భారత్ లో ఇంటి ఖర్చులు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. గత దశాబ్ధ కాలంగా ఇది ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో 2011-12 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో తలసరి నెలవారీ గృహ వ్యయం రెట్టింపుకు పైగా పెరిగిందనే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) తాజా సర్వే గణాంకాలు చెబుతున్నాయి.
గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) పేరుతో 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య కాలంలో ఈ సర్వే జరిగింది. ఇందులో భారత్‌లో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.2,630 ఉండగా, 2022-23 నాటికి రెట్టింపు పెరిగి రూ.6,459కి చేరింది.
గ్రామీణ కుటుంబాల ఖర్చులు కూడా ప్రస్తుత ధరల ప్రకారం 2012 ఆర్థిక సంవత్సరంలో రూ .1,430 నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .3,773 కు పెరిగాయి.
2011-12 ధరల వద్ద సగటు ఎంపీసీఈ 2012 ఆర్థిక సంవత్సరంలో రూ.2,630 నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .3,510కు పెరిగింది. 2012 ఆర్థిక సంవత్సరంలో రూ .1,430 ఉండగా 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.2,008కి చేరింది.
పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత ధరల ప్రకారం 2012 ఆర్థిక సంవత్సరంలో రూ.2,630గా ఉన్న సగటు ఎంపీసీఈ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.6,521కి, గ్రామీణ ప్రాంతాల్లో 2012 ఆర్థిక సంవత్సరంలో రూ.1,430 ఉంది. ఆ మొత్తం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.3,860కి చేరింది.
దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన కేంద్ర నమూనాలో గ్రామీణ ప్రాంతాల్లో 1,55,014 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 1,06,732 గృహాలతో కలిపి మొత్తం 2,61,746 ఇళ్ల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా వ్యయాల అంచనాలను లెక్కించారు. గణాంకాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వరుసగా మొదటి వినియోగదారుల వ్యయ సర్వే (సిఇఎస్) ఇది, రెండవది ప్రస్తుతం ఆగస్టు 2023 నుండి 12 నెలల కాలానికి కొనసాగుతోంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ), ప్రధాన ద్రవ్యోల్బణ రేటును అర్థం చేసుకోవడానికి ఈ సర్వే ముఖ్యమైనది.
Comments
Please login to add a commentAdd a comment