Sri kanaka durga temple
-
కిక్కిరిసిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై చేతులెత్తేసిన పోలీసులు
సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ దసరా నవరాత్రి వేడుకలు ముగింపునకు చేరుకున్నాయి. దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఇద్రకీలాద్రిపైకి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరో వైపు భవానీలు ఇంద్రకీలాద్రికి భారీగా చేరుకుంటుండటంతో కొండ దిగువ నుంచే భక్తులు కిటకిటలాడుతున్నారు.ఇంద్రకీలాద్రిపై భక్తులు, భవానీల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు చేతెలేత్తేశారు. సామాన్య భక్తులతోపాటు భవానీలతో క్యూలైన్లు నిండిపోయాయి. క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులను ఘాట్ రోడ్డులోకి వదిలేశారు.దీంతో చిన్న రాజగోపురం వద్దకు ఒక్కసారిగా భక్తులు చొచ్చుకువచ్చారు. కొండపైన భక్తులను పోలీసులు నిలువరించలేకపోతున్నారు. సీతమ్మవారి పాదాల ఘాట్ భవానీలతో నిండిపోయిది. భవానీలు కంట్రోల్ చేసేందుకు పోలీసులు రోప్‌లు ఏర్పాటు చేశారు. -
Vijayawada: హంస వాహనంపై స్వామి వారు జల విహారం (ఫొటోలు)
-
దుర్గమ్మ సేవలో లోక్‌సభ స్పీకర్
విజయవాడ : లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన కనకదుర్గ అమ్మ వారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ ఈవో, వేద పండితులు ఘనస్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు స్పీకర్ విజయవాడ వచ్చిన విషయం తెలిసిందే. -
ఆ లిఫ్ట్ ఎక్కేందుకు వీఐపీ, వీవీఐపీలకైతే ఓకే...
వృద్ధులు, వికలాంగులు సైతం రూ.100 టికెట్ కొనాల్సిందే సిబ్బందికి ఐడీ కార్డు తప్పనిసరి ఆలయ వేళలు రోజుకు 15 గంటలు లిఫ్టు పనివేళలు ఏడు గంటలే వ్యాపారుల ప్రయోజనాల కోసమే అధికారుల నిర్ణయం! విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దేవస్థానం ఏర్పాటు చేసిన లిఫ్టు ఎక్కాలంటే అనేక నిబంధనలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అమ్మవారికి భక్తులు సమర్పించిన మొక్కుబడులు, కానుకల సొమ్ము నుంచి సుమారు రూ.50 కోట్లు వెచ్చించి మల్లికార్జున మహామండపాన్ని నిర్మించారు. దీనిలో సుమారు రూ.20 లక్షలు పెట్టి రెండు లిప్టులు ఏర్పాటు చేశారు. అయితే ఈ లిప్టును ఇప్పుడు భక్తులు వినియోగించుకునేందుకు అధికారులు అనేక నిబంధనలు విధిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులపైనా కనికరం లేదా... సాధారణంగా వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు కనపడితే వారికి సహాయం చేద్దామని భావిస్తాం. అయితే దేవస్థానం అధికారులు వారిపైనా కనికరం చూపడం లేదు. వృద్ధులు లిఫ్టు ఎక్కదలిస్తే వారు 65 ఏళ్లు దాటినట్లు ధృవపత్రం, వికలాంగులకు 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్లు ధృవపత్రం చూపించాలంటూ నిబంధనలు విధించారు. దీంతో పాటు రూ.100 టిక్కెట్ తీసుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆ టిక్కెట్‌పై మరొకరిని అనుమతిస్తామని నిబంధనల్లో తెలిపారు. అలా కాకుండా ఉచితంగా కొండపైకి వెళ్లదలిస్తే.. సాధారణ భక్తులతో కలిసి ఉచిత బస్సులో కొండపైకి చేరుకుని అక్కడ నుంచి కొంత దూరం బ్యాటరీ కారులో వెళ్లి తరువాత కొద్దిదూరం నడిచి అమ్మవారి దర్శనానికి వెళ్లాలని దేవస్థానం అధికారులు సెలవిస్తున్నారు. వీఐపీ, వీవీఐపీలకైతే ఓకే... అమ్మవారి దర్శనానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలను మాత్రం లిఫ్టులో అనుమతిస్తారు. అందుకు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ భక్తులను అనుమతించని అధికారులు.. ప్రజాప్రతినిధులు, వారి అనుచరగణానికి వీలు కల్పించేందుకే ఇటువంటి నిబంధనలు విధించారనే విమర్శలు వస్తున్నాయి. దేవస్థానం నిత్యం ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు 15 గంటలపాటు పనిచేస్తుంటే.. లిఫ్టును మాత్రం మొక్కుబడిగా ఏడుగంటలే నడపాలని నిర్ణయించటం విచారకరం. కమిషనర్ ఆదేశాలు బేఖాతర్... ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ వై.అనూరాధ దేవస్థానానికి వచ్చిన సందర్భంగా లిఫ్టును వినియోగించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు ఈ లిఫ్టును ఉపయోగించాలంటూ ఆదేశాలిచ్చారు. దుర్వినియోగం అవుతోందని భావిస్తే అందులో ఎక్కేవారి ఐడీ కార్డులు అడగాలని సూచించారు. దీన్ని ఆసరాగా చేసుకున్న అధికారులు సాధారణ భక్తులు ఎక్కటానికి వీల్లేకుండా నిబంధనలు విధించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే! భక్తులు లిఫ్టు మార్గంలో కొండపైకి వెళితే ఘాట్‌రోడ్డులోని దుకాణాల్లో పూజా సామగ్రి కొనుగోలు చేయకుండా నేరుగా అమ్మవారి దర్శనానికి వెళతారు. అందువల్ల వ్యాపారులు తమకు నష్టాలు వస్తున్నాయని గోల చేయడంతో అధికారులు ఈ నిబంధనలు విధించారని భక్తులు విమర్శిస్తున్నారు. -
బెజవాడ దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవు దినాలతోపాటు గోదావరి పుష్కరాలు కూడా రావడంతో కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని క్యూ కట్టారు. ఉభయ గోదావరి జిల్లాలలో గోదావరి నదీ పుష్కర స్నానం ఆచరించిన భక్తులు తమ తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ అధికమైంది. -
బెజవాడ దుర్గగుడి ఏఈవో సస్పెన్షన్
విజయవాడ: బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆలయ ఏఈవో రాంబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం ఈ మేరకు దేవస్థానం ఈవో నర్సింగరావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల దేవస్థానంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల వేలం ప్రక్రియకు టెండర్లకు పిలిచారు. ఆ క్రమంలో ఏఈవో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో ఏఈవో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైంది. దీంతో రాంబాబుపై సస్పెన్షన్ వేటు పడింది.