సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు అమలు చేస్తామని శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వరివేస్తే రైతులకు రైతు బంధు ఆపాలని తెలిపిన అధికారుల సూచనలను కేసీఆర్ తిరస్కరించారు. అధికారుల సూచనలపై తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించిన సీఎం.. రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు
దళిత బంధు పథకాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దళితబంధుపై విపక్షాల రాద్ధాంతం చేస్తున్నాయని, వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేసీఆర్ స్పష్టంచేశారు. మొదట హుజురాబాద్‌తో పాటు నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో దళితబంధు అమలు చేస్తామని, తరువాత రాష్ట్ర వాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment