mudunuri prasadaraju
-
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
నరసాపురం/భీమవరం/ఉండి/ఏలూరు టౌన్/నరసాపురం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని 26వ వార్డులో 50 మంది కార్యకర్తలు స్థానిక పార్టీ దళిత విభాగం సీనియర్ నేత ఇంజేటి రవీంద్ర ఆధ్వర్యంలో జనసేన, టీడీపీలను వీడి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. భీమవరం 25వ వార్డుకు చెందిన 100 మంది జనసేన, టీడీపీ నాయకులతో పాటు పట్టణంలోని ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు భారీగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బొమ్మదేవర ముస్లి, కలిశెట్టి శ్రీనివాస్, పోలిశెట్టి సత్యనారాయణ, కర్ర స్వామి, బొమ్మదేవర మందు తదితరులున్నారు. ఉండి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు, ఉప సర్పంచ్ గొట్టుముక్కల కళ్యాణ్ వర్మ సమక్షంలో 50 మంది వైఎస్సార్సీపీలో చేరారు. ఏలూరు శ్రీరామ్ నగర్లో వైఎస్సార్సీపీ నాయకులు దారపు తేజ, గేదెల సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పోణంగికి చెందిన 200 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆళ్ల నాని సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. నరసాపురం మండలం చామకూరిపాలెంలోని అంబేద్కర్ నగర్లో వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు గుంపుల రత్నరాజు ఆధ్వర్యంలో 50 మంది జనసేన, టీడీపీ కార్యకర్తలు పార్టీ నేత పీడీ రాజు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. -
ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కేఎస్ఎన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు అసెంబ్లీ కమిటీలలో జిల్లా ప్రజాప్రతినిధులకు స్థానం దక్కింది. ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్‌గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ(కేఎస్ఎన్) నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తనకు ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని ఇచ్చినందుకు కొట్టు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో అమలు చేస్తానన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికే చాలావరకూ అమలు చేస్తోందని, నవరత్నాలతో పాటు ఇతర హామీలు ఎంతవరకూ అమలు అవుతున్నాయి. ఇంకా ఏయే హామీలు అమలు కావాలనే అంశాలను ప్రతి జిల్లాకు తిరిగి అధ్యయనం చేస్తామని, ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేస్తామని చెప్పారు. హామీల అమలు కమిటీలో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి స్థానం దక్కింది. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నేతృత్వంలో ఏర్పాటైన పిటిషన్ల కమిటీలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు స్థానం పొందారు. -
వారధి కోసం కదిలారు మా‘రాజులు’
సాక్షి, నరసాపురం: ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురం వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలనేది దశాబ్దాల డిమాండ్. అయితే గత టీడీపీ ప్రభుత్వం అదిగో వంతెన, ఇదిగో వంతెన అంటూ హైడ్రామా నడిపింది. ఇందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంతెన అంశంలో వడివడిగా అడుగులు వేస్తోంది. వశిష్ట వంతెన నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నిర్ణయించారు. దీంతో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నితిన్‌గట్కరీని ఢిల్లీలో సోమవారం కలవడానికి ఎంపీ, ఎమ్మెల్యే హుటాహుటీన బయలుదేరి వెళ్లారు. దీంతో వంతెన విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొదటి నుంచి వశిష్ట వంతెన విషయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కృతనిశ్చయంతో ఉన్నారు. కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వారా వంతెన నిర్మించి తీరతానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇప్పటికే లోక్‌సభలో వంతెన అంశాన్ని ప్రస్తావించి రెండు జిల్లాల ప్రజల ఇబ్బందులను ప్రధాని ఎదురుగా లోక్‌సభలో వివరించారు. ఇప్పుడు ఇద్దరు నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో వంతెన ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురంలో వంతెన నిర్మించాలనే డిమాండ్ బ్రిటీష్ కాలం నుంచీ ఉంది. గోదావరి జిల్లా వాసుల దశాబ్దాల కోరిక. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ విషయంలోనూ లేని విధంగా నాలుగుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఐదుగురు ముఖ్యమంత్రులు వంతెనపై దృష్టిపెట్టారు. స్వయంగా ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రుల వద్ద నలిగిన వంతెన ఫైలు వశిష్ట వంతెన అనేది దశాబ్దాల పోరాటం. బహుశా రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్‌కు ఇన్నిసార్లు శంకుస్థాపనలు, సర్వేలు జరగలేదు. బ్రిటీష్ హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మించాలని యోచించారు. బ్రిటీష్ పాలన మరికొంతకాలం ఉంటే కచ్చితంగా వారి హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మాణం జరిగేదని స్థానికంగా ఉండే పెద్దలు చెప్పుకుంటారు. కాగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి వంతెన ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇక ఎన్టీ రామారావు హయాంలో వంతెనకు బీజం పడింది. 1986లో ఎన్టీఆర్ వశిష్ట వంతెనకు నరసాపురంలోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ రెండు చోట్లా శంకుస్థాపనలు చేశారు. అయితే సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ నరసాపురంలో నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. రాజకీయ వత్తిళ్లతోనే ఇది జరిగిందనేది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న పెద్దచర్చ. అయితే అప్పటిలో వంతెన తరలించవద్దంటూ పెద్ద ఉద్యమమే సాగింది. ఇక అప్పటి నుంచీ నరసాపురం వెంతెన కథ సాగుతూనే ఉంది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కూడా వంతెన నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వంతెన నిర్మాణంపై ప్రకటనలు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలో కూడా వంతెన అంశాన్ని ప్రస్తావించారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక గత ఐదేళ్లలో అయితే వంతెన విషయంలో టీడీపీ నేతలు పెద్ద డ్రామానే నడిపారు. వంతెన మంజూరు అయిపోయిందంటూ పలుమార్లు స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చి హడావిడి చేశారు. వైఎస్ హయాంలో రూ.94 కోట్లతో టెండర్లు.. వశిష్ట వంతెన విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే చొరవ చూపారు. ఆయన పాదయాత్ర సమయంలో తీరంలో పర్యటించినప్పుడు, వంతెన అవసరాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో ఆయన రెండోసారి అధికారంలోకి రాగానే వంతెన నిర్మాణంపై దృష్టిపెట్టారు. 2008 ఏప్రిల్ 15వ తేదీన వశిష్ట వంతెనకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శంకుస్థాపన చేశారు. అక్కడితో సరిపెట్టకుండా రూ.94 కోట్లతో టెండర్ పిలిచి నిర్మాణ పనులను సత్యంకు అనుబంధ సంస్థగా ఉన్న మైటాస్ కంపెనీకి అప్పగించారు. ప్రాథమికంగా సర్వేలు అన్నీ పూర్తయ్యాయి, ఇక వంతెన పనులు ప్రారంభమవుతాయనగా సత్యం సంస్థ సంక్షోభంలోకి వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. అయితే వేరే కంపెనీకి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అంతలో ఆయన మృతిచెందారు. అయితే మైటాస్ వద్ద సబ్‌కాంట్రాక్ట్ తీసుకున్న వేరే కంపెనీ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చినా కూడా, తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు శ్రద్ధ చూపించలేదు. కచ్చితంగా నిర్మించి తీరుతాం. వంతెన కట్టాలి.. లేదంటే కుదరదని చెప్పాలి. అంతేగాని ప్రజలను మోసం చేయడం మంచిది కాదు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన వెంటనే టెండర్ పిలిపించి పనులు మైటాస్ సంస్థకు అప్పగించారు. ఆయన బతికుంటే ఎప్పుడో బ్రిడ్జి పూర్తయ్యేది. కానీ ఐదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వం వంతెన వచ్చేసిందంటూ హడావిడి చేసింది. స్వీట్లు పంచుకున్నారు. ఇది మోసం చేయడం కాదా. మా హయాంలో ఇలాంటి మోసాలు ఉండవు. కచ్చితంగా వంతెన నిర్మాణం జరిపి తీరుతాం. – ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే, నరసాపురం -
ఆక్వాపార్క్‌పై వైఎస్సార్ సీపీ సమరశంఖం
నరసాపురం : తుందుర్రు గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. మొగల్తూరు ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువు కారణంగా ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయినా తుందుర్రు ఆక్వా పార్క్ నిర్మాణంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల మంది ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపించే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవడానికి వైఎస్సార్ సీపీ నరసాపురం నియోజకవర్గ కన్వీనర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో ఆయన నిరాహారదీక్షకు కూర్చోనున్నారు. ఫుడ్‌పార్కు పనులు నిలిపివేయాలంటూ ఏడాదిన్నరగా ప్రజలు, ప్రతిపక్షపార్టీలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళుతోంది. ప్రభుత్వ విధానాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వైఎస్సార్ సీపీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ వస్తోంది. తాము పరిశ్రమలను వ్యతిరేకించడంలేదని, తుందుర్రు ఆక్వాపార్కును సముద్రతీర ప్రాంతంలో నిర్మించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. విషప్రచారం చేస్తున్న ప్రభుత్వం తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని వైఎస్సార్ సీపీ స్పష్టంగా చెబుతున్నా ప్రభుత్వం ప్రతిపక్షంపై విషప్రచారం చేస్తోంది. తుందురు ఫ్యాక్టరీ వద్దంటూ అభివృద్ధిని అడ్డుకుంటుందని ప్రభుత్వం విమర్శలకు దిగుతోంది. ఈ తరుణంలో మొగల్తూరు నల్లంవారితోటలోని ఆనందా ప్రా¯Œ్స ప్రాసెసింగ్ యూనిట్లో గత నెల 30న జరిగిన ఘోర ప్రమాదంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ చిన్న ఫ్యాక్టరీలో విషవాయువు కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మొగల్తూరు ఫ్యాక్టరీ కంటే తుందుర్రు ఫుడ్ పార్క్ 10 రెట్లకు పైగా పెద్దది కావడం గమనార్హం. అంత పెద్ద ఫ్యాక్టరీలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రాంతంలో తీవ్ర ప్రాణనష్టం తప్పదు. మొగల్తూరు ఫ్యాక్టరీ యాజమాన్యమే తుందుర్రు ఆక్వాపార్క్‌ను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో తుందుర్రు ఫుడ్ పార్క్‌ను సముద్ర తీర ప్రాంతానికి తరలించాలి్సందేనని ఈ నెల 1న ముదునూరి ప్రసాదరాజు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. 6వ తేదీలోగా దీనిపై ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా శుక్రవారం నుంచి నిరవధిక దీక్షకు కూర్చోనున్నారు. ఆళ్ల నాని సహా పలువురు నేతల రాక ముదునూరి చేపట్టిన దీక్షకు సంఘీభావంగా శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నానితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు, ముఖ్యనేతలు హాజరవుతున్నారు. పలువురు రాష్ట్రస్థాయి నేతలు కూడా వస్తున్నారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులతో పాటు, బాధిత గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.