expenses
-
పదేళ్ల ముందు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఖర్చు ఎంతో తెలుసా?
భారత్ లో ఇంటి ఖర్చులు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. గత దశాబ్ధ కాలంగా ఇది ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో 2011-12 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో తలసరి నెలవారీ గృహ వ్యయం రెట్టింపుకు పైగా పెరిగిందనే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) తాజా సర్వే గణాంకాలు చెబుతున్నాయి. గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) పేరుతో 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య కాలంలో ఈ సర్వే జరిగింది. ఇందులో భారత్‌లో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.2,630 ఉండగా, 2022-23 నాటికి రెట్టింపు పెరిగి రూ.6,459కి చేరింది. గ్రామీణ కుటుంబాల ఖర్చులు కూడా ప్రస్తుత ధరల ప్రకారం 2012 ఆర్థిక సంవత్సరంలో రూ .1,430 నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .3,773 కు పెరిగాయి. 2011-12 ధరల వద్ద సగటు ఎంపీసీఈ 2012 ఆర్థిక సంవత్సరంలో రూ.2,630 నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .3,510కు పెరిగింది. 2012 ఆర్థిక సంవత్సరంలో రూ .1,430 ఉండగా 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.2,008కి చేరింది. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత ధరల ప్రకారం 2012 ఆర్థిక సంవత్సరంలో రూ.2,630గా ఉన్న సగటు ఎంపీసీఈ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.6,521కి, గ్రామీణ ప్రాంతాల్లో 2012 ఆర్థిక సంవత్సరంలో రూ.1,430 ఉంది. ఆ మొత్తం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.3,860కి చేరింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన కేంద్ర నమూనాలో గ్రామీణ ప్రాంతాల్లో 1,55,014 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 1,06,732 గృహాలతో కలిపి మొత్తం 2,61,746 ఇళ్ల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా వ్యయాల అంచనాలను లెక్కించారు. గణాంకాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వరుసగా మొదటి వినియోగదారుల వ్యయ సర్వే (సిఇఎస్) ఇది, రెండవది ప్రస్తుతం ఆగస్టు 2023 నుండి 12 నెలల కాలానికి కొనసాగుతోంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ), ప్రధాన ద్రవ్యోల్బణ రేటును అర్థం చేసుకోవడానికి ఈ సర్వే ముఖ్యమైనది. -
ట్వీట్లతో రెచ్చిపోండి.. యూజర్లకు మస్క్ బంపరాఫర్
‘ట్వీట్లతో రెచ్చిపోండి.. దీని వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురై లీగల్‌గా అయ్యే ఖర్చులు నేను చూసుకుంటా’ అంటున్నారు ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఇలా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పలు అంశాలపై వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆయా కంపెనీల యాజమాన్యాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు ఆయా కంపెనీలు లీగల్‌గానూ ఉద్యోగులను ఇబ్బందులు పెడుతుంటాయి. అలాంటి వారికి అండగా నిలుస్తామని మస్క్ ప్రకటించారు. ఎక్స్ ప్లాట్ఫామ్లో ట్వీట్లు చేసే, లైక్ కొట్టే, కామెంట్లు చేసే ఉద్యోగులను వారి యాజమాన్యాలు, కంపెనీలు లీగల్‌గా వేధిస్తే దానికి ఎదుర్కొనేందుకు యూజర్లకు అండగా నిలుస్తామని, అందుకయ్యే మొత్తాన్ని భరిస్తామని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. ఇందుకు ఎటువంటి పరిమితి లేదని, అటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దీనిపై అధిక సంఖ్యలో యూజర్లు ప్రతిస్పందించారు. మస్క్‌ను పొడగ్తలతో ముంచేస్తూ కామెంట్లు పెట్టారు. ట్విటర్ ఇటీవల దాని ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను తొలగించి దాని స్థానంలో ‘ఎక్స్’ను తీసుకొచ్చింది. ట్విటర్‌ను పూర్తిగా రీబ్రాండ్ చేసే ప్రయత్నంలో భాగంగా దాని అధినేత మస్క్ ఈ మార్పు చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న మంత్లీ యూజర్లు 540 మిలియన్లకు పైగా పెరిగారంటూ చూపించే గ్రాఫ్ షేర్ చేస్తూ "కొత్త గరిష్టానికి" చేరుకున్నట్లు ప్రకటించారు. Zuck × Musk fight: ‘జుక్ × మస్క్’ కుబేరుల కోట్లాట లైవ్.. ఆ ఆదాయంతో.. ఇలా మస్క్ ఓ వైపు కంపెనీలో సంస్థాగత మార్పులు చేసుకుంటూ పోతుంటే మరోవైపు దీనికి పోటీగా మెటా థ్రెడ్స్ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాని నుంచి పోటీని ఎదుర్కొనేందుకు తమ యూజర్లకు మస్క్ ఈ ప్రకటించినట్లు తెలుస్తోంది. యాక్టివ్ యూజర్లు పెరిగినప్పటికీ ప్రకటనల ఆదాయంలో తగ్గుదల కారణంగా ప్రతికూల నగదు ప్రవాహం ఎదుర్కొంటున్నట్లు మస్క్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. If you were unfairly treated by your employer due to posting or liking something on this platform, we will fund your legal bill. No limit. Please let us know. — Elon Musk (@elonmusk) August 6, 2023 -
అంతర్జాతీయ క్రెడిట్ కార్డులపై ఆర్బీఐ గురి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రయాణ సమయాల్లో వ్యయాలకు సంబంధించి అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల (ఐసీసీ) వినియోగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెమిటెన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) పరిధిలోకి తీసుకుని వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన దీని ప్రకారం అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా విదేశీ మారకంలో చేసే వ్యయాలు ఇకపై ఎల్ఆర్ఎస్ పరిధిలోకి వస్తాయి. ఒక రెసిడెంట్ రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా సంవత్సరానికి గరిష్టంగా 2.5 లక్షల డాలర్ల వరకూ వ్యయం చేసే అవకాశం ఏర్పడింది. 2.5 లక్షల డాలర్లు, లేదా మరేదైన విదేశీ కరెన్సీలో దానికి సమానమైన మొత్తానికి మించిన చెల్లింపులకు (రెమిటెన్స్) ఆర్బీఐ నుంచి అనుమతి అవసరం అవుతుంది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ఎల్ఆర్ఎస్లో చేర్చడానికి సంబంధించి విదేశీ మారక నిర్వహణ (కరెంట్ అకౌంట్ లావాదేవీలు) (సవరణ) రూల్స్, 2023ని మంత్రిత్వ శాఖ మే 16న నోటిఫై చేసినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్బీఐతో సంప్రదింపులతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
ఇదేం పోకడ! ఖర్చు ఎక్కువ అవుతోందని.. బిడ్డకు పురుగులు తినిపిస్తున్న తల్లి
ప్రజలకు ఆరోగ్య స్పృహ గతంలో కంటే మరింత పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల అనంతరం ఇమ్యూనిటీ విషయంలో జాగ్రత్తలు అధికమయ్యాయి. ఇక కొందరేమో పర్యావరణ హితంగా జీవనం ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా వీగన్లుగా మారిపోతున్నారు. అయితే, కెనాడాకు చెందిన టిఫానీ అనే ఫుడ్ బ్లాగర్ షేర్ చేసుకున్న ఓ విషయం మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. తన 18 నెలల కూతురుకు ఏకంగా ఆమె మిడతలను తినిపిస్తోంది. అదేంటి? చిన్న పిల్లకు మిడతలు ఆహారంగా ఇవ్వడమేంటని ముక్కున వేలేసుకున్నారా? నిజంగా ఇది నిజం! ఖర్చుల భారం.. అందుకే.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. వారానికి 250 నుంచి 300 డాలర్లు (సుమారు రూ.25000) సరుకులకు ఖర్చవుతోందని, అందుకనే తన బిడ్డకు ప్రోటీన్ సప్లిమెంట్ కోసం వినూత్నంగా ఆలోచించానని వెల్లడించింది. మిడతల్లో (క్రికెట్స్) విలువైన ప్రోటీన్ ఉంటుందని, తన బేబీకి అవి తినిపించి వాటిని భర్తీ చేస్తున్నానని టిఫానీ వివరించింది. డబ్బులు ఆదా అవడంతో పాటు పాపకు అవసరమైన ప్రోటీన్ అందుతోందని ఆమె పేర్కొంది. కీటక శాస్త్రంపై తనకున్న అవగాహన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తాను కూడా సాలెపురుగు నుంచి తేలు వరకు పలు కీటకాలను గతంలో రుచి చూశానని పేర్కొంది. థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో పర్యటించినప్పుడు చీమలు, మిడతలను తిన్నానని చెప్పుకొచ్చింది టిఫానీ. అక్కడి ప్రజల జీవన విధానంలో కీటకాలను తినడం మామూలేనని వెల్లడించింది. (చదవండి: 69 క్యాన్ల సోడాలు హాంఫట్) ఇలాంటి ప్రయోగాలు అవసరమా? మిడతలతో తయారు చేసిన పఫ్‌లు, ప్రోటీన్ పౌడర్‌ను తన బిడ్డకు అందిస్తునన్నాని టిఫానీ చెప్పింది. బీఫ్, చికెన్, పంది మాంసంలో ఉండే ప్రోటీన్లకు బదులు మిడతలపై ఆధారపడటంతో వారానికి అయ్యే ఖర్చులో 100 డాలర్ల వరకు ఆదా అవుతోందని పేర్కొంది. అయితే, టిఫానీ చర్యను సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు తప్పుబడుతున్నారు. చిన్న పిల్లపై ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అని హితవు పలుకుతున్నారు. మరికొందరేమో కొత్త ఐడియా బాగానే ఉందిగానీ, చిన్నారికి ఇదో రకమైన శిక్ష కదా! అంటూ కామెంట్ చేశారు. ఏదైనా పాపకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అయితే, తన కూతురు కొత్త రకమైన ఆహారాన్ని స్వీకరించడంలో ఎలాంటి బెరుకు, భయం కనబర్చదని టిఫానీ పేర్కొనడం గమనార్హం. అందువల్లే తమ ఆహారం కానిదైనప్పటికీ ఆమె తింటోందని వివరణ ఇచ్చింది. దాంతోపాటు.. పీడియాట్రిక్ డైటీషియన్ వీనస్ కలామి ప్రకారం.. 6 నెలల వయసు తర్వాత పిల్లలకు ఆహారంలో పురుగులు, కీటకాలు భాగం చేస్తే తినే తిండి పట్ల పాజిటివ్ దృక్పథం అలవడుతుందని పేర్కొంది. (చదవండి: వింత ఘటన: విడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకుంది..ఫోటోషూట్ చేసి మరీ..) -
ఖర్చులో ఖర్చు.. ఎంత ఖర్చయినా సరే ఈ సారి మనమే గెలవాలి సార్!
ఖర్చులో ఖర్చు.. ఎంత ఖర్చయినా సరే ఈ సారి మనమే గెలవాలి సార్! -
గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్.. అసలేం జరిగిందంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఇకపై వారికి అందించే ఫ్రీ స్నాక్స్, లంచ్, మసాజ్, లాండ్రీతో పాటు ఇతర సౌకర్యాల్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌లో పనిచేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఆహ్లాదకర వాతావరణం, జీత భత్యాలు, ఉద్యోగులకు అందించే సౌకర్యాలు, ఇతర ప్రోత్సహాకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేసే వారికి సొసైటీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకే గూగుల్ ఉద్యోగం అంటే ఎగిరి గంతేస్తుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ప్రథమ స్థానంలో ఉన్న గూగుల్ ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితిని తట్టుకొని నిలబడాలంటే ఉన్న డబ్బును పొదుపుగా వాడుకొని..దూబారా ఖర్చుల్ని తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో ఇప్పటి వరకు ఉద్యోగులకు అందించిన అన్నీ ప్రోత్సాహకాల్ని రద్దు చేసింది. నియామకాల్ని తగ్గించి డబ్బుల్ని ఆదా చేస్తోంది. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ ఈ సందర్భంగా గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ మాట్లాడుతూ..సంస్థ అధిక ప్రాధాన్యత కలిగిన పనులపై మాత్రమే డబ్బుల్ని సమర్థవంతంగా వినియోగించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రోత్సాహకాల నిలిపి వేతపై ఉద్యోగులకు గూగుల్ మెమో జారీ చేసింది. హైరింగ్ ప్రాసెస్‌ను నిలిపివేసి ఉద్యోగుల్ని అధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్‌లపై పనిచేసేలా రీలొకేట్ చేయనున్నట్లు బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక తెలిపింది. ఉద్యోగులకు అందించే ల్యాప్‌ట్యాప్‌లను తిరిగి వెనక్కి తీసుకోవడంతో పాటు, ఆఫీస్ లొకేషన్ అవసరాలు, ప్రతి ఆఫీస్ స్పేస్‌లో కనిపించే ట్రెండ్ల ఆధారంగా ప్రొత్సహకాల్ని సర్ధుబాటు చేయాల్సి వస్తుందని పోరాట్ తెలిపినట్లు నివేదిక పేర్కొంది. మైక్రో కిచెన్ల అవసరం ఎంత వరకు ఉందనే విషయంపై స్పష్టత వచ్చిన వెంటనే వాటిని మూసివేయడం, వినియోగానికి తగ్గట్లు ఫిట్నెస్ క్లాసుల్ని షెడ్యూల్ చేయడం పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వాడాకాన్ని తగ్గించి డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టేందుకు సిద్ధమైనట్లు బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక హైలెట్ చేసింది. కొన్ని సర్ధుబాట్లు తప్పవ్ ఇక తాజా గూగుల్ నిర్ణయంపై ‘సంస్థ ఇచ్చే ప్రోత్సహాకాల్ని ఇష్టపడే ఉద్యోగులకు ఈ నిర్ణయం అసంతృప్తి కలిగించవచ్చు. కానీ కంపెనీకి నిధులను ఆదా చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా అధిక ప్రాధాన్యత కలిగిన ఇతర రంగాలపై దృష్టిసారించడం తప్పనిసరి. ముఖ్యమైన ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు, సౌకర్యాలను అందించడం కొనసాగిస్తుంది. అయితే కంపెనీ తన వనరుల విషయంలో బాధ్యతాయుతంగా ఉండేందుకు కొన్ని సర్ధుబాట్లు చేయబడతాయి అంటూ గూగుల్ ప్రతినిధి ర్యాన్ లామోన్ గిజ్మోడోకి చెప్పారు. చదవండి👉 గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తొందరపాటు.. ఏకిపారేస్తున్న సొంత ఉద్యోగులు! -
అర్చకులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి: అర్చకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అర్చక సంక్షేమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు వంద శాతం వైద్య ఖర్చులు తిరిగి చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా అధికారులను మంత్రి ఆదేశించారు. అర్చకుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అర్చకులకు వంద శాతం వైద్య ఖర్చులు చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. దీని ద్వారా అర్చకులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. చదవండి: కోల్డ్ స్టోరేజ్ నేతలంతా చేరి ప్రభుత్వంపై విమర్శలా: అమర్నాథ్ -
సరిలేరు మాకెవ్వరూ... అనవసర ఖర్చుల్లో ‘ గ్రేటర్’
జీహెచ్ఎంసీ మేయర్ క్యాంప్ కార్యాలయానికి (ఇంటి వద్ద) కానోపి షెడ్ నిర్మాణం కోసమంటూ దాదాపు రూ. 4.18 లక్షల అంచనా వ్యయంతో టెండరు పిలిచారు. ఇలా జీహెచ్ఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్, తదితరులు తాము ఏవి కావాలనుకుంటే అవి చేయించుకుంటున్నారు. ఓవైపు జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా.. వారు మాత్రం దేనికీ వెనుకాడటం లేరు. ప్రస్తుత పరిస్థితికి ఇది ఓ మచ్చుతునక ! – సాక్షి,సిటీబ్యూరో బల్దియా అంటే అంతే మరి.. జీహెచ్ఎంసీ ఖజానాలో చేరాల్సిన సొమ్మును ఉద్యోగులు సొంతానికి వాడుకుంటారు. ఇతర శాఖల్లో పనిచేసినప్పుడు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించినా ఎలాంటి వాహనం లేనివారికి ఇక్కడికి రాగానే వాహనం వచ్చి వాలుతుంది. ఇక ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యులైతే బల్దియా భవనాన్ని తమ సొంత ఇల్లే అనుకుంటారు. ఇంటికైనా రంగులు వేయాలనుకుంటే వెనుకాముందు కాస్త ఆలోచిస్తారేమో కానీ.. ఇక్కడ మాత్రం బాగున్నవాటిని సైతం కూలగొట్టి గొప్పగా కట్టించుకుంటారు. ఇలా ఎందుకంటే.. ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. వ్యయానికి నిధుల పరిమితి లేదు. అందుకే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సైతం ఖరీదైనవి కొంటారు. పాలకమండలి కొత్తదా, పాతదా అన్న తేడా లేదు. పదవి పోయాక వాటికి ఇంటికి తీసుకెళ్తారు. అధికారులూ ఆడంబరాలకు పోతారు. చేసిన అప్పులకు రోజుకు సగటున కోటి రూపాయల వడ్డీ కడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ దర్పం ఏమాత్రం తగ్గకుండా బాగున్నవి కూల్చి కొత్తగా కడుతుండటం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవచ్చుకానీ.. వారికవి మామూలే. ప్రధాన కార్యాలయ భవనంలో గత రెండు మూడేళ్లుగా ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణ పని జరుగుతూనే ఉంది. కాళేశ్వరం, మిషన్ భగీరథల వంటి ప్రాజెక్టులు, ఎన్నో ఫ్లై ఓవర్లు పూర్తయినా.. ఇక్కడ ఎప్పుడూ ఏదో పని జరుగుతూనే ఉంటుంది. అందుకు కారణం .. వారికే తెలుసు. ఇక పనులే కాదు.. ఏవిషయంలోనూ ఖర్చులకు వెనుకాడరు. టీ , బిస్కెట్ల నుంచి ఉత్సవాల నిర్వహణల వరకు ఖర్చు గ్రాండ్‌గా ఉండాల్సిందే. పాత పాలకమండలి.. కొత్త పాలకమండలి.. అప్పటి అధికారులు, ఇప్పటి అధికారులు అనే తేడా ఏం లేదు. అందరూ అతిరథులే.. ఖర్చుల మహారథులే. చెప్పుకుంటే.. ఎంతెంతో.. ► బల్దియాలో చాలామంది ఘనాపాటీలే. జీహెచ్ఎంసీ ఏర్పాటయ్యాక తొలి పాలకమండలి (2009–14)లో రెండు పార్టీల ఫ్లోర్‌లీడర్లు బల్దియాకు చెందిన సోఫాలు, జనరేటర్లు వంటివి సైతం ఇళ్లకు తరలించుకు వెళ్లారు. వారి కార్యాలయాల్లో ఉన్న వాటిని తమ పదవి పోగానే వాటిని సైతం ఇళ్లకు తీసుకెవెళ్లారు. ► కాగిత రహిత పాలన కింద ల్యాప్‌టాప్‌లు తీసుకొని తిరిగి ఇచ్చేయని వారెందరో. ► అధ్యయన యాత్రల పేరిట..వాటికి వెళ్లకుండానే అందుకయ్యే ఖర్చు దాదాపు లక్ష రూపాయలకు పైగా సొంత జేబుల్లో వేసుకున్నవారున్నారు. ప్రస్తుత పాలకమండలి అయితే.. ► మేయర్ క్యాంప్ కార్యాలయంలో(ఇంట్లో) కరెంట్ లేదంటూ భారీ ఇన్వర్టర్ను కోరడం రచ్చ కావడంతో వెనక్కు తగ్గారు. ► డిప్యూటీ మేయర్ కార్యాలయం ఆధునీకరణ చేపట్టారు. గత డిప్యూటీ మేయర్ కంటే తక్కువేం కాదంటూ రూ. 20 లక్షలు ఖర్చుచేస్తున్నారు. గత పాలక మండలి కూడా తక్కువేం కాదు.. ► గత పాలకమండలి(2016–21)లో డిప్యూటీ మేయర్ చాంబర్ ఆధునీకరణ పేరిట దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేశారు ► ఖరీదైన సెల్ఫోన్లు పాలక మండలి సభ్యులతోపాటు మేయర్ పేషీల్లోని ఉద్యోగులు సైతం పొందారు. ► మేయర్ కోసం ఒకటో అంతస్తులో ఒక చాంబర్ ఉండగా, పైన ఏడో అంతస్తులో మరొకటి ఏర్పాటు చేసుకున్నారు. అధికారులూ అంతే.. ► బాగున్న పన్వర్హాల్ను ఆధునీకరణ పేరిట లక్షలు ఖర్చు చేసి.. అసౌకర్యంగా మార్చారు. ► ప్రతి సోమవారం ప్రజావాణి, ఫేస్ టూ ఫేస్ వంటి కార్యక్రమాలేవీ లేకున్నా హాస్పిటాలిటీ ఖర్చులు మాత్రం భారీగా పెరిగాయి. పన్వర్ హాల్లో విలేకరుల సమావేశం పెట్టినా రూ. 20వేలు ఖర్చు చూపిస్తారు. ► ఎంతో మోజుపడి అద్దంలా చాంబర్లకు హంగులదుకున్న అధికారులు.. ఆ చాంబర్ల సౌఖ్యం పొందకుండానే బదిలీ అయి వెళ్లడం విచిత్రం. ► ఒక విభాగం ఆధునీకరణ పనుల కోసం దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. కొన్ని విభాగాల పనులుఇంకా జరుగుతున్నాయి. ► చెప్పుకుంటూ పోతే.. బల్దియాలో ఇలాంటిచిత్రవిచిత్రాలింకా ఎన్నెన్నో ! పొదుపు పాటించాలి.. దుబారా ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించాలి. ప్రస్తుతం నెలనెలా జీతాల చెల్లింపులకే ఇబ్బందులు పడుతున్న తరుణంలో వృథా ఖర్చుల్ని నిలిపివేస్తే మేలు. ప్రజలు చెల్లించిన పన్నుల నిధుల్ని ప్రజా సదుపాయాలకు వాడాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బల్దియా చట్టంలో ఖర్చు చేయొచ్చని లేదు.. మేయర్, డిప్యూటీ మేయర్ల చాంబర్లకు ఖర్చుచేయాలని బల్దియా చట్టంలో లేదు. క్యాంప్ కార్యాలయ నిర్వహణకు ఖర్చు చేసుకోవచ్చుననీ లేదు. ఫ్లోర్‌లీడర్లు, వారికి కార్యాలయాలు, ఫర్నీచర్ వంటివి లేవు. హోదాకు తగ్గట్లు ఉండేందుకు గౌరవంతో చేసేవి మాత్రమే. – సీనియర్ అధికారి, జీహెచ్ఎంసీ మీసాలకు సంపెంగనూనె.. మింగ మెతుకు లేకున్నా.. మీసాలకు సంపెంగనూనె అన్నట్లుంది జీహెచ్ఎంసీ వ్యవహారం. జీహెచ్ఎంసీలో నిధులు లేక అభివృద్ధి కుంటుపడింది. బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. అయినా ఆడంబర ఖర్చులు, దుబారా వ్యయం తగ్గించుకునే పరిస్థితిలో లేరు. చాంబర్ల మార్పులు, అనవసర రిపేర్లు, వాహనాల వినియోగం, లగ్జరీ ఐటెమ్స్ కొనుగోలు, ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తగ్గకపోగా, పెరుగుతున్నాయి. అవినీతి పెచ్చరిల్లి పోతున్నది. – ఎం. శ్రీనివాస్, సీపీఎం నగర కార్యదర్శి సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి నిర్మించాలి బల్దియా కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కడితే ఎంతో ప్రయోజనం. పారిశుధ్య కార్మికుల స్వేదంతోనే నగరం పరిశుభ్రంగా ఉంటుంది. కోట్లకు కోట్ల దుబారా ఖర్చుల్ని తగ్గించాలి. డిప్యుటేషన్ మీద వచ్చి పాతుకుపోయిన వారిని మాతృసంస్థలకు పంపించాలి. – యు.గోపాల్, అధ్యక్షుడు, జీహెచ్ఎంఈయూ చదవండి: అంతా మీ ఇష్టమైపోయింది.. పిలవని కార్యక్రమానికి రాలేను.. -
లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ ఖర్చు వైఎస్సార్సీపీదే
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిర్ణయించిన వ్యయం కన్నా తక్కువ ఖర్చు చేసిన ప్రధాన పార్టీల్లో వైఎస్సార్సీపీ తొలిస్థానంలో నిలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 543 మంది ఎంపీలకుగానూ 538 మంది అఫిడవిట్లలో పొందుపరిచిన వ్యయాలను ఎలక్షన్ వాచ్/ఏడీఆర్ సంస్థ ప్రకటించింది. ఎన్నికల ఖర్చు వివరాలు ప్రకటించని ఐదుగురు ఎంపీల్లో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఉన్నారు. వీరి వ్యయం వివరాలు లభ్యం కాలేదని సంస్థ వెల్లడించింది. మాధవి ఖర్చు రూ.14.12 లక్షలు ఎన్నికల ఖర్చులో వైఎస్సార్ సీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి 537వ స్థానం(రూ.14.12 లక్షలు), బల్లి దుర్గాప్రసాదరావు 535వ స్థానం (రూ.15.06 లక్షలు), బెల్లాన చంద్రశేఖర్ 533వ స్థానం (రూ. 15.83 లక్షలు), చింతా అనూరాధ 532వ స్థానం (రూ.16,74 లక్షలు), భీశెట్టి వెంకట సత్యవతి 531వ స్థానం(రూ.17.66 లక్షలు)లో ఉన్నారు. అనంత్‌నాగ్‌లో అత్యధికంగా.. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ఖర్చు పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షలుగా కమిషన్ నిర్ణయించింది. అత్యధికంగా ఖర్చు (నిబంధనల కంటే ఎక్కువగా) చేసినవారిలో హస్నైన్ మసూది (అనంతనాగ్, జమ్మూ కశ్మీర్, జేకే నేషనల్ కాన్ఫరెన్స్) రూ.79,27,920తో తొలిస్థానంలో నిలవగా రూ.77,95,916తో గోరఖ్‌పూర్ బీజేపీ సభ్యుడు రవికిషన్ రెండో స్థానంలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. శివసేన తరువాత టీఆర్ఎస్... ఎన్నికల వ్యయం వివరాలను వెల్లడించిన 538 మంది ఎంపీల సరాసరి ఖర్చు రూ.50.84 లక్షలని కమిషన్ పేర్కొంది. ఎంపీ అభ్యర్థి ఖర్చు విషయంలో పార్టీల వారీగా చూస్తే శివసేన (18 మంది ఎంపీలు) రూ.59.26 లక్షల సరాసరి ఖర్చుతో తొలిస్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ (9 మంది ఎంపీలు) రూ.57.85 లక్షల సరాసరి ఖర్చుతో ద్వితీయ స్థానంలో ఉంది. వైఎస్సార్ సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి ఎన్నికల వ్యయంలో సొంత డబ్బులు రూ.13,500 కాగా రూ.6,65,580 పార్టీ నుంచి అందించగా రూ.7,33,100 ఇతరత్రా విరాళాల రూపంలో సమకూరాయి. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వ్యక్తిగత డబ్బులు రూ.28,500 కాగా పార్టీ విరాళం రూ.49,99,693. -
ఎన్నికల వ్యయాన్ని సవరించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల వ్యయాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. లోక్‌సభ ఎన్నికలకు రూ. 77 లక్షలు, అసెంబ్లీ ఎన్నికలకు రూ. రూ.30.80 లక్షలు ఎన్నికల వ్యయంగా నిర్ణయించింది. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలో సవరణ చేసినట్లు కేంద్రం పేర్కొంది. సవరించిన నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయన్న కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఇంటి పద్దు.. అతిగా వద్దు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతోంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక విధానంలో భారీ కష్టాలు మొదలవుతున్నాయి. సగటు వేతన జీవికి ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్ 14 వరకు తొలివిడత లాక్డౌన్ పూర్తయింది. అనంతరం రెండో విడత లాక్డౌన్ ఈ నెల 14 నుంచి మే 7 వరకు పెరిగింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టేంత వరకు లాక్డౌన్ ఒక్కటే సరైన మార్గమని ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గకుంటే లాక్డౌన్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో మధ్యతరగతి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. లాక్డౌన్ పొడిగిస్తే తలెత్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు వేతన జీవి కుటుంబం సన్నద్ధమవుతోంది. మరింత పక్కాగా ఖర్చులు.. పేద, మధ్యతరగతి వర్గాల్లో భవిష్యత్ అవసరాల కోసం చేసే పొదుపు అంతా నెలవారీ ఖర్చులపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వేతన జీవికి నెలకొచ్చే జీతంపై సందిగ్ధం నెలకొంది. లాక్డౌన్ కారణంగా చాలా రంగాలు మూతబడ్డాయి. రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారిపై కూడా లాక్డౌన్ ప్రభావం పడింది. ఈ క్రమంలో ఖర్చులు భారీగా తగ్గించుకుంటే మేలని భావిస్తున్నారు. ముఖ్యంగా అదనపు ఖర్చులను పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఆహార పద్ధతుల్లో కూడా అనవసర ఖర్చును తగ్గించుకుంటున్నారు. చిరుతిళ్లకు చెక్ పెట్టి సాదాసీదా తిండికి అలవాటు పడుతున్నారు. కొందరిలో లాక్డౌన్ కారణంగా కిరాణా సరుకులు సైతం దొరకవనే భావన కనిపిస్తోంది. దీంతో అవసరానికి మించి ఎక్కువ కొనుగోళ్లు చేస్తున్నారు. తొలిదశ లాక్డౌన్లో ఎక్కువ శాతం కుటుంబాలు ఇలాగే కొనుగోళ్లు చేయడంతో చాలా దుకాణాలు సరుకులు లేక వెలవెలబోగా... ధరలు సైతం అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిరాణా సరుకులకు కొరత లేదు. దీంతో అవనసర ఖర్చును పూర్తిగా తగ్గించి పరిమితంగా కొనుగోళ్లు చేస్తే మంచిదని భావిస్తున్నారు. చెల్లింపుల భారం ఎలా.. లాక్డౌన్ కారణంగా బ్యాంకుల వద్ద తీసుకున్న రుణ చెల్లింపులపై ప్రభుత్వం మారటోరియం విధించింది. దీంతో మూడు మాసాల వరకు రుణ వాయిదాల చెల్లింపులు చేయాల్సిన పనిలేదు. అయితే ఈ మొత్తాన్ని లాక్డౌన్ తర్వాత చెల్లించాల్సిందే. అయితే అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇంతకు ముందున్న పరిస్థితే ఉంటుందా? అనే సందిగ్ధం సర్వత్రా నెలకొంది. దీంతో వాయిదాల చెల్లింపులను కట్టేద్దామనే ఆలోచనలో పడ్డారు. బ్యాంకింగ్ రంగంలో రుణాల మారటోరియం ఉండగా.. ప్రైవేటు అప్పులు, నెలవారీ చీటీలు, ఇతర సేవింగ్స్ పథకాలు, రుణ వాయిదాలపై ఎలాంటి మారటోరియం లేదు. దీంతో ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకుని ఆ మొత్తాన్ని అప్పులు చెల్లిస్తే ఇబ్బంది ఉండదనే అభిప్రాయం మధ్యతరగతి వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రెండు నెలల వరకు పాఠశాలలు తెరిచే అవకాశం లేకపోవడంతో స్కూల్ ఫీజులకు వెచ్చించే మొత్తాన్ని ఇతర రుణ చెల్లింపులపై ఖర్చు చేస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్లు మొదలు.. రుణ వాయిదాల చెల్లింపులు.. నిర్వహణ ఖర్చుల్లో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో కుటుంబ ఆర్థిక వ్యవస్థ కొత్త బాట పడుతోంది. లాక్డౌన్ కాలంతో పాటు అనంతర పరిస్థితుల ఆధారంగా బతుకు బండి ప్రయాణం సాగుతుంది. -
సన్‌ఫార్మా : అంచనాలు మిస్
సాక్షి, ముంబై: ఫార్మా దిగ్గజం సన్ ఫార్యాస్యూటికల్స్ నిరాశాజనక క్యూ3 ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్ క్వార్టర్లో నికరలాభం 26 శాతం తగ్గి 913.52 కోట్ల డాలర్లకు చేరుకుంది. గత క్యూ3లో రూ.1,242 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.914 కోట్లకు తగ్గిందని సన్ ఫార్మా తెలిపింది. వ్యయాలు రూ.6,203 కోట్ల నుంచి రూ.6,923 కోట్లకు పెరగడం వల్ల నికర లాభం తగ్గిందని సన్ ఫార్మా ఎండీ దిలిప్ సంఘ్వి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.7,657 కోట్ల నుంచి రూ.8,039 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. భారత్‌లో బ్రాండెడ్ వ్యాపారం బాగా ఉందని, క్యూ 3 తో పాటు తొమ్మిది నెలల కాలానికి రెండంకెల వృద్ధిని సాధించిందని సంఘ్వి తెలిపారు. ఆంకాలజీ ఉత్పత్తులకు చైనాలోని ఆస్ట్రాజెనెకాతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా కొత్త మార్కెట్లలో తమ పోర్ట్‌ఫోలియోను పెంచుకోనున్నామన్నారు. ఏఐఓసీడీ అవాక్స్ డిసెంబర్, 2019 నివేదిక ప్రకారం భారత ఫార్మా మార్కెట్లో అగ్రస్థానం తమ కంపెనీదేనని, రూ1.4 లక్షల కోట్ల మార్కెట్లో 8.2 శాతం మార్కెట్ వాటా తమ చేతిలోనే ఉందని పేర్కొన్నారు. -
ఆర్టీసీకి ప్రభుత్వం ఎక్కువే ఇచ్చింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువగానే ఆర్టీసీకి చెల్లించిందని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ హైకోర్టుకు నివేదించారు. ఆర్టీసీకి ప్రభుత్వ బకాయిల చెల్లింపులతోపాటు జీహెచ్ఎంసీ చేసిన చెల్లింపులపై నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సునీల్‌శర్మ ఈ మేరకు కౌంటర్ దాఖలు చేశారు. 2018– 19 సంవత్సరానికి రాయితీ కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం రూ.644.51 కోట్లుకాగా ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు లభిస్తున్నప్పటికీ ఆర్టీసీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉందన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో బస్సులను తిప్పడం వల్ల వచ్చిన నష్టాల భర్తీకి రూ.1,786.06 కోట్లను తిరిగి చెల్లించాలని జీహెచ్ఎంసీని ఆర్టీసీ కోరిందన్నారు. జీహెచ్ఎంసీ 2015–16, 2016– 17కు కలిపి రూ. 336.40 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు. ఆర్టీసీ కోరుతున్న మొత్తాలను చెల్లించే పరిస్థితిలో లేమంటూ జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వంగా పలు తీర్మానాలు పంపిందని వివరించారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి ఆధారంగానే ఎప్పటికప్పుడు చెల్లింపులు ఉంటాయని, వాటిని ఏమాత్రం బకాయిలుగా పరిగణించడానికి వీల్లేదన్నారు. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఏవిధంగానూ రుణపడి లేదన్నారు. ఇప్పటిదాకా రూ. 78 కోట్ల ఆర్జన... ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టిన 5–10–2019 నుంచి 30–10– 2019 వరకు సంస్థ రూ. 78 కోట్లు ఆర్జించిందని సునీల్‌శర్మ హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీ సమ్మె గురించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ కార్యదర్శికి తెలియచేశామని ఆయన హైకోర్టుకు వివరించారు. -
‘కర్ణాటక’ కోసం రూ.122 కోట్లు
న్యూఢిల్లీ: 2018, మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రూ.122.68 కోట్లు ఖర్చు పెట్టినట్లు బీజేపీ తెలిపింది. ఇందులో రూ.84 కోట్లను ప్రచారం కోసం(బల్క్ ఎస్సెమ్మెస్‌లు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్, వెబ్సైట్, ఇతర సామగ్రి) కోసమే ఖర్చుపెట్టినట్లు వెల్లడించింది. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలకు మరో రూ.16 కోట్లు వెచ్చించామని పేర్కొంది. గతేడాది జరిగిన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూ.14.18 కోట్లు ఖర్చుపెట్టామని ఎన్నికల సంఘానికి(ఈసీ) సమర్పించిన నివేదికలో బీజేపీ తెలిపింది. వీటిలో మేఘాలయలో రూ.3.8 కోట్లు, త్రిపురలో రూ.6.96 కోట్లు, నాగాలాండ్‌లో రూ.3.36 కోట్లు వ్యయమైనట్లు పేర్కొంది. విరాళాల్లో బీజేపీనే టాప్.. రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి రాజకీయ పార్టీలకు మొత్తం రూ.469.89 కోట్ల విరాళాలు రాగా, అందులో బీజేపీకే రూ.437.04 కోట్లు దక్కినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ తెలిపింది. కాంగ్రెస్ కేవలం రూ.26.25 కోట్లను అందుకున్నట్లు పేర్కొంది. బీజేపీ విరాళం.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీల మొత్తం విరాళానికి 12 రెట్లు అధికమని పేర్కొంది. జాతీయ పార్టీలల విరాళాల్లో 90 శాతం కార్పొరేట్ సంస్థలు, మిగిలిన 10 శాతాన్ని వ్యక్తులు ఇచ్చారని ఏడీఆర్ చెప్పింది. -
గర్ల్‌ఫ్రెండ్ కోసం దొంగగా మారిన గూగుల్ ఉద్యోగి
గర్ల్‌ఫ్రెండ్‌ను బయటికి తీసుకెళ్లినప్పుడు, పరువు పోకుండా ఖర్చులన్నీ తామే పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు చాలామంది అబ్బాయిలు. ఈ కోవలోనే ఆలోచించాడు ఓ గూగుల్ ఉద్యోగి. కానీ తన జేబులో డబ్బులు లేకపోవడంతో, ఏం చేయాలో తెలియక దొంగతనానికి పాల్పడ్డాడు. గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం దొంగగా మారిని ఈ గూగుల్ ఉద్యోగి చిట్టచివరికి కటకటాల పాలయ్యాడు. గర్విత్ సాహ్ని అనే 24 ఏళ్ల ఇంజనీర్. అత్యంత ప్రతిష్టాత్మకమైన టెక్ దిగ్గజం గూగుల్‌లో పనిచేస్తున్నాడు. ఇతను హర్యానా అంబాలా జిల్లాకు చెందిన వాడు. సెప్టెంబర్ 11న ఐబీఎం మల్టినేషనల్ టెక్నాలజీ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆ అనంతరం తాజ్ ప్యాలెస్‌లో మీడియాతో సమావేశమైంది. ఆ కాన్ఫరెన్స్ సందర్భంగా దివ్యాని జైన్ అనే ఉద్యోగిని హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి రూ.10వేల దొంగలించబడ్డాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, హోటల్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను చెక్ చేశారు. ఆ కెమెరా ఫుటేజీల్లో, నిందితుడు క్యాబ్‌లో హోటల్ రూమ్‌కు వచ్చినట్టు తెలిసింది. దాని నెంబర్ ద్వారా క్యాబ్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను, మొబైల్ నెంబర్‌ను గుర్తించారు. అయితే నిందితుడు అప్పటికే తన మొబైల్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. కానీ పోలీసులు అతని కొత్త మొబైల్ నెంబర్‌ను కూడా పట్టుకున్నారు. ఆ తర్వాత అతని ఇంట్లోనే గర్విత్ సాహ్నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ సందర్భంగా ఆర్థికంగా తాను చాలా నష్టాల్లో ఉన్నానని, గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం మనీ కూడా లేవని సాహ్ని చెప్పాడు. అతని నుంచి రూ.3000ను పోలీసులు రికవరీ చేసుకున్నారు. -
అమిత్ షాకు ముప్పు పెరిగే అవకాశం
న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్టీఐ) కింద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భద్రతా ఖర్చులను వెల్లడించడానికి కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) నిరాకరించింది. ఇది వ్యక్తిగత, గోప్యతకు సంబంధించిన అంశమని, ఆర్టీఐ పరిధిలోకి రాదని తెలిపింది. హోం మంత్రిత్వశాఖ సెక్షన్ 8(1) ప్రకారం సమాచారం బహిర్గతం చేయలేమని, అలా చేస్తే ఆ వ్యక్తి ప్రాణానికి హాని కలిగే అవకాశముందని చెప్పింది. ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులకు జడ్‌ప్లస్ భద్రత కల్పిస్తున్నారు, ప్రభుత్వ ఖజానా నుంచి దానికెంత చెల్లిస్తున్నారో వెల్లడించాలంటూ 2014 జూలై 5న దీపక్ జునేజా అనే వ్యక్తి ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేశారు. దరఖాస్తు నాటికి అమిత్ షా పార్లమెంట్ సభ్యుడు కాదు. అయితే సీఐసీ ఆదేశాలను జునేజా ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రైవేట్ వ్యక్తుల జెడ్ ప్లస్ భద్రతా ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించరాదంటూ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అమిత్‌షా 2014 జూలైలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి జడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్నారని, అది ఎలాంటి రాజ్యాంగ పదవి కాకపోయిన ప్రభుత్వ నిధి నుంచి ఎందుకు భద్రతా ఖర్చులను భరిస్తున్నారో వెల్లడించాలన్నారు. ప్రమాదంలో ఎవరు ఉన్నా వారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని హోం మంత్రిత్వశాఖ విన్నవించింది. వారి ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్ర భద్రతా ఏజెన్సీల నుంచి వచ్చిన నివేదికలను విశ్లేషించిన తర్వాతే వారికి భద్రత కల్పించినట్లు తెలిపింది. ఇప్పటికే వారు పెద్ద ఎత్తున బెదిరింపులకు గురవుతున్నారని, ఇప్పుడు వారి ఖర్చు సమాచారం బహిర్గతం చేస్తే శత్రువులు భద్రతను అంచనా వేస్తారంది. దీంతో ప్రమాదం పెరిగే అవకాశముందని చెప్పింది. జడ్ ప్లస్ భద్రత పూర్తిగా వ్యక్తిగతం, గోప్యత హక్కుకు సంబంధించినదని, ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన గోప్యత హక్కును ఉటంకిస్తూ దీనికి ఆర్టీఐ చట్టం వర్తించదని పేర్కొంది. వాదనల అనంతరం హైకోర్టు వ్యాజ్యాన్ని కొట్టేసింది. -
ఎమ్మెల్యేల్లో ‘పంచాయతీ’ గుబులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జరుగుతున్న కసరత్తు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. పంచాయతీ ఎన్నికలతో తమ నియోజకవర్గాల్లో కొత్త తలనొప్పులను ఇప్పుడెందుకు రుద్దుతున్నారని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే అధికార పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందని అంటున్నారు. అధికారం వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలు ఉంటే బాగుండేదని అంటున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలుంటే ఎమ్మెల్యేలపై అన్ని భారాల పడ్తాయని, ఫలితాల ప్రభావమూ ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకంగా గ్రామాల్లో ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితులు అధికార పార్టీ ఎమ్మెల్యేలను బెంబేలెత్తిస్తున్నాయి. తెలంగాణలోని ఎక్కువ గ్రామాల్లో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోనే నాయకులు, కార్యకర్తలు కేంద్రీకృతమయ్యారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింతర్వాత కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల్లో ఉన్న నాయకులంతా అధికార పార్టీలోనే చేరారు. ఏ నియోజకవర్గంలో చూసినా సర్పంచ్ స్థానానికి ఒక్కొక్క గ్రామంలో కనీసం ఐదారుగురు ముఖ్య నేతలు, సీనియర్లు, ఆసక్తి ఉన్నవారి మధ్య పోటీ ఉంది. గ్రామాల్లో నాయకుల మధ్య వ్యక్తిగత వైషమ్యాలు, అభ్యర్థుల పోటీలో అధికారిక అభ్యర్థిని ప్రకటించడం, వీరి ఆర్థిక భారాన్ని మోయడం, వీరి గెలుపోటముల వంటి అన్ని అంశాలు సమస్యగానే ఉంటాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ఆధిపత్య పోరు... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింతర్వాత అన్ని పార్టీల నేతలు ఆ పార్టీలోనే చేరిపోయారు. ఒకే పార్టీలో వీరు ఉన్నప్పటికీ ఏ ఇద్దరు నేతల మధ్య సయోధ్య లేదు. పేరుకు అధికార పార్టీలోనే ఉన్నా, గ్రామాల్లో వీరు ఎవరికి వారే అన్నట్టుగా తమ వర్గాలను, గ్రూపులను నడిపించుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేగా ఆ గ్రామానికి వెళ్లినప్పుడు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఎవరికివారే గ్రామస్థాయిలో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో కనీసం మూడు గ్రూపులుంటున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే ఐదారు గ్రూపులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వీరిలో ఏ ఒక్కరిని అభ్యర్థిగా ప్రకటించినా, మిగతా వర్గాలు వ్యతిరేకమయ్యే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. గ్రామ స్థాయి నేతల మధ్య వైషమ్యాలు సాధారణ ఎన్నికలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని భయపడుతున్నారు. సాధారణ ఎన్నికలకు ఎక్కువ సమయం ఉంటే అవకాశం రాని వారికి మరో ప్రత్యామ్నాయం చూపించే మార్గం ఉంటుందని, ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత అయితే గ్రామ స్థాయి నాయకులు పెద్దగా పట్టించుకోకపోవచ్చునంటున్నారు. ఎమ్మెల్యే స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నప్పుడు తమతో అవసరం ఉండదా అని గ్రామాల నాయకులు ధైర్యంగా ఉంటారని, అదే అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కొంచెం భయంతోనో, భక్తితోనే పార్టీకి పనిచేసే అవకాశం ఉంటుందంటున్నారు. గ్రామం అంతా టీఆర్ఎస్లోనే ఉంటే, ఏక కాలంలో అందరినీ సంతృప్తి పర్చడం సాధ్యంకాదంటున్నారు. పార్టీలో ఎక్కువ మంది నాయకులు ఉన్నప్పుడు పార్టీ అభ్యర్థిని అధికారికంగా ఎంపిక చేయడం, ఆ తరువాత అందరినీ కాపాడుకోవడం కత్తిమీద సాములాగానే ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక భారం ఎలా? పార్టీ అభ్యర్థిని నిర్ణయించడం ఒక సమస్య అయితే, వారి ఆర్థిక అంశాలు అంతకన్నా ఎక్కువగా ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయి, వార్డు సభ్యులు, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఖర్చు గురించి చెప్పుకునే పరిస్థితి ఉండదంటున్నారు. ఎన్నికల కమిషన్ ఎన్ని పరిమితులు విధించినా, ఎంత నిఘా పెంచినా ఖర్చును ఆపే పరిస్థితి ఉండదంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే కావడంతో అంతూపొంతు లేకుండా జరిగే వ్యయాలు ఎవరు మోయాలని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. స్థానికంగా అభ్యర్థులు ఖర్చులు భరించినా, ఎమ్మెల్యేగా, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా తమ నుంచి ఆర్థిక సహాయాన్ని ప్రతీ ఊరి నుంచి కచ్చితంగా ఆశిస్తారని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఒక్కొక్క ఊరికి రూ.యాబైవేలు, రూ.లక్షకు తగ్గకుండా ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సగటున 100 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, దీనిని బట్టి ఎమ్మెల్యేగా తమపై ఖర్చును లెక్కబెట్టి, ఆందోళన చెందుతున్నారు. కొంచెం పెద్ద గ్రామ పంచాయతీలు అయితే అంతకన్నా ఎక్కువగానే ఆర్థికంగా సహాయం చేయాల్సిన పరిస్థితి తప్పదేమోనని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఇవన్నీ లెక్క గడితే వచ్చే ఎన్నికల్లో తమకు అయ్యే ఖర్చులో సగం అయినా ఇప్పుడు భరించాల్సి వస్తుందని లెక్కలు గడుతున్నారు. ఇంత చేసినా గెలుపోటములు తమ ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. ఈ తలనొప్పులన్నీ ఎన్నికలకు ముందు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఎన్నికలయ్యేదాకా పంచాయతీ ఎన్నికలు వాయిదా పడితే బాగుండునని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. -
సెంటర్ ఎటెట్టా
సాక్షి, బద్వేలు : టెట్ పరీక్ష అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. పరీక్షా కేంద్రాలు ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం అభ్యర్థులకు శ్రమతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడేలా చేస్తోంది. జిల్లాలోని అభ్యర్థులకు సరిపోయే స్థాయిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దాదాపు మూడు వేల మంది ఇతర జిల్లాలకు వెళ్లి పరీక్ష రాయాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఈ నెల 10 నుంచి 19 వరకు జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ... జిల్లావ్యాప్తంగా 25 వేల మంది టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సరిపోయే స్థాయిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. మొదట దరఖాస్తు అనంతరం గత నెల 25 నుంచి 29 వరకు పరీక్షా కేంద్రాల ఎంపికకు అవకాశం కల్పించారు. మొదటి రోజు మధ్యాహ్నం లోపే డీఎడ్ అభ్యర్థులకు జిల్లాలో కేటాయిం చిన పరీక్షా కేంద్రాలన్నీ భర్తీ అయ్యాయి. సాయంత్రానికి మిగిలిన స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను తప్పని సరి పరిస్థితుల్లో ఇతర జిల్లా పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిం ది. కేంద్రాల మార్పునకు అవకాశం కల్పిస్తారని ఆశించినా వారి ఆశలపై అధికారులు నీళ్లు జల్లారు. గతంలో మాదిరే... టెట్–2017లో దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షా కేంద్రాల కేటాయింపులో ప్రభుత్వం చుక్కలు చూపింది. వారు కోరుకున్న కేంద్రాలను ఇవ్వకుండా చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ప్రస్తుత టెట్‌లో అలాంటి పరిస్థితి రాదని చెప్పిన అధికారులు తీరా దగ్గరికి వచ్చేసరికి చెతులేత్తాశారు. మరోసారి అలాంటి పరిస్థితే కల్పించి నిరుద్యోగులతో చెలగాటం అడుతున్నారు. జిల్లాలో పది కేంద్రాలే... జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేట పట్టణాలలో పది కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. గత నెల 29వ తేదీ తరువాత పరీక్షా కేంద్రాల మార్పునకు అవకాశం కల్పిస్తారని ఆశిం చినా మీడియం, సబ్జెక్టు మార్పునకు మాత్రమే అవకాశం కల్పించారు. దీంతో అభ్యర్థులు తీవ్రనిరాశకు గురవుతున్నారు. ∙పరీక్షా కేంద్రం మార్పు చేయాలంటూ ఫిర్యాదులు పెరుగుతుండటంతో ఈ అంశం తమ పరిధిలో లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పేపరు–1 ఎస్జీటీకి 13 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ పేపరు–2కు ఎనిమిది వేల మంది, భాష పండిత పరీక్షకు మూడు వేల మంది, పీఈటీకి 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మంగళవారం నుంచి హాల్‌టిక్కెట్ డౌన్లోడు చేసుకోవచ్చు. ఆందోళనలో గర్భిణులు, దివ్యాంగులు.. టెట్ దరఖాస్తు చేసుకున్న వారిలో గర్భిణులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కేంద్రాలు ఆన్లైన్లో మొదటి రోజే పూర్తి కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర జిల్లా కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు. రెండో రోజు నుంచి చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పట్టణాలలోని కేంద్రాలు మాత్రమే కనిపించాయి. తరువాతైనా కేంద్రాల మార్పునకు అవకాశం ఇస్తారని భావించినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు మాత్రం కనిపించడం లేదు. వందల కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష రాయాలంటే ఎలా అని గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. ఇతర జిల్లాలకు వెళ్లాలంటే రూ.వేలలో ఖర్చు ప్రస్తుతం ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయాలంటే రూ.వేలల్లో ఖర్చు పెట్టుకోవాల్సిందే. కేటాయించిన కేంద్రాలు కనీసం రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ముందురోజే వెళ్లాలి. బస్సుచార్జీలకు కనీసం రూ.వెయ్యి వెచ్చించాల్సిందే. అక్కడ వసతి, భోజనాలు, ఆటో ఖర్చులకు మరో రూ.వెయ్యికి పైగా కావాలి. గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులకు మరోకరు తోడు ఉండాలి. వీరికి కనీసం రూ.5 వేలు కావాల్సిన పరిస్థితి. -
స్థిరాదాయం లేకుంటే ఇవి గుర్తుండాలి
క్రమబద్ధంగా ఆదాయం వచ్చేటప్పుడు ప్రతి నెలా బడ్జెట్‌ను ప్లానింగ్ చేసుకోవడం కాస్త సులువుగానే ఉంటుంది. ఆదాయం ఎంత.. ఎంత ఖర్చు చేయొచ్చు.. ఎంత పొదుపు చేయొచ్చు లాంటి లెక్కలు వేసుకోగలం. అయితే, ఫ్రీలాన్స్ ప్రొఫెషనల్స్, స్వయం ఉపాధి పొందేవారి ఆదాయాలు క్రమబద్ధంగా కాకుండా.. అస్థిరంగానే ఉంటాయి. మరి వీరు ఆర్థిక సమస్యల్లో చిక్కుకోకుండా ఎలాంటి ప్రణాళిక కావాలి? దాన్నెలా అమలు చేయాలి? ఒకసారి చూద్దాం... సాధారణంగా ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చులు పెట్టడమనేది చాలా మందికి ఎదురయ్యే సమస్య. ఈ కోవలోకి రాకుండా ఉండాలంటే... ఖర్చు అలవాట్లను ఓ కంట కనిపెడుతుండాలి. వ్యయాలు ఆదాయాన్ని మించకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా ట్రాకింగ్ చేయడం కోసం ప్రస్తుతం చాలా మొబైల్ యాప్స్ ఉన్నాయి. వీటిని ఉపయోగించి స్థూలంగా మీ ఖర్చులు ఎంత ఉంటున్నాయన్నది ఓ అంచనాకు రావొచ్చు. ఇందుకోసం గడిచిన పన్నెండు నెలల్లో మీ ఖర్చుల తీరుతెన్నులను రాసి పెట్టుకోండి. సగటున ప్రతి నెలా ఎంత మేర ఖర్చులుంటున్నాయో లెక్కేయండి. రాబోయే రోజుల్లో ఖర్చుల ధోరణిని మెరుగుపర్చుకోవడానికి, ఆర్థిక అంశాలను ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తగినంత నగదు దగ్గర ఉంచుకోండి.. గత ఖర్చుల అలవాట్లను దృష్టిలో ఉంచుకుని తరచూ తలెత్తే వ్యయాలకు సరిపడేంత స్థాయిలో నగదు చేతిలో ఉండేలా చూసుకోవాలి (క్యాష్ రిజర్వ్). లేకపోతే, రుణాల వైపు చూడాల్సి వచ్చే ప్రమాదముంది. ఆదాయం మీ చేతికి రావడానికి 15– 30 రోజులు పట్టేలా ఉన్నప్పుడు.. ఆ సమయంలో గట్టెక్కడానికి వేర్వేరు బిల్లింగ్ తేదీలుండే క్రెడిట్ కార్డులను సమయోచితంగా ఉపయోగించుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల కోసం కేటాయించే నిధిని, ఈ క్యాష్ రిజర్వ్ని వేర్వేరుగానే ఉంచాలి. ఆదాయం క్రమానుగతంగా లేనప్పుడు కూడా రోజువారీ ఖర్చులకు సర్దుబాటు చేసుకునేందుకు ఉపయోగపడేది క్యాష్ రిజర్వ్. ఆదాయం చేతికొచ్చేందుకు సాధారణం కన్నా మరింత ఎక్కువ సమయం పట్టేసే సందర్భాల్లో ఆదుకునేదే అత్యవసర నిధి. అంతా ఒకే అకౌంటులో ఉండాలి.. మీ ఆదాయం అంతా కూడా ఒకే బ్యాంకు ఖాతాలో ఉండేలా చూసుకోవాలి. బాధ్యతారహితంగా చేసే ఖర్చులను నియంత్రించుకునేందుకు, విత్డ్రాయల్స్పై ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ నిర్దిష్ట స్థాయి కన్నా కిందికి తగ్గకుండా మీ అంతట మీరే ఒక పరిమితిని నిర్దేశించుకోండి. ముందు పొదుపు.. తర్వాతే ఖర్చులు చేతిలో డబ్బు లేకుండా పోవడమనే సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే బండగుర్తు ఒకటుంది. అదేంటంటే.. ముందుగా పొదుపు చేయాలి.. ఆ తర్వాతే ఖర్చులు చేయాలి. చాలా మంది తమ చేతిలోకి ఆదాయం రావడానికి ముందే దాన్ని క్రెడిట్ కార్డులు మొదలైన సాధనాలతో ఖర్చు చేసేస్తుంటారు. ఇలాంటి ధోరణులు తీవ్రమైన ఆర్థిక సమస్యలకు దారితీస్తాయి. రుణాలు తిరిగి చెల్లించలేని సంక్షోభ పరిస్థితి తలెత్తవచ్చు. అలా కాకుండా.. ముందు పొదుపునకు ప్రాధాన్యమిచ్చి మీ ఆర్థిక లక్ష్యానికి అనువైన సాధనంలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ఇది చేశాక మిగిలే మొత్తాన్నే ఖర్చుల కోసం ఉపయోగించడం అలవాటు చేసుకుంటే.. దీర్ఘకాలంలో తగినంత నిధిని పోగు చేసుకోగలుగుతారు. బీమా రక్షణ ఉండాలి.. ఆరోగ్యపరమైన సమస్యలు, శారీరకపరమైన వైకల్యాల్లాంటివి ముందుగా చెప్పిరావు. వచ్చిన తర్వాత వీటిని చూసీ, చూడనట్లుగా వదిలేసే పరిస్థితి ఉండదు. అటూ, ఇటూగా ఆదాయం ఉండేటప్పుడు.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడం కష్టంగానే ఉంటుంది. అయితే, తగినంత బీమా రక్షణ ఉండేలా చూసుకోవడం ద్వారా వీటిని అధిగమించవచ్చు. ఇంటిపెద్దకి అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తుంది జీవిత బీమా పాలసీ. అలాగే, ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నగదురహిత ట్రీట్మెంట్ ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకుంటే.. చికిత్స కోసం తక్షణం డబ్బులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. క్రమశిక్షణ కీలకం ఆదాయం అస్థిరమైనదైనప్పుడు.. డబ్బుపరమైన సమస్యలు తలెత్తకుండా ఆర్థిక క్రమశిక్షణతో ఉండాలి. అనవసరమైన రుణాలకు దూరంగా ఉండాలి. ప్లానింగ్ లేకుండా ఖరీదైన ఉత్పత్తుల జోలికి వెళ్లొద్దు. ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. వ్యాపారం ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు వేర్వేరుగానే ఉంచాలి. దీంతో డబ్బు నిర్వహణ సులభతరంగా ఉంటుంది. కాబట్టి సరైన ప్రణాళిక వేసుకుని ఆర్థికంగా క్రమశిక్షణతో ఉంటే.. క్రమబద్ధమైన ఆదాయం ఉన్నవారిలాగానే హాయిగా జీవించొచ్చు. -
దేశీ ఐటీపై పెరుగుతున్న వ్యయాలు
న్యూఢిల్లీ: డిజిటల్ సేవల వ్యాప్తి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దేశీయంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై (ఐటీ) చేసే వ్యయాలు ఈ ఏడాది 11.6 శాతం పెరిగి రూ.2,33,273 కోట్లకు చేరనున్నట్టు ‘క్యూస్ ఏజ్’ కన్సల్టింగ్ సంçస్థ తన నివేదికలో తెలియజేసింది. 2017లో ఐటీ కోసం నిధుల వినియోగం 12.9 శాతం ఉంటుందని అనుకుంటే, దీనికంటే తక్కువగా 10.3 శాతమే సాధ్యమైంది. దీనికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణాలుగా క్యూస్ ఏజ్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు కపిల్‌దేవ్ సింగ్ పేర్కొన్నారు. 2018లో కంపెనీలు, ప్రభుత్వం ఐటీపై చేసే వ్యయాల్లో 25 శాతం డిజిటల్ టెక్నాలజీ కోసమే ఉంటాయని సంçస్థ అంచనా వేసింది. ఇందులో అనలిటిక్స్, మొబిలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటాయని తెలియజేసింది. ఐటీ కంపెనీల అధిపతులు, సీఐవోల అభిప్రాయాల ఆధారంగా క్యూస్ ఏజ్ కన్సల్టింగ్ ఈ నివేదికను రూపొందించింది. 60 శాతానికి పైగా కంపెనీలు ఆధునిక డిజిటల్ టెక్నాలజీలైన బిగ్‌డేటా అనలిటిక్స్, ఆఫ్టిïషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), మెషిన్ లెర్నింగ్, రోబోలపై ఆసక్తిని ప్రదర్శించాయి. డిజిటల్లో తొలి విప్లవం సోషల్, మొబైల్, అనలైటిక్స్, క్లౌడ్ (ఎస్ఎంఏసీ) రూపంలో ఉందని, కంపెనీలు తమ వ్యాపార విభాగాల్లో వీటిని అమలు చేస్తున్నాయని సింగ్ పేర్కొన్నారు. 2018లో డిజిటల్లో రెండో విప్లవం బిగ్ డేటా అనలైటిక్స్, ఏఐ, ఐవోటీ, మెíషీన్ లెర్నింగ్, రోబోల రూపంలో ఉంటుందని, 18–24 నెలల్లో ఇది ప్రధాన విభాగంగా మారుతుందని కపిల్ వివరించారు. -
గ్రేటర్ బడ్జెట్‌కు అంచనాలేవి ?
గడువు దాటినా గడప దాటని కసరత్తు నోటీసులు జారీ చేసినా స్పందించని విభాగాలు వరంగల్ అర్బన్(వరంగల్ తూర్పు) : వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాల రూపకల్పనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వివిధ విభాగాల నుంచి తగిన సహకారం లేకపోవడం, సమాచారం ఇవ్వడంలో వైఫల్యం వంటి కారణాలు గ్రేటర్‌కు శాపంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆదాయ, వ్యయాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాల్సిన అధికార పాలక యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. చట్టం ఏం చెబుతోందంటే..! స్థానిక సంస్థల ఆదాయం, వ్యయాన్ని మదుపు చేసేందుకు రూపొందించిన శాసనబద్ధమైన ప్రక్రియే లెక్కాపద్దులు(బడ్జెట్). ప్రతి యేటా ఆదాయ వనరులు, వ్యయ అంచనా రూపొందించే ఈ ప్రక్రియ పురపాలక సంఘాలకు ఆయువుపట్టు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పురపాలక సంస్థలు ప్రతి ఏటా డిసెంబర్ 15వ తేదీలోగా మహానగర మేయర్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ ఆమోదం పొంది, డిసెంబర్ 31వ తేదీలోగా ఆదాయ, వ్యయాలను రూపొందించి ప్రభుత్వానికి పంపాలి. కానీ బల్దియా అధికార యంత్రాంగం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. హద్దు‘పద్దు’లేని పాలన.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ 2016–17 కేటాయింపులు, వ్యయం వంటి వివిధ అంశాలకు సంబంధించిన ప్రక్రియకు మరో రెండున్నర నెలల్లో ముగింపు పలకాల్సి ఉంది. ఈ లోగా నూతన ఆర్థిక సంవత్సరానికి 2017–18 సంవత్సరానికి అవసరమైన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన బడ్జెట్ అంచనాల రూపకల్పన పూర్తి చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి అన్ని విభాగాల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి ముందస్తు అంచనాలు డిసెంబర్ 15 నాటికి అందించాల్సి ఉంది. మేయర్ అధ్యక్షతన జరిగే స్థాయి సంఘం ముందుకు పరిశీలనతోపాటు అనుమతి కోసం బడ్జెట్ అంచనాలను పంపాల్సి ఉంటుంది. గడువుదాటి నెల రోజులవుతున్నా అధికారులు మాత్రం ముందస్తు అంచనాలను అందించలేకపోయారు. అదేమంటే ఇప్పటికే పలు కీలకమైన విభాగాల నుంచి పూర్తి సమాచారం అందలేదన్న వాదనలు వినవస్తున్నాయి. రెండు నోటీసులు జారీ చేసినా ఫలితం శూన్యం గ్రేటర్‌లోని వివిధ విభాగాలకు డిసెంబర్ మొదటి వారంలో నోటీసులు జారీ చేశారు. పక్షం రోజుల్లో అంచనాలు తయారు చేసి అందించాలని కోరారు. నెలఖారులోగా మరో ఏడు రోజులతో కూడిన నోటీసును అందించారు. అయినా ఆయా విభాగాల అధికారులు అంచనాల రూపకల్పన, వివరాలు అందించడంలో పూర్తిగా అలక్ష్యం చేస్తున్నారు. నూతన బడ్జెట్ అంచనాల్లో మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలోపు వెచ్చించగల గణాంకాలతోపాటు అవసరమైన వ్యయాల వివరాలు, నూతన ఆర్థిక సంవత్సరానికి అంచనాలు వీరు ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు గ్రేటర్లో అమలవుతున్న కీలక పథకాలకు వెచ్చించిన వ్యయం, భవిష్యత్‌లో రావాల్సిన నిధులు, ప్రభుత్వ నిధులు అందుకు అనువుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రాతిపదికన అంచనాలను పూర్తి స్థాయిలో క్రోడీకరించి పంపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మార్చిలోగా చేపట్టే పనులకు, అలాగే ఇంకా మిగిలిపోయే పనులకు, కొనసాగించాల్సిన పనులకు తగిన ఆర్థిక కేటాయింపులకు పాలక పక్షానికి తగిన అవకాశం చిక్కుతోంది. పాలకులు తమ ప్రాధామ్యాలు, హామీలు, నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ విషయాల్లో అటు పాలకులు, ఇటు అధికారులకు కనీస స్పృహ లేకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా స్పందించగలిగితే అనుకున్న గడువులోగా బడ్జెట్ ఆమోదం దక్కడం కష్టమేమి కాదు. -
గర్ల్‌ఫ్రెండ్ మీద పెట్టిన ఖర్చుల కోసం..
మాస్కో: రష్యాలో ఓ యువతికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ లాయర్‌ను ప్రేమించిన పాపానికి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకావద్దని కోరుకుంటున్న సదరు యువతి వివరాల్లోకి వెళ్తే.. రష్యాలోని క్రాస్నోయార్క్ప్కు ప్రాంతానికి చెందిన జుర్స్కోయా.. ఓ యువ లాయర్‌తో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో అతనిపై మనసు పారేసుకున్న జుర్స్కోయా.. లాయర్‌తో కలిసి విహారయాత్రకు క్రిమియాకు వెళ్లింది. అయితే ఆ విహారయాత్రలో యువ లాయర్ తనకు ప్రపోజ్ చేస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె.. చివరికి అతను ప్రపోజ్ చేయకపోవటంతో నిరాశతో ఇంటికి చేరింది. ఆ తరువాతే మొదలైంది అసలు కథ. ప్రేమ విఫలమైందన్న బాధలో ఉన్న ఆమెకు కోర్టు నుంచి సమన్లు వచ్చాయి. అవి ఏంటా అని చూస్తే.. విహారయాత్రలో బొకేలకు.. రెస్టారెంట్లకు చేసిన ఖర్చులు సుమారు రూ. 40 వేలు తనకు చెల్లించాలంటూ సమన్లు పంపాడు ఆ బాయ్‌ఫ్రెండ్ లాయర్. రెస్టారెంట్ బిల్లులు, కాఫీ షాప్ బిల్లులతో పాటు అన్ని బిల్లులను పక్కాగా కోర్టులో సమర్పించి మరీ తనకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకోవాలని చూస్తున్నాడు లాయర్ బాయ్‌ఫ్రెండ్. ఈ విషయంపై పేరు వెల్లడించని ఆ లాయర్ స్థానిక మీడియాతో మాట్టాడుతూ.. 'మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదు. మేం సరదా గా విహార యాత్రకు వెళ్లాం. ఖర్చులు మొత్తం నేనే భరిస్తానని నేను ఆమెతో చెప్పలేదు. అందుకే నాకు రావాల్సిన మొత్తం కోసం కోర్టును ఆశ్రయించాను' అని చెబుతున్నాడు. ఎంతగానో ప్రేమించిన బాయ్‌ఫ్రెండ్.. ఖర్చులు చెల్లించమంటూ కోర్టుకెక్కడంతో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతోంది జుర్స్కోయా. -
తెల్లకోటుకు కోట్లు అక్కర్లేదు!
- నేలకు దిగనున్న డాక్టర్ చదువుల ఖర్చులు - ప్రతిభకు పట్టం కట్టనున్న నీట్ - మెరుగైన ర్యాంక్ వస్తే ఏదో ఒక కేటగిరీలో సీటు గ్యారంటీ - ప్రైవేట్ యాజమాన్యాల అడ్డగోలు దోపిడీకి చెక్ పెట్టిన సుప్రీం తీర్పు - ర్యాంకుల ప్రకారమే ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో బీ, సీ కేటగిరీ అడ్మిషన్లు - ఎంబీబీఎస్‌లో బీ కేటగిరీకి ఏడాదికి 9 లక్షలు.. సీ కేటగిరీకి 11 లక్షలు - ఇవే సీట్లను గతంలో కోట్ల రూపాయలకు విక్రయించిన యాజమాన్యాలు సాక్షి, హైదరాబాద్ డాక్టర్ చదువంటే ఇప్పటిదాకా కోట్లలో డొనేషన్లు..! ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వేలం మాదిరి సీట్ల అమ్మకాలు..! ప్రతిభ ఉన్నా డబ్బుల్లేక సీటుకు దూరమైన పేద, మధ్య తరగతి విద్యార్థులెందరో..!! ఇకపై వీటన్నింటికీ ‘నీట్’ చెక్ పెట్టబోతోంది. నేషనల్ ఎలిజిబిలిటీ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో మెరుగైన ర్యాంక్ తెచ్చుకుంటే చాలు.. ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చెల్లించి ఎంబీబీఎస్, బీడీఎస్ చదువుకోవచ్చు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సైతం వంద శాతం సీట్లను మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ప్రైవేట్ కాలేజీల్లో 50 శాతం సీట్లను మాత్రమే మెరిట్లో భర్తీ చేసి మిగిలిన 50 శాతం సీట్లను బీ, సీ కేటగిరీల పేరుతో కాలేజీల యాజమాన్యాలు ఇష్టానుసారంగా అమ్ముకునేవి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ దశలోనూ ఈ అడ్డగోలు వ్యాపారాన్ని నియంత్రించే చర్యలు తీసుకోకపోవడంతో రూ.కోటి అంతకంటే ఎక్కువ చెల్లించడానికి ముందుకొచ్చే వారికే ఆ సీట్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని ప్రైవేట్ యాజమాన్యాల ధనదాహానికి తెరపడింది. ఇక సీటు ఏదైనా సరే.. ఏ కేటగిరీలో భర్తీ చేయాల్సి వచ్చినా సరే.. ‘నీట్’లో విద్యార్థులు సాధించిన ర్యాంక్‌ల ఆధారంగానే కేటాయించాల్సి ఉంటుంది. సీట్ల భర్తీ మెరిట్ ప్రకారమే.. రాష్ట్రంలో 10 ప్రైవేట్, రెండు మైనారిటీ వైద్య కళాశాలల్లో 1,750 సీట్లున్నాయి. ఇకపై వీటన్నింటినీ మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలి. వీటిలో 1,450 సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో ఉండగా.. 300 సీట్లు మైనారిటీ కాలేజీల్లో ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న 1,450 సీట్లలో గతేడాది దాకా 725 సీట్లు మాత్రమే మెరిట్ కోటాలో అడ్మిషన్ కమిటీ కన్వీనర్ కేటాయించేవారు. మిగిలిన 725 సీట్లు బహిరంగ వేలం ద్వారా.. సీటు కొనే సామర్థ్యాన్ని బట్టి కనిష్టంగా రూ.1 కోటి నుంచి రూ.1.75 కోట్లు దాకా విక్రయించిన దాఖలాలు ఉన్నాయి. బీ కేటగిరీలో 35 శాతం సీట్లకు యాజమాన్యాలే తూతూ మంత్రంగా పరీక్ష నిర్వహించి వారికి కావాల్సిన వారికి సీట్లు కేటాయించుకునేవి. ఇక సీ కేటగిరీ అయితే ఇష్టారాజ్యం. ఈ కేటగిరీ సీట్ల భర్తీకి యాజామన్యాలు ఏనాడూ నిబంధనలు పాటించలేదు. మామూలుగా అయితే బీ కేటగిరీకి ఎంసెట్ మెరిట్, సీ కేటగిరీకి (ఎన్నారై) ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ కాలేజీ యాజమాన్యాలు వారికి నచ్చిన వారి జాబితాను ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందేవి. ప్రభుత్వం ఏ దశలోనూ యాజమాన్యాలను కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో ఇప్పటిదాకా వారి వ్యాపారం ‘మూడు సీట్లు ఆరు కోట్లు’గా నడిచింది. మరి ఇప్పుడు ఎంత చెల్లించాలి... నీట్ పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరు ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు అర్హులు. బీ కేటగిరీలో 35 శాతం అంటే 490 సీట్లకు ప్రభుత్వమే కౌన్సెలింగ్ నిర్వహించాలి. కౌన్సెలింగ్‌కు హాజరైన వారి ర్యాంక్‌ను బట్టి సీటు కేటాయిస్తారు. ఈ సీటుకు ప్రభుత్వం నిర్ణయించిన ఏడాదికి రూ.9 లక్షల ఫీజు మాత్రమే చెల్లించాలి. గతంలో మాదిరి ఇప్పుడు అదనంగా ఒక్క పైసా చెల్లించాల్సిన పని లేదు. కాస్త మెరుగైన ర్యాంక్ తెచ్చుకుంటే ఐదున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును రూ.45 లక్షలతో పూర్తి చేయవచ్చు. గతంలో అయితే ఈ ఫీజుకు అదనంగా రూ.75 లక్షల నుంచి రూ.కోటి దాకా వసూలు చేసేవారు. ఇక ఎన్నారై కోటాలో 235 సీట్లను కూడా నీట్ ద్వారానే భర్తీ చేయాలి. ఇందుకు కాలేజీలు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలి. వచ్చిన దరఖాస్తుల్లో వారి ర్యాంక్‌లను బట్టి సీట్లు కేటాయించాలి. ఈ సీటుకు ప్రభుత్వం నిర్దేశించి రూ.11 లక్షలు మాత్రమే చెల్లించాలి. ఈ కోటాలో చేరిన విద్యార్థి ఐదున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును రూ.55 లక్షలతో పూర్తి చేయవచ్చు. ఇప్పటిదాకా ఈ సీటుకు రూ.55 లక్షలకు అదనంగా రూ.కోటి నుంచి కోటిన్నర దాకా వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉల్లంఘిస్తే ఏం చేస్తారు? ఏ ప్రైవేట్ యాజమాన్యమైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అన్యాయానికి గురైన విద్యార్థి నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చు. ఏ కాలేజీ అయినా సీట్లు భర్తీ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వకపోతే భర్తీ చేసుకునే సీట్లు చెల్లుబాటు కావు. ఎన్నారై కోటా సీట్లు భర్తీ చేయడానికి కాలేజీలు రెండు ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్తోపాటు వైద్య విద్య సంచాలకులకు తెలియజేయాలి. ఎన్నారై కోటా సీట్ల కోసం వచ్చిన దరఖాస్తుదారుల వివరాలతోపాటు వారికి వచ్చిన ర్యాంక్‌లను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెట్టాలి. విద్యార్థి తనకు సీటు వస్తుందో రాదో కచ్చితంగా తెలుసుకునేలా పారదర్శకత పాటించాలి. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి అనర్హులకు సీట్లు కట్టబెడితే భారతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం ఆ కాలేజీ గుర్తింపు పోతుంది. ఎంబీబీఎస్ కోర్సుకు ఇక ప్రైవేట్ వైద్య కాలేజీల్లో ఏడాదికి చెల్లించాల్సిన ఫీజు ఇదీ.. ఏ కేటగిరీ రూ.60,000 బీ కేటగిరీ రూ.9,00,000 సీ కేటగిరీ రూ.11,00,000 -
పిల్లల చదువుకు ఏం చేస్తున్నారు?
విద్యా రుణంపై ధీమా వద్దు... కొంతమంది తల్లిదండ్రులు పిల్లల చదువులకు ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది కదా! ఇప్పటి నుంచే దాచుకోవడం దేనికి అని ఆలోచిస్తున్నారు. కానీ ఈ రుణాలు అన్ని కోర్సులకు, అన్ని యూనివర్సిటీలకు అందుబాటులో ఉండవనేది మొట్టమొదట గుర్తించాల్సిన విషయం. ఎంపిక చేసిన కోర్సులు, విదేశాల్లో చేసే కోర్సులకు, కొన్ని యూనివర్సిటీలకు మాత్రమే ఇవి లభిస్తున్నాయి. అంతేకాక ఈ రుణాలు తీసుకున్నాక 12 నెలల నుంచి 18 నెలల తర్వాత నుంచి వీటి ఈఎంఐలు మొదలవుతాయి. అంటే మీ పిల్లలు ఉద్యోగంలో చేరిన వెంటనే రుణాలు తీర్చడం మొదలు పెట్టాలి. ఆర్థికంగా పిల్లలకు ఇది భారమే. ముందుచూపుతో వ్యవహరిస్తే ఇటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లల చదువు కోసం తగినంత నిధిని సమకూర్చుకోవచ్చు. పిల్లల చదువుకోసం పొదుపు చేయడానికి 10 నుంచి 15 ఏళ్ల సమయం ఉంటుంది కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లలకు ఏ చదువు చెప్పించాలనుకుంటున్నారు? ఏ యూనివర్సిటీ? దానికెంత మొత్తం కావాలి? అనే అంశాలపై అవగాహనతో ప్లాన్ చెయ్యాలి. పిల్లల ఇన్వెస్ట్మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా వంటి అనేక ఇన్వెస్ట్మెంట్ పథకాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకు డిపాజిట్లలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తుండాలి. ఒకవేళ తల్లిదండ్రులకు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మొత్తం సొమ్ము నామినీకి ఇస్తారు. దీంతో మీ ఆర్థిక లక్ష్యం మధ్యలోనే ఆగే ప్రమాదం ఉంటుంది. బీమా పథకాలైతే తల్లిదండ్రులకు బీమా రక్షణతో పాటు ఇన్వెస్ట్మెంట్స్నూ కొనసాగించొచ్చు. అనుకోని సంఘటన ఏమైనా జరిగినా మీ లక్ష్యం దెబ్బతినదు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి స్థిరమైన రాబడిని అందించేలా కొన్ని భీమా పథకాలున్నాయి. ఎంత తొందరగా ఈ బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే అంత ఎక్కువ మొత్తం పొందవచ్చు. ఫైనాన్షియల్ బేసిక్స్ పొదుపు ఎలా..? మనకు ప్రతి నెల జీతం వస్తుంది. వచ్చిన మొత్తం జీతాన్ని ఖర్చు చేయలేం కదా? భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. ఈ పొదుపు మొత్తం ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఒకే మొత్తంలో జీతం రాదు. అలాగే వారి వయసు, అవసరాలు వంటి తదితర విషయాలు కూడా ఎంత మొత్తంలో పొదుపు చేయాలనే అంశాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే యుక్త వయసు ఉద్యోగి తనకు వచ్చే జీతంలో ఎంత మొత్తాన్ని పొదుపు చేయాలనే విషయాన్ని కింద వివరించాము. * 23 ఏళ్ల వయసులో కెరీర్‌ను ప్రారంభించిన వ్యక్తి తనకు వచ్చే జీతంలో 60-65 శాతాన్ని పొదుపు చేయాలి. ఈ విధానాన్ని ఏడేళ్లు కొనసాగించాలి. * తర్వాతి 20 ఏళ్లు కూడా 25-30 శాతంగా పొదుపు చేస్తూ రావాలి. ఈ కాలంలో జీతం పెరుగుదలతోపాటు ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి పొదుపు మొత్తం తగ్గుతుంది. * అటు తర్వాత ఖర్చులు తగ్గుతాయి కనుక 35-40 శాతం పొదుపు చేయాలి. -
నా ఖర్చులు వాళ్లు భరిస్తారా?
‘‘మన కోసం మనం బతకాలి. ఆ తర్వాత ఇతరుల గురించి ఆలోచించాలి. కానీ, మన గురించి వదిలేసి ఇతరుల గురించి అదే పనిగా ఆలోచిస్తే మన జీవితం ఇతరుల అదుపాజ్ఞల్లో ఉన్నట్లుగా ఉంటుంది’’ అని శ్రుతీహాసన్ అంటున్నారు. మన ప్రవర్తన ఇతరులను ఇబ్బందిపెట్టేలా ఉండకూడదనీ, నలుగురిలో ఉన్నప్పుడు కొంచెం సంస్కారం పాటించాలనీ ఆమె అభిప్రాయం. ఈ విషయం గురించి అమ్మడికి కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. ‘‘ఇతరుల్ని ఇబ్బందిపెట్టకూడదనే భావనతో అదే పనిగా వాళ్ల గురించే ఆలోచించకూడదు. ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. ‘వాళ్లేమనుకుంటారో... వీళ్లేమనుకుంటారో’ అనుకుని మనకు నచ్చింది కాక, ఇతరులకు నచ్చింది చేస్తే, జీవితం బోర్ కొట్టేస్తుంది. అలాగే, తోటి స్టార్స్ ఎంత సంపాదిస్తున్నారు? ఏమేం సినిమాలు అంగీకరించారు? అని ఆరా తీయడం మొదలుపెడితే, మనశ్శాంతి కరవవుతుంది. అందుకే, నా గురించి నేను ఆలోచిస్తా. ఇతరులేం చేస్తున్నారో తెలుసుకోను. వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వను. ఎందుకంటే, నా ఖర్చులు వాళ్లు భరించరు. నా అవసరాలు కూడా తీర్చరు. నాకేదైనా సమస్య వస్తే నేనే పరిష్కరించుకోవాలి. అందుకే నా అభిప్రాయం ప్రకారం నేను ముందుకు సాగుతుంటా’’ అని నిర్మొహమాటంగా తన మనసులోని మాటలు బయటపెట్టారు.