బెజవాడ దుర్గగుడి ఏఈవో సస్పెన్షన్ | Vijayawada Sri Kanaka Durga Temple AEO suspension | Sakshi
Sakshi News home page

బెజవాడ దుర్గగుడి ఏఈవో సస్పెన్షన్

Published Tue, Dec 23 2014 3:19 PM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

Vijayawada Sri Kanaka Durga Temple AEO suspension

విజయవాడ: బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆలయ ఏఈవో రాంబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం ఈ మేరకు దేవస్థానం ఈవో నర్సింగరావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల దేవస్థానంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల వేలం ప్రక్రియకు టెండర్లకు పిలిచారు.

ఆ క్రమంలో ఏఈవో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో ఏఈవో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది. దీంతో రాంబాబుపై సస్పెన్షన్ వేటు పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement