వీడియో గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతలో దూసుకుపోతోందని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్(ఐడీజీసీ)-2024 బుధవారం 16వ ఎడిషన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్‌ఐసీసీ)లో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గేమింగ్ డెవలపర్లు, గేమింగ్ స్టూడియోలు, ఇతర గేమింగ్ ఔత్సాహికులు తమ ఆలోచనలు పంచుకోనున్నారు.
ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ..‘ప్రభుత్వం గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ రంగంలో అధిక నాణ్యత ప్రతిభావంతులను తయారు చేసేందుకు పని చేస్తోంది. ప్రపంచ గేమింగ్ రంగంలో ఇండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. వీడియో గేమింగ్, ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ, రియల్ మనీ గేమింగ్ ఇండస్ట్రీకి మధ్య స్పష్టమైన తేడా ప్రభుత్వానికి తెలుసు. వీడియో గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతలో ముందంజలో ఉంది’ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీడీఏఐ) ఛైర్‌పర్సన్ శ్రీధర్ ముప్పిడి మాట్లాడారు. వీడియో గేమ్ డెవలపర్‌లు, వీడియో గేమింగ్ స్టూడియోలు ఈ పరిశ్రమలో ఇతర వాటాదారులతో ప్రాతినిధ్యం వహించేలా అపెక్స్ బాడీగా జీడీఏఐ వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు
ఈ ఈవెంట్ మొదటి రోజున 6000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం నవంబర్ 15 వరకు జరుగుతుందన్నారు. ఐజీడీసీ 2024 100+ గ్లోబల్, లోకల్ గేమింగ్ డెవలపర్‌లు, పబ్లిషర్‌లు, సందర్శకులకు వేదికగా నిలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment