శరీర పనితీరుకు అవసరమైన కీలక మూలకం బీ12. అలాంటి బీ12తో జన్యు ఉత్ఫరివర్తనాలను రక్షించే డీఎన్‌ఏని సంశ్లేషించగలదని, దీంతో ఎన్నో రకాలా దీర్ఘకాలిక వ్యాధులతో సులభంగా పోరాడగలుగుతామని పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడించారు. అలాగే కణజాల పునరుత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు. ఈ బీ12 ఉపయోగాలు, ఎంతెంత మోతాదులో మానవులకు అవసరమో తదితర విశేషాల గురించే ఈ కథనం!.
ఐఆర్‌బీ బార్సిలోనా పరిశోధకులు సెల్యులర్ రీ ప్రోగ్రామింగ్‌కి బీ12 ఎలా అవసరమో తమ అధ్యయనంలో వెల్లడించారు. అందుకోసం పెద్దప్రేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఆ ఎలుకలకు విటమిన్ బీ12 సప్లిమెంట్స్ ఇవ్వగా.. అది ఎలుకల కడుపులోని పొరను సరిచేసేలా పేగు కణాలు సెల్యులార్‌ని రీప్రోగ్రామింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు గుర్తించారు. అసలు ఈ సెల్యులర్ రీప్రోగామింగ్‌కి ఎలా విటమిన్ సరిపొతుందనే దిశగా మరింత లోతుగా అధ్యయనం చేయగా..బీ12 మిథైలేషన్ జీవక్రియను సులభతం చేయగలదని తెలుసుకున్నారు.
నిజానికి కణజాల మరమత్తుకి మెదడు పనిచేసే కణాల డీఎన్‌ఏకి అధిక మొత్తంలో మిథైలేషన్ అవసరం. ఆ లోటును బీ12 భర్తి చేస్తుందని కనుగొన్నారు. అందువల్ల ఈ విటమిన్‌ని ఏదోరూపంలో శరీరానికి అందిస్తే దెబ్బతిన్న కణాజాల త్వరితగతిన రీప్రోగ్రామింగ్ చేయబడుతుందన్నారు. చెప్పాలంటే ముందుగా ఇది జన్యు పనితీరును మెరుగుపరిచడంతో చాలా సులభంగా కణజాలం రీప్రోగ్రామింగ్ చేయబడుతుందని తమ పరిశోధనల్లో వెల్లడించారు. ఇది చేతుల వాపులను కూడా తగ్గిస్తుందన్నారు. ఈ విటమిన్ దీర్ఘకాలిక వ్యాధులు, వయసు రీత్యా వచ్చే వ్యాధుల్లో పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు.
వయసు పైబడిన ఎలుకలకు అధిక విటమిన్ B12 ఇవ్వగా వాటి రక్తప్రవాహంలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ IL-6, సీఆర్‌పీ స్థాయిలపై విలోమ ప్రభావాన్ని చూపుతునట్లు కనుగొన్నారు. అందువల్ల ఇది వయసు రీత్యా వచ్చే వ్యాధులను ఎదుర్కొవడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. దీన్ని ఆహారం నుంచి మాత్రమే తీసుకోగలం. పరిమిత మోతాదులో తీసుకోవడమే మంచిదన్నారు. వయసు రీత్యా పురుషులు, స్త్రీలు ఎంతెంత మోతాదుల్లో తీసుకోవాలి, అలాగే గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా వివరించారు.
నిజానికి ఈ బీ12 విటమిన్ చేపలు, కాలేయం, ఎర్ర మాంసం, గుడ్లు, పాలు, చీజ్ వంటి ఉత్పత్తుల్లో లభిస్తుంది. ఇవేగాక ఈస్ట్ ఉత్పత్తులైన పట్టగొడుగులు, కొన్ని రకాల మొక్కలు, తృణధాన్యాల్లో కూడా ఉంటుందని అన్నారు. బలహీనమైన కండరాలు, వికారం, అలసట, అకస్మాత్తుగా హృదయ స్పందన రేటు పెరిగిపోవడం, ఎర్రరక్త కణాలు తక్కువగా ఉండటం తదితర సమస్యలను సులభంగా చెక్కుపెడుతుంది ఈ విటమిన్ బీ12. తద్వారా అనే రకాల దీర్ఘకాలిక రుగ్మతలు బారిన పడకుండా సురక్షితం ఉండగలుగుతామని నేచర్ మెటబాలిజం జర్నల్ వెల్లడించారు పరిశోధకులు.
(చదవండి: ఎక్స్‌ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?)
Comments
Please login to add a commentAdd a comment