తొలి జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అక్కడి కాప్స్
హెచ్‌ఐసీసీలో కాన్ఫరెన్స్‌కు వచ్చిన ప్రైవేట్ ఉద్యోగి
ల్యాప్‌టాప్, నగదు ఉన్న బ్యాగ్ చోరీ చేసిన దొంగలు
స్వస్థలానికి వెళ్లి కూబన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) అమలులోకి వచి్చన 20 రోజులకు అందులోని నిబంధనల ఆధారంగా కర్ణాటక రాజధాని బెంగళూరు పోలీసులు తొలి జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అక్కడి కూబన్ పార్క్ పోలీసుస్టేషన్‌లో శనివారం నమోదైన ఈ కేసు సైబరాబాద్ పరిధిలో జరిగిన నేరంపై కావడం గమనార్హం. ఈ కేసును ఇక్కడి పోలీసులకు బదిలీ చేయడానికి ఆ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. బెంగళూరులోని వసంత్‌నగర్‌కు చెందిన అపూర్వ్ ప్రకాష్ అక్కడి విఠల్ మాల్యాలోని ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి.
ఈ నెల 9న గచి్చ»ౌలిలోని హెచ్‌ఐసీసీలో జరిగిన ఓ సదస్సుకు ఆయన హాజరయ్యారు. తన ల్యాప్‌టాప్, రూ.70 వేల నగదుతో కూడిన బ్యాగ్ తస్కరణకు గురైనట్లు సదస్సు పూర్తయిన తర్వాత గమనించారు. ఆ రోజు సాయంత్రమే బెంగళూరు తిరిగి వెళ్లాల్సి ఉండటం, విమాన టిక్కెట్లు సైతం బుక్ కావడంతో వెంటనే పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోయారు. దీంతో బెంగళూరు వెళ్లిన ప్రకాష్ శనివారం కూబన్ పార్క్ ఠాణాలో కంప్‌లైంట్ ఇచ్చారు.
బీఎన్‌ఎస్‌ఎస్ అమలులోకి రాకముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆరీ్పసీ) అమలులో ఉండేది. దీని ప్రకారం జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. దీంతో బా«ధితులు నేరం జరిగిన ప్రాంతం ఏ ఠాణా పరిధిలోకి వస్తే అక్కడకే ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. అయితే బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్ 173 ప్రకారం దేశంలోని ఏ ప్రాంతంలో బాధితుడిగా మారినా తమకు ఉన్న అవకాశాన్ని బట్టి ఏదైనా ఠాణాలో ఫిర్యాదు చేయవచ్చు.
దీని ప్రకారం కేసు నమోదు చేయడం ఫిర్యాదు స్వీకరించిన పోలీసుల బాధ్యత. దీంతో ప్రకాష్ శనివారం కూబన్ పార్క్ ఠాణాకు వెళ్లి సైబరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో తస్కరణకు గురైన బ్యాగ్‌పై ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కూబన్ పార్క్ పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 305 (ఎ) ప్రకారం జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును సైబరాబాద్‌కు పంపాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. అక్కడ నుంచి గచి్చ»ౌలి ఠాణాకు ఈ కేసు చేరిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నెంబర్‌తో రీ–రిజిస్టర్ చేసే పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో పాటు ఘటనాస్థలి సందర్శన, పంచనామా నిర్వహణ తదితర ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment