సాక్షి, తాడేపల్లి: దేవాదాయ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన రూ. 70 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రసాదం పోటు తయారీ, ప్రసాదం కౌంటర్లు, స్టాక్ పాయింట్‌ను రూ. 27 కోట్లతో ఒకే భవనంగా నిర్మిస్తున్నామన్నారు.
రూ. 30 కోట్లతో అన్నదానం భవనం..
ఈ మేరకు మంగళవారం సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. రూ. 30 కోట్లతో రెండు ఫ్లోర్‌లుగా అన్నదానం భవనం, ఒకేసారి 1500 నుంచి 1800 మంది అన్న ప్రసాదం స్వీకరించే విధంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని తట్టుకునేలా రూ. 20 కోట్ల అంచనాలతో అదనంగా క్యూలైన్ల కాంప్లెక్స్ ఎక్స్ టెన్షన్ నిర్మాణం చేపట్టిన్నట్లు పేర్కొన్నారు. ఈ వారంలో టెండర్లు పిలుస్తున్నామని.. రూ. 28 కోట్లతో స్టెయిర్ కేస్ నిర్మిస్తున్నట్లు చెప్పారు.
రూ.120 కోట్ల ఆలయ నిధులతో అభివృద్ధి
అమ్మవారికి కుంకుమ పూజ ప్రత్యేకంగా నిర్వహించడానికి వీలుగా రూ. 6 కోట్లతో పూజా మండపం ఏర్పాటు. జులై రెండవ వారంలో టెండర్లు పిలుస్తున్నాం. విజయవాడ దేవాలయంలో ఒక మెగా వాట్ సోలార్ ప్లాంట్ త్వరలోనే ప్రారంభిస్తాం. రూ. 60 కోట్ల రూపాయిలతో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం చేయనున్నాం. రూ. 70 కోట్లలో ఇప్పటికే దాదాపు రూ. 14.70 కోట్ల పనులు పూర్తయ్యాయి. అదనంగా రూ.120 కోట్ల ఆలయ నిధులతో విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ది చేస్తున్నాం.
చదవండి: దళిత ద్రోహి చంద్రబాబు: మంత్రి నాగార్జున
కాణిపాకంలో రూ. 3.60 కోట్లతో అన్నదాన కాంప్లెక్స్
శ్రీశైలంలో రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణం. రూ.35 కోట్లతో శ్రీశైలం మాడవీధులలో 750 మీటర్లు పొడవుతో సాల మండపాలు నిర్మాణం. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో సాల మండపాల నిర్మాణాలు జరిగాయి. మళ్లీ సీఎం వైఎస్ జగన్ హయాంలో నిర్మించబోతున్నాం. కాణిపాకంలో రూ. 3.60 కోట్లతో అన్నదానం కాంప్లెక్స్. రూ. 4 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణాలు. శ్రీవాణి ట్రస్టుపై కొందరు దుష్పచారం చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన నిధులని ధర్మ ప్రచారం, ఆలయాల నిర్మాణాలకి ఉపయోగిస్తున్నాం.
1917 ఆలయాలు మంజూరు
శ్రీవాణి ట్రస్టు నిధులతో 1917 ఆలయాలు మంజూరు చేశాం. ఆలయాల పాలనా వ్యవహారాల్లో గత సంవత్సర కాలంలో ఎన్నో కీలక సంస్కరణలు చేపట్టాం. ప్రీ ఆడిట్ విధానం ద్వారా అవినీతి ఆరోపణలకి చెక్ పెట్టాం. ఆలయాలలో ప్రతీ మూడు నెలలకి సిబ్బంధి అంతర్గత బదిలీలు చేయాలని ఆదేశించాం. ఆలయాలలో ఆభరణాలపై రూ. 450 కోట్ల సీజీఎఫ్ నిధులతో గత నాలుగేళ్లగా కొత్త ఆలయాల నిర్మాణాలకి, పురాతన ఆలయాల పునరుద్దరణ చేపట్టాం. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గత ఏడాది కాలంలో పురాతన ఆలయాల పునరుద్దరణ, కొత్త ఆలయాల నిర్మాణాల కోసం 270 కోట్ల సీజీఎఫ్ విడుదల చేశాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment