‘హెల్త్’ బిజినెస్ | 'Health' Business | Sakshi
Sakshi News home page

‘హెల్త్’ బిజినెస్

Published Thu, Apr 7 2016 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

'Health' Business

వైద్యం.. వ్యాపారం
నగరంలో పెరుగుతున్న ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు
హోర్డింగులతో రోగులకు వల
సీఐ నిబంధనలు గాలికి  అక్రమార్జన కోసం అర్రులు చాస్తున్న పలువురు డాక్టర్లు

 

ఎంజీఎం : బట్టల దుకాణాల్లో డిస్కౌంట్లతో ప్రజలను ఆకర్షించే ప్రకటనలు మనం ఇప్పటి వరకు చూశాం..  వన్‌ప్లస్ వన్ స్కీమ్‌తో వినియోగదారులను తమవైపునకు తిప్పుకునే షాపింగ్‌మాల్స్‌ను కూడా గమనిస్తున్నాం. అయితే ఈ ట్రెండ్ ప్రస్తుతం వైద్య రంగానికి కూడా ఎగబాకింది. లండన్‌లో ప్రముఖ వైద్యుడు.. అమెరికాలో పేరుగాంచిన గొప్ప డాక్టర్.. మా ఆస్పత్రికి వస్తున్నారు.. మేము చేయబోయే శస్త్రచికిత్సల్లో ఆయన కూడా పాల్గొంటారు.. మా ఆస్పత్రిలో మెరుగైనా వైద్యం అందిస్తాం.. ఫలానా శస్త్ర చికిత్సలు అవసరమున్న వారు ఈ సెల్‌నంబర్ ద్వారా తమ పేరు రిజిస్టర్ చేసుకోండి.. అంటూ నగరంలోని పలు ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు ఇప్పుడు కొత్తరకం వైద్య వ్యాపారానికి తెరతీస్తున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను తుంగలో తొక్కుతూ తమ నర్సింగ్ హోమ్ వైపునకు రోగులు తరలివచ్చేలా పత్రికల్లో ప్రకటనలు వేరుుస్తూ.. ప్రధానకూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేరుుస్తూ ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారుు.

 
జోరుగా ప్రచారం..

నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు రోగులను ఆకర్షించుకునేందుకు ప్రచారమే ప్రధాన అస్త్రంగా భావిస్తున్నాయి. నగరంలో ప్రధాన హోర్డింగుల నుంచి మొదలుపెడితే ప్రజలు వెళ్లే ఆటో రిక్షాలను వరకు దేనిని వదిలిపెట్టడం లేదు. వీటితోపాటు ఎఫ్‌ఎం రేడియోలు, వైద్య సంఘాలైన ఐఎంఏ, తానా వంటి సంఘాలు చేసే కార్యక్రమాల్లో సైతం తమ నర్సింగ్ హోమ్‌ల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ప్రధాన అకర్షణగా ప్రదర్శిస్తూ ప్రచారం కల్పిస్తున్నారు. అసలు ప్రచారాల్లో ఆయా నర్సింగ్ హోమ్‌ల వైద్యులు పేర్లు ఉండకూడదనేది ఎంసీఐ స్పష్టం చేస్తుంది. కానీ.. వైద్యుడు ఇంటి పేరుతో కానీ.. ఆయన పేరుతో ఆస్పత్రి నెలకొల్పిన కొంత మంది వైద్యులు తెలివిగా ఐఎంఎలో కీలకంగా వ్యవహరిస్తూ తమదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చడం వైద్యవర్గాల్లో సైతం విస్మయాన్ని కలిగిస్తుంది.

 
నాన్ మెడికల్ వ్యాపారుల హవా...

పెద్ద పెద్ద నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నస్టిక్స్ కేంద్రాలు, మెడికల్ కళాశాలలు నెలకొల్పి ప్రచారాన్ని అస్త్రంగా చేసుకుని వైద్య రంగాన్ని పూర్తి వ్యాపార రంగంగా మార్చుకుంటూ అడుగులు వేస్తున్నారుు. ఈ క్రమంలో ప్రజల ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య స్థితిగతులను పక్కకు నెట్టి వైద్య మాఫియాగా మారి ధనదోపిడే లక్ష్యంగా కార్పొరేట్ ముసుగులో యథేచ్ఛగా వైద్య వ్యాపారం సాగిస్తున్నారు. కాగా, కొందరు డాక్టర్లు చేస్తున్న ఈ వ్యాపారానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల అండదండలు పుష్కలంగా ఉండడం గమనార్హం.

 
అమెరికా వైద్యుడి రాక పేరుతో వ్యాపారం..

నగరంలోని జేపీఎన్ రోడ్డులో ఉన్న ఓ ఆస్పత్రిలో ఈనెల 13న జరిగే కీలు మార్పిడి శస్త్రచికిత్సకు అమెరికా కు చెందిన వైద్యు నిపుణులు వస్తున్నారని నిర్వాహకులు ఏకంగా ఓ పత్రికలో ప్రకటన చేయడం వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతే కాకుండా సదరు వైద్యుడు శస్త్ర చికిత్సలో పాల్గొనడంతోపాటు ఏకంగా అతడి వద్ద వైద్య సలహాలు తీసుకునేందుకు రోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నంబర్‌ను సైతం వ్యాపార ప్రకటనలా ఇవ్వడం చర్చనీయూంశంగా మారింది. ఇలాంటి ప్రకటనలు వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ యజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎంసీఐని లెక్క చేయడం లేదని తెలుస్తుంది.

 

ప్రకటనలు నిబంధనలకు విరుద్ధం..
డాక్టర్లు తమ పేరుతో ప్రకటనలు చేసుకోవడం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధం. నగరంలో ఆస్పత్రులు ప్రారంభించే వైద్యులు విదేశాల్లో ఏదైనా కోర్సు పూర్తి చేసి పునః ప్రారంభ సమయంలో మాత్రమే ప్రకటనలు చేసుకోవాలి. అంతేకాకుండా భారీ హోర్డింగులతో, కరపత్రాలతో ప్రచారం చేసుకోవడం ఎంసీఐ నిబంధనలకు విరు ద్ధం. ఇలాంటి ప్రకటనలపై చర్యలు తీసుకునేందుకు నాలుగు రోజులు క్రితం హైదరాబాద్‌లో ఎంసీఐ సమావేశం నిర్వహించాం. నగరంలో ఇటీవల జరిగిన కార్యక్రమంపై విచారణ చేసి చర్యలు చేపడుతాం.      -రాజ్‌సిద్ధార్థ్,   తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటీవ్  సభ్యుడు

 

విదేశీ వైద్యుల రాక ప్రకటన సరికాదు
విదేశీ వైద్యులు మా నర్సింగ్ హోమ్‌కు వస్తున్నారు.. రోగులు ఈ నంబర్‌కు ఫోన్ చేసి తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ప్రకటనలు చేసుకోవడం ఎంసీఐ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఎవరైనా విదేశీ వైద్యులు ఎంసీఐ తాత్కాలిక అనుమతితోనే కాన్ఫరెన్స్ శస్త్ర చికిత్సల్లో మాత్రమే పాల్గొనాలి. వ్యక్తిగత నర్సింగ్ హోమ్‌లలో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధం.  -డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, ఐఎంఏ క్రమశిక్షణ సంఘం చైర్మన్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement