Vitamin B-12
-
సెల్యులర్ రీప్రోగ్రామింగ్కి ఆ విటమిన్ అత్యంత కీలకం!
శరీర పనితీరుకు అవసరమైన కీలక మూలకం బీ12. అలాంటి బీ12తో జన్యు ఉత్ఫరివర్తనాలను రక్షించే డీఎన్ఏని సంశ్లేషించగలదని, దీంతో ఎన్నో రకాలా దీర్ఘకాలిక వ్యాధులతో సులభంగా పోరాడగలుగుతామని పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడించారు. అలాగే కణజాల పునరుత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు. ఈ బీ12 ఉపయోగాలు, ఎంతెంత మోతాదులో మానవులకు అవసరమో తదితర విశేషాల గురించే ఈ కథనం!. ఐఆర్బీ బార్సిలోనా పరిశోధకులు సెల్యులర్ రీ ప్రోగ్రామింగ్‌కి బీ12 ఎలా అవసరమో తమ అధ్యయనంలో వెల్లడించారు. అందుకోసం పెద్దప్రేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఆ ఎలుకలకు విటమిన్ బీ12 సప్లిమెంట్స్ ఇవ్వగా.. అది ఎలుకల కడుపులోని పొరను సరిచేసేలా పేగు కణాలు సెల్యులార్ని రీప్రోగ్రామింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు గుర్తించారు. అసలు ఈ సెల్యులర్ రీప్రోగామింగ్కి ఎలా విటమిన్ సరిపొతుందనే దిశగా మరింత లోతుగా అధ్యయనం చేయగా..బీ12 మిథైలేషన్ జీవక్రియను సులభతం చేయగలదని తెలుసుకున్నారు. నిజానికి కణజాల మరమత్తుకి మెదడు పనిచేసే కణాల డీఎన్ఏకి అధిక మొత్తంలో మిథైలేషన్ అవసరం. ఆ లోటును బీ12 భర్తి చేస్తుందని కనుగొన్నారు. అందువల్ల ఈ విటమిన్‌ని ఏదోరూపంలో శరీరానికి అందిస్తే దెబ్బతిన్న కణాజాల త్వరితగతిన రీప్రోగ్రామింగ్ చేయబడుతుందన్నారు. చెప్పాలంటే ముందుగా ఇది జన్యు పనితీరును మెరుగుపరిచడంతో చాలా సులభంగా కణజాలం రీప్రోగ్రామింగ్ చేయబడుతుందని తమ పరిశోధనల్లో వెల్లడించారు. ఇది చేతుల వాపులను కూడా తగ్గిస్తుందన్నారు. ఈ విటమిన్ దీర్ఘకాలిక వ్యాధులు, వయసు రీత్యా వచ్చే వ్యాధుల్లో పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు. వయసు పైబడిన ఎలుకలకు అధిక విటమిన్ B12 ఇవ్వగా వాటి రక్తప్రవాహంలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ IL-6, సీఆర్పీ స్థాయిలపై విలోమ ప్రభావాన్ని చూపుతునట్లు కనుగొన్నారు. అందువల్ల ఇది వయసు రీత్యా వచ్చే వ్యాధులను ఎదుర్కొవడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. దీన్ని ఆహారం నుంచి మాత్రమే తీసుకోగలం. పరిమిత మోతాదులో తీసుకోవడమే మంచిదన్నారు. వయసు రీత్యా పురుషులు, స్త్రీలు ఎంతెంత మోతాదుల్లో తీసుకోవాలి, అలాగే గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా వివరించారు. నిజానికి ఈ బీ12 విటమిన్ చేపలు, కాలేయం, ఎర్ర మాంసం, గుడ్లు, పాలు, చీజ్ వంటి ఉత్పత్తుల్లో లభిస్తుంది. ఇవేగాక ఈస్ట్ ఉత్పత్తులైన పట్టగొడుగులు, కొన్ని రకాల మొక్కలు, తృణధాన్యాల్లో కూడా ఉంటుందని అన్నారు. బలహీనమైన కండరాలు, వికారం, అలసట, అకస్మాత్తుగా హృదయ స్పందన రేటు పెరిగిపోవడం, ఎర్రరక్త కణాలు తక్కువగా ఉండటం తదితర సమస్యలను సులభంగా చెక్కుపెడుతుంది ఈ విటమిన్ బీ12. తద్వారా అనే రకాల దీర్ఘకాలిక రుగ్మతలు బారిన పడకుండా సురక్షితం ఉండగలుగుతామని నేచర్ మెటబాలిజం జర్నల్ వెల్లడించారు పరిశోధకులు. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
Summer Drinks: మ్యాంగో మస్తానీ.. ఇందులోని సెలీనియం వల్ల..
Summer Drinks- Mango Mastani Recipe: మంచి ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక మ్యాంగో మస్తానీ తాగితే దాహం తీరుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మస్తానీ తాగే కొద్ది తాగాలనిపిస్తుంది. ఈ ఒక్క జ్యూస్ తాగడం వల్ల.. విటమిన్ ఎ, బి2, బి6, బి12, సి, డి, క్యాల్షియం, అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, పీచుపదార్థం, ఫోలేట్, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియంలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్ అయిన సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. మ్యాంగో మస్తానీ తయారీకి కావాల్సినవి: మామిడి పండు ముక్కలు – కప్పు, చల్లటి క్రీమ్ మిల్క్ – కప్పు, జాజికాయ పొడి – చిటికెడు, ఐస్‌క్యూబ్స్ – పావు కప్పు, పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఐస్‌క్రీమ్ – రెండు స్కూపులు, చెర్రీ, పిస్తా, బాదం పప్పు, టూటీప్రూటీ, మామిడి ముక్కలు – గార్నిష్‌కు సరిపడా, ఉప్పు – చిటికెడు. మ్యాంగో మస్తానీ తయారీ విధానం: ►మామిడి పండు ముక్కల్ని బ్లెండర్లో వేయాలి. ►దీనిలో పంచదార, జాజికాయ పొడి, ఉప్పు వేసి ప్యూరీలా గ్రైండ్ చేయాలి. ►ఈ ప్యూరీలో పాలు, ఐస్‌క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంగుళం గ్యాప్ ఉండేలా గ్లాసులో పోయాలి. ►గ్లాసులో గ్యాప్ ఉన్న దగ్గర ఐస్‌క్రీమ్, మామిడి పండు ముక్కలు, డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: రోజు గ్లాసు బీట్రూట్ – దానిమ్మ జ్యూస్ తాగారంటే.. -
Health Tips: విటమిన్ బి 12 లోపమా.. ఇవి తిన్నారంటే..
శరీరానికి అత్యంత అవసరమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ బి12 ఒకటి. ఇది నీటిలో కరిగే విటమిన్. రక్తహీనత నుంచి మతిమరుపు వరకు.. నరాల బలహీనత నుంచి డిప్రెషన్ వరకు ఎన్నో రకాలుగా ఇది మనల్ని ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి 12 తగినంత లేకపోతే ముఖ్యంగా ఎదరయ్యే సమస్య అరికాళ్లు, అరచేతుల తిమ్మిర్లు. ఇది లోపించిందో, తగినంత ఉందో అని తెలుసుకునేందుకు చేసే పరీక్ష కాసింత ఖరీదైనదే. అయితే మనకు ఎదురయ్యే కొన్ని సమస్యల ద్వారా ఈ పోషక లోపం ఉన్నట్లు అర్థం చేసుకుని దీనిని భర్తీ చేసేందుకు తగిన ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ పోషకం సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు తీసుకోకపోతే విటమిన్ బి12 లోపం ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. మన శరీరం దీన్ని సొంతంగా తయారు చేసుకోలేదు. అంతేకాదు.. ఇది శాకాహార పదార్థాల నుంచి పెద్దగా లభించదు కూడా. అందుకే దాదాపు 80 శాతం వీగన్లు, వెజిటేరియన్లకు విటమిన్ బి12 లోపం ఉంటుంది. విటమిన్ బి12 తక్కువగా ఉండడం వల్ల శరీరం వివిధ రకాలు గా ప్రభావితమవుతుంది. విటమిన్ బీ 12 లోపం మూడ్ స్వింగ్స్కు కారణమైతే మరికొందరిలో డిప్రెషన్‌కు కూడా దారి తీస్తుంది. విటమిన్ బి12 సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకునే వీలుంటుంది. ఇతర లక్షణాలు: కళ్లు తిరగడం: విటమిన్ బి12 మన శరీరంలో ఆరోగ్యకరమైన రక్త కణాలను తయారుచేస్తుంది. బి12 లోపిస్తే.. రక్తకణాలు తక్కువగా ఉండడంతో శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణవాయువు సరఫరా తగ్గుతుంది. తద్వారా అలసట ఎక్కువవుతుంది. మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వల్ల కళ్లు తిరిగినట్లుగా అనిపించడంతో పాటు కంగారు, గజిబిజిగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కారణాలు విటమిన్ బి12 లోపానికి రెండు కారణాలు ఉంటాయి. మొదటిది పెర్నీషియస్ అనీమియా.. అంటే ఇందులో మన రోగ నిరోధక వ్యవస్థ మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తుంటుంది. జీర్ణాశయంలోని కణాలను ఇలా నాశనం చేయడం వల్ల శరీరం మనం తీసుకునే ఆహారంలోని విటమిన్ బి12 శరీరానికి అందదు. ఇది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. రెండోది మనం తీసుకునే ఆహారంలోనే సహజంగా విటమిన్ బి12 తక్కువగా ఉండడం.. సాధారణంగా వీగన్లు లేదా శాకాహారుల డైట్లో విటమిన్ బి12 తక్కువగానే లభిస్తుంది. ఇలాంటివారిలో ఈ లోపం కనిపించవచ్చు. ఏకాగ్రత లేకపోవడం చాలామందిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. గతంలో మంచి జ్ఞాపకశక్తి ఉన్నవారిలో కూడా, బి12 లోపించినందువల్ల ఏకాగ్రత లేకపోవడం, విషయాలు తరచూ మర్చిపోతుండడం వంటి లక్షణాలు చోటు చేసుకుంటాయి. ఇది కొంత కాలానికి డిమెన్షియాకి దారి తీస్తుంది. అంటే వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవడం, వ్యక్తులను గుర్తించడానికి సమయం పట్టడం వంటివి అన్నమాట. బీ12 సమృద్ధిగా లభించే ఆహారం గుడ్డు, పొట్టుతీయని ధాన్యం, పెరుగు, పాలు, చేపలు, నెయ్యి, బీట్రూట్, మష్రూమ్స్, ఆల్ఫాల్ఫా అనే ఒకరకమైన గోధుమ జాతికి చెందిన గడ్డి, జున్ను, ఈస్ట్, అరటి, యాపిల్, బెర్రీ జాతి పండ్లు. రోజుకు ఎంత మేర విటమిన్ బి12 కావాలో తెలుసుకొని ఆ మొత్తంలో ఈ పోషకాన్ని అందించే ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించడం.. వీలు కానప్పుడు డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లు వాడటం మంచిది. చదవండి👉🏾Patika Bellam Health Benefits: పటికబెల్లం ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? కానీ ఎక్కువ తిన్నారంటే -
యాభై ఏళ్లు వచ్చేసరికి మహిళల్లో ఈస్ట్రోజెన్ తగ్గిపోతుంది.. కాబట్టి
Health Tips For Women: మీ పిల్లలకు, మీ వారికి, అత్తమామలకు, ఇతర కుటుంబ సభ్యులకు కావలసిన వాటన్నింటినీ అమర్చి పెడుతూ మీ గురించి మీరు పట్టించుకోవడం మానేశారా? అయితే ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ, ముందు ముందు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కనీసం ఇప్పుడయినా మేలుకోవడం మంచిది. 50 సంవత్సరాలు దాటిన స్త్రీలు తమ ఆరోగ్యం కోసం అలవరచుకోవలసిన ఆహారపు నియమాలు ఏమిటో తెలుసుకుందాం... ►నిజానికి యాభై ఏళ్లు దాటిన వారికోసం ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏమీ లేదు. కాకపోతే వయసుతోపాటు శరీరానికి విటమిన్లను గ్రహించే శక్తి తగ్గుతుంటుంది కాబట్టి తీసుకునే ఆహారంలోనే ఆయా విటమిన్లు పుష్కలంగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ►యాభైఏళ్లు వచ్చేసరికి మహిళల్లో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల శరీరానికి క్యాల్షియంను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. శరీరంలో క్యాల్షియం తగ్గితే ఆస్టియో పొరోసిస్ అనే వ్యాధి వస్తుంది. కాబట్టి క్యాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. క్యాల్షియం ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు బాగా తీసుకుంటే సరిపోతుంది. ►అయితే ఇక్కడ మరో విషయం... శరీరం క్యాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డి3తోపాటు వ్యాయామం అవసరం. విటమిన్ డి3 కోసం పొద్దున పూట సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వ్యాయామం చేస్తే శరీరం క్యాల్షియంను గ్రహించుకుంటుంది. లేకుంటే క్యాల్షియం ట్యాబ్లెట్లు మింగవలసి ఉంటుంది. ►సాధారణంగా 50 సం. దాటినవారు కుటుంబంలోని వాళ్లందరూ ఎవరి పనుల మీద వాళ్లు బయటకు వెళ్లిపోయాక ఎక్కువ సమయం కూర్చుని ఉంటారు. అందువలన కండరాలు పటుత్వం కోల్పోయి బలహీనత వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు, మొలకలు, బాదం, నట్స్ లాంటి ఆహారం తీసుకోవాలి. ►యాభై దాటిన వారికే కాదు, ఎవరికైనా సరే, శరీర పోషణకు మాంస కృత్తులు చాలా అవసరం. కిలో శరీర బరువుకు 1.5 గ్రా.చొప్పున మాంసకృత్తులు తీసుకోవాలి. ఉదాహరణకు 60 కేజీల బరువున్నవారు 90 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. ►మరో ముఖ్య విటమిన్ – విటమిన్ బి 12. శరీరానికి రోజుకు 2.4 మైక్రోగ్రాముల బి12 కావాలి. విటమిన్ బి 12, శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, ఎర్ర రక్తకణాల వృద్ధికి, మెదడు సరిగా పనిచేయడానికి అవసరం. బి 12, పాలు,పెరుగు, చీజ్, గుడ్లు, చేపలు, చికెన్ మొదలైన వాటిలో లభిస్తుంది. ►ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్ధాలు తగ్గిస్తే మంచిది. అధిక ఉప్పు అధిక రక్తపోటుకు, కీళ్ల నొప్పులకు దారి తీసే అవకాశం ఉంది. ►50 సం దాటినవారు ఎక్కువగా మతిమరుపు వచ్చిందని అంటూ ఉంటారు. ఒక సర్వే ప్రకారం వీళ్ళు నీళ్లు తక్కువ తీసుకోవడం కూడా మతిమరుపునకు ఉన్న కారణాల్లో ఒకటని తేలింది. ►చక్కగా పండ్లు, కూరలు, ఆకుకూరలు, మొలకలు, తృణధాన్యాలతో కూడిన మితాహారాన్ని తీసుకుంటూ, శరీరానికి తగినంత వ్యాయామం కల్పించడం అవసరం. చదవండి: Best Health Tips In Telugu: ఈ చిట్కాలతో ఆరోగ్యం, అందం కూడా! రోజూ కోడిగుడ్డు తింటే.. -
విటమిన్ బి12 లోపం ఉందా..? ల్యాబ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..!
Vitamin B12 Deficiency: విటమిన్ బి12 లోపాన్ని చాలా ప్రమాదకారిగా పరిగణించాలని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రక్తహీనత, నాడీ సంబంధిత సమస్యలు, అతిసారం, గ్లోసిటిస్ (స్మూత్ టంగ్), కండరాల బలహీనత వంటి సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ బి12 లోపం ఉంటే.. మొదట్లో మైకం కమ్మినట్లుగా, మగతగా, శ్వాసతీసుకోవడం భారంగా ఉంటుందని.. ఈ లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పైన పేర్కొన్న రుగ్మతలతో పాటు బాబిన్స్కీ రిఫ్లెక్స్ సంభవిస్తుందని డాక్టర్లు అంటున్నారు. బాబిన్స్కీ రిఫ్లెక్స్ అంటే.. అరికాళ్లపై కొట్టినప్పుడు పాదానికి ఉన్న అన్నివేళ్లు కిందికి వంగుతుంటే బొటనవేలు మాత్రం పైకి లేస్తుంది. రెండేళ్లలోపు పిల్లల్లో ఈ రిఫ్లెక్షన్ సాధారణమే అయినప్పటికీ.. పెద్దవారిలో ఈ రిఫ్లెక్షన్ కనిపిస్తే అది కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతకు సంకేతమని నేషనల్ లైబ్రెరీ ఆఫ్ మెడిసిన్ నిపుణులు అంటున్నారు. విటమిన్ బి12 లోపం ఉందా..? ఇలా చేయండి అరికాళ్లపై తట్టి చూసుకోవడం ద్వారా విటమిన్ బి12 స్థాయిలు పడిపోయిన విషయాన్ని అంచనా వేయవచ్చు. అరికాళ్లపై కొట్టినప్పుడు పాదానికి ఉన్న అన్నివేళ్లు కిందికి వంగిపోతూ, బొటనవేలు మాత్రం పైకి లేస్తుంటే అది బి12 లోపానికి సంకేతంగా పరిగణించవచ్చు. అయితే సమగ్ర రక్త పరీక్షల ద్వారా మాత్రమే ఈ లోపాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. విటమిన్ బి12 స్థాయిలు 150ng/l కంటే తక్కువగా ఉంటే దాన్ని లోపంగా చెప్పవచ్చు. చదవండి: Jhilam Chattaraj: నాన్న మరణిస్తే కూతురి.. తల వెంట్రుకలు కూడా ఏడుస్తాయి! -
అందుకే చలికాలంలో చర్మం పొడిబారిపోతుంది! ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే..
సీజన్ మారింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏటా వచ్చే ఈ మార్పును వాతావరణ శాఖ అధికారికంగా నమోదు చేస్తుంది. కానీ అంతకంటే ముందే మన దేహం సంకేతాలను జారీ చేస్తుంది. దుప్పటి పక్కకు తోసేసే పిల్లలు ఒద్దికగా దుప్పటిలో తమను తాము ఇముడ్చు కుంటారు. సాక్స్ వేసుకునేటప్పుడు సాఫీగా సాగిపోకుండా పాదాల చర్మానికి తగులుకోవడం, దారాలు లేవడం మరో సంకేతం. పెద్ద బైట్ తీసుకుందామని నోరు అమాంతం తెరిస్తే పొడిబారిన పెదవులు సహకరించవు. ఆరు నెలలుగా డ్రెస్సింగ్ టేబుల్ డ్రాల్లో ఉండిపోయిన లిప్‌బామ్‌లు, బాడీ లోషన్లు బయటకు వస్తాయి. కాలం మారింది... అందుకే లైఫ్ స్టైల్ కూడా మారి తీరాలి మరి. దేహం రాజీ పడదు చలికాలం దాదాపుగా అందరూ చేసే ప్రధానమైన పొరపాటు నీరు తక్కువగా తీసుకోవడం. ‘దాహం వేయలేదు కాబట్టి తక్కువగా తాగాం, దేహానికి అవసరమైతే దాహం వేస్తుంది కదా’ అని సౌకర్యవంతమైన సమాధానం చెప్పుకుంటే కుదరదు. చల్లటి నీటికి బదులు నార్మల్ వాటర్ లేదా గోరువెచ్చటి నీటిని ఎప్పటిలాగానే రెండు ముప్పావు నుంచి మూడు ముప్పావు లీటర్ల వరకు తీసుకోవాలి. మజ్జిగ, పండ్ల రసాల వంటి ద్రవాలను ఎక్కువ తీసుకున్నప్పుడు నీటి పరిమాణాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు. ‘యూఎస్ నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్’ సూచన మేరకు సగటున ఒక మహిళ రోజుకు 2.7 లీటర్లు, మగవాళ్లు 3.7 లీటర్లు ద్రవాలు (నీరు, ఇతర ద్రవాహారం కలిపి) దేహానికి అవసరమని సూచించింది. ఏ కాలమైనా సరే... దేహంలోని వ్యర్థాలను బయటకు పంపించడానికి దేహక్రియలకు అవసరమైన ద్రవాలు దేహానికి అంది తీరాలి. అప్పుడే చర్మం పొడిబారకుండా, నిర్జీవంగా మారిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. దేహంలోని వ్యర్థాలు విసర్జితం కాకుండా చర్మం మీద ఎన్ని లోషన్లు రాసినా దేహక్రియలు మెరుగుపడవు, చర్మఆరోగ్యం కూడా మెరుగవదనే విషయాన్ని మర్చిపోకూడదు. చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!! వెచ్చ‘టీ’లు ఈ సీజన్లో బాలెన్స్డ్ డైట్ తప్పని సరి. పగలు పుదీనా టీ, తులసి టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ, లెమన్ టీ, తాజా నిమ్మరసం తీసుకోవాలి. అందుబాటులో ఉంటే కొబ్బరి నీరు కూడా తాగచ్చు. కొబ్బరి నీరు ఎండాకాలంలో మాత్రమే తాగాలనుకోవడం కేవలం అపోహ మాత్రమే. వర్షాకాలమైనా, శీతాకాలమైనా కొబ్బరి నీరు ఆరోగ్యకరమే. రాత్రి భోజనానికి ముందు వెజిటబుల్ సూప్‌లు తాగాలి. పొట్టుతో కూడిన ధాన్యాలు, పప్పులు, నట్స్, మంచి నెయ్యి రోజువారీ ఆహారంలో ఉండాలి. మాంసాహారులైతే ఈ కాలంలో మ మటన్‌కు బదులు తేలిగ్గా జీర్ణమయ్యే చేపలు, చికెన్, గుడ్లు తీసుకోవచ్చు. వాల్నట్, అవిసె గింజలు తీసుకోవాలి. అలాగే బొప్పాయితోపాటు బత్తాయి, కమలాపండ్లు రోజూ తీసుకుంటే మంచిది. ఇక కూరల్లో ఈ సీజన్లో పండే అన్ని రకాల కూరగాయలు, క్యాలిఫ్లవర్, బ్రోకలి వారంలో ఒకసారైనా తీసుకుంటుంటే చర్మానికి మాయిశ్చర్ సహజంగా అందుతుంది. చదవండి: ఆ ఫొటోలు తీసినందుకు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు.. ఎమోషనల్ ఈటింగ్ వద్దు ఆహార విహారాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరిలో వారికి ఉన్న ఇతర ఆరోగ్యకారణాల రీత్యా ఈ కాలంలో విటమిన్ డీ 3, బీ12 లోపం ఏర్పడుతుంటుంది. బీ 12 లోపం మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. ప్రతి చిన్న విషయానికీ విపరీతమైన భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఈ మానసిక అలజడి నుంచి సాంత్వన పొందడానికి ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఈ ఎమోషనల్ ఈటింగ్ చాలా సందర్భాల్లో ఓవర్ ఈటింగ్‌కు దారి తీస్తుంది. కాబట్టి దేహంలో బీ12, డీ3 విటమిన్ స్థాయులు తగ్గకుండా చూసుకోవాలి. అవసరం అనిపిస్తే విటమిన్ లెవెల్స్ టెస్టులతో నిర్ధారించుకుని తదనుగుణంగా జీవనశైలి మార్పులు చేసుకోవచ్చు. ఎండ మంచిదే! రోజూ కనీసం అరగంట సమయం అయినా సూర్యరశ్మి ఒంటి మీద పడాలి. అప్పుడే దేహంలో సెరోటోనిన్ స్థాయులు, మెలటోనిన్ స్థాయులు సక్రమంగా ఉంటాయి. అవి మంచి నిద్రకు, హార్మోన్స్ సమతుల్యతకు దోహదం చేస్తాయి. కాబట్టి ఈ విధమైన జీవనశైలితో దేహంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. చలికాలంలో దేహ సాధారణ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడంతోపాటు రెండేళ్లుగా భయపెడుతున్న కరోనా వ్యాధిని, భౌతికదూరం వంటి జాగ్రత్తలను మర్చిపోకూడదు. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
మతిమరుపు...మందు
-
Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..
రక్తహీనత, అలసట, తిమ్మిర్ల నివారణకు విటమిన్ బి12 ఎంతో సహాయపడుతుంది. ఇది శరీర పెరుగుదలకు, రక్త కణాల నిర్మాణంలో, నాడీ వ్యవస్థ క్రమబద్ధీకరణకు, డీఎస్ఏ ఉత్పత్తికి ప్రధాన పోషకం. అలాగేశరీరంలోని వివిధ భాగాల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది కూడా. ఐతే ప్రపంచవ్యాప్తంగా 15% కంటే ఎక్కువ మంది ప్రజలు విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విటమిన్ బి 12 మన శరీరంలో సహజంగా ఉత్పత్తి కాదు. సీ ఫుడ్ (సముద్ర ఆధారిత ఆహారాలు), గుడ్లు, మాంస ఉత్పత్తులు, కొన్ని ప్రత్యేక పండ్లు, కూరగాయల్లో మాత్రమే ఈ విటమిన్ ఉంటుంది. ఏదిఏమైనప్పటికీ శాఖాహారులు ఈ విటమిన్ లోపంతో అధికంగా బాధపడుతున్నారు. విటమిన్ బి12 లోపిస్తే శక్తి హీనతతోపాటు కొన్ని రకాల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. యాంగ్జైటీ విటమిన్ బి12 స్థాయిలు తక్కువగా ఉంటే మానసిక సమతుల్యత దెబ్బతిని డిప్రెషన్‌కు దారితీస్తుంది. ఎందుకంటే మెదడులోని ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్ రసాయనాలైన డోపమైన్, సెరోటోనిన్ ఉత్పత్తికి విటమిన్ బి 12 బాధ్యత వహిస్తుంది. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. తిమ్మిర్లు చేతులు, కాళ్ల వేళ్ల చివర్లు సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా విటమిన్ బి12 మన శరీరంలో నాడీవ్యవస్థ పనితీరులో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇది లోపిస్తే శరీరం సమతుల్యత తప్పి కళ్లు తిరగడం, వికారం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మతిమరుపు విటమిన్ బి12 లోపం మెదడు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. మతిమరుపు, తికమకపడటం, విషయాలను గుర్తుపెట్టుకోవడం కష్టతరమవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో మిమిక్ డైమెన్షియా అనే వ్యాధి భారీనపడే అవకాశం కూడా ఉంది. చదవండి: Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి.. నాలుక రుచి మందగించడం విటమిన్ బి12 లోపిస్తే నాలుకపై ఉండె రుచిమొగ్గలు క్రమంగా రుచిని కోల్పోతాయి. అంతేకాకుండా నాలుక వాపు, నోటి పుండ్లు, ముడతలు, నోటిలో మంట వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చు. హృదయ సమస్యలు గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా తలెత్తుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా.. -
ఎప్పుడు పరీక్ష చేయించినా...
నా వయసు 50 ఏళ్లు. నేను ఒక ప్రభుత్వ ఉన్నతోద్యోగిని. ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా మాస్టర్ హెల్త్చెకప్ చేయించుకుంటూ ఉంటాను. అయితే ప్రతిసారీ పరీక్షల్లో నేను ఒక విషయం గమనిస్తున్నాను. నా విటమిన్ బి12, విటమిన్–డి పాళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. మిగతా అన్ని పరీక్షలూ నార్మల్‌గా ఉంటున్నాయి. ప్రతిసారీ ఇందుకోసం మందులు వాడుతున్నా, నాకు ఆ పరీక్షల్లో నార్మల్ రిజల్ట్ రావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి దీనికి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా? – ఒక సోదరుడు, హైదరాబాద్ విటమిన్ బి12 సాధారణంగా మాంసాహారంతో పాటు పాలు, పాల ఉత్పాదనల్లోనే చాలా ఎక్కువగా లభ్యమవుతుంటుంది. ఒకవేళ మీరు శాకాహారి అయి ఉండి, పాలు చాలా తక్కువగా తీసుకునేవారైతే మీకు విటమిన్ బి12, విటమిన్–డి లు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యే అవకాశాలు ఉండవు. అయితే చాలామంది మాంసాహారం తీసుకునేవారిలో సైతం, దాన్ని రక్తంలోకి తీసుకెళ్లే కొన్ని కాంపోనెంట్స్ లేకపోవడం వల్ల అవి భర్తీకాకపోవచ్చు. ఇలా విటమిన్ బి12 తక్కువగా ఉన్నవారు వాటిని డాక్టర్ సూచించిన మోతాదులో (అంటే సాధారణంగా మొదట... ప్రతి రోజు ఒకటి చొప్పున నాలుగు రోజులూ, ఆ తర్వాత ప్రతివారం ఒకటి చొప్పున నాలుగు వారాలు, ఇక ఆ తర్వాత ప్రతి నెలా ఒకటి చొప్పున ఆర్నెల్లు... ఆ తర్వాత మూడు నెలలకొకసారి చొప్పున) ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి. ఇక విటమిన్–డి అనేది కేవలం సూర్యకాంతితోనే మనకు లభ్యమవుతుంది. ఆహారం ద్వారా లభ్యం కావడం చాలా చాలా తక్కువ (అందులోనూ చాలా ఎక్కువ మోతాదులో డి–విటమిన్ చేర్చితే తప్ప). ఒకవేళ విటమిన్–డి కోసం మీరు ఎండలో తిరిగినా కేవలం మీ ముఖం, బట్టలతో కప్పి లేని చేతుల వంటి భాగాలు మినహా మిగతా భాగాలు ఎండకు ఎక్స్పోజ్ కావు. మీ మేని రంగు నలుపు అయితే మీకు విటమిన్–డి పాళ్లు తక్కువగా సమకూరే అవకాశం ఉంది. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విటమిన్–డి లోపం ఉన్నట్లు కనుగొన్నప్పుడు విటమిన్–డి 60,000 యూనిట్ల టాబ్లెట్లను వారానికి ఒకటి చొప్పున ఎనిమిది వారాలు వాడాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు. ఆ తర్వాత కూడా ప్రతి నెలా ఒక టాబ్లెట్ తీసుకొమ్మని సూచిస్తారు. మీరు ఒకసారి మీ ఫిజీషియన్/న్యూరాలజిస్ట్‌ను కలిసి చర్చించి, మీ డాక్టర్ సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు వాడండి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వెజిటేరియన్లలో విటమిన్ బి12 లోపిస్తే..!
మనం ఏ పని చేయాలన్నా అవసరమైనది మన మెదడు, నాడీ వ్యవస్థ చక్కగా ఉండటం. ఆ మెదడు నుంచి అన్ని అవయవాలకూ ఆదేశాలు సక్రమంగా అందడం. అందుకు ఉపయోగపడే అత్యంత కీలకమైన పోషకమే... ‘విటమిన్-బి12’. ఇది కేవలం మెదడు నుంచి అన్ని అవయవాలకూ ఆదేశాలు అందేలా చేయడమే కాదు... రక్తం పుట్టుకలోనూ పాలుపంచుకుంటుంది. ప్రతి కణంలో జరిగే జీవక్రియల్లో భాగస్వామ్యం తీసుకుని డీఎన్ఏ పుట్టుకలో, అమైనో యాసిడ్స్ కార్యకాలాపాల్లో (మెటబాలిజమ్‌లో) పాలుపంచుకుంటుంది. మాంసాహారంలోనే పుష్కలంగా లభించే విటమిన్ బి12... శాకాహార నియమాన్ని చాలా కఠినంగా పాటించేవారిలో చాలా తక్కువగా ఉంటుంది. దాంతో వారికి కొన్ని సమస్యలు రావడం సాధారణం. వాటిని అధిగమించి, మన నాడీవ్యవస్థనూ, కణాల్లోని జీవక్రియలనూ సక్రమంగా పనిచేయించడం ఎలాగో చెప్పుకుందాం. శాకాహారుల్లో విటమిన్ బి12 ఎందుకు తక్కువ... విటమిన్ బి12ను మొక్కలుగానీ, ఫంగస్గానీ... ఆ మాటకొస్తే జంతువులుగానీ సృష్టించలేవు. కేవలం బ్యాక్టీరియా దాంతో పాటూ ఆర్చియా అనే ఏకకణ జీవులు మాత్రమే ఈ విటమిన్‌ను సృష్టించగలవు. ఆర్చియా అనేది ఎంత చిన్న జీవి అంటే ఏకకణజీవికంటే కూడా తక్కువ స్థాయి జీవి. ఈ ఏకకణానికి న్యూక్లియస్ (కేంద్రకం) ఉండదు. ఇదొక కణమనీ, కణంలోని భాగాలని అని నిర్దిష్టంగా చెప్పేందుకు వాటి విభాగాలూ, పైపొరలూ కూడా ఉండవు. కానీ బ్యాక్టీరియా, ఆర్కియా వెలువరించే ఎంజైముల సంయోగంతో ఈ ప్రపంచంలో విటమిన్-బి12 స్వాభావికంగా తయారవుతుంది. పైగా దీని నిర్మాణం చాలా సంక్లిష్టమైనది. ఇది జంతువులకు మేలు చేసే బ్యాక్టీరియా మనుగడ సాగించే చోట... అంటే... జంతువుపై ఆధారపడి బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా వెలువరించే పదార్థాలతో జంతువులూ ఇలా పరస్పరం సహాయం (సింబయాసిస్) చేసుకుంటూ ఉండే ప్రదేశాలలో మాత్రమే ఈ విటమిన్ పుడుతుంది. అందుకే ఇది జంతుమాంసం, జంతు ఉత్పాదనల వనరులనుంచే ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. అందుకే శాకాహార నియమాన్ని చాలా కఠినంగా పాటించేవారిలో ఇది చాలా తక్కువ. విటమిన్ బి12 లోపం ఉంటే... ⇒ విటమిన్ బి12 లోపం ఉన్నవారు ఎప్పుడూ చాలా అలసటగా, నీరసంగా ఉంటారు. నిస్సత్తువ ఆవరించి ఉన్నట్లుగా ఫీలవుతుంటారు. ⇒ విటమిన్ బి12 లోపం వల్ల ఆక్సిజన్‌ను అన్ని అవయవాలకూ తీసుకెళ్లే ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ కండిషన్‌ను ‘విటమిన్-బి12 అనీమియా’ అంటారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మన శరీరం చాలా పెద్దసైజు ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటినే మెగాలోబ్లాస్టిక్, మ్యాక్రోసైటిక్ ఎర్రరక్తకణాలంటారు. ఇవి తమ విధిని సక్రమంగా నిర్వహించలేవు. ⇒ విటమిన్-బి12 అనీమియా వల్ల అలసట, నిస్సత్తువలతో పాటు ఒక్కోసారి ఊపిరి సరిగా అందకపోవడం జరగవచ్చు. ⇒ తలనొప్పి, చెవుల్లో ఏదో హోరు వినిపించడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. మరింత నిర్దిష్టమైన లక్షణాలు : చర్మం పసుపుపచ్చరంగులోకి మారడం నాలుకపూయడం నోట్లో పుండ్లు కొన్ని ప్రదేశాల్లో స్పర్శజ్ఞానం కోల్పోవడం నొప్పి ఎక్కువగా తెలియకపోవడం నడుస్తున్నప్పుడు పడిపోవడానికి అవకాశం చూపు సరిగా లేక స్పష్టంగా కనిపించకపోవడం క్షణక్షణానికీ మూడ్స్ మారిపోవడం డిప్రెషన్‌కు లోనుకావడం మతిమరపు రావడం. శాకాహారులతో పాటు... ఇంకా ఎవరెవరిలో తక్కువ... సాధారణంగా 75 ఏళ్లకు పైగా వయసు పైబడిన వారిలో ఇది తక్కువ పుట్టుకతో వచ్చే జబ్బు అయిన పెర్నీషియస్ అనీమియా అనే కండిషన్ ఉన్నవారిలో ఇది తక్కువ. ఈ కండిషన్ ఉన్నవారిలో ఒక ప్రోటీన్ లోపం వల్ల జీర్ణమైన ఆహారం నుంచి విటమిన్ బి12 ను సంగ్రహించే సామర్థ్యం లోపిస్తుంది. అందుకే ఇలాంటి కుటుంబ చరిత్ర ఉన్న వారిలో 60 ఏళ్లు దాటిన మహిళల్లో ఇది ఎక్కువ ఇక పొట్ట లోపలిపొర పలచబారిన వారిలోనూ ఇది తక్కువ పొట్టలో పుండ్లు (అల్సర్స్) ఉన్నవారిలో పొట్టలోని కొంతభాగాన్ని సర్జరీ ద్వారా తొలగించిన వారిలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారిలో చాలాకాలంగా అజీర్తి మందులు (ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ -పీపీఐ) వాడుతున్నవారిలోనూ విటమిన్ బి12 పాళ్లు తక్కువ. నిర్ధారణ : సాధారణంగా రక్తపరీక్ష ద్వారా విటమిన్ బి12 లోపం తెలుసుకుంటారు. ఇక ఎర్రరక్తకణాల సైజ్‌ను బట్టి కూడా విటమిన్ బి12 లోపాన్ని అంచనావేస్తారు. విటమిన్ బి12కు చికిత్స విటమిన్ బి12 తక్కువగా ఉందని రక్తపరీక్షలో నిర్ధారణ అయితే... అలాంటి రోగులకు సాధారణంగా ఆరు బి12 ఇంజెక్షన్లతో ఈ లోపాన్ని భర్తీ చేస్తారు. ఇది రోజుకు ఒకటిగానీ లేదా రెండు నుంచి నాలుగు రోజులకు ఒకటి చొప్పున ఇస్తారు. ఈ విటమిన్ బి12 అంతా కాలేయంలో నిల్వ అయి ఉంటుంది. కొన్ని నెలలపాటు శరీరానికి అవసరమైన జీవక్రియలకోసం శరీరం తన విటమిన్-బి12 అవసరాల కోసం దాన్ని కాలేయం నుంచి తీసుకొని వాడుకుంటుంది. ఒకవేళ పెర్నీషియస్ అనీమియా కారణంగా విటమిన్ బి12 లోపం ఉన్నవారైతే... జీవితకాలం పాటు డాక్టర్లు చెప్పిన మోతాదుల్లో విటమిన్ బి12ను తీసుకుంటూ ఉండాలి. ఇలా విటమిన్ బి12 తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. ఇక కొందరిలో ఇది పెర్నీషియస్ అనీమియా వల్ల కాకుండా పోషకాహారలోపం వల్ల విటమిన్ బి12 లోపం ఏర్పడితే అప్పుడు ఇంజెక్షన్ రూపంలో కాకుండా సైనకోబాలమైన్ టాబ్లెట్ల రూపంలోనూ దీన్ని శరీరానికి అందిస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఎవరికి వారుగా విటమిన్-బి12 టాబ్లెట్లను, ఇంజెక్షన్లను తీసుకోకూడదు. డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వీటిని తీసుకోవాలి. ఎందుకంటే... ఈ ఇంజెక్షన్లనూ, మాత్రలనూ తీసుకునే వారు ఒకవేళ ఇతర మాత్రలనూ వాడుతుంటే... విటమిన్ బి12 ఇంజెక్షన్లూ, మాత్రలూ వాటి కార్యకలాపాలకు అడ్డుపడకుండా చూసేలా డాక్టర్లు మోతాదులను నిర్ణయిస్తారు. నివారణ మాంసాహారంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది గుడ్లు, సముద్రపు చేపలు, పాలలో ఇది ఎక్కువ. మాంసాహారం తీసుకోడానికి ఇష్టపడని వారు ఈ కింది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విటమిన్ బి12ను పొందవచ్చు. శాకాహారులు పుష్కలంగా విటమిన్ బి 12 పొందాలంటే... విటమిన్ బి12తో సమృద్ధం చేసిన (విటమిన్ బి12 ఫోర్టిఫైడ్) బాదం పాలలో ఇది ఎక్కువ విటమిన్ బి12తో సమృద్ధం చేసిన కొబ్బరిపాలలోనూ ఇది చాలా ఎక్కువ పులిసిపోయే స్వభావం ఉన్న ఆహారంలోని ఈస్ట్ (న్యూట్రిషనల్ ఈస్ట్)తోనూ ఈ లోపాన్ని తొలగించుకోవచ్చు విటమిన్ బి12తో సమృద్ధం చేసిన సోయాపాలతో తక్షణం తినగలిగే తృణధాన్యాలు (సి రేల్స్)లో తక్కువ కొవ్వు ఉన్న పాలు తోడుబెట్టి చేసిన పెరుగులోనూ పాలలోనూ, చీజ్‌లోనూ, వెనిలా ఐస్‌క్రీమ్‌లోనూ విటమిన్ బి12 ఎక్కువ. అందుకే శాకాహారులు పైన పేర్కొన్న ఆహారంపై ఆధారపడవచ్చు. - డాక్టర్ ఎమ్. గోవర్థన్ సీనియర్ ఫిజీషియన్,కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్