
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల వ్యయాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. లోక్‌సభ ఎన్నికలకు రూ. 77 లక్షలు, అసెంబ్లీ ఎన్నికలకు రూ. రూ.30.80 లక్షలు ఎన్నికల వ్యయంగా నిర్ణయించింది. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలో సవరణ చేసినట్లు కేంద్రం పేర్కొంది. సవరించిన నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయన్న కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.