సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ దసరా నవరాత్రి వేడుకలు ముగింపునకు చేరుకున్నాయి. దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఇద్రకీలాద్రిపైకి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరో వైపు భవానీలు ఇంద్రకీలాద్రికి భారీగా చేరుకుంటుండటంతో కొండ దిగువ నుంచే భక్తులు కిటకిటలాడుతున్నారు.
ఇంద్రకీలాద్రిపై భక్తులు, భవానీల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు చేతెలేత్తేశారు. సామాన్య భక్తులతోపాటు భవానీలతో క్యూలైన్లు నిండిపోయాయి. క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులను ఘాట్ రోడ్డులోకి వదిలేశారు.దీంతో చిన్న రాజగోపురం వద్దకు ఒక్కసారిగా భక్తులు చొచ్చుకువచ్చారు. కొండపైన భక్తులను పోలీసులు నిలువరించలేకపోతున్నారు. సీతమ్మవారి పాదాల ఘాట్ భవానీలతో నిండిపోయిది. భవానీలు కంట్రోల్ చేసేందుకు పోలీసులు రోప్‌లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment