Government guarantees
-
మలిసంధ్యలో చేయూత
సాక్షి, అమరావతి: వృద్ధుల జీవిత కాలాన్ని పొడిగించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంచానికి పరిమితమైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ఒక ప్రభుత్వాస్పత్రిలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా జెరియాట్రిక్ వార్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ వార్డుల్లో క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్ తదితర జబ్బులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వృద్ధులకు వైద్య సేవలందిస్తారు. ప్రతి జెరియాట్రిక్ వార్డులో 10 పడకలుంటాయి. ఒక జనరల్ ఫిజీషియన్, ఇద్దరు నర్సులు, ఫిజియోథెరపిస్ట్ సహా ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఒక్కో వార్డు ఏర్పాటుకు ప్రభుత్వం రూ.20 లక్షలు ఖర్చు చేస్తోంది. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ఈ జెరియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేస్తారు. అనంతపురం, గుంటూరు, వైఎస్సార్, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోని ఒక్కో వార్డును జెరియాట్రిక్ వార్డులుగా మార్చారు. గతేడాదే ఆయా జిల్లాల్లో ఈ వార్డులు అందుబాటులోకొచ్చినా.. కరోనా కారణంగా సేవలు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వైద్య సేవలు ప్రారంభిస్తున్నారు. కర్నూలు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కృష్ణా, శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో జిల్లా, ఏరియా ఆస్పత్రుల ప్రాంగణంలో కొత్తగా వార్డులు నిర్మిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణాల్లో వార్డుల నిర్మాణం పూర్తయింది. దీంతో త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. -
ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కేఎస్ఎన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు అసెంబ్లీ కమిటీలలో జిల్లా ప్రజాప్రతినిధులకు స్థానం దక్కింది. ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్‌గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ(కేఎస్ఎన్) నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తనకు ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని ఇచ్చినందుకు కొట్టు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో అమలు చేస్తానన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికే చాలావరకూ అమలు చేస్తోందని, నవరత్నాలతో పాటు ఇతర హామీలు ఎంతవరకూ అమలు అవుతున్నాయి. ఇంకా ఏయే హామీలు అమలు కావాలనే అంశాలను ప్రతి జిల్లాకు తిరిగి అధ్యయనం చేస్తామని, ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేస్తామని చెప్పారు. హామీల అమలు కమిటీలో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి స్థానం దక్కింది. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నేతృత్వంలో ఏర్పాటైన పిటిషన్ల కమిటీలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు స్థానం పొందారు. -
ఆయిల్‌ఫెడ్‌కు రూ. 79 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ
పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎన్సీడీసీ రుణం సాక్షి, హైదరాబాద్: జాతీయ సహకార అభి వృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి తెలంగాణ ఆయిల్‌ఫెడ్ తీసుకునే రూ. 79.47 కోట్ల రుణా నికి గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు విడుదల చేయనుంది. దీంతో ఆయిల్‌ఫెడ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పారావు పేట లో నిర్మాణంలో ఉన్న ఆయిల్‌ఫాం ఫ్యా క్టరీ, అశ్వారావుపేటలో ప్రస్తుతమున్న ఫ్యాక్టరీ విస్త రణ పనులకు ఈ రుణాన్ని ఖర్చు చేస్తారు. -
‘స్మార్ట్’గా తప్పించారు!
ఒకప్పటి రాజధాని.. రాష్ట్రాలను కలిపే క్రమంలో పోగొట్టుకున్న తన హోదాను రాష్ట్ర విభజన సమయంలో దక్కించుకుంటుందని అందరూ భావించారు. ఆ దిశగా ఈ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు పోరాడారు కూడా. అయితే ఫలితం లేకపోయింది. కానీ కర్నూలుకు ప్రాధాన్యం ఇస్తామంటూ సీఎం చంద్రబాబు ఎన్నో హామీలు గుప్పించారు. అయితే ప్రస్తుతం ఆయన హామీలు ఒక్కొక్కటిగా నీరుగారిపోతుండడం విస్మయాన్ని కల్గిస్తోంది. కర్నూలుకు మరోసారి మొండిచేయి - ఒకప్పటి రాజధానికి వరుస పరాభవాలు - హామీలు ఒక్కొక్కటిగా నీరుగారుతున్న వైనం - అధికార పార్టీ జిల్లా నేతలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర విభజన తర్వాత ఒకప్పటి రాజధానికి ఆ హోదా దక్కకపోయినా అంతకు మించిన రీతిలో అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం హామీలు గుప్పించింది. ఎయిమ్స్(ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్), క్యాన్సర్ ఆసుపత్రి, హజ్‌హూస్, క్రీడా యూనివర్సిటి, స్మార్ట్‌సిటి ఇలా ఎన్నో కర్నూలుకే అన్నట్టు ప్రచారం జరిగింది. అధికార పార్టీకి చెందిన ఇక్కడి నేతలు, మంత్రులతోపాటు సీఎం సైతం బల్లగుద్దీ మరీ ఈ మాటలు చెప్పారు. అన్నీ ఒకే ఇక పనులే తరువాయి అన్నంతగా పరిస్థితిని తెచ్చారు. రాజధాని చాన్స్ మిస్సయినా అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి తథ్యమన్నట్లు జిల్లా ప్రజలు భావించారు. కాని అచరణకు వచ్చే సరికి పరిస్థితి ఇందుకు పూర్తి వ్యతిరేకంగా సాగుతోంది. అర్భాటంగా ప్రకటించిన హామీలన్నీ ఒక్కోక్కటిగా ఇతర జిల్లాలకు తరలిపోతుండడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం సార్మ్‌సిటి జాబితాలో కూడా లేకపోవడంతో కర్నూలుకు మరో భంగపాటుగా భావిస్తున్నారు. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో టార్చ్‌లైట్ వేసి వెతికినా కర్నూలు కనిపించకపోవడం గమనార్హం. రూ.300 కోట్ల ప్రతిపాదనలు బుట్టదాఖలు రెండున్నర నెలల క్రిత మే స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం స్మార్ట్ సిటీగా కర్నూలును ఎంపిక చేసింది. సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. నగర జనాభా, మంచినీటి అవసరాలు, డ్రెయినేజీ సిస్టం, మురికివాడల పరిస్థితి, వ్యక్తిగత మరుగుదొడ్ల వివరాలు, సమగ్రాభివృద్ధికి కావాల్సిన అవసరమైన నివేదికలు తయారు చేయాల్సిందిగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రత్యేకదృష్టి సారించి రూ.300 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. నగరంలో ప్రధానంగా మురుగు కాల్వ వ్యవస్థ, భూగర్భ డ్రెయినేజి, నీటిశుద్ధి కేంద్రాలు, అన్ని వీధులకు రోడ్లు, కాల్వలు, కల్వర్టులు, ఖాళీ స్థలాల్లో పార్కుల ఏర్పాటు వంటి వాటితో నివేదికలు రూపొందించారు. అయితే అవేవీ కార్యరూపం దాల్చకపోవడంతో అధికార పార్టీకి చెందిన జిల్లా నేతలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా స్మార్ట్ సిటీల ఎంపికలో కూడా కర్నూలును విస్మరించడం గమనార్హం. రాష్ట్రంలో స్మార్ట్ సిటీలను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతికి మాత్రమే చోటు దక్కింది. -
ఇదేం దా‘రుణం’!
⇒రుణమాఫీపై అంతా గందరగోళం ⇒రుణమాఫీ జాబితాల్లో పేర్లు లేక రైతుల ఆందోళన ⇒ గార మండలంలో అర్హులైన రైతులు 13,200 మంది ⇒జాబితాల్లో పేర్లు లేని వారి సంఖ్య 8,200 ⇒మళ్లీ దరఖాస్తు చేసుకోమంటున్న అధికారులు ⇒బ్యాంకులు, మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణ గార: రుణమాఫీతో రైతులందరికీ భరోసా కల్పిస్తామన్న ప్రభుత్వ హామీలు ఆచరణలో తస్సుమంటున్నాయి. మాఫీ ప్రకటించిన ఆరునెలల తర్వాత మొదటి విడతగా రూ.50 వేల లోపు పూర్తి మాఫీ అంటు ఆన్లైన్లో పెట్టిన జాబితాలు చూసి రైతులు బావురుమంటున్నారు. గార మండలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బ్యాంకర్ల లెక్కల ప్రకారం ఈ మండలంలో 13200 మంది రైతులు సుమారు రూ. 40 కోట్ల మేరకు పంట, బంగారం రుణాలు తీసుకున్నారు. కళింగపట్నం, కరజాడ, అరసవల్లి విశాఖ గ్రామీణ బ్యాంకులు, గార స్టేట్ బ్యాంకు, శ్రీకూర్మం ఆంధ్రాబ్యాంకు, తూలుగు, అంపోలు పీఏసీఎస్‌ల ద్వారా ఈ రుణాలు పొందారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలో మండలానికి చెందిన 5వేల మంది రైతులకు మాత్రమే చోటు దక్కింది. వీరికి రూ.12 కోట్లు రుణమాఫీ వర్తిస్తుంది. ఒక్క శ్రీకూరమం పంచాయతీలోనే అత్యధికంగా 1100 మంది రైతులకు మాఫీ వర్తించలేదు. రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, భూమి పత్రాల ఆధారంగానే ఈ జాబితా రూపొందించామని ప్రభుత్వం చెబుతోంది. అర్హులైన రైతులందరూ అన్ని పత్రాలను అధికారులకు అందజేసినా.. వేలాది మంది పేర్లు జాబితాలో లేకపోవడానికి ఆధార్ నెంబర్లలో తప్పులు, భూమి పత్రాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలను ప్రభుత్వం చూపిస్తోంది. కానీ అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా వారి పేర్లు కూడా ఎందుకు గల్లంతయ్యాయన్న దానికి ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. రుణమాఫీ వర్తించాలంటే మళ్లీ అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని అటు అధికారులు, ఇటు బ్యాంకర్లు సూచిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. కాగా రుణమాఫీ జాబితాలో పేర్లు లేని రైతులు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు మీ సేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరిట కోత ఇదిలా ఉండగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో మాఫీ మొత్తంలో భారీ కోత విధించింది. రైతుకు ఎంత పంటరుణం ఇవ్వాలన్నది రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. దీన్నే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు. ఇది ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఎకరా వరి పంటకు 2001లో రూ.13,500, 2002లో రూ.15వేలు, 2003లో రూ,16వేలు, 2004లో రూ.18,500 మంజూరు చేయాలని రిజర్వ్ బ్యాంకు నిర్దేశించింది. రుణమాఫీ అమలు నాటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను కాకుండా 2001 రూ.13,500 రేటును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకొని మాఫీ వర్తింపజేసింది. ఫలితంగా పూర్తి మాఫీకి అర్హత ఉన్న రైతులు కూడా పూర్తిస్థాయిలో లబ్ధిపొందే అవకాశం లేకుండాపోయింది. -
అన్నదాతల ఇళ్లలో చావుడప్పు!
-
అన్నదాతల ఇళ్లలో చావుడప్పు!
టీడీపీ హయాంలో ఇదో పరంపర ఈ ఆర్నెల్ల కాలంలో 86 మంది రైతుల బలవన్మరణం రైతుల గోడు పట్టని సీఎం చంద్రబాబు ‘మీ కోసం’ పాదయాత్రలో రైతుల కష్టాలను కళ్లారా చూశానని, అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తానన్న టీడీపీ అధినేత అధికారం చేపట్టి ఆరు నెలలైనా రైతాంగానికి సాంత్వన చేకూర్చే ఒక్క నిర్ణయమూ తీసుకోలేదు రైతుల ఖాతాలు తగ్గించడానికే ఆర్నెల్లూ కసరత్తు రుణ భారంతో పాటు, అపరాధ వడ్డీ భారం కూడా తోడై మరింత కుంగిపోతున్న అన్నదాత ఒక్క అనంతపురం జిల్లాలోనే 40 మంది బలవన్మరణం.. కర్నూలు జిల్లాలో 33 మంది ప్రాణాలు వదులుతున్న రైతుల్లో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలు, సన్న, చిన్నకారు రైతులే సాక్షి, హైదరాబాద్: బంగరు భూమిలో విషాదం చిమ్ముతోంది. పచ్చటి పొలాల్లో కన్నీరు పారుతోంది. ప్రభుత్వం హామీలు అమలు కాక, కాలం కలిసి రాక రైతన్న కుదేలవుతున్నాడు. రుణాలు మాఫీ చేస్తుందని సర్కారుపై పెట్టుకున్న ఆశలు అడియాశలై, కుప్పలా పేరుకున్న అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్నాడు. ఇల్లాలి పుస్తెలమ్మి పంట కోసం తెచ్చుకున్న పురుగుమందు తాగో, సద్దిమూట తగిలించాల్సిన చెట్టు కొమ్మకు ఉరేసుకొనో బలవన్మరణం పొందుతున్నాడు. మరికొందరు గుండె పగిలి మరణిస్తున్నారు. అన్నదాతకు అండగా నిలిచి, సిరులు పండించేలా చేయూతనివ్వాల్సిన సర్కారు.. రైతన్న బలవన్మరణం పొందుతున్నా పట్టించుకోవడంలేదు. వ్యవసాయం దండగ, టూరిజమే పండగన్న సిద్ధాంతంతో దేశదేశాలు తిరిగొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇక్కడి రైతుల గోడు మాత్రం వినిపించడంలేదు. అధికారం కోసం పాదయాత్రలు చేసి, అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఈ ఆర్నెల్లలో రైతన్న కష్టాలను మరింతగా పెంచారు. ‘మీ కోసం’ పాదయాత్రలో రైతుల కష్టాలను కళ్లారా చూశానని, అందుకే అధికారంలోకి రాగా నే రైతుల రుణాలన్నీ సంపూర్ణంగా మాఫీ చేస్తానన్న బాబు.. అధికారం చేపట్టి ఆరు నెలలైనా రైతాంగానికి సాంత్వన చేకూర్చే ఒక్క నిర్ణయం తీసుకోలేదు. తొలి సంతకం అంటూ హడావుడి చేసి రుణమాఫీని మసిపూసి మారేడు కాయ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 87,612 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయకపోగా, వారి ఖాతాలను తగ్గించడంలోనే ఆరు నెలలు సాగదీశారు. దాని పర్యవసానాలను రైతులు ఎదుర్కొంటున్నారు. అప్పులు తీరుతాయని, కొంతలో కొంతైనా భారం తగ్గుతుందని భావించిన రైతాంగానికి, రుణ భారంతో పాటు దానికిప్పుడు అపరాధ వడ్డీ భారం కూడా తోడైంది. మరో వైపు సీజన్ సరిగా లేక , భారంగా మారిన అప్పులు, వడ్డీల సంగతేంటో రైతులు మరింతగా కుంగిపోతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 86 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని, ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని రాజకీయపార్టీలు చెబుతున్నాయి. అసలే కరువు కాటకాలతో తల్లడిల్లే రాయలసీమ జిల్లాల్లో ఈసారి వ్యవసాయదారులకు మరిన్ని ఇబ్బం దులు తలెత్తాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అనంతపురం జిల్లాలోనే 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఖ్య 60కంటే ఎక్కువేనని జిల్లాకు చెందిన ప్రజా సంఘాలు అంటున్నాయి. కర్నూలు జిల్లాలోనూ 33 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కడప జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆరు నెలల్లోనే ఈ స్థాయిలో ఆత్మహత్యలకు పాల్పడటం రైతుల దయనీయస్థితిని తెలియజేస్తోందని ప్రజా సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాయలసీమలోనే కాదు.. ఇంతో అంతో సేద్యం చేయడానికి వీలున్న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోనూ ఇద్దరు రైతులు మరణించారు. పంట నష్టపోయి, అప్పు ఎలా తీర్చాలో తెలియక గుండెచెదిరి కన్నుమూశారు. దక్షిణాది ధాన్యాగారంగా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. నేల రాలుతున్న వారిలో ఎక్కువ మంది బడుగు, బలహీనవర్గాల వారు, సన్న, చిన్నకారు రైతులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా ప్రకటించుకున్న చం ద్రబాబు ఇంతవరకు రైతన్నల ఆత్మహత్యలను మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. ఏ ఒక్క కుటుంబాన్నీ పరామర్శించలేదు. చిల్లి ఏగాణి సాయం ప్రకటించలేదు సరికదా.. ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఎరువుల ధరలపై నోరెత్తరేం? ముఖేష్ అంబానీ కంపెనీకి లబ్ధి చేకూర్చేలా గ్యాస్ ధరను సవరించేందుకు నానా తంటాలు పడిన చంద్రబాబు, ఆయన మిత్రబృందం.. కరెంటు చార్జీలు రెట్టింపు అయినా, ఎరువుల ధర పెరిగినా కిమ్మనరు. పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్టు సొంత పొలంలోనే రైతులు వ్యవసాయ కూలీలుగా మారుతున్నా, గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణాలకు వలసపోతున్నా పట్టించుకోరు. రైతన్నను సంపన్నుణ్ణి చేస్తామం టూ మాటలతో సరిపెడతారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్నే కిందిస్థాయిలో ఉన్న రైతుకు అం దించలేని పాలకులు.. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సుసంపన్నం చేస్తామని నమ్మబలుకుతూ రైతుల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు. సబ్సిడీలకు ఎగనామం పెట్టేందుకే.. గ్రామీణ వ్యవహారాలను నిశితంగా పరిశీలించే ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్ కొద్దికాలం చెప్పిన మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి సరిపోతాయని చెప్పొచ్చు. ‘కార్పొరేట్ కంపెనీ నుంచి వచ్చే ఎంబీఏ గ్రాడ్యుయేట్ రైతు గ్రూపులను ఏర్పాటు చేస్తాడు. వరి, రాగి, మిర్చి, పత్తి ఎలా పండించాలో వ్యవసాయంలో అప్పటికే ఆరితేరిన వారికి సలహాలు ఇస్తాడు. పాఠాలు చెప్తాడు. రైతులకిచ్చే కోట్లాది రూపాయల సబ్సిడీలను బొక్కేందుకు కార్పొరేట్ కంపెనీలు పన్నిన పన్నాగం ఇది’ అంటారు సాయినాధ్. చంద్రబాబు వ్యవహార శైలి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. కార్పొరేట్లకు వంత పాడి, కర్షకుల కడుపు కొడుతున్నారు. అందుకే రైతు ఆత్మహత్యల్ని చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా... ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. పెరిగిన సాగుబడి వ్యయంతో కొట్టుమిట్టాడుతున్న రైతుకు పెట్టుబడి రాయితీ కల్పించాలి. రైతులకు అండగా నిలిచేలా పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. సబ్సిడీలను పెంచాలి. సాగు మెళకువల్ని పెంచేలా పరిశోధనలు జరగాలి. రుణ ప్రణాళికను ప్రకటించి, వ్యవసాయంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంపొందించాలి. అప్పుడే రైతుకు భరోసా కలిగి, ఆత్మహత్యల్ని నివారించగలుగుతాము. గతంలో బాబు హయాంలో 11,952 మంది ఆత్మహత్యలు.. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఏలుబడిలో రైతుల ఆత్మహత్యలు కొత్తేమీ కాదు. సాక్షాత్తు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 11,952 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో దేశంలో రోజుకు 2,000 మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తుంటే, రాష్ట్రంలో ఆ సంఖ్య 375 మందికి చేరింది. ‘సాక్షి నెట్వర్క్’ పరిశీలన ప్రకారం చంద్రబాబు అధికారం చేపట్టిన ఈ ఆరు నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య 86కు చేరింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది జగద్విదితం. రుణ మాఫీపై గంపెడాశలు పెట్టుకున్న రైతాంగం, ఆ హామీ వమ్మయినట్లేనని నిర్ధారణకు వచ్చి, నిస్పృహకు లోనై ఆత్మహత్యల వైపు అడుగు వేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. హక్కుల వేదిక డిమాండ్ ఇది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలపై నిజ నిర్ధారణ చేసిన మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) సమగ్ర రుణ ప్రణాళికను ప్రకటించాలని ఉభయ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఏపీలోని అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై హెచ్ఆర్ఎఫ్ సోమవారమిక్కడ ఓ ప్రకటన చేసింది. ‘చనిపోతున్న వారిలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు, కౌలు రైతులు. ఉభయ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 910 మంది చనిపోయారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోడం వల్ల అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అమలు చేయాల్సిన జీవో 421 ని కూడా అమలు చేయడంలేదు. ప్రతి కుటుంబానికీ ఆర్థిక సాయాన్ని అందజేయాలి. ప్రస్తుతం ఇస్తున్న లక్షన్నరను రూ.5 లక్షలకు పెంచాలి’ అని వేదిక ప్రతినిధులు వీఎస్ కృష్ణ, ఎ. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. -
ఐకేపీ ప్రశ్నార్థకం?
ఎస్‌హెచ్‌జీలకు అందని రుణాలు ఏటా ఎదురు చూపులే ఈ ఆర్థిక సంవత్సరం కూడా మొండిచేయే వడ్డీలేని రుణాలు వట్టిమాటే అంటున్న సభ్యులు హుకుంపేట/అరకురూరల్, న్యూస్‌లైన్: మహిళల ఆర్థిక స్వావలంబనకు స్వ యం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చే బ్యాంకు లింకేజీ ప్రస్తుతం వారి దరి చేరడం లేదు. బ్యాంకర్లు అనేక లింకులు పెడుతున్నా రు. తీసుకున్న రుణానికి ఎక్కువ వడ్డీ పడుతుండడంతో సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళలకు వడ్డీలేని రుణాలిస్తామం టూ ఊదరగొడుతున్న ప్రభుత్వం హామీలు నీటిమూటలవుతున్నాయి. మహిళల్లో సామాజిక చైతన్యం తీసుకువచ్చేందుకు 2005లో మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలు మహోజ్వలంగా వెలిగాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పటిష్టమైన మహిళా సమాఖ్యలు ఏర్పడ్డాయి. మహారాణులు స్థాయికి మహిళలు ఎదిగారు. ఆర్థికంగా ఆసరా పొంది నాలుగు డబ్బులు వెనకేసుకున్నారు. చింత లేకుండా పిల్లలను చదివించుకునేవారు. వ్యవసాయ పనుల మదుపులకు ఇబ్బంది పడేవారు కాదు. మహానేత మరణంతో డ్వాక్రా, స్వయం సహాయక సంఘాల పరిస్థితి తారుమారైంది. ఆశించిన పురోగతి కనిపించడంలేదు. ప్రపంచ బ్యాంకు రుణం ఆగిపోవడంతో ఐకేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. మహిళా స్వయం సహాయక ఉద్యమంలో పంచసూత్రాలు కీలకం. వారంవారం సమావేశాలు, పొదుపు, అంతర్గత అప్పులు, తిరిగి చెల్లింపులు, పస్తకాల సక్రమ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉపాధిహామీతో అనుసంధానం చేసి కూలీలకు నగదు పంపిణీ బాధ్యతలను మహిళా సమాఖ్యలకు అప్పగిస్తే వాటి ఆదాయం మెరుగుపడే అవకాశముంది. తమ కార్యకలాపాలను తామే నిర్వహించుకునే సత్తాలేనప్పుడు ఈ సమాఖ్యలు నిలబడడం కష్టం. ఉదాహరణకు అరకులోయ మండలంలో 48 గ్రామైక్య సంఘాలు, 818 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీటిలో కేవలం 65 స్వయం సహాయక సంఘాలకు మాత్రమే బ్యాంకు లింకేజీ రుణాలు రూ. 1.18 కోట్లు అందించారు. 2013-14వ సంవత్సరానికి 168 సంఘాలకు రూ 2.31కోట్లు పంపీణి చేయాల్సి ఉండగా కేవలం 31 స్వయం సహాయక సంఘాలకు రూ. 48,12 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది స్త్రీ నిధి నిధుల మంజూరుకు గ్రేడింగ్ జాబితా సిద్ధం చేయలేదంటే ఐకేపీ అధికారులు, సిబ్బంది పనితీరు అర్థమవుతోంది. ఆర్థిక ఆసరా పథకం కింద గతేడాది దరఖాస్తులు తీసుకున్నప్పటికీ పాడేరు ఐటీడీఏ ఏ ఒక్క మహిళా సంఘానికి రుణాలు ఇవ్వలేదు.