Kottu Satya Narayana
-
మోసం చేయడం బాబుకు అలవాటుగా మారింది: కొట్టు సత్యనారాయణ
సాక్షి,తాడేపల్లిగూడెం: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక మోసపూరితమైన బడ్జెట్ అని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు బుధవారం(నవంబర్ 13)తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘మోసం చేయడం అనేది చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. ముగ్గురు కలసి నాటకం ఆడుతూ ప్రజలను నట్టేట ముంచారు.ఈ బడ్జెట్ లో గత బడ్జెట్ కంటే రూ.41వేల కోట్లు ఎక్కువ చూపించారు.కాగ్ నివేదిక ప్రకారం 9 శాతం వృద్ధి ఉన్నది ఇప్పుడు మైనస్ 2 శాతానికి పడిపోయింది.అలాంటప్పుడు ఏ విధంగా గత బడ్జెట్ కంటే ఎక్కువ చూపించారో అర్థం కావట్లేదు. ఇదంతా ఒక అంకెల గారడీ మాత్రమే అని తేటతెల్లం అవుతుంది.గత ప్రభుత్వం కంటే 20శాతం అప్పులు ఎక్కువగా పెంచారు.దీనికి పచ్చమీడియా ప్రజలను మోసం చేస్తూ వార్తలు చేస్తున్నారు.గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద కుటుంబంలో ఒక విద్యార్థికి ఇచ్చేలా 6500 కోట్లు పెడితే కుటుంబంలో అందరూ విద్యార్థులకు ఇస్తానని తల్లికి వందనం ఇచ్చేందుకు రూ.5387కోట్లు కేటాయించడం హాస్యాస్పదంగా ఉంది.ప్రజలకు మీ బడ్జెట్ అగమ్యగోచరంగా కనపడుతోంది.ఈ బడ్జెట్ ద్వారా రైతుల నోట్లో మట్టి కొట్టారు. సున్నావడ్డీ తీసేసారు.ధరల స్థిరీకరణకు ఎటువంటి నిధులు కేటాయించలేదు.స్త్రీ శక్తి ద్వారా ఏడాదికి రూ. 18వేలు ఇస్తానని బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదు.గత ప్రభుత్వంలో 19,180కోట్లు,కాపు నేస్తం,వైఎస్సార్ ఆసరా,వైఎస్సార్ చేయూత పథకాల కింద మహిళలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేశాం.ఉచితబస్సు ప్రయాణం ఇస్తానని బడ్జెట్లో ఇచ్చిందేంటి. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ చంద్రబాబు ప్రజలను తేనె పూసిన కత్తిలాగా మోసం చేస్తున్నారు.జాబ్ క్యాలెండర్ ఉందా? కాపు సంక్షేమం ద్వారా 15వేల కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.కూటమి ప్రభుత్వంలో ఇప్పటిదాకా 3లక్షల 50వేల మందికి పెన్షన్లు తీసేశారు.సెంటు స్థలంలో సమాధికి కూడా సరిపోదని పట్టణంలో రెండు,రూరల్‌లో 3సెంట్లు ఇస్తానని హామీ ఇచ్చి దానికోసం బడ్జెట్లో ఏమి కేటాయించని ఘనత చంద్రబాబుది.ఉచిత ఇసుక పేరు చెప్పి కూటమి నేతలు దోచుకుంటున్నారు.పైకి మాత్రం ఇసుక జోలికి వెళ్లొద్దంటూ ఆదేశాలు చేస్తున్నట్లు నటిస్తున్నారు.వైసీపీ సోషల్ మీడియాపై చేస్తున్న అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.రెడ్ బుక్ పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతోంది.అన్యాయం జరిగితే ఎదిరించేందుకు సిద్ధంగా ఉంటాం.ప్రతి కార్యకర్తకు ఎప్పుడూ అండగా ఉంటాం’అని కొట్టు తెలిపారు. -
విప్లవాత్మక సంస్కరణలతో దేవదాయ శాఖలో సువర్ణాధ్యయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ళ పాలనలో దేవదాయ, ధర్మాదాయ శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేవదాయ శాఖలో ఒక సువర్ణాధ్యాయం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి ఛాంబరులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గడచిన ఐదేళ్ళ జగన్మోహన్రెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సమర్ధవంతంగా జరిగిందని, అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరిందని అన్నారు. ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శించడం బాధాకరమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక దేవాలయాలను కూల్చేయగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిన్నంటిని పునరుద్ధరించడమే కాకుండా 4500 కొత్త ఆలయాలను నిర్మించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1600 కోట్ల వ్యయంతో ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. శ్రీశైలం దేవాలయంలో భక్తులకు సౌకర్యం కల్పించే దిశగా సాలమండపాలు నిర్మాణాలను త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు. విజయవాడలో ఇటీవల జరిగిన మహాలక్ష్మి యజ్ఞం ఫలితంగా కేంద్రం నుంచి నిధులు వరదల్లా పారాయన్నారు. 2018 వరకు 1621 దేవాలయాలకు మాత్రమే ధూపదీప నైవేధ్యాల సౌకర్యం ఉండేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10వేల దేవాలయాల వరకు ధూపదీప నైవేధ్యాలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని తెలియజేసే విధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వార, మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. అర్చక వెల్ఫేర్ బోర్డు, ఆగమ సలహామండలి, అర్చక ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేశామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్ బుకింగ్ కోసం యాప్‌ను కూడా రూపొందించామన్నారు. దేవాలయాల భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎండోమెంట్ ఆస్తుల లీజు గడువు ముగిశాక ఖాళీ చేసే విధంగా ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఆ చట్టం ప్రకారం వారిని ఖాళీ చేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్చకులు పనిచేసే దేవాలయాల పరిధిలో వారికి ఇళ్ళ స్థలాలు కేటాయించామన్నారు. అందులో భాగంగా ఇళ్ళు లేని పేద అర్చకులకు ఇళ్ళు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని చెప్పారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పదోన్నతులు కల్పించడమే కాకుండా ఆలయాల నిర్మాణాలలో క్వాలిటీని పెంచేందుకు ఇంజనీర్లను నియమిస్తున్నామన్నారు. ప్రీ ఆడిట్ సిస్టంను అమల్లోకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకుని పలు దేవాయాలకు చెందిన ఉద్యోగులు మంత్రి కొట్టు సత్యనారాయణకు అభినందనలు తెలిపి గజమాలతో సత్కరించారు. -
AP: ఎల్లో మీడియాపై డిప్యూటీ సీఎం కొట్టు ఫైర్
సాక్షి,తాడేపల్లిగూడెం: ఎల్లో మీడియాపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పేవన్నీ వాస్తవాలని చెప్పారు. చంద్రబాబు అబద్ధాలకు రామోజీ వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఆదివారం ఆయన తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పిలుపుతో దెందులూరు సిద్ధం సభకు లక్షలాది మంది తరలి వచ్చారన్నారు. సభలో సీఎం జగన్ వాస్తవాల ప్రసంగంపై ఎల్లో మీడియా రోత రాతలు రాసిందని విమర్శించారు. బాబు హయాంలో దేవాలయాలను కూల్చివేసినపుడు రామోజీ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో దేవాదాయశాఖలో పూర్తి పారదర్శకత తీసుకువచ్చి అవినీతి లేకుండా చేశామని చెప్పారు. దేవాదాయ ఆస్తుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వం మీద బురద జల్లేందుకే ఎల్లో మీడియా విషపు రాతలు రాసిందని కొట్టు మండిపడ్డారు. -
బాబుకు దురద ఎందుకు? : కొట్టు సత్యనారాయణ
ఏలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అభ్యర్థుల ఎంపికలో చేర్పులు మార్పులు చేసుకుంటే చంద్రబాబుకు ఎందుకు దురదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఇద్దరూ సత్తు రూపాయలేనని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహనరెడ్డి అభ్యర్థులను మారుస్తున్నారని చెప్పారు. జగన్ ఎత్తుగడలు చూసి చంద్రబాబు, పవన్‌లకు గంగవెర్రులెత్తుతుందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎవరిని పెట్టుకోవాలనేది జగన్ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా విభజించారని అన్నారు. దానికి అనుగుణంగానే జిల్లాలు మారుతాయని, మార్పులు చేర్పులు ఉంటాయని కొట్టు తెలిపారు. సొంతంగా పోటీ చేసే సత్తాలేక 25 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్ల కోసం చంద్రబాబుకు పవన్‌కల్యాణ్ మోకరిల్లాడని దుయ్యబాట్టారు. చంద్రబాబు కూడా తనకు అభ్యర్థులు లేక ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా వారికి టిక్కెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడన్నారు. అభ్యర్థులను పెట్టలేని దుస్థితిలో టీడీపీ, జనసేన అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టలేని దుస్థితిలో టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయన్నారు. తమ పార్టీ వైఎస్సార్సీపీ మాత్రం 2024లో జరిగే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మార్పులు, చేర్పులు చేస్తున్నారన్నారు. వాటిని తాము స్వాగతిస్తున్నామని మంత్రి కొట్టు చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీ పరంగా ఏ మార్పులు చేయాలో ఎలా నూరుశాతం ఓట్లు సాధించాలో జగన్‌కు తెలుసన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులపై ఎవరిని పోటీకి పెట్టాలో తెలియక తెదేపా, జనసేన అయోమయంలో ఉన్నాయన్నారు. జగన్ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఎన్నికల సమయంలో అక్కడక్కడా చేర్పులు, మార్పులు సహజమన్నారు. తెదేపా, జనసేన పార్టీలు వైఎస్సార్సీపీ అభ్యర్థుల పట్ల ఇష్టానుసారం మాట్లాడటం గురువింద గింజ మాదిరిగా ఉందన్నారు. చంద్రబాబు కుప్పం నుంచి చంద్రగిరికి ఎందుకు వచ్చాడని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో వంగలపూడి వనితను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు తీసుకువచ్చి ఎందుకు పోటీ చేయించారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు అండగా నిలుస్తుందనే లక్ష్యంతో జగన్ మార్పులు చేర్పులు చేసుకుంటున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇవి కూడా చదవండి: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు : మజ్జి శ్రీనివాసరావు -
దేవాలయాల సంక్షేమంపై సీఎం జగన్ దృష్టి పెట్టారు: కొట్టు
-
కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కొట్టు
-
బాబు అరెస్ట్ పట్ల రాష్ట్రప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు: కొట్టు సత్యనారాయణ
-
హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదు: మంత్రి కొట్టు
సాక్షి, బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా: హిందూ సంస్కృతి గురించి పవన్‌కు ఏం తెలుసని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదని విమర్శించారు. అన్నవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని.. దళారీ వ్యవస్థకు తావు లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వివాహ వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి పవన్ కల్యాణ్.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నాడని మండిపడ్డారు. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసే స్థోమత ఉన్న వారు కూడా స్వామివారి మీద భక్తితో పిల్లలకు అన్నవరంలో వివాహం చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. అన్నవరంలో సరాసరి ఏడాదికి ఏడు లక్షల వ్రతాలు, 4 వేల వివాహాలు జరుగుతాయని తెలిపారు. ఆలయంలో జరిగే పెళ్లిళ్లకు ఆలయ నిర్వాహకులు బాధ్యులు కాదని పేర్కొన్నారు. అన్నవరంలో దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని, వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ఈ చర్యతో బ్రోకర్ల పనులకి అడ్డుకట్ట పడటంతో.. వీళ్లంతా పవన్ కళ్యాణ్ సంప్రదించారని అన్నారు. చదవండి: పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోంది: మంత్రి అంబటి ‘రోజురోజుకి పవన్ కళ్యాణ్ దిగజారి పోతున్నాడు. చంద్రబాబులాంటి శనిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబును వదులుకుంటేనే నీకు రాజకీయ భవిష్యత్తు. సమాజంలో సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉంటే దానిని కూడా చూడలేకపోతున్నావు. ప్రజా నాయకుడైన వైఎస్ జగన్‌ను విమర్శిస్తే ప్రజలే నీకు మరోసారి బుద్ధి చెప్తారు. చంద్రబాబు ఐడియాలజీని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. రాష్ట్రంలో దేవాలయాలు కూల్చేసింది నీ దత్తతండ్రి చంద్రబాబే. గతంలో దేవాలయాలు కూల్చి వేసినప్పుడు కళ్ళు మూసుకున్నావా? అప్పుడు కోర్టులో ఎందుకు కేసు వేయలేకపోయావని నిలదీశారు. వేషాలు వేసి మోసాలు చేసి, హిందూ ధర్మం కూడా పాటించలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని బీసీ సంక్షేమశాఖా మంత్రి వేణుగోపాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను తీర్చే సెఈం జగన్ పట్ల అనుచితంగా మాట్లాడటం దారుణమని అన్నారు. హిందూ ధర్మం గురించిపవన్ మాట్లాడితే ఎవరు వినరని అన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో కులాలు, ప్రాంతాలు, వాలంటీర్ల గురించి మాట్లాడటం పవన్ నైజమని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే రెమ్యునరేషన్ మీద ఆధారపడిన పవన్.. గత ఎన్నికల్లో ఓచోట గెలిచిన వ్యక్తిని కూడా తన దగ్గర కూర్చోబెట్టుకోలేకపోయాడని దుయ్యబట్టారు. -
బాబు నుంచి పవన్‌కు రిపోర్టు వచ్చిందేమో: కొట్టు సత్యనారాయణ సెటైర్లు
సాక్షి తాడేపల్లి: పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యాఖ్యాలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఎవరిచ్చిన రిపోర్ట్ చదువుతున్నారో పవన్‌కు అసలు అర్థమవుతుందా అని ప్రశ్నించారు. బాహుశా అది చంద్రబాబు నుంచి వచ్చిన నివేదిక ఏమోనని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటిస్తూ వాలంటీర్ల నియామకం జరిగిందని తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రామాణికంగా తీసుకున్నామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వాలంటీర్లలో 75 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు. వాలంటీర్లు పాకిస్తాన్ వాళ్లేం కాదని, ప్రతీ 50 కుటుంబాలకు వాలంటీర్లను ఆయా కుటుంబాల నుంచే నియమించామని అన్నారు. అసలు విషయాలు తెలుసుకోకుండా అజ్ణానవాసిలా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రెండు లక్షల పుస్తకాలు చదివిన ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో పవన్ ఒక్కడేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
AP: దేవాదాయశాఖపై మంత్రి కొట్టు సమీక్ష.. కీలక నిర్ణయాలు
సాక్షి, తాడేపల్లి: దేవాదాయ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన రూ. 70 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రసాదం పోటు తయారీ, ప్రసాదం కౌంటర్లు, స్టాక్ పాయింట్‌ను రూ. 27 కోట్లతో ఒకే భవనంగా నిర్మిస్తున్నామన్నారు. రూ. 30 కోట్లతో అన్నదానం భవనం.. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. రూ. 30 కోట్లతో రెండు ఫ్లోర్లుగా అన్నదానం భవనం, ఒకేసారి 1500 నుంచి 1800 మంది అన్న ప్రసాదం స్వీకరించే విధంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని తట్టుకునేలా రూ. 20 కోట్ల అంచనాలతో అదనంగా క్యూలైన్ల కాంప్లెక్స్ ఎక్స్ టెన్షన్ నిర్మాణం చేపట్టిన్నట్లు పేర్కొన్నారు. ఈ వారంలో టెండర్లు పిలుస్తున్నామని.. రూ. 28 కోట్లతో స్టెయిర్ కేస్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.120 కోట్ల ఆలయ నిధులతో అభివృద్ధి అమ్మవారికి కుంకుమ పూజ ప్రత్యేకంగా నిర్వహించడానికి వీలుగా రూ. 6 కోట్లతో పూజా మండపం ఏర్పాటు. జులై రెండవ వారంలో టెండర్లు పిలుస్తున్నాం. విజయవాడ దేవాలయంలో ఒక మెగా వాట్ సోలార్ ప్లాంట్ త్వరలోనే ప్రారంభిస్తాం. రూ. 60 కోట్ల రూపాయిలతో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం చేయనున్నాం. రూ. 70 కోట్లలో ఇప్పటికే దాదాపు రూ. 14.70 కోట్ల పనులు పూర్తయ్యాయి. అదనంగా రూ.120 కోట్ల ఆలయ నిధులతో విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ది చేస్తున్నాం. చదవండి: దళిత ద్రోహి చంద్రబాబు: మంత్రి నాగార్జున కాణిపాకంలో రూ. 3.60 కోట్లతో అన్నదాన కాంప్లెక్స్ శ్రీశైలంలో రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణం. రూ.35 కోట్లతో శ్రీశైలం మాడవీధులలో 750 మీటర్లు పొడవుతో సాల మండపాలు నిర్మాణం. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో సాల మండపాల నిర్మాణాలు జరిగాయి. మళ్లీ సీఎం వైఎస్ జగన్ హయాంలో నిర్మించబోతున్నాం. కాణిపాకంలో రూ. 3.60 కోట్లతో అన్నదానం కాంప్లెక్స్. రూ. 4 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణాలు. శ్రీవాణి ట్రస్టుపై కొందరు దుష్పచారం చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన నిధులని ధర్మ ప్రచారం, ఆలయాల నిర్మాణాలకి ఉపయోగిస్తున్నాం. 1917 ఆలయాలు మంజూరు శ్రీవాణి ట్రస్టు నిధులతో 1917 ఆలయాలు మంజూరు చేశాం. ఆలయాల పాలనా వ్యవహారాల్లో గత సంవత్సర కాలంలో ఎన్నో కీలక సంస్కరణలు చేపట్టాం. ప్రీ ఆడిట్ విధానం ద్వారా అవినీతి ఆరోపణలకి చెక్ పెట్టాం. ఆలయాలలో ప్రతీ మూడు నెలలకి సిబ్బంధి అంతర్గత బదిలీలు చేయాలని ఆదేశించాం. ఆలయాలలో ఆభరణాలపై రూ. 450 కోట్ల సీజీఎఫ్ నిధులతో గత నాలుగేళ్లగా కొత్త ఆలయాల నిర్మాణాలకి, పురాతన ఆలయాల పునరుద్దరణ చేపట్టాం. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గత ఏడాది కాలంలో పురాతన ఆలయాల పునరుద్దరణ, కొత్త ఆలయాల నిర్మాణాల కోసం 270 కోట్ల సీజీఎఫ్ విడుదల చేశాం’ అని తెలిపారు. -
‘పవన్ రాజకీయాల కోసం కాపులను వాడుకోవాలని చూస్తున్నారు’
సాక్షి, ఏలూరు: పవన్ రాజకీయాల కోసం కాపులను వాడుకోవాలని చూస్తున్నారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పవన్ పనిచేసేది చంద్రబాబు కోసమేనని మండిపడ్డారు. కాపులు ఏకం కాకుండా చంద్రబాబు కుట్ర చేశారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు ఏ విధంగా వేధించారో పవన్‌కు తెలియదా అంటూ ప్రశ్నించారు. కాపులు సీఎం జగన్‌ను నమ్మారు కాబట్టే 60 శాతం కాదు 90 శాతం ఓట్లు వేసి గెలిపించారన్నారు. కాపులకు సీఎం.. ఉన్నత స్థానం కల్పించి సముచిత స్థానం కల్పించారన్నారు. బాబు ఇచ్చిన 5 శాతం తప్పుడు జీవో కంటే సీఎం జగన్ ఇచ్చిన దాని వల్ల మేలు జరుగుతుందని పవన్‌కు తెలియడం లేదా అంటూ ఫైర్ అయ్యారు. పవన్ చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు కాపుల మనోభావాలు దెబ్బ తీస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు చేసిన అవినీతి పవన్‌కు కనపడట్లేదు.. తనకు కావాల్సిన ప్యాకేజీలు అందుతున్నాయి కాబట్టి బాబు గొప్పోడిలాగా కనపడుతున్నాడని మంత్రి మండిపడ్డారు. చదవండి: ‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’ -
గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని సంక్షేమ పథకాలు సీఎం జగన్ ఇచ్చారు: డిప్యూటీ సీఎం కొట్టు
-
‘సీఎం జగన్‌కు అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు’
సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్రెడ్డికి ఏదో రకంగా అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు విషపు రాతలు రాయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎల్లో మీడియా, చంద్రబాబు,దత్తపుత్రుడు కలిసి మాపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. లక్షల కోట్లు దోచుకున్నారు కాబట్టే గత ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించారు.. అందుకే వారిని ఓడించి ఇంట్లో కూర్చో బెట్టినా మార్పు రావడం లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్ లు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తోందని, మొన్న అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా రెండు స్కామ్‌లను బయటపెట్టినట్లు చెప్పారు. -
అర్చకులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి: అర్చకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అర్చక సంక్షేమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు వంద శాతం వైద్య ఖర్చులు తిరిగి చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా అధికారులను మంత్రి ఆదేశించారు. అర్చకుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అర్చకులకు వంద శాతం వైద్య ఖర్చులు చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. దీని ద్వారా అర్చకులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. చదవండి: కోల్డ్ స్టోరేజ్ నేతలంతా చేరి ప్రభుత్వంపై విమర్శలా: అమర్నాథ్ -
జరిగిన దుర్ఘటనలకు చంద్రబాబుదే బాధ్యత : మంత్రి కొట్టు సత్యనారాయణ
-
బాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలయ్యారు : మంత్రి కొట్టు సత్యనారాయణ
-
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి కొట్టు సత్యనారాయణ
-
రాజానగరం లో ఘనంగా కాపు కార్తీకమాస వన సమారాధన సభ
-
పార్టీని అద్దెకు ఇవ్వడానికి పవన్ సిద్దమయ్యాడు : మంత్రి కొట్టు సత్యనారాయణ
-
రాష్ట్రంలో ఎక్కడ గొడవ జరిగినా జనసేన కార్యకర్తలు ఉంటున్నారు : కొట్టు సత్యనారాయణ
-
విజయనగరం : వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
-
పవన్ ట్వీట్ల ద్వారానే ప్రజల్లో ఉన్నానని అనుకుంటాడు: మంత్రి కొట్టు సత్యనారాయణ
-
చంద్రబాబు పై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్
-
ఏపీలోని ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే శ్రీశైలంలో ఆన్ లైన్ సేవలని నైన్ అండ్ నైన్ సంస్ధ సహకారంతో చేపట్టామని తెలిపారు. శ్రీశైలంలో విజయవంతం కావడంతో ఇపుడు ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు అదే సంస్ధ ఉచితంగా చేపట్టిందన్నారు. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు అన్ని దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలు విస్తరిస్తామన్నారు. అవినీతిని అరికట్టేందుకు.. పారదర్శత కోసం ఆన్లైన్ సేవలు ఉపయోగపడతాయన్నారు. క్యూ లైన్ నిర్వహణ కూడా ఈ యాప్ ద్వారా చేస్తామన్నారు. రూమ్‌లు, దర్శనాలు, సేవలు, ఈ- హుండీ.. ఇలా అన్నీ ముందుగానే ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. తొమ్మిది ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు ముందుగా ప్రారంభిస్తున్నామన్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయానికి దసరా మహోత్సవాల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం, శ్రీకాళహస్తి, కాణిపాకం, పెనుగంచిప్రోలులలో కూడా ఆన్లైన్ సేవలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఆలయ భూములు, ఆభరణాలపై జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. ఆన్‌లైన్‌తో పాటే భక్తులు ఆఫ్ లైన్లో సేవలు కొనసాగుతాయని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ గెలుస్తాం: మంత్రి పెద్దిరెడ్డి) -
కాగ్ నివేదికలో నిజం లేదా?
తాడేపల్లిగూడెం రూరల్: ‘రాజధాని పేరిట అమరావతిలో మాజీ సీఎం చంద్రబాబు వేలాది ఎకరాల భూములను దోచుకుని ఆ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చాలని ప్రయత్నించడం నిజం కాదా? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బట్టబయలు చేసిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో నిజం లేదా? టీడీపీ నాయకులకు దమ్ముంటే తప్పని చెప్పాలి...’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సవాల్ విసిరారు. గత టీడీపీ ఐదేళ్ల పాలనాకాలంలో చంద్రబాబు దోచుకున్న డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వస్తున్నారని, అది ఎన్నాళ్లో సాగదని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం కొట్టు సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల శాతం కంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల శాతం తక్కువేనని స్పష్టంచేశారు. చంద్రబాబు పాలనాకాలంలో చేసిన అప్పుల కంటే కూడా ఇప్పుడు తక్కువగానే అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు గాలికొదిలేసిన విద్యుత్ డిస్కంల బకాయిలు రూ.22 వేల కోట్లను సీఎం జగన్ చెల్లిస్తూ వస్తున్నారన్నారు. నాడు చంద్రబాబు నిర్లక్ష్యంగా వదిలేసిన రోడ్లను సైతం నేడు నిర్మిస్తున్నారని తెలిపారు. టీడీపీ సిగ్గుమాలిన పార్టీ అని, ఆ పార్టీ నాయకులు దిగజారి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచితే, రాష్ట్ర ప్రభుత్వంపై బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రూ.200 ఇస్తే గానీ టీడీపీ కార్యక్రమాలకు మనుషులు రాని దుస్థితి నెలకొందన్నారు.