‘ఏవో, ఏఈవో’ ఫలితాలను ఇవ్వండి | High Court Order on AO AEO Give results | Sakshi
Sakshi News home page

‘ఏవో, ఏఈవో’ ఫలితాలను ఇవ్వండి

Published Fri, Dec 16 2016 12:26 AM | Last Updated on Thu, Mar 28 2019 5:12 PM

High Court Order on AO AEO Give results

సర్కార్‌కు హైకోర్టు ఆదేశం  
సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయాధికారులు (ఏవో), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) పోస్టుల  ఫలితాలను సీల్డ్‌కవర్‌లో తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్‌ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏవో, ఏఈవోల పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని, ఆ మేర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement