రాష్ట్రంలో లోక్‌సభకు,అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు
హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ (ఈసి) వర్గాల సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గాలు ఉన్న స్థితిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు. 2019 ఎన్నికలకే నియోజకవర్గాల పునర్‌విభజన చేస్తారు.
మార్చి 4-6 తేదీల మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. మే మూడోవారంలో ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. మార్చి నాటికి రాష్ట్ర విభజన జరిగే అవకాశం లేదు. అందువల్ల ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రకారం ఎన్నికలు జరిగిన తరువాతే రాష్ట్ర విభజన జరుగుతుందని స్పష్టమవుతోంది.