ఏలూరు: ఫ్లెక్సీల వివాదంలో తాడేపల్లిగూడెం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ వివాదంలో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సత్యనారాయణ అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.
మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఒత్తిడి మేరకే సత్యనారాయణను అరెస్ట్ చేశారంటూ వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఐని బండ బూతులు తిట్టిన మంత్రి మాణిక్యాలరావును వదిలి.. సత్యనారాయణను అరెస్ట్ చేయడమేంటంటూ వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఫ్లెక్సీల వివాదంలో పోలీసుల అత్యుత్సాహం
Published Sat, Oct 22 2016 11:58 AM | Last Updated on Tue, Oct 9 2018 5:03 PM
Advertisement
Advertisement