=నకిలీల ఆటలు సాగనివ్వం
=ఆయుధాలు ధరించి తిరిగితే ఊరుకునేది లేదు
=కానిస్టేబుళ్ల పనితీరు భేష్
=నాటి అమరులు త్యాగాలతోనే ప్రశాంతమైన వాతావరణం
=పరకాల ఠాణాను సందర్శించిన డీఐజీ కాంతారావు
పరకాల, న్యూస్‌లైన్ : డబ్బు సంపాదన కోసమే కొందరు నక్సలైట్ల ముసుగు వేసుకుంటున్నారని, అలాంటి నకిలీల ఆటలు సాగనివ్వమని, ఎవరైనా ఆ యుధాలు ధరించి తిరిగితే ఊరుకునేది లేదని వరంగల్ రేంజ్ డీఐజీ ఎం. కాంతారావు హెచ్చరించారు. పరకాల పోలీస్‌స్టేషన్‌ను ఆయన శు క్రవారం సందర్శించారు. పోలీసుల గౌరవ వం దనం స్వీకరించి, వారి పనితీరుపై ఆరా తీశా రు. ఒక్కో కానిస్టేబుల్ పేరు, అతడు నిర్వర్తిస్తున్న విధుల వివరాలను అడిగి తెలుసుకున్నా రు. గ్రామాలవారీగా క్రైం రేటు ఎలా ఉంది.. రౌడీషీటర్లు ఎందరున్నారు.. మావోలు, మాజీ లు ఎంతమంది ఉన్నారంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆరేళ్ల తర్వాత పరకాల పోలీస్ స్టేషన్‌ను డీఐజీ కేడర్ అధికారి సందర్శించడం జరిగిందన్నారు. నక్సలైట్ల పేరుతో తిరిగిన నకిలీలను పట్టుకున్నట్లు తెలిపారు. నిజాం రజాకార్లతో పోరాడి ప్రాణాలు అర్పించిన వీరులు పుట్టిన గడ్డ పరకాల అని కొనియూడారు. వారి త్యాగాలతోనే నేడు మనం ప్రశాంతంగా జీవిం చగలుతున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారి గా పరకాల, వరంగల్‌తోపాటు ఖమ్మం జిల్లా లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. విద్రోహ శక్తులు, ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడం కోసం వీటిని రహస్య ప్రాంతాల్లో పెట్టి నిఘా ఉంచుతామని తెలిపారు. మహిళలు, పిల్లల హక్కుల రక్షణ కోసం పోలీసులు నిరంతరం పని చేస్తున్నారన్నారు.
పోలీస్ క్వార్టర్ల సందర్శన
ఈ సందర్భంగా డీఐజీ స్టేషన్ ఆవరణలోని క్వార్టర్లను డీఐజీ సందర్శించారు. కానిస్టేబుళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను డీఐజీ అడిగి తెలుసుకున్నారు. క్వార్టర్లలో డ్రైనేజీ వ్యవస్థ లేద ని, వర్షానికి తడిసిన గోడలు షాక్ కొడుతున్నాయని చెప్పడంతో డీఐజీ క్వార్టర్లలోకి వెళ్లారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డీఎస్పీ, సీఐని ఆదేశించారు. అలాగే పరకాల, రేగొండ మండలాల్లో ఇటీవల ప్రమాదవశాత్తు ఇళ్లు కాలిపోయిన బాధిత కుటుంబాలకు డీఐజీ దుస్తులు, బియ్యం, వంట పాత్రలను పంపిణీ చేశారు. పోలీసుల ఔదార్యంతోనే వీటిని అందిస్తున్నామని తెలిపారు.
కుంకుమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
పట్టణంలోని కాకతీయులునాటి కుంకుమేశ్వర ఆలయంలో డీఐజీ కాంతారావు ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయ అర్చకులు కోమాళ్లపల్లి సంపత్‌కుమార్‌శర్మ డీఐజీకి పూజలు చేయించి ఆలయ చరిత్రను వివరించారు. సంప్రదాయ పద్ధతిలో డీఐజీని సన్మానించారు.
కానిస్టేబుల్‌కు డీజీఐ అభినందనలు
విధులు సక్రమంగా నిర్వహించిన కానిస్టేబుల్‌ను డీఐజీ కాంతారావు వెరీ గుడ్ అని అభినందించారు. 1996 బ్యాచ్‌కు చెందిన ఎం. సురేష్ పర్సనల్ డైరీని చూసిన డీఐజీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. 15 దొంగతనాల కేసులను చే ధించినట్లు చెప్పడంతో కరచాలం చేసి అభినందించారు. డీఐజీ వెంట పరకాల డీఎ స్పీ పి.సంజీవరావు, సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు, ఎస్సై వినయ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
డబ్బు సంపాదనకే నక్సలైట్ల ముసుగు
Published Sat, Dec 21 2013 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement