సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు అసెంబ్లీ కమిటీలలో జిల్లా ప్రజాప్రతినిధులకు స్థానం దక్కింది. ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్‌గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ(కేఎస్‌ఎన్) నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తనకు ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని ఇచ్చినందుకు కొట్టు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో అమలు చేస్తానన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికే చాలావరకూ అమలు చేస్తోందని, నవరత్నాలతో పాటు ఇతర హామీలు ఎంతవరకూ అమలు అవుతున్నాయి. ఇంకా ఏయే హామీలు అమలు కావాలనే అంశాలను ప్రతి జిల్లాకు తిరిగి అధ్యయనం చేస్తామని, ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేస్తామని చెప్పారు. హామీల అమలు కమిటీలో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి స్థానం దక్కింది. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నేతృత్వంలో ఏర్పాటైన పిటిషన్ల కమిటీలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు స్థానం పొందారు.
Comments
Please login to add a commentAdd a comment