vijayawada kanaka durga temple
-
కిక్కిరిసిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై చేతులెత్తేసిన పోలీసులు
సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ దసరా నవరాత్రి వేడుకలు ముగింపునకు చేరుకున్నాయి. దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఇద్రకీలాద్రిపైకి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరో వైపు భవానీలు ఇంద్రకీలాద్రికి భారీగా చేరుకుంటుండటంతో కొండ దిగువ నుంచే భక్తులు కిటకిటలాడుతున్నారు.ఇంద్రకీలాద్రిపై భక్తులు, భవానీల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు చేతెలేత్తేశారు. సామాన్య భక్తులతోపాటు భవానీలతో క్యూలైన్లు నిండిపోయాయి. క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులను ఘాట్ రోడ్డులోకి వదిలేశారు.దీంతో చిన్న రాజగోపురం వద్దకు ఒక్కసారిగా భక్తులు చొచ్చుకువచ్చారు. కొండపైన భక్తులను పోలీసులు నిలువరించలేకపోతున్నారు. సీతమ్మవారి పాదాల ఘాట్ భవానీలతో నిండిపోయిది. భవానీలు కంట్రోల్ చేసేందుకు పోలీసులు రోప్‌లు ఏర్పాటు చేశారు. -
ఇంద్రకీలాద్రి పై ఘనంగా వసంత నవరాత్రి ఉగాది మహోత్సవాలు
-
175కి 175 స్థానాలు గెలిచి..మళ్లీ జగన్ సీఎం కావాలి
-
విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం (ఫొటోలు)
-
AP: దేవాదాయశాఖపై మంత్రి కొట్టు సమీక్ష.. కీలక నిర్ణయాలు
సాక్షి, తాడేపల్లి: దేవాదాయ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన రూ. 70 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రసాదం పోటు తయారీ, ప్రసాదం కౌంటర్లు, స్టాక్ పాయింట్‌ను రూ. 27 కోట్లతో ఒకే భవనంగా నిర్మిస్తున్నామన్నారు. రూ. 30 కోట్లతో అన్నదానం భవనం.. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. రూ. 30 కోట్లతో రెండు ఫ్లోర్లుగా అన్నదానం భవనం, ఒకేసారి 1500 నుంచి 1800 మంది అన్న ప్రసాదం స్వీకరించే విధంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని తట్టుకునేలా రూ. 20 కోట్ల అంచనాలతో అదనంగా క్యూలైన్ల కాంప్లెక్స్ ఎక్స్ టెన్షన్ నిర్మాణం చేపట్టిన్నట్లు పేర్కొన్నారు. ఈ వారంలో టెండర్లు పిలుస్తున్నామని.. రూ. 28 కోట్లతో స్టెయిర్ కేస్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.120 కోట్ల ఆలయ నిధులతో అభివృద్ధి అమ్మవారికి కుంకుమ పూజ ప్రత్యేకంగా నిర్వహించడానికి వీలుగా రూ. 6 కోట్లతో పూజా మండపం ఏర్పాటు. జులై రెండవ వారంలో టెండర్లు పిలుస్తున్నాం. విజయవాడ దేవాలయంలో ఒక మెగా వాట్ సోలార్ ప్లాంట్ త్వరలోనే ప్రారంభిస్తాం. రూ. 60 కోట్ల రూపాయిలతో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం చేయనున్నాం. రూ. 70 కోట్లలో ఇప్పటికే దాదాపు రూ. 14.70 కోట్ల పనులు పూర్తయ్యాయి. అదనంగా రూ.120 కోట్ల ఆలయ నిధులతో విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ది చేస్తున్నాం. చదవండి: దళిత ద్రోహి చంద్రబాబు: మంత్రి నాగార్జున కాణిపాకంలో రూ. 3.60 కోట్లతో అన్నదాన కాంప్లెక్స్ శ్రీశైలంలో రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణం. రూ.35 కోట్లతో శ్రీశైలం మాడవీధులలో 750 మీటర్లు పొడవుతో సాల మండపాలు నిర్మాణం. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో సాల మండపాల నిర్మాణాలు జరిగాయి. మళ్లీ సీఎం వైఎస్ జగన్ హయాంలో నిర్మించబోతున్నాం. కాణిపాకంలో రూ. 3.60 కోట్లతో అన్నదానం కాంప్లెక్స్. రూ. 4 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణాలు. శ్రీవాణి ట్రస్టుపై కొందరు దుష్పచారం చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన నిధులని ధర్మ ప్రచారం, ఆలయాల నిర్మాణాలకి ఉపయోగిస్తున్నాం. 1917 ఆలయాలు మంజూరు శ్రీవాణి ట్రస్టు నిధులతో 1917 ఆలయాలు మంజూరు చేశాం. ఆలయాల పాలనా వ్యవహారాల్లో గత సంవత్సర కాలంలో ఎన్నో కీలక సంస్కరణలు చేపట్టాం. ప్రీ ఆడిట్ విధానం ద్వారా అవినీతి ఆరోపణలకి చెక్ పెట్టాం. ఆలయాలలో ప్రతీ మూడు నెలలకి సిబ్బంధి అంతర్గత బదిలీలు చేయాలని ఆదేశించాం. ఆలయాలలో ఆభరణాలపై రూ. 450 కోట్ల సీజీఎఫ్ నిధులతో గత నాలుగేళ్లగా కొత్త ఆలయాల నిర్మాణాలకి, పురాతన ఆలయాల పునరుద్దరణ చేపట్టాం. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గత ఏడాది కాలంలో పురాతన ఆలయాల పునరుద్దరణ, కొత్త ఆలయాల నిర్మాణాల కోసం 270 కోట్ల సీజీఎఫ్ విడుదల చేశాం’ అని తెలిపారు. -
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్ ( ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. ►అమ్మవారి ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు ► సీఎం జగన్‌కు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేసిన దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ► అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ► ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు పరివేష్టం చుట్టిన ఆలయ అర్చకులు. ► పూర్ణకుంభంలో సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ఆలయ అధికారులు ► పంచెకట్టులో అమ్మవారి దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ► ఇంద్రకీలాద్రి చేరుకున్న సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ. -
Kanaka Durga Temple: నేడు గాయత్రీదేవి అలంకారం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం కనకదుర్గమ్మ.. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు ఉండటంతో గాయత్రీదేవి త్రిమూర్త్యాంశగా వెలుగొందుతోంది. గాయత్రీదేవిని దర్శించుకుంటే ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రిపై నేడు ►తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనం ►ఉదయం 5 గంటలకు ఖడ్గమాలార్చన ►ఉదయం 7 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన ►ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన ►ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం ►ఉదయం 10 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన రెండో బ్యాచ్ ►సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల సేవ ►రాత్రి 11 గంటలకు అమ్మవారి దర్శనం నిలిపివేత మయూర వాహనంపై కొలువుదీరిన భ్రామరీ సమేత మల్లికార్జునుడు బ్రహ్మచారిణిగా భ్రమరాంబాదేవి శ్రీశైలం టెంపుల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో మంగళవారం భ్రమరాంబాదేవి.. బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి భ్రమరాంబాదేవి, మల్లికార్జునస్వామి మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. తొలుత ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం నుంచి రథశాల వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, అంకాలమ్మగుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు వెళ్లి తిరిగి ఆలయ ప్రవేశం చేసింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్ల అలంకారమూర్తులను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు, ఈవో ఎస్.లవన్న, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పూజలు చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి మహేశ్వరిగా రాజశ్యామల అమ్మవారు సింహాచలం: విశాఖ శ్రీశారదాపీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండోరోజు మంగళవారం శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు మహేశ్వరిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి విశేషంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అంతకుముందు అమ్మవారి మూలవిరాట్‌కి స్వరూపానందేంద్ర సరస్వతి అభిషేకం చేశారు. దాదాపు 40 నిమిషాలు జరిగిన అభిషేకసేవలో భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. పీఠం ప్రాంగణంలో చండీహోమం, చతుర్వేదపారాయణ, దేవీ భాగవత పారాయణ నిర్వహించారు. శ్రీచక్రానికి నవావరణార్చన చేశారు. ఈ సందర్భంగా శంకర విజయం అనే అంశంపై ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ధూళిపాళ కృష్ణమూర్తి చేసిన ప్రవచనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. సాయంత్రం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చేతులమీదగా రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరస్వామికి పీఠార్చన చేశారు. -
Vijayawada: బాలా త్రిపుర సుందరీదేవికి భక్తుల నీరాజనం
సాక్షి, విజయవాడ: దుర్గమ్మ కొండపై ‘శరన్నవ’ సంబరం కొనసాగుతోంది. ఒకవైపు భక్తుల కోలాహలం, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల సందళ్లతో కృష్ణా తీరం పులకిస్తోంది. దసరా ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకారం, నిత్య పూజల అనంతరం ఆలయ అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. నాలుగు గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, చండీహోమం, శ్రీచక్రార్చనలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో అనధికార వీఐపీల కట్టడికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ టి.కె. రాణా క్యూలైన్లను పలు మార్లు పరిశీలించి, దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. టికెట్లు లేకుండా దర్శనానికి ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించవద్దని ఆలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవ ఏర్పాట్లు అద్భుతం: స్పీకర్ తమ్మినేని అమ్మవారి దర్శనానికి విచ్చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాంనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఈవో భ్రమరాంబ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను బహూకరించారు. అనంతరం మీడియాతో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేయడం అభినందనీయమన్నారు. అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తున్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లతో పాటు క్యూలైన్లు, టికెట్ల జారీ పక్రియను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కొండపై టికెట్లు విక్రయిస్తున్న తీరును పరిశీలించడంతో పాటు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. టికెట్లు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందని, రూ. 300, రూ.100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఆయా క్యూలైన్ మార్గాలలోనే అమ్మవారి దర్శనానికి పంపాలన్నారు. మహా మండపం మీదుగా కొండపైకి ఎవరూ రాకుండా కట్టుదిట్టంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పాస్ లేకుండా కార్లను కొండపైకి ఎందుకు అనుమతిస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బంది లేకుండా దర్శనం: మంత్రి కొట్టు భక్తుల రద్దీ నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. వినాయకుడి గుడి, రథం సెంటర్, టోల్గేట్, ఓం టర్నింగ్ వద్ద మంత్రి క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. వినాయకుడి నుంచి కొండపైకి చేరుకునేందుకు 30 నిమిషాలు పడుతుందని పలువురు భక్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని టికెట్ల కౌంటర్లలో ఆన్లైన్ టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఫుట్ స్కానర్ ద్వారా భక్తుల సంఖ్యను నమోదు చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి, అందుకు తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోమవారం సుమారు 30 వేల మంది భక్తులు దర్శనానికి విచ్చేశారని, 60 వేల లడ్డూలను విక్రయించామన్నారు. ఈవో భ్రమరాంబ, స్పెషల్ ఆఫీసర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి నయనమనోహరం నగరోత్సవం వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా ఆదిదంపతుల నగరోత్సవం నయనమనోహరంగా జరిగింది. గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహామండపం సమీపంలో ప్రారంభమైన నగరోత్సవంలో అర్చకులు, వేదపండితులు, కళాకారులు, అధికారులు పాల్గొని సేవలందించారు. తొలుత ఈవో భ్రమరాంబ కొబ్బరికాయ కొట్టి నగరోత్సవాన్ని ప్రారంభించారు. పోలీసులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): కోవిడ్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు చేశారు. గురువారం నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రాతఃకాల అర్చన, 4 గంటల నుంచి 5 గంటల వరకు ఖడ్గమాలార్చన నిర్వహిస్తారు. ఖడ్గమాలార్చన సమయంలో ఒక క్యూలైన్లో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ క్యూలైన్ ద్వారా ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులను అత్యవసరం అయితే దర్శనానికి అనుమతిస్తారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రాత్రి నిద్ర చేసే భక్తులు తెల్లవారుజామున లేచి అమ్మవారిని దర్శించుకుని తిరిగి తమ స్వస్థలాలకు బయలుదేరుతారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఉదయం 6 గంటల తర్వాతే అమ్మవారి దర్శనానికి అనుమతించేవారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైళ్లు అందుకోలేక ఇబ్బందులు పడేవారు. దీనిపై వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులతో చర్చించిన ఈవో దర్శన వేళలను మార్పు చేశారు. ఇకపై ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. -
దుర్గమ్మ దసరా హుండీ ఆదాయం రూ.7.50 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో అమ్మవారికి హుండీల ద్వారా రూ.7.50 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో భక్తులు సమర్పించారు. మూడు రోజులుగా జరుగుతున్న కానుకల లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. బుధవారం లెక్కింపులో రూ.1,43,62,253 నగదు, 328 గ్రాముల బంగారం, 8.174 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ చెప్పారు. 3 రోజులుగా నిర్వహించిన లెక్కింపులో మొత్తం రూ.7,50,84,836ల నగదు,1.448 కిలోల బంగారం, 26.577 కిలోల వెండి లభ్యమైనట్లు తెలిపారు. -
నేడు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. సోమవారం ఉదయం దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని, సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ జె.నివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారని చెప్పారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. అనంతరం వేదపండితులు ఆయన్ని ఆశీర్వదిస్తారని తెలిపారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆగ్మెంటెడ్ రియాల్టీ షోను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అమ్మవారి చరిత్రను తెలిపే ఆగ్మెంటెడ్ రియాల్టీ షోను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. దుర్గగుడి అధికారులు సరికొత్త టెక్నాలజీతో ఇంద్రకీలాద్రిపై ఘాట్‌రోడ్డు, చినరాజగోపురం, మల్లేశ్వరస్వామి దేవస్థానాల వద్ద చరిత్ర చెప్పే క్యూఆర్ కోడ్ ఉన్న బోర్డులు ఏర్పాటు చేశారు. ‘కనకదుర్గ ఏఆర్’ అనే యాప్ డౌన్లోడ్ చేసి బోర్డుపై కోడ్ స్కాన్ చేస్తే అమ్మవారి చరిత్ర, ఆడియా, వీడియో ద్వారా విని, చూసే అవకాశం ఉందని ఆలయ ఈఈ భాస్కర్ తెలిపారు. సినిమా మాదిరి బొమ్మలు, మ్యూజిక్ ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ఇది చిన్న పిల్లలకు వినోదాత్మకంగా కూడా ఉంటుందని చెప్పారు. -
విజయవాడ: రికార్డు స్థాయిలో తలనీలాల ఆదాయం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించే తలనీలాలకు రికార్డు ధర పలికింది. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఏడాదిపాటు తలనీలాలు సేకరించుకునేందుకు రూ.7,15,99,999 చెల్లిస్తామని తమిళనాడుకు చెందిన కేఎం ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. గత ఏడాది రూ.5.67 కోట్లు పలికిన టెండర్ ఈ దఫా రూ.7.16 కోట్లకు చేరింది. దీంతో నిరుటికంటే రూ.1.49 కోట్ల మేర ఆలయానికి అధికంగా ఆదాయం సమకూరింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన తలనీలాలను పోగుచేసుకునే హక్కుకోసం ఆలయ అధికారులు టెండర్ ప్రక్రియను నిర్వహించారు. బహిరంగ వేలం, సీల్డ్ టెండర్, ఈ–టెండర్ విధానాల ద్వారా టెండర్లు ఆహ్వానించారు. దుర్గగుడి పరిపాలన భవనంలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మొత్తం పదిమంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఈ టెండర్ దేవదాయశాఖ కమిషనర్ ఆమోదం పొందిన 72 గంటల్లోనే కేఎం ఇండస్ట్రీస్ ఆ మొత్తాన్ని ఆలయానికి చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ ప్రక్రియను దేవస్థానం ఏఈవో వెంకటరెడ్డి, పాలకమండలి సభ్యులు బాల, సుజాత పర్యవేక్షించారు. (చదవండి: విజయవాడలో అరుదైన పిల్లి హల్చల్.. ఎలా వచ్చింది?) -
విజయవాడ: కనక దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్
-
విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్
సాక్షి, విజయవాడ: సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం నేరుగా ఇంద్రకిలాద్రికి వెళ్లి కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా వల్ల ఎంతో మంది అనేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, అందరిని చల్లగా కాపాడాలని ఆ అమ్మవారిని కొరుకున్నా అని తెలిపారు. కాగా కరోనా కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరోగా మారారు సోనూసూద్. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి సాయం అందించి వారి పాలిట దేవుడిగా నిలిచారు. విద్య, వైద్యం, ఉపాధి ఇలా అనేక రకాలుగా సేవలు అందించారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలెండర్లను సప్లై చేశారు. అంతేగాక ఇందుకోసం ఆయన ప్రత్యేకం ఫౌండేషన్ కూడా ప్రారంభించి దాని ద్వారా ప్రజల కోసం విరాళాలు సేకరించి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను సైతం సోనూ సూద్ తన బాధ్యత భావించిన లక్షలాదిమంది అవసరాలు తీర్చి అపర దాన కర్ణుడుగా కీర్తించబడుతున్నారు. దీంతో ఈ రీయల్ హీరోను నేరుగా చూసేందుకు విజయవాడకు ప్రజలు గుంపులుగా తరలివచ్చారు. -
కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్రీ కమలానంద భారతీ స్వామిజీ
సాక్షి, విజయవాడ: శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలానంద భారతీ స్వామిజీ గురువారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ స్వామిజీకి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం స్వామీజీకి ఆలయ వేద పండితులు వేదస్వస్తి పలికారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాని మోహన్ స్వామిజీకి అమ్మవారి చిత్ర పఠంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామీజీ కమలానంద భారతీ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. చదవండి: సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి.. -
దుర్గమ్మ సన్నిధిలో అల్లరి నరేశ్ దంపతులు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సినీ నటుడు అల్లరి నరేష్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన నరేష్ దంపతులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వ్రస్తాలు బహూకరించారు. -
మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు
-
దసరా ఉత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కలిశారు. గురువారం ఆయన విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమినాయుడు, ఈవో ఎంవీ సురేష్, ఆలయ అర్చకులతో కలిసి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం జగన్‌ను ఆహ్వానించారు. కాగా, అక్టోబర్ 17 నుంచి 25 వరకు విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. 9 రోజుల్లో అమ్మవారికి 10 అలంకారాలు చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గంటకి 1000 మంది భక్తులను మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా 60 సంవత్సరాల లోపు వారిని, 10 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారిని దర్శనానికి అనుమతించంలేదు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. -
కోవిడ్ నియమాలతో దసరా ఉత్సవాలు..
సాక్షి, విజయవాడ : కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విజయవాడ కనకదుర్గ గుడిలో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సురేష్‌బాబు తెలిపారు. మూలా నక్షత్రం రోజు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. ఈసారి దసరా ఉత్సవాలకు రూ.4కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదం మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నవారికే దర్శన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు దుర్గగుడిలో దసరా నవరాత్రులు ఆహ్వాన పత్రికను దుర్గగుడి పాలకమండలి సభ్యులు, తదితరులు ఆవిష్కరించారు. చదవండి: ‘దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. 9 రోజులే’ -
‘దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. 9 రోజులే’
సాక్షి, విజయవాడ : అక్టోబర్ 17 నుంచి 25 వరకు విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన ఆన్లైన్ టికెట్లను ఛైర్మన్, ఈవో విడుదల చేశారు. 9 రోజులకు సంబంధించి ఉచిత, 100, 300 రూపాయల టికెట్స్ విడుదల చేయగా.. ఈ సంవత్సరం అన్ని సేవ టికెట్స్ ఆన్లైన్లో ఉంచినట్లు తెలిపారు. ఆన్లైన్లో ఏ దేశంలో ఉండి అయిన సేవా టికెట్ బుక్ చేసుకోవొచ్చన్నారు. సేవ టికెట్ బుక్ చేసుకున్న వారికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, అమ్మవారి దస్త్రం వారి ఇంటికి పంపిస్తామని వెల్లడించారు. (తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ) జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దసరా ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించినట్లు పైలా సోమినాయుడు పేర్కొన్నారు. దసరా సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను రోజుకి 10 వేల మందిని మాత్రమే అనుమతించనున్నట్లు, ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు మాత్రమే అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. ములనక్షత్రం రోజు మాత్రం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దర్శనం ఉంటుందన్నారు.ఈ నవరాత్రి దర్శనాలకి సంబంధించిన దర్శన టికెట్స్ అన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, భక్తులు ఎవరైనా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే కచ్చితంగా టికెట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. (కనకదుర్గ అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు) ‘టికెట్ లేకపోతే ఎవరిని కొండ పైకి అనుమతించం. కరోనా నేపథ్యంలో కేశకండనశాల ఉండదు. ప్రతి సంవత్సరం లాగే అమ్మవారి దర్శనానికి నాయకుడి గుడి దగ్గర నుంచే క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు సాయంత్రం నుంచి కృష్ణ నది ఒడ్డున నదీ హారతులు మళ్ళీ ప్రారంభిస్తున్నామం. ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు నది హారతులు ఉంటాయి. ఆన్లైన్లో టికెట్ తీసుకుని దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలకు అనుగుణంగా కొండపైకి రావాలి. వీఐపీలు దసరా నవరాత్రులలో అందరికి టైం స్లాట్స్ పెడుతున్నాం. అందరూ ఆ స్లాట్స్లోనే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి.’ అని తెలిపారు. (‘ఆలయాలపై దాడులకు పాల్పడే వారిని వదలం’) కోవిడ్ కారణంగా ఈ సారి దసరాకి కొన్ని ఆంక్షలు కొనసాగుతాయయని దుర్గ గుడి సురేష్ బాబు తెలిపారు. ‘ఈ సారి 9 రోజులు మాత్రమే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. 9 రోజుల్లో అమ్మవారికి 10 అలంకారాలు చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గంటకి 1000 మంది భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తాం. దసరా 9 రోజులు ఎవరికి అంతరాలయం దర్శనం ఉండదు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎవరికి కొండపైకి ఎలాంటి బస్ సౌకర్యం ఉండదు. అందరూ నడిచి రావాల్సిందే. దసరా నవరాత్రులకు సంబంధించి ఎటువంటి కరెంట్ బుకింగ్ ఉండదు. ఈ నెల 19న దేవాదాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా 60 సంవత్సరాల లోపు వారిని, 10 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారిని దర్శనానికి అనుమతించము.’ అని వెల్లడించారు. -
కనకదుర్గ అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు
సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అమ్మవారి దర్శన వేళల్లో ఆలయ అధికారులు మార్పులు చేశారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే రేపటి నుంచి(శుక్రవారం) భక్తులకు అమ్మవారి దర్శనం సమయం ఉదయం 06.గంటల నుంచి రాత్రి 08.గంటల వరకు లయ అధికారులు పెంచారు. (వైఎస్ జగన్ విజన్‌ను అభినందించిన కేంద్ర మంత్రి) కరోనా ప్రారంభం నుంచి దుర్గగుడిలో భక్తులు అమ్మవారి సేవల్లో ప్రత్యక్షం పాల్గొనే అవకాశం నిపిలివేశారు. రేపటి నుంచి భక్తులు ప్రతిరోజు సాయంత్రం 06.గంలకు జరుగనున్న అమ్మవారి పంచహారతులు సేవలో పరిమిత సంఖ్యలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. అమ్మవారి సేవల టిక్కెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. www.kanakadurgamma.org , మొబైల్ ఆప్ kanakadurgamma, అలాగే మీ సేవా సెంటర్ల ద్వారా భక్తులు అమ్మవారి సేవ టికెట్స్ పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. (20 శాతం మందికి వైరస్ వచ్చి పోయింది) -
తిరుమలలో ధన్వంతరి మహాయాగం
సాక్షి, తిరుమల : ప్రపంచంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ నెల 26 నుంచి 28 వరకు ధన్వంతరి మహాయాగం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం జరపనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ప్రపంచం భయభ్రాంతులకు గురవుతోందన్నారు. శ్రీమహావిష్ణువు రూపాలలో సర్వ రోగాలను నయం చేసే ధన్వంతరి రూపం ఒకటని, ఈ యాగం నిర్వహించడం వల్ల మానవాళికి నష్టం కలిగించే వ్యాధులు నయమవుతాయని పేర్కొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి, మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామి ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహిస్తామని చెప్పారు. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమలలో భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. యథావిథిగా దుర్గగుడిలో హోమాలు.. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం నుంచి ప్రారంభం కానున్న హోమాలు, పారాయణాలు యథావిథిగా జరుగుతాయని ఆలయ ఈవో సురేష్‌బాబు తెలిపారు. కరోనా నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి భక్తులకు అనుమతి లేదన్నారు. అమ్మవారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయని చెప్పారు. దూరప్రాంతాల నుంచి వచ్చేవారు ఇందుకు సహకరించాలన్నారు. తిరిగి అమ్మవారి దర్శన తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. కాణిపాకంలో భక్తుల దర్శనాలు నిలిపివేత.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆయలంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయం, అనుబంధ దేవాలయాల దర్శనం నిలిపివేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి దేముళ్ళు తెలిపారు. తిరిగి భక్తులను దర్శనానికి అనుమతిచ్చే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. స్వామివారికి జరిగే నిర్ణీత కాల పూజలు, సర్కారీ సేవలు, యథావిథిగా, శాస్త్రోక్తముగా దేవస్థానం నిర్వహిస్తుందని చెప్పారు. భక్తులు ఇందుకు సహకరించాలని కోరారు. ► కరోనా నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో తిరుమలగా భాసిల్లే వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏడు శనివారాల ప్రదక్షిణలు, దర్శనాలను ఆలయ నిర్వాహకులు నిలిపివేశారు. ► కరోనా నేపథ్యంలో మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన ఏడుపాయాల వనదుర్గ మాత ఆలయం శుక్రవారం నుంచి మార్చి 31వరకు మూసివేశారు. ► కరోనా వైరస్ సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో భక్తుల దర్శనాలను మార్చి 31వరకు నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈఓ తెలిపారు. ► కరోనా వైరస్ ప్రబలకుండా కర్నూలు జిల్లా మహానందీశ్వర స్వామి ఆలయంలో దేవాదాయశాఖ ఆదేశాల మేరకు వేదపండితులు మహా మృత్యుంజయ యాగం చేపట్టారు. ► కరోనా నియంత్రణలో భాగంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగా పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 20 నుంచి 31వరకు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. అమ్మవారి నిత్య కైంకర్య సేవలు కొనసాగనున్నట్టు అర్చకులు తెలిపారు. ► కరోనా నేపథ్యంలో మెదక్‌లోని సీఎస్ఐ చర్చికి భక్తులు రావద్దని బిషప్ సల్మాన్ రాజ్ సూచించారు. -
ఆ రోజు విద్యార్థులకు అమ్మవారి ఉచిత దర్శనం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయని దుర్గగుడి ఈవో ఎంవి సురేష్‌బాబు తెలిపారు. వేడుకల సందర్భంగా ఆలయ సిబ్బంది దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అమ్మవారి దర్శనం చేయించి అనంతరం వారికి చీరలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు. ఇకపై జీన్స్ వేసుకున్నా, సంప్రదాయ దుస్తుల్లో రాకున్నా అంతరాలయ దర్శనం కల్పించబోమని స్పష్టం చేశారు. ఇక అమ్మవారిని అంతరాలయం నుంచి దర్శించుకోవాలనుకునే భక్తుల నుంచి రూ.300 చొప్పున టికెట్ వసూలు చేస్తుండగా దీన్ని ఆన్లైన్లో బుక్‌చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 30న శ్రీపంచమిని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతి దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆరోజు విద్యార్ధులకు అమ్మవారి ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో సురేష్‌బాబు ప్రకటించారు. ఈ నెల 31న సీవీ రెడ్డి వర్ధంతి కావడంతో 100 మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నామన్నారు. కొండపై అర్జునుడు ప్రతిష్టించిన ఆలయానికి భక్తులను అనుమతించే మార్గంపై ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. కేశఖండన శాల, ప్రసాదం పోటు శాశ్వత భవనాలకు త్వరలోనే శంకుస్థాప చేస్తామన్నారు. అమ్మవారి పులిహోర ప్రసాదాన్ని రూ.5 నుంచి రూ.10కి పెంచాలని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. చదవండి: ‘అన్ని దేవాలయాలకు ఒకటే వెబ్సైట్’ -
‘అన్ని దేవాలయాలకు ఒకే వెబ్సైట్’
సాక్షి, విజయవాడ : ఈ ఏడాది భవానీ దీక్షా విరమణలకు అరు లక్షల మంది భవానీలు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. 13 లక్షల 39 వేల లడ్డూలను భవానీలకు విక్రయించామని అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చీరలు, లడ్డూ ప్రసాదాల ద్వారా అమ్మవారికి 2 కోట్ల 53 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఇంకా హుండీలను లెక్కించాల్సి ఉందని, ఇరుముడుల ద్వారా వచ్చిన సామాగ్రికి 26 న ఆక్షన్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఆక్షన్‌లో ఎవరైనా పాల్గొనవచ్చని, ప్రతీ మంగళవారం వృద్ధాశ్రమాలకు భోజన అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నవృద్ధులకు అమ్మవారి దర్శనం చేయించి వారికి చీరలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 26 న సూర్యగ్రహణం సందర్భంగా దుర్గమ్మ ఆలయం మూసివేస్తున్నామన్నారు. రేపు(డిసెంబర్ 25) రాత్రి 9 గంటల 30 నిముషాలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేస్తున్నామని అన్నారు. తిరిగి 26 సాయంత్రం అమ్మవారి స్నపనాభిషేకం అనంతరం దుర్గమ్మ ఆలయ తలుపులు తెరిచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా నకిలీ వెబ్ సైట్లపై ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాయాలకు ఒకటే వెబ్ సైట్ ఉండాలని ప్లాన్ చేస్తున్నామని, జనవరి 8 న అన్ని దేవాలయాల ఈవోలతో దేవాదాయ శాఖ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఇకపై దుర్గమ్మ దర్శనం కోసం ముందుగానే అన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొనే వెసులుబాటు భక్తులకు కల్పిస్తున్నామని ఈ ప్రక్రియ ఉగాది నాటికి అమల్లోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.