న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తాము ఆదేశించలేమని, అది సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కోర్టు మంగళవారం కొట్టివేసింది. ‘ఇది కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అంశం కాదు. మీ ఆలోచన మంచిదే కావచ్చు. కానీ సాధ్యం కాదు’ అని తెలిపింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సామాజిక కార్యకర్త సలేక్ చంద్ జైన్ ఇటీవల పిల్ దాఖలు చేశారు.
‘ఒకేసారి’ ఎన్నికలు సాధ్యం కాదు!
Published Wed, Nov 9 2016 3:11 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement