
సాక్షి, ఏలూరు: పవన్ రాజకీయాల కోసం కాపులను వాడుకోవాలని చూస్తున్నారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పవన్ పనిచేసేది చంద్రబాబు కోసమేనని మండిపడ్డారు. కాపులు ఏకం కాకుండా చంద్రబాబు కుట్ర చేశారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు ఏ విధంగా వేధించారో పవన్‌కు తెలియదా అంటూ ప్రశ్నించారు.
కాపులు సీఎం జగన్‌ను నమ్మారు కాబట్టే 60 శాతం కాదు 90 శాతం ఓట్లు వేసి గెలిపించారన్నారు. కాపులకు సీఎం.. ఉన్నత స్థానం కల్పించి సముచిత స్థానం కల్పించారన్నారు. బాబు ఇచ్చిన 5 శాతం తప్పుడు జీవో కంటే సీఎం జగన్ ఇచ్చిన దాని వల్ల మేలు జరుగుతుందని పవన్‌కు తెలియడం లేదా అంటూ ఫైర్ అయ్యారు. పవన్ చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు కాపుల మనోభావాలు దెబ్బ తీస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు చేసిన అవినీతి పవన్‌కు కనపడట్లేదు.. తనకు కావాల్సిన ప్యాకేజీలు అందుతున్నాయి కాబట్టి బాబు గొప్పోడిలాగా కనపడుతున్నాడని మంత్రి మండిపడ్డారు.
చదవండి: ‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’
Comments
Please login to add a commentAdd a comment