![AP Government Key Decision On Priest Welfare - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/7/cm-ys-jagan_15.jpg.webp?itok=5Tus9iUa)
సాక్షి, అమరావతి: అర్చకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అర్చక సంక్షేమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు వంద శాతం వైద్య ఖర్చులు తిరిగి చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు.
తక్షణమే అమల్లోకి వచ్చేలా అధికారులను మంత్రి ఆదేశించారు. అర్చకుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అర్చకులకు వంద శాతం వైద్య ఖర్చులు చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. దీని ద్వారా అర్చకులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు.
చదవండి: కోల్డ్ స్టోరేజ్ నేతలంతా చేరి ప్రభుత్వంపై విమర్శలా: అమర్నాథ్
Comments
Please login to add a commentAdd a comment