రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి
సాక్షి, నెట్‌వర్క్: పెద్ద నోట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారుు. నోట్ల మార్పిడికి వెళ్లిన ముగ్గురు వేర్వేరు ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయారు.
వైద్యానికి డబ్బుల్లేక..: వైద్యం చేరుుంచుకునేందుకు డబ్బులందక గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రుకు చెందిన గొట్టిపాటి ప్రసాద్(35) మృతి చెందాడు.ప్రసాద్‌కు జ్వరం,పచ్చకామెర్లు వచ్చారుు. చికిత్స కోసం గుంటూరు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.ప్రసాద్ తల్లిదండ్రులు అకౌంట్లో ఉన్న డబ్బులు తెచ్చుకునేందుకు బ్యాంకు, ఏటీఎంల చుట్టూతిరిగా రు.ప్రయోజనం లేకపోవడంతో డబ్బులు తర్వాత ఇస్తామని ప్రాధేయపడటంతో వైద్యులు సమ్మతించి, స్కానింగ్ చేరుుంచమని సూచించారు. దీనికి ఇబ్బందులు ఏర్పడి చివరకు వైద్యం అందక ప్రసాద్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
రుణం చెల్లించడానికి వెళ్లి..: చిత్తూరులోని కాజూరు కాలనీకు చెందిన రత్నం పిళ్లై (72) గతేడాది శేషాపిరాన్‌వీధిలోని ఇండియన్ బ్యాంకులో బంగారు నగలు కుదవపెట్టి రుణం తీసుకున్నాడు. ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేయడంతో పిళ్లై తన వద్ద ఉన్న రూ.500 నోట్లతో రుణం చెల్లించేందుకని కుమారుడు ప్రసాద్‌తో కలసి బుధవారం ఉదయం బ్యాంకుకు వెళ్లాడు. పిళ్లై క్యూ లైన్‌లో ఉండగా, రుణం విషయం మాట్లాడ టానికి ప్రసాద్ బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లాడు. అయితే అరగంటకు పైగా క్యూలైన్‌లో నిలబడ్డ పిళ్లై కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో ఆయన తలకు దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. కొడుకు తండ్రిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
గుండెపోటుతో వృద్ధురాలి మృతి
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామానికి చెందిన కనకమేడల విజయలక్ష్మి(71) బుధవారం నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందింది. విజయలక్ష్మి తన వద్ద ఉన్న రెండు రూ.500 నోట్లు మార్చుకునేందుకు మేనకోడలు కస్తూరితో ఉయ్యూరులోని ఎస్‌బీఐ బ్రాంచ్ వద్దకు వచ్చింది. ఆటో దిగి బ్యాంకు లోపలకు వెళ్తున్న క్రమంలో గుండెపోటు వచ్చి కుప్పకూలింది.
ప్రాణం తీసిన పెద్ద నోట్లు
Published Thu, Nov 17 2016 1:06 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM
Advertisement
Advertisement