
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సినీ నటుడు అల్లరి నరేష్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన నరేష్ దంపతులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వ్రస్తాలు బహూకరించారు.