ వారు ప్రతీ ఏటా రైతులు వేసిన పంటల వివరాలను సేకరిస్తారు. ఈ వివరాల్లో చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉండటంతో మరోసారి రైతు సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. గతంలో రైతుల సాగు వివరాలు తెలుసుకోవడం ఒక రకంగా చాలా కష్టంగా ఉండిందనే చెప్పవచ్చు. రైతులు బ్యాంకులో ఒక పంట పేరిట రుణం తీసుకుంటే.. బీమా కోసం మరో పంట నమోదు చేయించేవారు. దీంతో పాటు పంట రుణం కోసం ఇంకో పంట చూపించడం సాధారణంగా మారింది. దీంతో రైతులు అసలు ఏఏ పంటలు సాగు చేస్తున్నారు అని తెల్సుకోవడం కొంత ఇబ్బందిగానే మారింది. అయితే ఈ సమగ్ర సర్వేతో రైతుల పక్క వివరాలు తెలియడంతో పంట కాలనీల ఏర్పాటు దిశగా ముందడుగు పడే అవకాశం ఉంది. ఈ సర్వే ద్వార ఒక ఒక నిర్ణీత ప్రదేశంలో ఎక్కువగా సాగయ్యే పంటలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించి, వాటి దిగుబడి పెంచేందుకు, విస్తృత మార్కెట్ కల్పించేందుకు అవకాశం కలుగనుంది. అలాగే ఫుడ్ ప్రాసెసిసింగ్, క్రాప్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక పరిపుష్టి చేకుర్చేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి. కొనసాగుతున్న ఆన్లైన్.. సమగ్ర సర్వేలో సేకరించిన వివరాలు ప్రత్యేకమైన పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఏఈవోలు వారి క్లస్టర్ గ్రామాల్లో ఆఫ్‌లైన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్ చేస్తున్నారు. వారికి ఇచ్చిన ట్యాబ్‌లలో ఈ పూర్తి సర్వే వివరాలు నమోదు చేస్తున్నారు. ఒక్కసారి ఆన్లైన్ ప్రక్రియ పూర్తి అయితే ఒక్క క్లిక్‌తో ఏ గ్రామంలోని వివరాలైన తెలుసుకునే వీలుటుంది. అన్ని జిల్లాల నుంచి సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తుండటంతో రైతుల సమస్త సమాచారం ఒకే చోటు లభించే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్క రైతు వివరాలను ఆన్లైన్ చేసేందుకు కనీసం 20–30నిమిషాలు పడుతుండటంతో ఆన్లైన్ ప్రక్రియ కొంత నెమ్మదిగా కొనసాగుతోంది. గ్రామాల వారీగా నివేదికలు పంపించాం సమగ్ర సర్వేపై ప్రభుత్వానికి గ్రామాల వారీగా నివేదికలు పంపించాం. గ్రామాల వారీగా సాగు విస్తీర్ణం, పంటల వివరాలు ఆన్లైన్ చేశాం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్, రైతుబంధు పనుల్లో కొంత సిబ్బంది బిజీగా ఉండటంతో రైతుల వారీగా ఆన్లైన్ చేసే పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతున్నా యి. ఏఈవోలు వారి వారి క్లస్టర్ సమాచా రాన్ని ఆన్లైన్ చేయాలని ఆదేశాలు జారీ చే సాం. త్వరలో పూర్తిస్థాయిలో ఆన్లైన్ చే స్తాం. – ఆశాకుమారి, డీఏవో,ఆదిలాబాద్ -
యువ వ్యవసాయాధికారుల దుర్మరణం
సాక్షి, భైంసా/భైంసారూరల్: చిన్న వయస్సులో ఏఈవో ఉద్యోగాలు వచ్చిన ఆ కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీరని వేదన మిగిల్చింది. నర్సాపూర్ మండలంలో పనిచేస్తున్న ఇద్దరు యువ ఏఈ వోలు ఆదివారం సెలవు దినం కావడంతో భైంసా మండలంలోని పేండ్‌పెల్లి గ్రామంలో వింధుకు హాజరయ్యారు. విందు ముగించుకుని సాయం త్రం 6.30 గంటలకు ద్విచక్రవాహనంపై తిరుగు పయనమయ్యారు. టోల్‌ప్లాజాకు 200 మీటర్ల దూరంలోకి రాగానే ఇసుకలోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని వెనుకవైపు నుంచి ఢీ కొట్టారు. ఘటనలో బండి నడుపుతున్న విక్రమ్ తలకు తీవ్రగాయంకాగా అక్షయ్‌కుమార్ రెండుకాళ్లు విరిగాయి. క్షతగాత్రులను ఆటో ట్రాలీలో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యంకోసం అంబులెన్సులో నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో విక్రమ్(25)మృతి చెందాడు. నిజామాబాద్ ఆసుపత్రిలో అక్షయ్‌కుమార్(25) చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి అమరేశ్‌కుమార్, మార్క్‌ఫెడ్ డీఎం కోటేశ్వర్రావు, ఏడీఏఅంజిప్రసాద్, ఏఓలు రాంచందర్‌నాయక్, సోమలింగారెడ్డి, టీఎన్జీఓస్ భైంసా ప్రధాన కార్యదర్శి నాగుల శ్రీహరి, జిల్లాలో పనిచేసే ఏఈఓలు అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్... విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి భైంసా ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో మృతదేహాలను చూసి కుటుంబీకులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ.5వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. ప్రభుత్వం తరుపున ఆదుకుంటాం ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఉదయం 7గంటలకే భైంసా ఏరియా ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకుంటానన్నారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఏఈవోలు మృతిచెందిన సంఘటన తనను కలిచివేస్తుందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అమరేశ్‌కుమార్ బాధిత కుటుంబీకులకు రూ. 10వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుత్ను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఒకే మండలంలో పనిచేసి... 2017 జనవరి 30న విక్రమ్, అక్షయ్‌కుమార్‌లు ఏఈఓలుగా ఉద్యోగంలో చేరారు. విక్రమ్ నర్సాపూర్ మండలం చాక్పెల్లి సెక్టార్లో, కునింటి అక్షయ్‌కుమార్ అదే మండలం రాంపూర్ సెక్టార్లో ఏఈఓగా విధులు నిర్వహిస్తుండేవారు. ఇద్దరు ఏఈఓలు మృతిచెందిన విషయం తెలుసుకున్న నర్సాపూర్ రైతులు తీవ్ర ఆవేదన చెందారు. ఇంటికి పెద్దకొడుకు అక్షయ్ కుభీర్ మండలం హల్దా గ్రామానికి చెందిన కునింటి హన్మండ్లు గంగాబాయి దంపతులకు ముగ్గురు సంతానం. వ్యవసాయం చేస్తూ ముగ్గుర్ని చదివించారు. పెద్దవాడైన అక్షయ్‌కుమార్ ఏఈఓగా ఉద్యోగం సాధించడంతో కష్టాలు కొంతమేర గట్టెక్కాయి. రెండవ కుమారుడు అజయ్‌కుమార్, మూడవ కుమారుడు విజయ్‌కుమార్ డిగ్రీ చదువుతున్నారు. వయస్సు పైబడ్డ తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటాడనుకున్న పెద్ద కొడుకు ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. తమ ఆవేదన ఎవరికి చెప్పాలో తెలియక మృతుని సోదరులిద్దరు గుండెలు బాదుకుంటూ రోధించిన తీరు అందరిని కలిచివేసింది. భైంసా ఏరియా ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని కుభీర్ మండలం హల్దా గ్రామానికి తరలించారు. ఇంటికి పెద్దదిక్కే విక్రమ్ మామడ మండలం గాయక్పెల్లికి చెందిన బలి రాం కళాబాయి దంపతులకు ఐదుగురు సంతానం. అందులో ముగ్గురు ఆడపిల్లలు కాగా ఇద్దరికి వివాహం జరిపించారు. ఇదే సమయంలో విక్రమ్‌కు ఏఈఓగా ఉద్యోగం వచ్చింది. నర్సాపూర్ మండలంలో ఏఈఓగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతేడాది తల్లి కళాబాయి సైతం అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబానికి అన్నీతానై నడుపుతున్న ఏఈఓ విక్రమ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలియ గానే వారంతా నివ్వెరపోయారు. వారి బంధువులు భైంసా ఏరియా ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లారు. -
దుర్గగుడిలో అవినీతి ఏఈవో సస్పెన్షన్
-
వ్యవసాయాధికారులతో 4న సీఎం భేటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో వచ్చే నెల 4న మూడు వేల మంది వ్యవసాయాధికారులు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక సమావేశానికి ఆదేశాలు జారీ చేశారు. రైతుబంధు పథకం అమలు తీరుపై ఈ కార్యక్రమంలో సీఎం సమీక్షించనున్నారు. అలాగే రైతు బీమా పథకం అమలు కార్యాచరణకు సూచనలు ఆహ్వానించనున్నారు. ఈ సమావేశానికి మండల స్థాయిలో పనిచేసే 2,500 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), జిల్లా వ్యవసాయాధికారులు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులను ఆహ్వానించారు. ప్రోత్సాహకానికి సర్కార్‌కు విన్నపం! అయితే పెట్టుబడి చెక్కుల పంపిణీలో కీలకపాత్ర పోషించినందున.. గత కొన్ని నెలలుగా దీనిపై ప్రత్యేకంగా పనిచేస్తున్నందున ఓ నెల వేతనం ప్రోత్సాహకంగా ఇవ్వాలని వ్యవసాయశాఖాధికారులు సర్కార్‌కు విన్నవించాలని యోచిస్తున్నారు. 4న సభలో ఇదే విషయమై ప్రత్యేకంగా సీఎంకు విన్నవించాలని పలువురు వ్యవసాయ ఉద్యోగ నేతలు భావిస్తున్నారు. -
గ్రూప్ 2కు తండ్రీ కొడుకులు సెలక్ట్
ప్రకాశం, త్రిపురాంతకం: తండ్రీ కొడుకులు ఒకేసారి గ్రూప్ 2కు సెలక్టయ్యారు. ఒకరు ముందు, ఆ తర్వాత మరొకరు గ్రూప్–2 పరీక్షలు రాశారు. అయితే ఇద్దరికీ ఒకే సారి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో సంతోషంలో మునిగిపోయారు. కష్టపడితే సాధించలేనిది ఏమిలేదంటున్నారు ఈ తండ్రీ కొడుకులు. త్రిపురాంతకం మండలం దూపాడు పంచాయతీ పరిధిలోని దీవెపల్లి గ్రామానికి చెందిన కటికి సుబ్బారావు కుమారుడు శ్రీనివాసులు ఈ ఘనత సాధించారు. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివారు. సుబ్బారావు 1999లో గ్రూప్ 2కు సెలక్ట్ అయ్యారు. అయితే కొందరు కోర్టును ఆశ్రయించడంతో కాలయాపన జరిగింది. ప్రస్తుతం సుబ్బారావు ఏఈఓగా సెలక్ట్ అయ్యారు. ఈయన జెడ్పీ హైస్కూల్ దొనకొండలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. గత పదిహేను సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఇతని కుమారుడు శ్రీనివాసులు 2016 గ్రూప్2 ఫలితాల్లో ఏఎస్ఓ సెక్రెటరియేట్‌గా ఎంపికయ్యారు. అంతంత మాత్రం వసతులున్న స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య, దూపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. గ్రామస్తులు, పలువురు ప్రముఖులు అభినందించారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకుసాగితే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు శ్రీనివాసులు. -
వ్యవసాయాధికారులపై సమితుల పెత్తనం!
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయాధికారులపై రైతు సమన్వయ సమితి సభ్యుల పెత్తనం మొదలు కానుందా? సమితుల్లో అత్యధికంగా టీఆర్ఎస్ కార్యకర్తలే ఉండటంతో వారి నియంత్రణలో అధికారులు పనిచేయాల్సి రానుందా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉందని వ్యవసాయశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ‘పెట్టుబడి’పథకం చెక్కుల పంపిణీ మొదలుకొని పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు సమితి సభ్యుల పర్యవేక్షణే కీలకం కానుండటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిధిలో కిందిస్థాయిలో ఎవరూ రాజకీయ కార్యకర్తలు ఉండేవారు కాదు. అధికారులే కిందిస్థాయిలో పనులు చక్కబెట్టేవారు. రైతు సమన్వయ సమితిలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సభ్యులు 1.61 లక్షల మంది ఉన్నారు. వాటికి సమన్వయకర్తలున్నారు. గ్రామస్థాయిలో 15, మండల, జిల్లా స్థాయిలో 24, రాష్ట్రస్థాయిలో 42 మంది చొప్పున సభ్యులున్నారు. ప్రతీ గ్రామ, మండల, జిల్లా సమితులకు సమన్వయకర్త ఉన్నారు. రాష్ట్రస్థాయి సమితి ఇంకా ఏర్పడాల్సి ఉంది. రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఇప్పటికే ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒత్తిళ్లు తప్పవా? రాష్ట్ర వ్యవసాయశాఖలో కిందినుంచి పైస్థాయి వరకు పటిష్టమైన వ్యవస్థ ఉంది. రెండు మూడు గ్రామాలకు కలిపి వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) ఉంటారు. మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి (ఎంఏవో) ఉంటారు. నియోజకవర్గం స్థాయిలో సహాయ వ్యవసాయాధికారి (ఏడీఏ), జిల్లాస్థాయిలో జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) ఉంటారు. ఏఈవోపై గ్రామ రైతు సమితి సభ్యులు, సమన్వయకర్తల నుంచి ఇబ్బందులు తలెత్తుయని అంటున్నారు. మండల సమన్వయ సమితి సభ్యులు, సమన్వయకర్తల నుంచి ఎంఏవోలకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఏడీఏ, డీఏవోలకు జిల్లా సమితి సభ్యులు, సమన్వయకర్తల నుంచి ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవసాయ యంత్రాల సరఫరాకు ఎంఏవో నుంచి అనుమతి అవసరం. అక్కడి నుంచే ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పుడు ట్రాక్టర్లకు సంబంధించి పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో పంపిణీ చేసే వరి నాటు యంత్రాల విషయంలోనూ ఇదే జరగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సమితి సమన్వయకర్తల నుంచి కూడా పైరవీలు పెరగనున్నాయి. అనధికారిక ప్రొటోకాల్ వ్యవసాయ శాఖ చేపట్టే ప్రతి కార్యక్రమం తమకు చెప్పాలని అనేకచోట్ల రైతు సమితి సమన్వయకర్తలు అంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఒకరకంగా గ్రామస్థాయి సమితి నుంచి పైస్థాయి వరకు ప్రొటోకాల్ ప్రకారం నడుచుకోవాలన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రస్థాయిలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నుంచి ప్రొటోకాల్ సమస్య ఉంటుందన్న భయాందోళనలను అధికారులు వెళ్లబుచ్చుతున్నారు. నిరంతరం కింది నుంచి పైస్థాయి వరకు గుత్తా పరిధిలోకే వ్యవసాయ విస్తరణ వ్యవస్థ వెళుతుందని అంటున్నారు. వ్యవసాయశాఖ చేపట్టే అన్ని రకాల కార్యక్రమాలు రైతు సమన్వయ సమితుల ద్వారానే జరుగనుండటంతో వాటికి అత్యంత ప్రాధాన్యం నెలకొంది. దీంతో రైతు సమన్వయ సమితి మరో అధికార కేంద్రంగా ఏర్పడనుందంటున్నారు. ఇది అనేక కొత్త సమస్యలను సృష్టిస్తుందని అంటున్నారు. -
ఏఈవో పోస్టులకు 2 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్ : గ్రేడ్–2 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్(ఏఈవో) పోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థులకు మార్చి 2 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచినట్లు పేర్కొంది. వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా, ఇతర వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించింది. -
ఇక.. చీటీ ఉంటేనే మందులు!
సాక్షి, తాండూరు : ఇక.. ఇష్టారాజ్యంగా పంటలపై మందుల వినియోగానికి చెక్ పడనుంది. వ్యవసాయాధికారులు అగ్రి వైద్యులుగా మారనున్నారు. ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ దుకాణాలు అగ్రి మెడికల్ షాపులుగా మారనున్నాయి. రైతులు పంటలకు అధిక మోతాదు మందులు వినియోగించి నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీంతో పురుగులమందు దుకాణాలు అగ్రి మెడికల్ దుకాణాలుగా మారనున్నాయి. వ్యవసాయాధికారులు చీటీ ఇస్తేనే ఇకపై మందులు ఇచ్చే పద్ధతి అమలులోకి రానుంది. జిల్లాలో 18 మండలాలు, 501 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 7లక్షల ఎకరాలు సాగుకు అమోదయోగ్యమైన భూములు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1.74లక్షల హెక్టార్లలో కంది, మినుము, వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఏటా పురుగుమందులు వినియోగం పెరిగిపోతుంది. ఇప్పటివరకు రైతులు పురుగుమందులను దుకాణదారుల సూచన మేరకు వినియోగించేవారు. ఈక్రమంలో ఒక్కోసారి అధికమొత్తంలో కూడా ఉపయోగిస్తూ తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన సర్కారు కొత్త పద్ధతిని అమలులోకి తీసుకురానుంది. ఇకపై ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే.. పంటల దిగుబడి అధికంగా రావాలనే ఉద్దేశంతో రైతులు పంటలకు రసాయన మందులను అధిక మోతాదుతో వినియోగించి తీవ్రంగా నష్టపోతున్నారు. పంటకు పురుగు ఆశించిందని నేరుగా మందుల దుకాణాదారులను అడిగి వారు ఇచ్చిన మేరకు పిచికారీ చేస్తుండేవారు. ఈనేపథ్యంలో రైతులకు దుకాణాదారులు నకిలీ మందులను సైతం అంటగట్టేవారు. తద్వారా వేల హెక్టార్లలో పంట నష్టం జరుగుతోంది. ఈనేపథ్యంలో తీవ్రనష్టాలకు గురై కొన్నిసందర్భాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలూ లేకపోలేదు. దీం తో ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చర్యల కు ఉపక్రమించింది. ఇకపై వ్యవసాయ అధికారులు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయా లు చేయకుండా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాదారులకు ఉత్తర్వులు జారీ చేయనుంది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి.. జిల్లాలో ఉన్న రసాయనిక పురుగుమందు, ఎరువుల దుకాణాల్లో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి విత్తనం విత్తే నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు అవసరమైన మందులను వ్యవసాయాధికారులు సూచనల మేరకు దుకాణాదారులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఈఓల కొరత.. జిల్లాలో 501 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 99 వ్యవసాయ క్లస్టర్లుగా ఉండాలి. అయితే, ప్రస్తుతం జిల్లాలో 53 క్లస్టర్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ఒక్కో క్లస్టర్లో 5వేల ఎకరాలకు ఒక ఏఈఓ అందుబాటులో ఉండాలి. కాగా, జిల్లాలో 44 మంది ఏఈఓలు విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయాధికారులకు ఇప్పటికే తలకు మించిన భారం ఉండటంతో పని ఒత్తిడి తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందుల చీటీ రాసి ఇవ్వడం మంచిదే అయినా, ఈ పద్ధతి నిర్వహణలో ఇబ్బందులు తప్పేలా లేవని క్షేత్రస్థాయిలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. చీటీ రాసి ఇస్తేనే మందులు.. రైతులు పండిస్తున్న పంటలకు పిచికారీ చేసేందుకు వ్యవసాధికారులు చీటీ రాసి ఇవ్వాల ని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో ఏఈఓల కొరత ఉంది. ప్రభుత్వం త్వరలో ఏఈఓలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏఈఓలు బీజీగా ఉన్నారు. అయినప్పటికీ ఈ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. –గోపాల్, వ్యవసాయాధికారి,వికారాబాద్ జిల్లా -
అధికారుల చేతుల్లో రైతుల వివరాలు
► ఇంటింటా నిర్వహిస్తున్న సర్వే ► పూర్తి వివరాలు సేకరణ జైనథ్ : మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లోని 55 గ్రామాల్లో రైతుల వారీగా పక్క వివరాలు నమోదుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల వ్యవసాయాధికారి ఏవో వివేక్, కొత్తగా విధుల్లోకి చేరిన ఏఈవోలు ఈ పనులను ప్రారంభించారు. ప్రత్యేకంగా రూపొందిన ప్రొఫార్మాలతో ఏఈవోలు వారి సెక్టార్ పరిధిలోని గ్రామాల్లో సర్వేలను ప్రారంభించారు. రైతుల పూర్తి సమాచారం.. ప్రత్యేకంగా చేపడుతున్న ఈ సర్వేలో రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సర్వేల కోసం ప్రత్యేకంగా రూపొందిన ప్రొఫార్మాలో ఏఈవో సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. దీంట్లో రైతుల పేర్లు, తండ్రి పేరు, గ్రామం, శివారం, ఆధార్ నంబర్, సర్వే నంబర్‌తో పాటు ముబైల్ నంబర్ కూడ నమోదు చేస్తున్నారు. ఇవే కాకుండా రైతులు ప్రస్తుతం వేసిన, వేస్తున్న పంటల పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. రైతులకు పంట రుణం ఉందా? బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉందా? అనే అంశాలు కూడా సేకరిస్తున్నారు. వీటితో పాటు రైతులకు అతి ముఖ్యమైన నీటి పారుదల అంశంపై ఈ సర్వేలు వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులకు నీటి పారుదల వసతి ఉందా? ఉంటే బావుల ద్వారా ఎంత? కాల్వల ద్వారా ఎంత ఉంది? అనే కోణంలో వివరాలు నమోదు చేస్తున్నారు? కాగా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం కోసం యంత్ర పరికరాలు, డ్రిప్ సిస్టమ్, ట్రాక్టర్లు వంటివి ఎంత మందికి అందుబాటులో ఉన్నాయనే అంశాలను సైతం ప్రాధాన్యంగా సర్వే చేస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయంపై ఎంతమంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు? ఎంత మందికి వర్మీ కంపోస్ట్, నాడెం కంపోస్ట్ యూనిటులు ఉన్నాయి? వంటి రైతుల సమగ్ర వివరాలు నమోదు చేసేందుకు ఈ సర్వేలు నిర్వహిస్తున్నట్లు ఆధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సర్వే ద్వారా రైతుల సమగ్ర సమాచారం అందుబాటులోకి రావడంతో వ్యవసాయ శాఖ సేవలు మరింత విస్తృతం అయ్యే అవకాశం ఉంది. 15రోజుల్లో సర్వే పూర్తి... మండలంలో గత కొన్ని రోజులుగా ఈ సర్వే నిర్వహిస్తున్నాము. ఒక్కొక్క ఏఈవో పరిధి లో 2వేల మంది రైతులు ఉన్నారు. ఈ లెక్క న 15రోజుల్లో సర్వే పూర్తి చేసి, తుది నివేదికలు సిద్ధం చేస్తాం. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం పథకలు అర్హులైన రైతులకు మాత్రమే అందేలా చూడటంతో పాటు, రైతులకు మరింత వేగవంతంగా, నాణ్యతతో సేవలిందవచ్చు. – వివేక్, ఏవో -
ఏవో, ఏఈవో, హెచ్‌వో పోస్టుల భర్తీకి
హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీకి నిరాకరణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాధికారులు (ఏవో), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈ వో), ఉద్యానవన అధికారుల (హెచ్‌వో) పోస్టుల భర్తీకి ఉమ్మడి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ సమయంలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్కులు వస్తే, అటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాం ప్రసాద్‌ల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. వ్యవసాయాధి కారులు, విస్తరణాధికారులు, ఉద్యానవన అధికారుల పోస్టుల భర్తీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని, ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, రాత పరీక్షకు అనుమతినిస్తూ ఫలితాలను వెల్లడించవద్దని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. తరువాత వీటిపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే మిగిలిన అభ్యర్థులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్కులు వస్తే, అటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘ఏవో, ఏఈవో’ ఫలితాలను ఇవ్వండి
సర్కార్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాధికారులు (ఏవో), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) పోస్టుల ఫలితాలను సీల్డ్కవర్లో తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏవో, ఏఈవోల పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని, ఆ మేర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. -
ఏఈఓపై టీడీపీ నాయకుడి దౌర్జన్యం
డీ.హీరేహాళ్ : మండలకేంద్రంలో పప్పుశనగ పంపిణీ సందర్భంగా ఏఈఓ గోపాల్‌పై టీడీపీ నాయకుడు శనివారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. పప్పుశనగ టోకన్లకోసం మాజీ జెడ్పీటీసీ శ్రీరామజ్యోతి భర్త శ్రీరాములు తన విధులకు ఆటంకం కలిగించడమే కాక దుర్భాషలాడినట్లు ఏఈఓ గోపాల్ తెలిపారు. టీడీపీ నాయకుడికి ఎలాంటి నల్లరేగడి భూమి లేకున్నా పప్పుశనగ కొనుగోలుకు వచ్చాడని, అయితే ఏఓతో అనుమతి తీసుకోవాలని సూచించినా పట్టించుకోలేదన్నారు. ‘నువ్వు అధికారివి కాదా, నీకు పని చేయడం రాదా’ అంటూ నానా హంగామా చేసినట్లు ఏఈఓ వాపోయారు. చివరికి నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఏఈఓ డీ.హీరేహాళ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నేటి నుంచి కరువు మండలాల్లో పంట నష్టంపై సర్వే
గ్రామస్థాయి వీఆర్వో, ఏఈఓ, పంచాయతీ సెక్రటరీలతో టీమ్ కర్నూలు(అగ్రికల్చర్): కరువు ప్రాంతాలుగా గుర్తించిన 12 మండలాల్లో శుక్రవారం నుంచి పంట నష్టంపై సర్వే మొదలు కానుంది. గ్రామస్థాయిలో వీఆర్ఓ, వ్యవసాయ విస్తరణాధికారి, పంచాయతీ సెక్రటరీ సర్వే చేయనున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు మండలాల వారీగా నమోదైన వర్షపాతం ఆధారంగా 34 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ఇందులో కల్లూరు, కోడుమూరు, ప్యాపిలి, వెల్దుర్తి, మంత్రాలయం, నందికొట్కూరు, చాగలమర్రి, కొలిమిగుండ్ల మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించింది. జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలో లేని గూడూరు, డోన్, కోసిగి, ఉయ్యాలవాడ మండలాలను కూడా ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా గుర్తించడం విశేషం. 12 మండలాల్లో ఈనెల 2 నుంచి సర్వే చేపట్టి 9వ తేదీకి పూర్తి చేస్తారు. తర్వాత గ్రామ పంచాయతీలో పెట్టి గ్రామసభ ఆమోదం తీసుకున్న తర్వాత డేటా ఎంట్రీ చేసి ఈనెల 16వ తేదీ నాటికి జిల్లా కేంద్రానికి నివేదికలు వచ్చేలా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాధారంపై సాగు చేసిన వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను గ్రామస్థాయిలో సర్వే చేసే టీమ్‌కు ఇవ్వాల్సి ఉంది. రెండు హెక్టార్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని జేడీఏ ఠాగూర్ నాయక్ తెలిపారు. 50 శాతం.. ఆపైన దెబ్బతిన్న పంటలను మాత్రమే నమోదు చేస్తారు. 2011, 2012 సంవత్సారాల్లో కరువు ఏర్పడినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో జరిగిన అవకతవకలను పరిగణనలోకి తీసుకుని ఈసారి అలాంటి వాటికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లుగా జేడీఏ వివరించారు. కరువు మండలాల్లో వర్షాభావం వల్ల పంటలను కోల్పోయిన రైతులు వెంటనే సంబంధిత గ్రామ కమిటీలకు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను అందజేయాలని తెలిపారు. జాబితాలను పంచాయతీలో పెట్టి అభ్యంతరాలు స్వీకరించి.. పరిష్కరించిన తర్వాతే డేటా ఎంట్రీ మొదలవుతుందన్నారు. కాగా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలోని 26 మండలాలను ప్రభుత్వం పక్కన పెట్టింది. వీటిని కూడా కరువు ప్రాంతాలుగా గుర్తించేలా జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. -
బెజవాడ దుర్గగుడి ఏఈవో సస్పెన్షన్
విజయవాడ: బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆలయ ఏఈవో రాంబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం ఈ మేరకు దేవస్థానం ఈవో నర్సింగరావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల దేవస్థానంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల వేలం ప్రక్రియకు టెండర్లకు పిలిచారు. ఆ క్రమంలో ఏఈవో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో ఏఈవో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది. దీంతో రాంబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. -
వ్యయం జాస్తి సాయం నాస్తి
అరకొరగా విత్తనాల సరఫరా నెల్లిమర్ల: సోమవారం ఉదయం ఏఓ సూరినాయుడు, ఏఈఓ ఉషారాణి క్షేత్రస్థాయికి వెళ్లారు. మరో ఏఈఓ ప్రశాంతి కార్యాలయంలోనే ఉండి రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు స్లిప్పులు రాస్తున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న 56 గ్రామాల్లో ఈ ఖరీఫ్‌లో మొత్తం ఆరువేల ఎకరాల్లో వరి పంట వేసేందుకు సిద్ధమయ్యారు. వరిసాగు చేసే రైతులకు అవసరమయ్యే విత్తనాలు మొత్తం వెయ్యి క్వింటాళ్లు కాగా ఇప్పటిదాకా కేవలం 360 క్వింటాళ్లు మాత్రమే సబ్సిడీపై సరఫరా చేసేందుకు మండలానికి వచ్చా యి. మొక్కజొన్న సాగు చేసే రైతులకు సైతం విత్తనాలు అందుబాటులో లేవు. ఇప్పటిదాకా ప్రభుత్వం మొక్కజొన్న విత్తనాలపై సబ్సిడీ ప్రకటించలేదు. దీంతో రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. డెంకాడ: డెంకాడ మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సోమవారం ఉదయం 10.15 గంటలకు ఏఈవో భాను తెరిచారు. మరో ఏఈఓ జగన్నాథం చొల్లంగిపేట రైతుల అవసరాలపై అక్కడకు వెళ్లారు. మరో ఏఈవో ప్రశూతి సెలవుపై ఉన్నారు. మండల వ్యవసాయాధికారి హరిక్రిష్ణ రాలేదు. 1001, నెల్లూరి సన్నాలు, రాగోలు సన్నాలు వంటి వరి విత్తనాలు మినహా, ఈ ప్రాంతంలో ఎక్కువగా వేసే సోనామసూరి, స్వర్ణ రకం విత్తనాలు లేవు. వేరుశనగ విత్తనాలు సమయం మించినా ఇంకా రాలేదు. ఇక్కడ ఐదుగురు ఏఈఓలు ఉండేవారు. ఇప్పుడు ముగ్గురే ఉన్నారు. పూసపాటిరేగ: ఖరీఫ్ సీజనుకు సంబంధించి సబ్సిడీపై వచ్చిన వరి విత్తనాలు అరకొరగానే వచ్చాయి. వ్యవసాయ అధికారి తిరుపతిరావు సెలవులో ఉన్నారు. విస్తరణాధికారులు శ్రీలక్ష్మి ,సూర్యప్రకాశరావులు కార్యాలయంలోనే ఉన్నారు. విస్తరణాధికారి రామకోటి ఫీల్డ్‌లో ఉన్నారు. మండలంలో 350 బస్తాల సాంబమసూరి, 120 బస్తాల 1001 మాత్రమే సబ్సిడీలో ఉన్నాయి. సిబ్బంది కొరత చీపురుపల్లి: మండలానికి నలుగురు వ్యవసాయ విస్తరణ అధికారులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. చీపురుపల్లిలో గల వ్యవసాయ కార్యాలయానికి రోజుకి 50 నుంచి వంద మంది వరకు వస్తున్నారు. ఏఓ కార్యకలాపాలు చక్కగా ఉన్నాయి. ప ర్మిట్లు రాసేందుకు ఒకే ఏఈఓ అయిపోవడంతో వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులకు జాప్యం జరుగుతోంది. కార్యాలయానికి వస్తున్న రైతులకు ఏ రకం విత్తనాలు మంచివో వివరించడం ఏఈఓనే చూసుకోవాలి. మెరకముడిదాం: మండ లానికి చెందిన ఇన్చార్జి వ్యవసాయాధికారి కె.అరుణ్‌కుమార్ గరివిడి ఫుల్‌చార్జ్ కావడంతో మండలానికి చెందిన రైతులకు అందుబాటులో ఉండలేకపోతున్నారు. మండలానికి చెందిన ఏఈఓలు ముగ్గురు ఉన్నారు. వాళ్లు ముగ్గురు ప్రతీరోజు వ్యవసాయకార్యాలయంలో రైతులకు అందుబాటులో ఉంటున్నారు. సోమవారం వ్యవసాయాధికారులు మధ్యాహ్నం 12 గంటల వరకూ వ్యవసాయ కా ర్యాలయాన్ని తెరవలేదు. మెరకముడిదాం గ్రామంలో 10 గ్రామాలకు చెందిన రైతులకు అవ గాహన సదస్సును నిర్వహించడంతో 12.30 కు కార్యాలయాన్ని తెరిచారు. గరివిడి(చీపురుపల్లి రూరల్): గరివిడిలో వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయాధికారి ఉన్నా లేనట్టేనని రైతులు తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు వ్యవసాయాధికారులు ఎవరూ లేరు. పది మంది రైతులు అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. రెండు మూడు రోజులుగా ఖరీఫ్‌లో సాగుచేసే విత్తనాల కోసం కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా అధికారులు మాత్రం కనిపించటం లేదని రైతులు చెబుతున్నారు. గుర్ల: రైతుల కోసం మండల కేంద్రం గుర్లలో ప్రభుత్వ పక్కా భవనంతో కూడిన వ్యవసాయ కార్యాలయం అందుబాటులో ఉంది. ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఒక ఏఈఓ పోస్టు ఖాళీగా ఉంది. సలహాలు, సూచనల కోసం సుమారు 20 నుంచి 30 మంది రైతులు వస్తుంటారు. అలాగే విత్తనాల సీజనులో 200 నుంచి 300 మంది వస్తుంటారు. అధికారులున్నా లాభం లేదు... నా పేరు మడపాన నారాయణరావు. నాది వెదుళ్లవలస గ్రామం. గత మూడు రోజులుగా వరి విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయానికి తిరుగుతున్నాను. ఎప్పుడు వచ్చినా అధికారులు కనిపించడం లేదు. రోజూ ఇదే తంతు. వ్యవసాయాధికారుల నుంచి ఏమాత్రం సలహాలు, సూచనలు అందటం లేదు. అతి కొద్దిమందికే... విజయనగరం రూరల్ : మండల పరిధిలో సుమారు 12 వేల మంది రైతులు ఉండగా వీరిలో వ్యవసాయాధికారులను సలహాలకు సంప్రదించేది అతికొద్ది మంది మాత్రమే. మండలం లో ఒక వ్యవసాయాధికారి, ముగ్గురు వ్యవసాయ విస్తరణాధికారులు పనిచేస్తున్నా రు. గ్రామాలకు వెళ్లి పంటలు, ఎరువుల వాడకంపై సలహాలు ఇవ్వాల్సిన వ్యవసాయాధికారులు కేవలం ఖరీఫ్ సీజన్‌కు ముందు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పంట నష్ట సమయంలో ఆదర్శ రైతులు కాంగ్రెస్ పార్టీకి, వారి కుటుంబ సభ్యులకే పంటనష్ట పరిహారం అందేలా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో ఐదు వేల ఎకరాల్లో పల్లం భూములు, నాలుగు వేల ఎకరాల్లో మెట్టు భూములు ఉన్నాయి. ఖరీఫ్‌లో విత్తనాల సరఫరాపై గ్రామ గ్రామానికి వెళ్లి అవగాహన కల్పించాల్సిన అధికారులు ఐదారు గ్రామాలకు ఒకే చోట సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో అధికారులు బొబ్బిలి రూరల్: మండల వ్యవసాయశాఖాధికారి కార్యాలయానికి రైతులు సలహాల కోసం రోజూ పది మంది వరకు వస్తుంటారు. ఎరువులు ఎంత మోతాదులో వేయాలి? ఈ వాతావరణంలో విత్తనాలు నాటవచ్చా? ఏయేరకాలు ఈ ప్రాంతానికి అనుకూలం? నెల్లూరు సన్నాలు చీడలకు తట్టుకోగలవా? వంటి సందేహాలు రైతులు సోమవారం వ్యక్తం చేశారు. మండల వ్యవసాయశాఖాధికారిగా ఏ.రవీంద్ర వ్యవహరిస్తుండగా, ఆయన సోమవారం విజయనగరంలో జేడీతో సమావేశానికి వెళ్లారు. ఆయన సేవలపై రైతులు సంతృప్తి వ్యక్త ంచేస్తున్నారు. అలాగే ముగ్గురు ఏఈఓలు జోగినాయుడు, రామమూర్తి, కిరణ్‌కుమార్‌లు ఉన్నారు. సోమవారం ఇద్దరు ఏఈఓలు విత్తనాల పంపిణీకి మనగ్రోమోర్ సెంటర్‌కు వెళ్లగా ఏఓ కార్యాలయంలో ఏఈఓ కిరణ్‌కుమార్ అందుబాటులో ఉన్నారు. తెర్లాం రూరల్: తె ర్లాంలోని మండల వ్యవసాయ కార్యాలయం సోమవారం ఉదయం 10 గంటలకు తెరచి ఉంది. మండల వ్యవసాయ అధికారి బి. శ్రీనివాసరావు, ఏఈఓ తమ్మినాయుడులు విధుల్లో ఉన్నారు. రఘు, ఇందిర అనే మరో ఇద్దరు ఏఈఓలు 10.15 గంటలకు కార్యాలయానికి వచ్చి, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. 1001 రకం వరి విత్తనాల కోసం మండలంలోని కొల్లివలస, పూనువలస, లోచర్ల, కుమ్మరిపేట, కాలంరాజుపేట గ్రామాల నుంచి రైతులు వ్యవసాయ కార్యాలయానికి వచ్చారు. విత్తన శుద్ధి తప్పని సరిగా చేయాలని ఏఓ రైతులకు సలహా ఇచ్చారు. బాడంగి: రైతులకు అవసరమైన వరి విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతులు తిరుగుతున్నారు. విత్తనాల కోసం సోమవారం గొల్లాది, పెదపల్లి, వీరసాగరం,పిండ్రంగివలస, కోడూరు,రావివలస, గూడెపువలస, మళ్లంపేట గ్రామాలకు చెందిన సుమారు 12 మంది రైతులు కార్యాలయానికి చేరుకుని అధికారుల కోసం వేచి చూస్తున్నారు. అధికారులు సమయపాలన పాటించడం లేదని రైతులు చెబుతున్నారు. రామభద్రపురం : స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సోమవారం రైతులు బారులు తీరారు. దీనిపై ఆందోళన కార్యక్రమం జరుగుతుందని వ్యవసాయ అధికారి చిం తాడ ప్రసాద్ పోలీసుల సహాయంతో మూడో విడతగా వచ్చిన 1001 వరి విత్తనాలను 540 బస్తాలను పంపిణీ చేశారు. ఒక్కో పాస్ పుస్తకానికి ఒక బస్తా ఇస్తామని ఏఓ తెలుపగా దానికి మించి కావాలని ఎక్కువ భూమి ఉన్న వారు అడిగారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విత్తనాలను సరఫరా చేయాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏఓ ప్రసాద్‌ని వివరణ కోరగా 100 క్వింటాళ్లు ఈ ఏడాది తక్కువగా సరఫరా చేసింద ని త్వరలో వాటి ని తీసుకొచ్చి రైతులకు అందిస్తామన్నారు.