అందరికీ ఉచిత సెల్‌ఫోన్లు: చంద్రబాబు | Free cell phones to be given everyone, if TDP come to power: chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అందరికీ ఉచిత సెల్‌ఫోన్లు: చంద్రబాబు

Published Wed, Mar 19 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

అందరికీ ఉచిత సెల్‌ఫోన్లు: చంద్రబాబు

అందరికీ ఉచిత సెల్‌ఫోన్లు: చంద్రబాబు

టీడీపీలో కొట్టు, హరివర్ధన్‌రెడ్డి చేరిక
 సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా సెల్‌ఫోన్లు అందిస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల్లో పది శాతం మందికి సెల్‌ఫోన్లు లేవని, తమ పార్టీ అధికారంలోకి వస్తే వారికి ఫోన్లు ఉచితంగా అందిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా చంద్రబాబు మంగళవారం తన నివాసంలో జరిగిన సభలో ప్రసంగించారు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తానేనన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేవన్నారు. టీడీపీ పని అయిపోయిందని కొందరు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్రేన్‌తో లే పినా లేచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement