
సాక్షి, విజయవాడ: శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలానంద భారతీ స్వామిజీ గురువారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ స్వామిజీకి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం స్వామీజీకి ఆలయ వేద పండితులు వేదస్వస్తి పలికారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాని మోహన్ స్వామిజీకి అమ్మవారి చిత్ర పఠంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామీజీ కమలానంద భారతీ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు.
చదవండి: సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి..
Comments
Please login to add a commentAdd a comment