న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రయాణ సమయాల్లో వ్యయాలకు సంబంధించి అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల (ఐసీసీ) వినియోగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెమిటెన్స్ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) పరిధిలోకి తీసుకుని వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది.
ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన
దీని ప్రకారం అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా విదేశీ మారకంలో చేసే వ్యయాలు ఇకపై ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి వస్తాయి. ఒక రెసిడెంట్ రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా సంవత్సరానికి గరిష్టంగా 2.5 లక్షల డాలర్ల వరకూ వ్యయం చేసే అవకాశం ఏర్పడింది. 2.5 లక్షల డాలర్లు, లేదా మరేదైన విదేశీ కరెన్సీలో దానికి సమానమైన మొత్తానికి మించిన చెల్లింపులకు (రెమిటెన్స్) ఆర్‌బీఐ నుంచి అనుమతి అవసరం అవుతుంది.
అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ఎల్‌ఆర్‌ఎస్‌లో చేర్చడానికి సంబంధించి విదేశీ మారక నిర్వహణ (కరెంట్ అకౌంట్ లావాదేవీలు) (సవరణ) రూల్స్, 2023ని మంత్రిత్వ శాఖ మే 16న నోటిఫై చేసినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్‌బీఐతో సంప్రదింపులతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో..
Comments
Please login to add a commentAdd a comment